టవర్‌సర్కిల్‌లో నాయకుల బైక్ ర్యాలీ
సాక్షి, కరీంనగర్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు తప్పుడుగా నమోదవుతున్నాయంటూ, ఇందులో ప్రాథమిక విచారణ అవసరమని, తక్షణ అరెస్టులు ఆపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ సోమవారం దళిత ముస్లిం లిబరేషన్ యునైటెడ్ ఫ్రంట్, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైనట్లు దళిత ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మెండి చంద్రశేఖర్, దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉదయమే దళిత, ప్రజా సంఘాలకు చెందిన నేతలు పెద్దఎత్తున స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు రం గప్రవేశం చేసి దళితులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
దీంతో తోపులాట జరిగింది. దళిత ముస్లిం లిబరేషన్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌తోపాటు దళితులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పో లీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. దళిత సంఘాల నేతలు సుద్దాల లక్ష్మణ్, మేడి మహేశ్, ఇంజం వెంకటస్వామి, కల్లెపల్లి శంకర్, మాదరి శ్రీనివాస్, గోష్కి శంకర్, మేడి అంజయ్య, గోష్కి అజయ్, గంటల రేణుక, మాల మాలతి, యనమల మంజుల, తీట్ల ఈశ్వరి, సముద్రాల అజయ్, బడుగు లింగయ్య, గసికంటి కుమార్, బొలుమాల సదానందం, బొగ్గుల మల్లేశం, కోహెడ వినోద్, గాలిపెల్లి శ్రీనివాస్, సానది వెంకటేష్, గంటల మహేందర్, గోర్రె రాజయ్య, పోత్తూరి రమేశ్, మైసని మనోహర్, చిన్న రుద్రవరపు పాల్గొన్నారు.
సంఘాల ఆధ్వర్యంలో..
కేవీపీఎస్, ఆర్‌పీఐ, టీఎంఆర్‌పీఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని నీరుగార్చేలా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లగుడ్డలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.సురేష్, చందు, చిరంజీవి, రాజయ్య, కుతాడి శివరాజ్, లింగంపల్లి బాబు, వెంకన్న, కృష్ణ, ఆంజనేయలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment