Allu Arjun Father In Law K Chandra Shekar Comments On Dowry Went Viral | Sneha Reddy Father - Sakshi
Sakshi News home page

Allu Arjun Father In Law: బన్నీ గురించి స్నేహా రెడ్డి తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Published Fri, May 20 2022 4:30 PM | Last Updated on Sat, May 21 2022 8:19 AM

Sneha Reddy Father K Chandra Shekar About Dowry To Allu Arjun - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2011లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా బన్నీ ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. తాజాగా అల్లు అర్జున్‌ మామ, స్నేహరెడ్డి తండ్రి చంద్రశేఖర్‌ ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


అల్లుడిగా బన్నీకి వందకు వంద మార్కులు వేస్తానని కితాబిచ్చారు. అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా బయట కూడా బన్నీకి ఎంతో మంది అభిమానులున్నారని, చిరంజీవి అడుగుజాడలో బన్నీ కూడా ఎంతో కష్టపడతారని చెప్పుకొచ్చారు.


ఇక పెళ్లి సమయంలో బన్నీకి ఎంత కట్నం ఇచ్చారు అని అడగ్గా.. బన్నీ అసలు కట్నం తీసుకోలేదని పేర్కొన్నారు. 'వాళ్లకే ఎక్కువ ఉంది. మనం ఇచ్చేది వాళ్లకి లెక్క కూడా కాదు. కట్నాలకు వాళ్లు వ్యతిరేకం' అంటూ బన్నీ గురించి ప్రశంసలు కురిపించారు. బన్నీపై ఆయన మామ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement