chandra shekar
-
‘ప్లాంట్ మ్యాన్’ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు: నిర్మాత
చంద్రశేఖర్, సోనాలి జంటగా కె.సంతోష్‌బాబు దర్శకత్వంలో రూపొందిన సైంటిఫిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫ్లాంట్మ్యాన్’. జనవరి 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తమ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నిర్మాత పన్నా రాయల్ మాట్లాడుతూ .. డైరెక్టర్‌గా నేను అందరికీ పరిచయమే. నిర్మాతగా నేను చేసిన మొదటి సినిమా ఇది. ఒక చిన్న సినిమాగా ‘ప్లాంట్ మ్యాన్’ను స్టార్ట్ చేశాము. కానీ, రిజల్ట్ మాత్రం అల్టిమేట్‌గా ఉంది. ఇలాంటి రెస్పాన్స్ వస్తే సంవత్సరానికి రెండు చిన్న సినిమాలు చేసి కొత్త వారిని ఇంట్రడ్యూస్ చెయ్యాలని ఉంది. ‘ప్లాంట్ మాన్’ చిత్రం ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ ముఖ్య కారణం. సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు’’ అన్నారు. దర్శకుడు కె.సంతోష్‌బాబు మాట్లాడుతూ ‘‘మా ఈ చిన్న సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్. ఈ సినిమా చేయడానికి నిర్మాత పన్నా రాయల్గారే కారణం. నేను చెప్పిన లైన్ నచ్చి ఈ సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి పన్నాగారు, డిఓపి కర్ణన్‌గారు, సాయినాథ్‌గారు కారణం. నటీనటులు, టెక్నీషియన్స్ అందించిన సపోర్ట్‌తో ఇంత మంచి సినిమా చేయగలిగాను’’ అన్నారు. హీరో చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘‘నెల క్రితం ఈ హాల్ బయట ఉండి చూసిన నన్ను ఇప్పుడు స్టేజ్ మీద కూర్చోబెట్టారు. పన్నాగారు కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ సంక్రాంతి ఫెస్టివల్‌కి కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది’’ అన్నారు. హీరోయిన్ సోనాలి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో అవకాశం డిఓపి కర్ణన్‌గారి ద్వారా వచ్చింది. దానికి నిర్మాత పన్నాగారు ఎంతో సపోర్ట్ చేశారు. స్టార్టింగ్‌లో కొంత నెర్వస్‌గా ఉంది. అందరూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఒక మంచి సినిమాలో నేను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉంది. సినిమా థియేటర్లలో రన్ అవుతోంది. తప్పకుండా అందరూ చూడండి’’ అన్నారు. -
ఎమ్మెల్యే హర్షవర్ధన్, ఎమ్మెల్సీ చల్లా వేధిస్తున్నారు! : చంద్రశేఖర్ వేగే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తనను వేధిస్తున్నారని, రాజకీయ పలుకుబడితో తనపై తప్పుడు కేసులు పెట్టి భయాందోళనలకు గురి చేస్తున్నారని గోల్డ్‌ఫిష్ అబోడ్ కంపెనీ ఎండీ చంద్రశేఖర్ వేగే అరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా తమపై పీడీ యాక్ట్ నమోదు చేయిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తప్పుడు పత్రాలు, ఆరోపణలతో తనపై, తన కంపెనీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కోకాపేటలోని స్థలంపై గోల్డ్ ఫిష్ సంస్థకు, ఎమ్మెల్సీ చల్లాకు మధ్య కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చల్లా చేసిన ఆరోపణలపై వివరణ ఇస్తూ గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో చంద్రశేఖర్ వేగే విలేకరుల సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ► కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2.30 ఎకరాల స్థలంలో ప్రాజెక్ట్‌ను నిర్మించాలని కంపెనీ భావించింది. ఈ క్రమంలో కంపెనీ డైరెక్టర్ కాటం అశ్వంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన పెట్టుబడిదారుడిగా తన సమీప బంధువైన చల్లా వెంకట్రామిరెడ్డి ఆసక్తిగా ఉన్నారని చెప్పడంతో సంస్థ యాజమాన్యం అందుకు అంగీకరించింది. దీంతో కంపెనీ ప్రతినిధి వాసుదేవరెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి సర్వే నంబరు–85లో ఉన్న 2.30 ఎకరాల వ్యవసాయ భూమిని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ హోల్డర్స్‌గా 2013 మార్చిలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఆ తర్వాత ఈస్థలాన్ని ఎమ్మెల్సీ, ఇతరుల పేర్లపై సేల్‌డీడ్ పూర్తి చేశాం. ► నిబంధనల ప్రకారం 2013 మేలో చల్లా వెంకట్రామిరెడ్డి ఈ స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు డెవలప్మెంట్ కమ్ జనరల్ పవరాఫ్ అటార్నీ చేస్తూ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో 4 బేస్మెంట్లు గ్రౌండ్ 38 అంతస్తులలో హైరైజ్ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించాం. ► ఈ మేరకు ప్రొవిజన్ నిర్మాణ అనుమతుల కోసం 2014 జూన్‌లో దరఖాస్తు చేసుకోగా.. డిసెంబర్ 12 నాటికి భూ మార్పిడి, హెచ్ఎండీఏ నుంచి నిర్మాణ అనుమతులతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పర్యావరణ అనుమతులన్నీ లభించాయి. అయితే 2014లో రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రతికూల పరిస్థితులు సద్దుమణిగే వరకూ కంపెనీ, ఎమ్మెల్సీ ఇరువురూ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నెమ్మదించాలని నిర్ణయించుకున్నాం. అప్పటికే తొలుత పెట్టిన పెట్టుబడులకు అదనంగా రూ.12 కోట్లు ఖర్చు చేశాం. ► హెచ్ఎండీఏ నుంచి తుది అనుమతులు, కంపెనీ బిల్టప్ ఏరియా వాటాలను నిర్ధారించే సప్లిమెంటరీ అగ్రిమెంట్‌పై ఎమ్మెల్సీ సంతకాలు చేయకుండా తాత్సారం చేశారు. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు కరోనా మహమ్మారితో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో ప్రాజెక్ట్ వ్యవహారం గందరగోళంలో పడిపోయింది. ప్రాథమిక ఒప్పందంలో లేని అంశాలను లేవనెత్తుతూ ప్రాజెక్ట్‌కు అడ్డుపడుతుండటంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు కంపెనీ కొత్త ఒప్పందాన్ని ఎమ్మెల్సీ ముందు ఉంచింది. ప్రాజెక్ట్ కొనసాగించడం ఎమ్మెల్సీకి ఇష్టంలేని పక్షంలో వారు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు అంటే రూ.40 కోట్లు చెల్లిస్తామని, ఆ తర్వాత ఒప్పందం నుంచి వైదొలిగితే ఆగిపోయిన ప్రాజెక్ట్‌ను కంపెనీ టేకోవర్ చేస్తుందని వివరించాం. ► అయితే ఈ ఒప్పందాన్ని అంగీకరించని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తనకున్న రాజకీయ పలుకుబడితో గోల్డ్‌ఫిష్ కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులపై కేసులు పెట్టించడం మొదలుపెట్టారు. దీంతో కంపెనీ ఎండీ అయిన నేను 21 రోజుల పాటు జైలులో గడపడమే కాకుండా పలు ప్రభుత్వ అధికారులు, నాయకుల నుంచి ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజాలను ఎదుర్కోలేక చల్లా వెంకట్రామి రెడ్డి తమను మోసగాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీరి అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. -
రైల్వేలో ఖాళీల సంఖ్య 2.74 లక్షలు
న్యూఢిల్లీ: రైల్వేలో 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. ఇందులో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఖాళీలే 1.75 లక్షల వరకు ఉన్నాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నలకు రైల్వే శాఖ వివరంగా సమాధానమిచి్చంది. రైల్వే శాఖలో మొత్తంగా 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది. ఇందులో భద్రత కేటగిరీకి సంబంధించిన ఖాళీలు 1,77,924గా ఉన్నాయి. జూన్ 1 తేదీ నాటికి నాన్ గెజిటెడ్ గ్రూప్ సిలో 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రైల్వే శాఖ చెప్పింది. ఇక రైల్వేల భద్రతకు సంబంధించి 9.82 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే 8.04 లక్షల భర్తీ చేసినట్టు వివరించింది. భద్రత కేటగిరీలో లోకో పైలెట్లు, ట్రాక్ తనిఖీలు చేసే వ్యక్తులు, పాయింట్స్‌మెన్, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లు, సిగ్నల్ అసిస్టెంట్లు, ఇంజనీర్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, టికెట్ కలెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఒడిశాలో బాలాసోర్ వద్ద ఘోరమైన రైలు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఐ కింద పోస్టుల ఖాళీలపై ఆర్టీఐ కింద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2011లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా బన్నీ ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. తాజాగా అల్లు అర్జున్ మామ, స్నేహరెడ్డి తండ్రి చంద్రశేఖర్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అల్లుడిగా బన్నీకి వందకు వంద మార్కులు వేస్తానని కితాబిచ్చారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా బయట కూడా బన్నీకి ఎంతో మంది అభిమానులున్నారని, చిరంజీవి అడుగుజాడలో బన్నీ కూడా ఎంతో కష్టపడతారని చెప్పుకొచ్చారు. ఇక పెళ్లి సమయంలో బన్నీకి ఎంత కట్నం ఇచ్చారు అని అడగ్గా.. బన్నీ అసలు కట్నం తీసుకోలేదని పేర్కొన్నారు. 'వాళ్లకే ఎక్కువ ఉంది. మనం ఇచ్చేది వాళ్లకి లెక్క కూడా కాదు. కట్నాలకు వాళ్లు వ్యతిరేకం' అంటూ బన్నీ గురించి ప్రశంసలు కురిపించారు. బన్నీపై ఆయన మామ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. -
కమలంలో ముసలం.. పార్టీలో గ్రూపు రాజకీయాలు
సాక్షి, వికారాబాద్: బీజేపీలో గ్రూపు రాజకీయాలకు తెరలేచింది. జిల్లా నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ నేతల నుంచి తరచూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. సదానంద్‌రెడ్డి పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర పూర్తయినా.. ఇప్పటికీ క్యాడర్‌పై పట్టు సాధించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఈక్రమంలో జిల్లా అధ్యక్షుడినే మార్చాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయాన్ని కొంతమంది నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బీజేపీకి వెన్నెముక అయిన సంఘ్ పరివార్.. ప్రస్తుత అధ్యక్షుడి పనితీరుపై అసంతృప్తిగా తెలుస్తోంది. ఆయన స్థానంలో తాండూరుకు చెందిన ఓ నాయకుడికి అవకాశం ఇస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. చదవండి: సీఎం భగవంత్ మాన్ మరొకటి.. చండీగఢ్ పంజాబ్‌కే సొంతం కార్యకర్తల్లో అసంతృప్తి బీజేపీ జిల్లా నేతల పనితీరుపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో యువ నాయకత్వం, ఏబీవీపీ, కిందిస్థాయి నాయకులు చురుగ్గా పాల్గొంటుండగా, ముఖ్య నేతలుగా చెప్పుకొంటున్న వారు మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా ఉన్న సదానంద్‌రెడ్డి సతీమణి.. ఇప్పటి వరకు అధికార పార్టీ పనితీరును ఎండగడుతూ బీజేపీ పక్షాన వాయిస్ వినిపించలేకపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో జరుగుతున్న పార్టీ కార్యకర్తల సమావేశాలకు జిల్లా ముఖ్య నేతలు మొహం చాటేయటం కూడా విమర్శలకు తావిస్తోంది. పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్‌రెడ్డి సైతం కొంత కాలంగా జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అతనికి జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేతతో పొసగకపోవటమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: హైడ్రామా.. కాంగ్రెస్ కొంప ముంచిన ఎమ్మెల్యేలు జిల్లా నేతలు విఫలం ఇటీవలే నాలుగు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ మంచి ఊపుమీద కనిపిస్తోంది. రాష్ట్ర నాయకత్వం కూడా ఈ స్పీడ్‌ను కొనసాగించాలని భావిస్తోంది. దక్షణాదిలో సైతం పట్టుసాధించాలంటే తెలంగాణపై ఫోకస్ పెట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి బీజేపీ బలోపేతానికి కంకణం కట్టుకుంది. దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్పై బీజేపీ గెలుపు.. ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభైకిపైగా కార్పొరేట్ స్థానాల కైవసం, ఆ తర్వాత కొద్ది రోజులకే హుజూరాబాద్‌లో ఈటల విజయం, ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలను రాబట్టిన పార్టీ మంచి ఊపుమీదుంది. మంత్రిగా, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఎ.చంద్రశేఖర్ బీజేపీలో కొనసాగుతుండటం స్థానిక నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా మారుతారని అంతా భావించారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో ఏసీఆర్ పెద్దగా పాల్గొనకపోవడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. -
జీవితం ఏ నిర్వచనానికి లొంగనిది..!
‘తాతగారు, మీరు పెద్దగా చదువుకోలేదు. అయినా, ఎంతో ఆనందంగా ఉంటారు. అమ్మ నాన్నలు పెద్ద చదువులు చదివారు. పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కానీ సంతోషంగా ఉండరు. ఎందుకని?‘ అమాయకంగా తన పదేళ్ల మనవడడిగిన ప్రశ్నకు పెద్దగా నవ్వేశారా తాతగారు. ‘నానీ, నేను జీవితాన్ని జీవిస్తున్నాను. వాళ్ళు బతుకుతున్నారు. అంతే’ అన్నారాయన. ప్రశ్న అమాయకమైనదే కానీ, సమాధానం ఎంతో లోతైనది. వేదాంతులు, తాత్వికులు చెప్పేటంత, చెప్పినంత సాంద్రమైనది. గాఢమైనది. అనేకానేక అనుభవాల పొరలను తనలో ఇముడ్చుకుని, తమాయించుకుని, తెప్పరిల్లి జీవితార్ణవపు సుఖ దుఃఖాల ఆటుపోట్లను సమంగా తీసుకోగలిగిన స్థితప్రజ్ఞత ధ్వనిస్తోంది ఆ సమాధానం లో. ఆ తాతగారి జీవితానంద ఆస్వాదనకు, కొడుకు, కోడలి ఆందోళనకు, ఆశాంతికి భేదమదే. జీవితాన్ని జీవించాలి. అంటే..? జీవితంలోని సుఖాలను ఎలా హాయిగా అనుభవిస్తున్నామో, దుఃఖాలనూ అలాగే స్వీకరించగలగాలి. జీవితం పట్ల ఒక అవగాహన ఏర్పరుచుకోవాలి. హిమం ఒక వాతావరణంలో కరిగిపోవటం, మరొక వాతావరణంలో ఘనీభవించటం, సూర్యోదయ సూర్యాస్తమాయాలు ఏర్పడం ఎంత సహజమో /జీవితంలోని ఎత్తు పల్లాలు అంతే. మనిషికి ఆలోచనా శక్తి, ఒక మనస్సు దానికి స్పందన ఉన్నాయి. సుఖాన్ని తీసుకున్నంత హాయిగా ఆహ్లాదంగా మనస్సు దుఃఖాన్ని తీసుకోలేదు. రెండిటిని సమానంగా తీసుకోవాలని బుద్ధికి తెలుస్తుంది. కాని మనస్సుకు తెలియదు. బుద్ధి అనంతమైన భావాలకు / ఆలోచనలకు ఆవాసం. వాటికి స్పందించేది మనస్సు. అది దాని లక్షణం. సుఖదుఖాల భావన రెండిటికి సమానంగా తెలియాలి. అపుడే జీవితంలోని ఆహ్లాద ఘటనలను, జీవితాన్ని అతలాకుతలం చేసే అనూహ్య సంఘటనలను అక్కున చేర్చుకోగలం. ఆ స్థితికి చేరుకున్నప్పుడే జీవితాన్ని జీవించగలం మనోస్థైర్యంతో. అంతటి కుదురైన మనస్సు మన జీవిత కుదుళ్లను పెకలించలేదు. అన్ని వేళలా మనస్సును స్థిరంగా ఉంచుకోవటమే స్టితప్రజ్ఞతంటే. ఆ తాతగారికి ఉన్న గొప్ప లక్షణం అదే. కొంతమందికది సహజాభరణం. కొందరు ప్రయత్నించి సాధిస్తారు. ఇంకొందరికి జీవితం నేర్పుతుంది. కొందరికి జీవితంలో ఒంటపట్టదు. మనిషి వివేచనను, విచక్షణలను సంయోగం చేయగలిగితే చాలు. అది చిక్కుతుంది. ఒక మనిషి జీవితంలో పైకి రావటమనేది అతని తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఒక మార్గాన్ని ఎంపిక చేసుకుని దానిలో పయనించి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలడు. అది ఒక ఉద్యోగం కావచ్చు లేదా వ్యాపారం కావచ్చు. జీవితంలో చక్కగా స్థిరపడి, ఆర్థికం గా పరిపుష్టుడై సమాజంలో గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటాడు. అయినా ఇతనికి తృప్తి లేనట్లయితే ఆశాంతికి లోనవుతుంటాడు. దీనికి భిన్నంగా అంతే తెలివితేటలున్న మరొక వ్యక్తి మంచి ఆవకాశాలు రాక సాధారణ జీవితం గడుపుతూ ఉండచ్చు. సమాజం అతన్ని అసమర్థుడుగా భావించవచ్చు. కాని, ఈ వ్యక్తి తనలోని అద్భుత గుణమైన తృప్తితో తనకున్న దానితో, తను గడుపుతున్న జీవితంతో ఆనందంగా ఉండచ్చు. ఈ ఆనందమే మనిషిని జీవితాన్ని ప్రేమించేటట్లు చేసి నిజంగా జీవించేటట్టు చేస్తుంది. మొదటి వ్యక్తి అంత సాధించినా తృప్తి అనే గుణం లేనందువల్ల ఆశాంతికి గురవుతాడు. మనసు కు ఓ స్థిరత్వం ఉన్నప్పుడే తృప్తి అనే గుణం మనిషి వ్యక్తిత్వంలో ఒదిగిపోతుంది. అది ఉన్నవారే జీవితాన్ని ఆనందంగా గడపగలరు. చాలామంది తమ జీవితాన్ని ఇతరుల జీవితం తో పోల్చుకుంటారు. ఒకింత స్ఫూర్తికి, అలా తామూ ఎదగాలనే భావన లేదా/ ఆలోచనకు, అది అవసరం. అదీ ఒక స్థాయి వరకు మాత్రమే అభిలషణీయం/ హర్షదాయకం. కానీ అనుచితమైన పోలిక మన ప్రశాంత చిత్తమనే నదిలో పడ్డ రాయి లాంటిది. జీవితాన్ని ఆనందంగా గడపాలంటే చిన్న, చిన్న విషయాలను ఆస్వాదించటం అలవరచుకోవాలి. నారింజ రంగులో ఉండే సూర్యోదయం, అరుణ వర్ణపు సూర్యాస్తమయం, సప్తవర్ణ శోభిత హరివిల్లు, మంచు బిందువులు ముద్దిస్తున్న పుష్పాలు, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కుటుంబంతో కొంత సమయాన్ని గడపటం, ఒక పుస్తకం చదవటం, మొక్కలకు నీళ్లు పోయటం ఒకరి దప్పికను తీర్చటం, ఒకరి ఆకలిని తీర్చటం... వీటిలో ఏదైనా కావచ్చు. మరేవైనా వారి వారి అభిరుచిని బట్టి అలవాటు చేసుకోవచ్చు. ఇదీ మన జీవితాన్ని ఆనందభరితం చేస్తుంది. ఇవే మనల్ని నిజంగా జీవింప చేస్తాయి. బాహ్య చక్షువులతోపాటు ఆనందం, ఆస్వాదన అనే మనో నేత్రాలు కావాలి. మనమే వాటిని పొందాలి/ సంపాదించుకో వాలి. అప్పుడు జీవితాన్ని ఎంత మనోజ్ఞంగా ఉంటుందో అనుభవంలోకి వస్తుంది. ఎంతోమంది రుషులు, వేదాంతులు, తత్త్వ వేత్తలు, మహానుభావులు జీవితాన్ని నిర్వచించారు. దాని లోతుపాతులు శోధన చేసి, సాధన చేసి తమ జీవితానుభావాన్ని జోడించి జీవితమంటే ఇది అని చెప్పారు. వాస్తవానికి అది వారి భావన, వారి దార్శనికత. వారి శక్తి, ప్రతిభా వ్యుత్పత్తుల మనోదారుఢ్యం మీద జీవితం/ జీవితపు కొలతలు ఆధారపడి ఉంటాయి. సామాన్యులు వాటిని అర్థం చేసుకోవటానికి వారి జిజ్ఞాసకు కృషి, సాధనల తోడు తప్పనిసరిగా కావాలి. వీరే కాక ప్రతి ఒక్కరు జీవితం అంటే ఇది, ఇదే అంటూ ఎన్నో మాటలు చెపుతుంటారు. ఇక్కడే మనం అప్రమత్తం కావాల్సింది ఉంటుంది. మన ఇంగిత జ్ఞానమూ ఉపయోగించాలి. ఈ ప్రతి నిర్వచనం వారి వారి జీవిత నేపథ్యం నుండి వచ్చింది. ఆ నిర్వచనాన్ని మన జీవితాలకు అన్వయించుకునే ముందు మనకా నేప«థ్యం ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఒకవేళ ఉన్నా, ఆ పరిస్థితులలో ఆ వ్యక్తులు చూపిన గుండె నిబ్బరం, తెగువ, శక్తులు మనకున్నాయో లేదో అంచనా వేసుకోవాలి. అపుడే వాటిని స్వీకరించాలి. అయితే, అన్ని జీవిత నిర్వచనాలలో ఉండే సామ్యత చూడగలగాలి. మన జ్ఞానవివేకాలను సంయోగం చేసి ఎంతవరకు మన జీవితాలకు ఉపయోగించుకోవచ్చో నిర్ణయించుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఈ పరిశీలనకు మన చదువుల సారాన్ని కలపాలి. జీవితాన్ని ప్రేమించాలి. మనకు లభించిన జీవితాన్ని చక్కగా, హాయిగా జీవించాలి. ఈర్ష్య, అసూయలకు, అహంకారానికి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లనే భావనకు, అసంతృప్తికి, అనవసరపు ప్రాధాన్యతలకు, ఆడంబరాలకు దూరంగా ఉండగలగాలి. ఆ స్థితికి మనం చేరుకున్న క్షణం మనస్సు ఎంతో నిర్మలమవుతుంది. అదే మనలను స్థిరచిత్తులను చేస్తుంది. ఆ దశలో కష్టసుఖాలను సమానంగా తీసుకునే మానసిక శక్తి సహజంగా ఒనగురుతుంది. ఈ పరిపక్వత కోసమే మనం తపించి, సాధించ గలగాలి. అపుడే జీవిత వజ్రాయుధ ఘాతాలను తట్టుకుని నిబ్బరించుకోగలం. జీవితం ఉల్లాసం గా జీవించగలం. జీవితాన్ని జీవించటమంటే అదే. ఆ తాతగారు తన మనవడికి చెప్పిన మాటలు అందరకు శిరోధార్యమే. – బొడ్డపాటి చంద్రశేఖర్. అంగ్లోపన్యాసకులు -
బీజేపీ: ఆపరేషన్ ఆకర్ష్..
సాక్షి, రంగారెడ్డి: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార టీఆర్ఎస్ పార్టీలోని అసమ్మతి నేతలపై కాషాయదళం దృష్టి సారించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌కు కాషాయ కండువా కప్పేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న ఈ సీనియర్ నేత.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కమల తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే చివరి నిమిషంలో వెనకడుగు వేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ముందు కూడా మరోసారి ఈ అంశం చర్చకు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ నెగ్గడంతోపాటు తాజాగా రెండు రోజుల క్రితం వెలువడిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ గణనీయంగా స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఊపుమీదున్న బీజేపీలో ఆయన చేరిక మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీజేపీకి చెందిన పలువురు నాయకులు.. చంద్రశేఖర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. బీజేపీలో చేరికకు ఆయన సుముఖంగా ఉన్నప్పటికీ.. కొంత సమయం కావాలని కాషాయదళ నేతలను కోరినట్లు వార్తలు వినిపించాయి. తన అనుయాయులు, పార్టీ శ్రేణులు, సన్నిహితులతో చర్చించి వారి అభీష్టాన్ని తెలుకుంటానని చెప్పినట్లు సమాచారం. మూడు నాలుగు రోజుల్లో మాజీ మంత్రి చేరికపై స్పష్టత వస్తుందని కమల నేతలు చెబుతున్నారు. ఎలాగైనా పార్టీలో చేరతారన్న ధీమాతో వారు ఉన్నారు. ఈయన రాకతో వికారాబాద్‌లో బీజేపీ మరింత బలపడుతుందన్న విశ్వాసాన్ని బీజేపీ వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్‌కు కష్టకాలమే.. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతగిలిన కాంగ్రెస్‌ను.. సీనియర్ నేతల వలసలు మరింత ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ పార్టీ జిల్లాను శాసించిన స్థాయి నుంచి.. ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నాయకత్వ లేమి, అధిష్టానానికి నాయకులకు మధ్య సమన్వయం కొరవడటం తదితర కారణాల వల్ల హస్తం చతికిల పడుతూ వస్తోంది. ఈ వైఫల్యాల వల్లే నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే తరహాలోనే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కమలం వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న చంద్రశేఖర్‌కు సీఎం కేసీఆర్ సన్నిహితుడనే పేరుంది. అయితే గులాబీ పార్టీలో ఇమడలేకపోయిన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీని వీడారు. ఏఐఎఫ్బీ తరఫున ఎన్నికల బరిలో దిగి.. ఓటమిపాలైన చంద్రశేఖర్ తిరిగి హస్తం గూటికి చేరారు. సొంత నియోజకవర్గమైన వికారాబాద్‌ని కాదని పొరుగున ఉన్న చేవెళ్ల సెగ్మెంట్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు. దీనిపైనా ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. దీనికితోడు స్థానిక నేతనైన తనను కాదని వికారాబాద్‌లో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తోందని మథన పడ్డారు. ఈ పరిణామాలన్నీ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు మార్గం చూపుతున్నాయని తెలుస్తోంది. మొత్తంగా ఈ పార్టీకి భవిష్యత్ లేదన్న నిర్ణయానికి వచ్చిన ఈయన ప్రత్యామ్నాయంగా కమలం చెంతకు చేరేందుకు దాదాపుగా సిద్ధమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పక్కా వ్యూహంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, శేరిలింగంపల్లి సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తదితరులు కాషాయ కండువా కప్పుకున్నారు. మరికొందరి నేతలపై దృష్టి సారించిన కమలనాథులు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, ఇతర పార్టీల్లో పదవులు అలంకరించిన మాజీలు, క్రియాశీలక నేతలతోపాటు టీఆర్ఎస్లో ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అధికార పార్టీలో అధికంగానే ఉంది. ఇటువంటి నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ఆశావహులతో టచ్‌లోకి వెళ్లాలని బీజేపీ ప్రణాళిక రూపొందించుకుంటోంది. మొత్తానికి వీలైనంత వేగిరంగా జిల్లాలో టీఆర్ఎస్కు దీటుగా కమలదళాన్ని సిద్ధం చేసి ఎన్నికలను ఎదుర్కోవాలన్నది బీజేపీ వ్యూహంగా చెప్పవచ్చు. -
ర్యాపిడ్ టెస్ట్‌లకు సింగరేణి 5 వేల కిట్లు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు, ప్రైవేటు ఆసుపత్రులతో అత్యవసర సేవల ఒప్పందం వంటి చర్యలు చేపట్టింది. సంస్థ ఎండీ ఎన్.శ్రీధర్ నేతృత్వంలో తీసుకున్న చర్యలను సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్, పా), ఎం.బలరాం (ఫైనాన్స్) మంగళవారం ఏరియా మేనేజర్లకు వివరిస్తూ పలు సూచనలు చేశారు. ర్యాపిడ్ టెస్టుల కోసం ఐదువేల కిట్లతో పాటు, కరోనా వ్యాధి నివారణ కోసం హెటిరో సంస్థ తయారు చేసిన 1,800 ఖరీదైన ఇంజక్షన్ డోస్‌లను కూడా కొనుగోలు చేసినట్లు చెప్పారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో పాటు ఈ డోస్‌లను గురువారంలోగా ఏరియా ఆసుపత్రులకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సింగరేణి ఉద్యోగులకు చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లో వెంటిలేటర్ సౌకర్యం కలిగిన మూడు ఆసుపత్రులతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ఔట్సోర్సింగ్ సిబ్బందికి అదనపు చెల్లింపులు సింగరేణి ఆసుపత్రులతో పాటు క్వారంటైన్ సెంటర్లలో పనిచేసే వైద్య సిబ్బందికి అవసరమైన సహాయ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని సింగరేణి సంస్థ ఎండీ శ్రీధర్ సూచించారు. కరోనా వైద్య సేవల్లో పాల్గొంటున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనంతో పాటు రోజుకు రూ.300 చొప్పున అదనంగా చెల్లించాలని సంస్థ నిర్ణయించింది. అన్ని ఏరియా ఆసుపత్రుల్లోనూ పూర్తి సౌకర్యాలతో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఎండీ ఆదేశించారు. -
ఆ ఆరింటిలోనే!
సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ లోకోపైలెట్ చంద్రశేఖర్ ఏమరుపాటు వల్లే కాచిగూడ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు అంచనాకు వచ్చారు. సాధారణంగా నగరంలోని ఎంఎంటీఎస్ స్టేషన్లలో రైలు 2 నిమిషాలు ఆగిన తర్వాత ఆటోమేటిక్‌గా సిగ్నల్ పడుతుంది. దాంతో రైలు ముందుకు వెళ్తుంది. కానీ 6 ప్రధాన స్టేషన్లలో మాత్రం హోమ్ సిగ్నలింగ్ వ్యవస్థ పని చేస్తోంది. ఈ ఆరింటిలో స్టార్టింగ్ సిగ్నల్ అందితేనే రైలు ముందుకు కదులుతుంది. సోమవారం కాచిగూడ స్టేషన్లో 2 నిమిషాలు ఆగిన ఎంఎంటీఎస్ స్టార్టింగ్ సిగ్నల్ వెలగకుండానే బయలుదేరింది. ఆ సమయంలో అదే ట్రాక్‌పై వస్తున్న హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు హోమ్ సిగ్నల్ పడింది. ఇది గమనించకుండానే ఎంఎంటీఎస్ దూసుకురావడంతో ఎక్స్‌ప్రెస్‌ను బలంగా ఢీకొట్టింది. ఇదంతా కాచిగూడ స్టేషన్‌కు కేవలం 300 మీటర్ల దూరంలో 30 సెకన్ల వ్యవధిలో జరిగినట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గ్రేటర్లో మొత్తం 45 కిలోమీటర్ల పరిధిలో 26 స్టేషన్ల మీదుగా ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో 20 స్టేషన్లు ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థపై ఆధారపడి ఉండగా... ఆరింటిలో మాత్రం హోమ్ సిగ్నలింగ్ వ్యవస్థ పని చేస్తోంది. అంటే లోకోపైలెట్‌కు గ్రీన్ సిగ్నల్ అందితే తప్ప ముందుకు వెళ్లడానికి వీల్లేదు. హోమ్ సిగ్నలింగ్ ఎక్కడెక్కడ? సికింద్రాబాద్, కాచిగూడ, ఫలక్‌నుమా, లింగంపల్లి, నాంపల్లి, హఫీజ్‌పేట్ స్టేషన్లలో ఎంఎంటీఎస్‌తో పాటు ఇతర రైళ్ల రాకపోకల కోసం హోమ్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉంది. పది ప్లాట్‌ఫామ్‌లు ఉన్న సికింద్రాబాద్ స్టేషన్లో ఒక దానిపైనున్న రైలు బయలుదేరితే తప్ప మరో దానికి అవకాశం లభించదు. కంట్రోల్ సెంటర్ రూట్ రిలే ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ద్వారా రైళ్లకు ప్లాట్‌ఫామ్‌లను కేటాయిస్తారు. సికింద్రాబాద్‌తో పాటు మిగతా 5 స్టేషన్లలోనూ ఇదే విధంగా సిగ్నలింగ్ వ్యవస్థ పని చేస్తోంది. కాకినాడ, విశాఖ నుంచి వచ్చే పలు రైళ్లను లింగంపల్లి వరకు పొడిగించడం వల్ల అక్కడ రైళ్లు హోమ్ సిగ్నలింగ్‌పై ఆధారపడి రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్ తర్వాత నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్లు. ఇక్కడ పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు ఉంటాయి. అలాగే మహబూబ్‌నగర్, కర్నూల్, ఉందానగర్ నుంచి వచ్చే రైళ్లతో ఫలక్‌నుమా రద్దీగా ఉంటుంది. హఫీజ్‌పేట్ మీదుగా కొన్ని రైళ్లను మళ్లిస్తారు. దీంతో ఈ ఆరు హోమ్ సిగ్నలింగ్‌పై ఆధారపడి ఉంటాయి. ఆయా స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో ‘స్టార్టింగ్’ సిగ్నల్ అందితే తప్ప ముందుకు కదలడానికి అవకాశంఉండదు. 2నిమిషాల సమయం నేచర్‌క్యూర్ ఆస్పత్రి, బోరబండ, బేగంపేట్, జామై ఉస్మానియా, విద్యానగర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు, మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట, డబీర్‌పురా, ఉప్పుగూడ తదితర ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ ద్వారా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ స్టేషన్లలో కేవలం ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలే ఉంటాయి. దీంతో ప్రతి 2 నిమిషాలకు ఒకసారి సిగ్నల్ వస్తుంది. లోకోపైలెట్లు సిగ్నల్ కోసం ఎదురు చూడకుండానే 2 నిమిషాలు ఆగిన తరువాత వాకింగ్ స్పీడ్‌తో రైలును కదిలిస్తారు. ఆటోమేటిక్‌గా సిగ్నల్ అందుతుంది. దీంతో రైలు వేగాన్ని పెంచేస్తారు. నగరంలో ప్రతిరోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు ఇదే పద్ధతిలో రాకపోకలు సాగిస్తున్నాయి. వేగం ఎక్కువే... సాధారణంగా ఎంఎంటీఎస్ రైళ్లు 25 కేవీ విద్యుత్ సామర్థ్యంతో నడుస్తున్నాయి. పాత రైళ్లకు వన్ ఫేజ్ విద్యుత్ మోటార్ పని చేస్తుండగా.. ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ఎంఎంటీఎస్ రైళ్లకు (టెటీస్కోపిక్ కోచ్‌లు ఉన్నవి) త్రీ ఫేజ్ మోటార్లను ఏర్పాటు చేశారు. దీంతో ఈ రైళ్లు బయలుదేరిన క్షణాల్లోనే వేగాన్ని అందుకుంటాయి. ‘కాచిగూడలో ప్రమాదానికి కారణమైన ట్రైన్ కూడా టెటీస్కోపిక్ కోచ్‌లతో కూడి, త్రీ ఫేజ్ మోటార్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది స్టేషన్‌కు 300 మీటర్ల దూరంలో హంద్రీని ఢీకొనే సమయానికి కనీసం 50 కిలోమీటర్ల వేగంతో ఉండి ఉంటుంది. ఆ సమయంలో హంద్రీ ఎక్స్‌ప్రెస్ 10 కిలోమీటర్ల వేగంతో చాలా నెమ్మదిగా లూప్లైన్లో ట్రాక్ మారుతుండడం వల్ల ప్రమాద తీవ్రత తక్కువగా ఉంది’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు విశ్లేషించారు. -
చిత్తూరు జిల్లాలో పెరిగిపోయిన టీడీపీ అరాచకాలు
-
కర్ణాటకలో బీజేపీ అభ్యర్థి జంప్
బెంగళూరు: కర్ణాటకలోని రామనగర అసెంబ్లీ స్థానానికి ఈనెల 3న ఉప ఎన్నిక జరగనుండగా బీజేపీకి ఆ పార్టీ అభ్యర్థి ఎల్.చంద్రశేఖర్ గట్టి షాకిచ్చారు. బీజేపీ నేతలు తనను పట్టించుకోవడం లేదంటూ తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాగా, ఈ స్థానం నుంచి జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ అభ్యర్థిగా సీఎం కుమారస్వామి భార్య అనిత పోటీ చేస్తున్నారు. చంద్రశేఖర్ తప్పుకోవడంతో ఆమె గెలుపు మరింత తేలిక కానుంది. గురువారం చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప నేను ఫోన్ చేసినా మాట్లాడటం లేదు. ప్రచారంలో నేతలెవరూ నన్ను కలుపుకుని పోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్‌కు వెళుతున్నా. జేడీఎస్ అభ్యర్థికే మద్దతిస్తా’ అని తెలిపారు. -
సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఆందోళన
సాక్షి, కరీంనగర్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు తప్పుడుగా నమోదవుతున్నాయంటూ, ఇందులో ప్రాథమిక విచారణ అవసరమని, తక్షణ అరెస్టులు ఆపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ సోమవారం దళిత ముస్లిం లిబరేషన్ యునైటెడ్ ఫ్రంట్, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైనట్లు దళిత ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మెండి చంద్రశేఖర్, దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉదయమే దళిత, ప్రజా సంఘాలకు చెందిన నేతలు పెద్దఎత్తున స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు రం గప్రవేశం చేసి దళితులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరిగింది. దళిత ముస్లిం లిబరేషన్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌తోపాటు దళితులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పో లీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. దళిత సంఘాల నేతలు సుద్దాల లక్ష్మణ్, మేడి మహేశ్, ఇంజం వెంకటస్వామి, కల్లెపల్లి శంకర్, మాదరి శ్రీనివాస్, గోష్కి శంకర్, మేడి అంజయ్య, గోష్కి అజయ్, గంటల రేణుక, మాల మాలతి, యనమల మంజుల, తీట్ల ఈశ్వరి, సముద్రాల అజయ్, బడుగు లింగయ్య, గసికంటి కుమార్, బొలుమాల సదానందం, బొగ్గుల మల్లేశం, కోహెడ వినోద్, గాలిపెల్లి శ్రీనివాస్, సానది వెంకటేష్, గంటల మహేందర్, గోర్రె రాజయ్య, పోత్తూరి రమేశ్, మైసని మనోహర్, చిన్న రుద్రవరపు పాల్గొన్నారు. సంఘాల ఆధ్వర్యంలో.. కేవీపీఎస్, ఆర్పీఐ, టీఎంఆర్పీఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని నీరుగార్చేలా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లగుడ్డలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.సురేష్, చందు, చిరంజీవి, రాజయ్య, కుతాడి శివరాజ్, లింగంపల్లి బాబు, వెంకన్న, కృష్ణ, ఆంజనేయలు తదితరులు పాల్గొన్నారు. -
సెంచరీతో చెలరేగిన చంద్రశేఖర్
కేంబ్రిడ్జ్ 342 ఆలౌట్ ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: కేంబ్రిడ్జ్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ బి. చంద్రశేఖర్ (113 బంతుల్లో 119; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో స్పోర్టింగ్ ఎలెవన్ ఆధిక్యాన్ని తగ్గించాడు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో మంగళవారం రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన కేంబ్రిడ్జ్ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగుల వద్ద ఆలౌటైంది. చంద్రశేఖర్ ధాటిగా ఆడాడు. తనయ్ త్యాగరాజన్ (51), మల్లికార్జున్ (50) రాణించారు. స్పోర్టింగ్ బౌలర్లలో గౌరవ్ 4, సాత్విక్ రెడ్డి 3 వికెట్లు తీశారు. అంతకుముందు 412/7 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన స్పోర్టింగ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 424 పరుగుల వద్ద ఆలౌటైంది. ఈ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల ఆధిక్యం లభించింది. నగరంలో మంగళవారం కురిసిన వర్షం వల్ల పలు మ్యాచ్‌ల రెండో రోజు ఆట రద్దయ్యింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 216, జైహనుమాన్ తొలి ఇన్నింగ్స్: 171 (సాకేత్ సాయిరామ్ 39, శాండిల్య 33; మెహదీహసన్ 6/47), ఎన్స్‌కాన్స్ రెండో ఇన్నింగ్స్: 129 (అరుణ్ 38; సాకేత్ సాయిరామ్ 5/42, తేజ 3/15), జైహనుమాన్ రెండో ఇన్నింగ్స: 78/3 (శశిధర్ 31). ఆర్.దయానంద్ తొలి ఇన్నింగ్స్: 273, చార్మినార్ సీసీ తొలి ఇన్నింగ్స్: 206/9 (ఎస్కె మొహమ్మద్ 131; భగత్ వర్మ 5/104). -
కడప పాతబస్టాండ్ వద్ద వ్యక్తి దారుణ హత్య
కడప నగరంలోని పాతబస్టాండ్ వద్ద పట్టుపోగుల చంద్రశేఖర్(55) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి పరారయ్యారు. హత్యకు గురైన వ్యక్తి పట్టుపోగుల రెసిడెన్సీ యజమానిగా గుర్తించారు. డబ్బుల విషయంలో తేడా రావడంతో ప్రత్యర్థులే హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఎంపీలను సస్పెండ్ చేశారని.. గుండుతో నిరసన
నల్లగొండ(సూర్యాపేట): పార్లమెంట్ సమావేశాలకు రాకుండా కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేయడంపై ఓ అభిమాని మనస్తాపానికి గురయ్యాడు. సస్పెండుపై స్పందిస్తూ.. గుండు చేయించుకుని వినూత్నంగా నిరసన తెలిపాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన రాహుల్ గాంధీ జన జాగృతి జాతీయ అధ్యక్షుడు రిక్షా చంద్రశేఖర్, తెలంగాణ తల్లి విగ్రహం ఎదుటు గుండు గీయించుకుని నిరసన తెలిపారు. -
‘మొక్క’వోని దీక్షతో..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : హరితహారం కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్ని జిల్లాల్లో పర్యటించి స్వయంగా మొక్కలు నాటేందుకు సిద్ధమైన నేపథ్యంలో శనివారం జిల్లాకు విచ్చేస్తున్నారు. శని, ఆదివారాల్లో జిల్లాలో పర్యటిస్తున్న కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లోని హుస్నాబాద్, మానకొండూరు, పెద్దపల్లి, ధర్మపురి ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్వయంగా మొ క్కలు నాటాలని నిర్ణయించారు. సీఎం రాక నేపథ్యంలో కలెక్టర్ నీతూప్రసాద్, ఎస్పీ జోయల్ డేవిస్ సహా అధికార యంత్రాంగమంతా శుక్రవారం ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం పర్యటించే బస్వాపూర్, హుస్నాబాద్, చిగురుమామిడి, ముల్కనూర్, ఎల్ఎండీ ప్రాంతాల్లోని మొక్కలు నాటే ప్రదేశాలను పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ముల్కనూరులో సీఎం ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ తదితరులు సీఎం రాక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శనివారం కేసీఆర్ పర్యటన ఇలా... కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాలోకి ప్రత్యేక బస్సు ద్వారా ప్రవేశిస్తారు. తొలుత కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలోని మోడల్స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడినుంచి 3.40 గంటలకు బస్వాపూర్ రిజర్వ్ ఫారెస్ట్, 4.15 గంటలకు హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయం వద్ద మొక్కలు నాటడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు చిగురుమామిడి మండల కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. 5.15 గంటలకు ముల్కనూర్, 5.40 గంటలకు తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ జెడ్పీహెచ్ఎస్, 5.55 గంటలకు తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల, 6.20 గంటలకు అల్గునూర్‌లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో మొక్కలు నాటుతారు. అనంతరం కరీంనగర్ మండలంలోని తీగలగుట్టపల్లికి చేరుకుని ఉత్తర తెలంగాణ భవన్లో రాత్రి బస చేస్తారు. ఆదివారం పర్యటన షెడ్యూల్ ఆదివారం ఉదయం 8 గంటలకు ఆయన ఉత్తర తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి 8.15 గంటలకు సర్కస్‌గ్రౌండ్‌లో, 8.35 గంటలకు శాతవాహన విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటుతారు. అనంతరం 9.15 గంటలకు కలెక్టరేట్లోని హెలిప్యాడ్‌కు చేరుకుని హెలిక్యాప్టర్ ద్వారా యాదాద్రికి బయలుదేరుతారు. రాష్ట్రపతి ప్రణభ్‌ముఖర్జీ యూదాద్రి దర్శనానికి వస్తున్నందున కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం తిరిగి హెలిక్యాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.30 గంటలకు పెద్దపల్లి ఐటీఐ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుని కళాశాలల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 2.40 గంటలకు ధర్మారం మార్కెట్‌యార్డులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గం ద్వారా తన బస్సులో ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బయలుదేరుతారు. -
క్షణికావేశం
పెనుకొండ: పంతాలు.. పట్టింపులు ఆ దంపతుల నిండు జీవితాలను బలితీసుకున్నాయి.. కుటుంబ కలహాలతో క్షణికావేశానికి గురైన ఉపాధ్యాయ దంపతులు తమ కలల పంట అయిన రెండేళ్ల చిన్నారిని ఒంటరి చేసి తిరిగిరాని లోకాలకు చేరారు.. చిన్న సమస్యను పరిష్కరించుకోవడంలో రాజీ పడలేక నిండు ప్రాణాలను బలవంతంగా తీసుకున్నారు. పెనుకొండ పట్టణంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ విషాదాంతం వివరాలు ఇలా ఉన్నాయి. బుక్కపట్టణం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్(27) సోమందేపల్లి మండలం జూలుకుంట గ్రామ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తాడిపత్రికి చెందిన ఏఎస్ఐ రామచంద్రారెడ్డి కుమార్తె రమాదేవి(23)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండు సంవత్సరాల కుమార్తె తేజస్విని ఉంది. రమాదేవి డీఎస్సీ రాసేందుకు సిద్ధమవుతుంది. ఆమె చదువుకు అండగా ఉంటున్న చంద్రశేఖర్ కుమార్తె తేజస్వినిని తన స్వగ్రామంలో తల్లిదండ్రులు వద్ద వదలి రావాలని అనుకున్నాడు. అయితే తమ తల్లిదండ్రుల వద్ద వదిలిరావాలని రమాదేవి అనడంతో ఇద్దరి మధ్య మాటామాటా జరిగింది. మూడు రోజుల పాటు వివాదం కొనసాగింది. సోమవారం రాత్రి కూడా ఇదే విషయమై ఇద్దరు గొడవపడి వేర్వేరు గదుల్లో నిద్రించారు. మంగళవారం ఉదయం నిద్రలేచిన చంద్రశేఖర్ ఎంతకీ భార్య గది నుంచి బయటకు రాకపోవడంతో కిటికీలో నుంచి చూశాడు. గదిలో పైకప్పుకు ఉరివేసుకుని ఉన్న రమాదేవి కనిపించింది. దీంతో తీవ్రంగా కలత చెందిన చంద్రశేఖర్ వెంటనే కొండాపురం రైల్వేలైన్ వద్దకు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత రైల్వే పోలీసులు భావించారు. రమాదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం బయట పడగా భర్త కోసం ఆరా తీశారు. ఆచూకీ లేకపోవడం, సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో రైలు కిందపడి మరణించిన వ్యక్తిపై దృష్టి మళ్లించారు. ఘటనా స్థలానికి వెళ్లగా చనిపోయిన వ్యక్తి ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌గా తేలింది. సమాచారం అందుకున్న సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్ఐ లింగణ్ణలు ఘటన స్థలానికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఇద్దరి మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉపాధ్యాయులు విషయం బయటకు రావడంతో పట్టణవాసులు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున మృతుడు చంద్రశేఖర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. చిన్నారి తేజస్విని చూసి మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. మృతుల కుటుంబీకులు పట్టణానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను చూసి బోరున విలపించారు. మృతదేహాలను అగ్రహారం తరలించడానికి ఏర్పాట్లు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
నేడు సీఎం ఏరియల్ సర్వే
ఆమనగల్లు: ఫార్మాసిటీకి కావాల్సిన భూములను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం పరిశీలించనున్నారు. హెలికాప్టర్ నుంచే ఆయన భూములను పరిశీలించనుండడంతో అధికారులు ఆ భూముల్లో జెండాలు పాతారు. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఫార్మాసిటీ, ఫిల్మ్‌సిటీల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశ్రామిక వేత్తల బృందంతో కలిసి బుధవారం అందుకు సంబంధించిన భూములను హెలికాప్టర్ నుంచి పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ శర్మన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆమనగల్లు మండల పరిధిలో దిల్ సంస్థకు కేటాయించిన భూములను గుర్తించేందుకు వీలుగా ఆ భూముల్లో పచ్చజెండాలు పాతారు. ‘దిల్’కు 1642 ఎకరాలు కేటాయింపు మండలంలోని ఐదు గ్రామాల ప రిధిలో 1,642 ఎకరాలను దిల్ సంస్థకు ప్రభుత్వం 2007లో కేటాయించింది. ఆమనగల్లు గ్రామంలోని 16 సర్వే నెంబర్ లో 226 ఎకరాలు, 21 సర్వే నెంబర్లో 8.15 ఎకరాలు, సర్వే నెం.27లో 101 ఎకరాలు, సర్వే నెం.68లో 113ఎకరా లు, సర్వే నెం.643లో 18ఎకరాలు, స ర్వే నెం.646లో 40 ఎకరాలు, సర్వే నెం.1429లో 197 ఎకరాలు, ముద్విన్‌లో సర్వే నెం.179లో 267 ఎకరాలు, ఆకుతోటపల్లిలో సర్వే నెం.304లో 382 ఎకరాలు, చెన్నంపల్లిలో సర్వే నెం.23లో 57 ఎకరాలు, పోలెపల్లిలో సర్వే నెం.3లో 162 ఎకరాలు, సర్వే నెం.5 లో 68 ఎకరాలను దిల్ సంస్థకు కేటాయించారు. భూముల పరిశీలన జిల్లా సరిహద్దులను గుర్తించడానికి వీ లుగా అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. మండలంలోని జమ్ములబావితాండా సమీపంలో దాదాపు 570 ఎకరాలను రంగారెడ్డి జిల్లా అధికారులు తమ భూములుగా రికార్డుల్లో పేర్కొన్నారు. దీంతో జిల్లా సరిహద్దులోని భూములను జిల్లా ల్యాండ్ అండ్ సర్వే ఏడీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు శివకుమార్, శ్రీనివాస్‌రెడ్డి, సర్వేయర్ మహేశ్ కొలతలు వేస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి ముఖ్యమంత్రి పరిశ్రమలకు కేటాయించిన భూములపై ఏరియల్ సర్వే చేయనున్నందున అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శర్మన్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మండలంలో దిల్ సంస్థకు కేటాయించిన భూములను గుర్తించడానికి వీలుగా జెండాలు ఏర్పాటు చేశామన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో ఏర్పాటు చేసిన వద్ద జిల్లాకు సంబందించిన భూముల ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
స్నాతకోత్సవం..
-
మా బిడ్డ సీఎం అవుతుండు
ఆనందంలో చింతమడక గ్రామస్తులు సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: చింతమడక... ఒకప్పడు ఈ పేరు కేవలం పొరుగున ఉన్న నాలుగు గ్రామాలకే సుపరిచితం. కానీ నేడు అది యావత్ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ధన్యస్థలంగా ప్రతీతి పొందుతోంది. చింతమడక ముద్దు బిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆ గ్రామ వాసులంతా ఆ అపురూప క్షణాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాల్యం తమతో కలిసి ఆడిపాడిన దోస్త్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతుండడంతో కేసీఆర్ బాల్యమిత్రులు ఆన ందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ‘ప్రత్యేక’ పోరాటంలో ఆ పల్లె ప్రత్యేకం తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అందరినీ ఏకం చేసి ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్ స్వగ్రామం చింతమడక తెలంగాణలోని పది జిల్లాలకు స్ఫూర్తిగా నిలిచింది. 2001లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా గులాబీ జెండాను భుజానికెత్తుకున్న కేసీఆర్, ప్రత్యేక రాష్ట్రం సాధించడంతో పాటు అధికార పగ్గాలు కూడా చేపట్టనుండడంతో ఆయన స్వగ్రామంలోని ప్రతి గడపా పులకిస్తోంది. చరిత్రలో సుస్థిరంగా నిలిచిన ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్‌కు జన్మనిచ్చిన ఆ గ్రామం నేడు ఆనంద పరవశంతో ఓలలాడుతోంది. జూన్ 2న కేసీఆర్ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామం చింతమడకలోని కొందరిని ‘న్యూస్‌లైన్’ పలుకరించగా, సీఎం మా వాడేనంటూ గంతులేశారు. మా దోస్త్ తప్పకుండా మంచి సీఎం అవుతాడంటూ కితాబిచ్చారు. ఎంతో గర్వంగా ఉంది.. చింతమడక బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావడం ఎంతో గర్వంగా ఉంది. ఆయన బాల్యం నుంచే మొండి పట్టుదల. అనుకున్నది సాధించే వరకు వదలడు. రాజకీయాల్లో కూడా పట్టు విడుపులేని వ్యక్తి. మా ఊరి నాయకుడు రాష్ట్ర నాయకుడు అవుతున్నాడంటే సంతోషంగా ఉంది. - సత్యనారాయణగౌడ్, మాజీ సర్పంచ్ మా ఊరి పేరు అందరికి తెలిసింది మొన్నటి దాకా సిద్దిపేట మండలానికి, జిల్లాకు తెలిసిన మా ఊరి పేరు నేడు దేశ వ్యాప్తంగా తెలిసింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజలకు మరింత సేవలు చేసి ఊరిని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. - కూస బాల్‌రాజు, గ్రామ నాయకుడు సీఎం మాఊరోడని చెప్పుకుంటాం ముఖ్యమంత్రి కేసీఆర్ మాఊరోడేనని గర్వంగా చెప్పుకుంటాం. ఇక చింతమడకపై అందరూ దృష్టి పెడతారు. తప్పకుండా గ్రామం అభివృద్ధి చెందుతుంది. - చెప్యాల దేవవ్వ, ఎంపీటీసీ -
ఇద్దరికే చాన్స్?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా గులాబి దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8.25 నిమిషాలకు ఆయన ప్రయాణ స్వీకారం చేయనుండగా, అదే వేదిక మీద రాష్ట్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 14 మందితో కొలువుదీరనున్న కేసీఆర్ మంత్రివర్గంలో జిల్లా నుంచి ఇద్దరికి చాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి వెన్నెముకగా నిలబడిన సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావుకు కీలకమైన భారీ నీటిపారుదల, విద్యుత్ శాఖలతో పాటు వ్యవసాయ శాఖను కూడా అప్పగిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల వేళ టీఆర్ఎస్ తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు, రైతులకు రుణమాఫీ వంటీ కీలక హామీలు ఇవ్వడం వల్ల వీటిని సమర్థవంతంగా నిర్వహించేందుకే కేసీఆర్ ఏరికోరి హరీష్‌రావుకు ఆ శాఖలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక జిల్లాకు కేటాయించనున్న రెండో పదవిపైనే సందిగ్ధం నెలకొని ఉంది. దీనిపై పార్టీ సీనియర్ నాయకులు కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. వడపోత విధానంలో కేసీఆర్ తన మిత్రుడు బాబూమోహన్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. మెదక్‌లో రాములమ్మను మట్టికరిపించిన పద్మాదేవేందర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్లలను తొలుత కేసీఆర్ పరిశీలించినట్లు సమాచారం. అయితే తన నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు, హరీష్‌రావు నియోజకవర్గం సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలన్నీ ఒకే రెవెన్యూ డివిజన్ కిందకు వస్తున్నాయి, దీంతో ఒకే డివిజన్‌కు మూడు పదవులు ఇవ్వడం సరైన పద్ధతి కాదనే ఆలోచనతో కేసీఆర్ సోలిపేటను పక్కనపెట్టినట్లు తెలిసింది. ఇక మహిళా కోటాలో పద్మాదేవేందర్‌రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని, ఆమెకు మహిళా, శిశు సంక్షేమశాఖ కేటాయించవచ్చని తొలుత ప్రచారం జరిగింది. కానీ సామాజిక వర్గాల సమీకరణ, ఇతర పరిణామాల నేపథ్యంలో బాబూమోహన్ పేరు తెరమీదకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు దళిత సామాజిక వర్గానికి చెందిన బాబూమోహన్... కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. ఇద్దరూ బావ అంటే ‘బావ’అని సంభోదించుకుంటారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఆత్మీయులుగా మెలగగలిగారు. ఆ అభిమానంతోనే కేసీఆర్.. బాబూమోహన్‌ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించి, అందోల్ సీటిచ్చారు. అంతేకాకుండా పట్టుబట్టి మరీ బాబూమోహన్‌ను గెలిపించుకున్నారు. తాజాగా మంత్రి పదవి కూడా బాబూమోహన్‌కే ఇవ్వడానికి కేసీఆర్ మొగ్గు చూపిన్నట్లు సమాచారం. బాబూమోహన్‌కు పదవి ఇవ్వటం వల్ల సామాజిక వర్గాల సమీకరణను కూడా సమతుల్యం చేసినట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై బాబూమోహన్ స్పందన కోరగా..! ‘‘మా బావే సీఎం అవుతున్నప్పడు నాకు మంత్రి పదవి ఉంటే ఎంత? లేకుంటే ఎంత’’ అంటూ సమాధానమిచ్చారు. -
యువతతోనే మార్పు
ఆర్ఎస్ఎస్ షష్ట్యాబ్ధి ఉత్సవాలు జిల్లాకేంద్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పథసంచాలన్ ఆకట్టుకుంది. దేశభక్తి, హిందూత్వం, ధర్మ పరిరక్షణ కోసం ఏర్పడిన సంస్థ ఆర్ఎస్ఎస్ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంతీయ కార్యవాహ్ ఎక్కా చంద్రశేఖర్ అన్నారు. యువతతోనే మార్పు సాధ్యమని, రాజకీయాలకు అతీతంగా దేశ అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. కరీంనగర్ అర్బన్, న్యూస్‌లైన్ : రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా యువ త దేశ అభ్యున్నతికి పాటుపడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంతీయ కార్యవాహ్ ఎక్కా చంద్రశేఖర్ సూచించారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆర్ఎస్ఎస్ షష్ట్యాబ్ది ఉత్సవాలు ఆదివారం జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వ్యక్తి త్వ నిర్మాణంతోనే దేశంలో మార్పులు సాధ్యమన్నారు. ఆర్ఎస్ఎస్ దేశభక్తి, హిందుత్వం, ధర్మ పరిరక్షణ కోసం ఏర్పడిన సంస్థ అని, దేశ ఉన్నతే లక్ష్యంగా పని చేస్తుం దని తెలిపారు. యువతతోనే మార్పు సాధ్యమని, ప్రతీ ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచిం చారు. దేశానికి సేవ చేసినా కన్నతల్లికి చేసినట్లుగా భా వించాలన్నారు. దేశ సరిహద్దులు తెలియని వారు కూ డా పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దే శంలో మూడు కోట్ల మంది విదే శీయులు అనుమతి లేకుండా జీవనం సాగిస్తున్నారని, దేశంలో భద్రత కరువైందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్కు ఏ పార్టీతో సం బంధం లేదని, యువతలో దేశభక్తి పెంపొందించడానికి కృషి చేస్తుందని అన్నారు. ఆకట్టుకున్న పథసంచాలన్.. అంతకుముందు ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి 500 మంది కార్యకర్తలతో ప్రారంభమైన పథసంచాలన్ ఆకట్టుకుంది. రాజీవ్‌చౌక్, టవర్ సర్కిల్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, బస్టాండ్, తెలంగాణ చౌక్ మీదుగా కళాశాల మై దానానికి చేరింది. టవర్‌సర్కిల్‌లో వీహెచ్‌పీ, టవర్‌సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్, జ్యూయలరీ సంఘం స్వా గతం పలికారు. నిగమ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాం డెంట్ గోపాల్ రెడ్డి, విభాగ్ సంఘ్ చాలక్ మల్లోజుల కిషన్‌రావు, జిల్లా సంఘ్ చాలక్ గట్టు మురళీమనోహర్, నగర సంఘ్ చాలక్ సీహెచ్. రమణాచారి, బూర్ల దక్షిణామూర్తి, చక్రాల రామాంజనేయులు, జన్న సత్యనారాయణరెడ్డి, సుగుణాకర్‌రావు, బండి సంజయ్‌కుమార్, గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఎడవెల్లి విజేందర్‌రెడ్డి, కుమ్మరి కుంట సుధాకర్, ముక్కా హరీష్‌బాబు, కరండ్ల మధుకర్, బేతి మహేందర్‌రెడ్డి, శిరీష్, రమణారెడ్డి, ప్రశాం త్, రామారావు, చక్రధర్, రవీందర్ పాల్గొన్నారు. -
కబళించిన కరెంట్ తీగ
నందిపేట, న్యూస్‌లైన్: విద్యుదాఘాతానికి ఓ రైతు మృ తి చెందాడు. నిజామాబాద్ జిల్లా తల్వేద గ్రామానికి చెందిన ఒక రైతు ట్రాన్స్ఫార్మర్కు ఫీజు పోయిందని ట్రాన్స్‌కో లైన్‌మేన్ చంద్రశేఖర్ అనుమతితో లైన్‌క్లియర్ (ఎల్సీ) తీసుకున్నాడు. కొంతసేపటి తరువాత అదే గ్రామానికి చెందిన భోజన్న తన పొలం వద్దనున్న ట్రాన్స్ఫార్మర్కు కూడా ఫీజు పోయిందని ఎల్సీ తీసుకున్నాడు. ముందుగా ఎల్సీ తీసుకున్న రైతు పని పూర్తిచేసుకుని సరఫరా ఇవ్వాల్సిందిగా ఉపవిద్యుత్ కేంద్రానికి ఫోనులో సమాచారం అందించాడు. అయితే భోజన్న కూడా ఎల్సీ తీసుకున్న విషయాన్ని మరిచిన ఆపరేటర్ సరఫరాను పునరుద్ధరించాడు. దీంతో, భోజన్న విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు ఏడీ కిరణ్‌కుమార్‌పై దాడి చేశారు. లైన్‌మన్ సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
మావోయిస్టు నేత చంద్రశేఖర్‌పై కేసు కొట్టివేత
గద్వాల, న్యూస్‌లైన్: మావోయిస్టు పార్టీ కర్ణాటక రాష్ట్ర సభ్యుడు చంద్రశేఖర్ గోరబాల అలియాస్ చంద్రశేఖర్ ఆజాద్‌పై జిల్లా పోలీసులు పెట్టిన మారణాయుధాల కేసును జిల్లా మూడో అదన పు సెషన్స్ కోర్టు జడ్జి ప్రభాకర్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. న్యాయవాది మనోహర్ కథనం ప్ర కారం... 2010 జూన్ 12 రాత్రి కర్ణాటక నుంచి అయిజ మీదుగా కర్నూలుకు ఆయుధాలతో వెళ్తున్నాడనే ఆరోపణలతో అయిజ పోలీసులు చంద్రశేఖర్ ఆజాద్‌ను అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు గద్వాల కోర్టులో హాజరుపరచగా, జ డ్జి రిమాండ్ విధించారు. ఏకే-47, అత్యాధునిక ఆయుధాలతో చంద్రశేఖర్‌ను అరెస్టు చేసినట్లు అప్పట్లో జిల్లా పోలీసులు మీడియా ముందు చూపించారు. నాటినుంచి చర్లపల్లి జైలులో విచారణ ఖైదీగా ఉంటున్న ఆయన గద్వాల కోర్టుకు హాజరవుతూ వచ్చారు. రెండున్నర ఏళ్ల విచారణ అనంతరం చంద్రశేఖర్ పై మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు మోపిన ఆయుధాల కేసులో సాక్షాధారాలు చూయించలేకపోయారు. దీంతో శుక్రవారం గద్వాల ఏడీజే ప్రభాకర్ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. తీర్పు కాపీ వచ్చే వరకు పోలీసుల అదుపులు ఉండాల్సి ఉన్నందున, తీర్పు వెలువడిన అనంతరం చర్లపల్లి జైలు అధికారులు చంద్రశేఖర్‌ను హైదరాబాద్‌కు తీసుకెళ్లారని న్యాయవాది మనోహర్ వివరించారు. అయిజ ఎక్కడుందో తెలియదు.. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. తనను కర్ణాటకలో అదుపులోకి తీసుకుని, అయిజలో అరెస్టు చేసినట్లు చూపించారని ఆరోపించారు. అయిజ ఎక్కడుంతో తనకు ఇప్పటి వరకు తెలియదన్నారు. ఏది ఏమైనా చివరకు న్యాయమే గెలుస్తుందన్న వాస్తవానికి నిదర్శమే కోర్టు తీర్పు అని ఆయన పేర్కొన్నారు. -
నేడు భువనగిరిలో బీజేపీ యువగర్జన
భువనగిరి, న్యూస్‌లైన్ : భువనగిరిలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో యువగర్జన నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పీవీ ఫౌండేషన్ అధినేత పీవీ శ్యాంసుందర్‌రావు పార్టీలో చేరుతున్న సందర్బంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హాజరువుతున్నారని తెలిపారు. ఆయనతో పాటు నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతా సాంబమూర్తి, రవీంద్రరాజు, ప్రేమ్‌కుమార్‌యాదవ్‌లు కూడా పాల్గొంటారని వివరించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే యువ గర్జన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. భువనగిరి నియోజకవర్గంతోపాటు జిల్లా నుంచి బీజేపీ కార్యకర్తలు, తెలంగాణ వాదులు పెద్దఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు. ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు యువగర్జన సభ జరిగే భువనగిరి జూనియర్ కళాశాల మైదానాన్ని బీజేపీ నాయకులు మంగళవారం పరిశీలించారు. సభావేదికతోపాటు, మైదానంలో కుర్చీల ఏర్పాటు, సభ కోసం వచ్చే కార్యకర్తలకు అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు. సమారు 10 వేల మంది కార్యకర్తలు హాజరవుతారని, ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో పెద్దఎత్తున నాయకుల కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.