suprme court
-
లైంగిక వేధింపుల కేసు.. రాజీ కుదుర్చుకున్నా రద్దు చేయలేం: సుప్రీం
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో సుప్రీంకోర్టు గురువారం కీల కీలకతీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల కేసులో ఫిర్యాదుదారుల కుటుంబంతో నిందితుడు రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును కొట్టివేయడం కుదరదని తేల్చిచెప్పింది. ఈ కేసులోనిందితుడికి ఉపశమనం కలిగిస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా అత్యున్నత ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం కొట్టివేసింది. 2022లో జస్థాన్‌లోని గంగాపూర్ నగరంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మైనర్ బాలిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) కేసులు నమోదు చేశారు. మైనర్ బాలిక వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడు విమల్ కుమార్ గుప్తా స్టాంప్ పేపర్‌పై బాలిక కుటుంబం నుంచి ఓ వాంగ్మూలాన్ని తెచ్చాడు.అందులో తాము నిందితుడిని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఇకపై ఉపాధ్యాయుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని బాధిత కుటుంబం పేర్కొన్నట్టుగా ఉంది. పోలీసులు దీనిని అంగీకరించి కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే కింది కోర్టు ఈ చర్యను తోసిపుచ్చింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. బాధిత కుటుంబం వాంగ్మూలాన్ని అంగీకరించిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని పోలీసులను ఆదేశించింది.అయితే హైకోర్టు తీర్పును రామ్‌జీ లాల్ బైర్వా అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు గమనించిన జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ పివి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పును రద్దు చేసింది. రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును రద్దు చేయలేమని స్పష్టం చేసింది.అలాగే ఈ కేసును తిరిగి విచారించాలని ఆదేశించింది. -
ఆర్జీ కర్ కేసు విచారణ లైవ్ స్ట్రీమ్ చేయొద్దు : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి అత్యాచార ఘటన కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసు విచారణను లైవ్ స్ట్రీమ్ చేస్తామని, ఆ విషయంలో తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది.మంగళవారం సుప్రీం కోర్టు ఆర్జీ కర్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి ఘటన కేసును విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా .. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నందుకు తన మహిళా లాయర్లకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ సున్నితమైన అంశంలో విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయోద్దని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.కపిల్ సిబల్ విజ్ఞప్తిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పందించారు. కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయలేమని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసు విచారణ లైవ్ స్ట్రీమ్ లో కొనసాగుతుందని స్పష్టం చేశారు.‘నా ఛాంబర్లోని మహిళా న్యాయవాదులకు బెదిరింపులు వస్తున్నాయి. వారిపై యాసిడ్ దాడులు చేస్తామని, హత్యాచారం చేస్తామని చెదిరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారని అన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి బదులిస్తూ.. మహిళ న్యాయవాదుల భద్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
SC: సిసోడియా పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తైంది. సీబీఐ, ఈడీ కేసుల్లో ఆయన బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం (ఆగస్ట్6 న)తో వాదనలు పూర్తి కాగా, కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియా 17 నెలలకు పైగా జైలులో ఉన్నారు. గతంలో ఢిల్లీ కోర్టును ఆశ్రయించినప్పటికీ.. ఆయన అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా సిసోడియా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. సిసోడియాకు సుదీర్ఘ జైలు శిక్ష కొనల్సిన అవసరం లేదని గతంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. అంతేకాదు.. ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి. కానీ, అలాంటిదేం జరగలేదని.. పైగా సరైన ఆధారాల్ని కూడా ఉంచలేదని సింఘ్వీ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు.. బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ, ఈడీ తరఫు లాయర్ వాదించారు. దీంతో.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. Excise policy cases: SC reserves order on AAP leader Manish Sisodia's bail pleasEdited video is available on PTI Videos (https://t.co/L2D7HH309u) #PTINewsAlerts #PTIVideos @PTI_News pic.twitter.com/6fFzsSumFq— PTI News Alerts (@PTI_NewsAlerts) August 6, 2024 -
నల్లధనంపై నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేయడం వల్ల నల్లధనానికి ద్వారాలు తెరుచుకున్నట్లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓ నేషనల్ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల అవసరం రాజకీయ పార్టీలకు ఎంత అవసరమో గుర్తు చేశారు. ‘రాజకీయ పార్టీలు నిధుల్ని సేకరించేందుకు అందుబాటులోకి తెచ్చిందే ఈ ఎలక్టోరల్ బాండ్ల పథకం. భారత ఆర్థిక వ్యవస్థను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి’ అని గడ్కరీ అన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు నిర్ణయంపై తాను వ్యాఖ్యానించబోనన్న గడ్కరీ.. నిషేధంలోని లోపాల్ని ఎత్తి చూపారు. ఎలక్టోరల్ బాండ్లను నిషేధిస్తే నల్లధనం రూపంలోనే డబ్బు చేతులు మారుతుందని చెప్పారు. ‘ఎలక్టోరల్ బాండ్లను సంపన్నులు కొనుగోలు చేస్తారు. ఆ సంపన్నులు కాంట్రాక్టర్లు అవుతారు. వ్యాపారం లేదా పరిశ్రమల వృద్ది కోసం ఉపయోగిస్తారు. కాబట్టి దానికి (క్విడ్ ప్రోకో) లింక్ చేయడం సరికాదు అని సూచించారు. -
16,000 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ విక్రయం.. ఏ పార్టీకి ఎన్ని నిధులు?
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని, భావప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కుకు ఉల్లంఘన అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ సుప్రీంకోర్టు తీర్పు ప్రధాన రాజకీయ పార్టీలపై పెను ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని సర్వోన్నత న్యాయస్ధానం రద్దు చేయడం బీజేపీకి గట్టి దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే 2016 నుంచి 2022 మధ్య ఈ స్కీమ్ కింద పార్టీలకు సమకూరిన విరాళాల్లో 60 శాతం పైగా కాషాయ పార్టీకే లభించాయి. 2017-18 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీనిని ప్రవేశ పెట్టారు. ఈ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. అయితే.. ఎవరైతే విరాళాలు ఇస్తారో వారి వివరాల్ని బ్యాంక్, రాజకీయ పార్టీలు గోప్యంగానే ఉంచుతాయి. చదవండి: లంచాలు, కమీషన్ల కోసమే ఎన్నికల బాండ్లు.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్ కాగా ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. 2016 నుంచి 2022 మధ్య రూ. 16,437. కోట్ల విలువైన 28,030 ఎలక్టోరల్ బాండ్లు ఎస్బీఐ విక్రయించింది. మొత్తం విరాళాల్లో బీజేపీకి 60 శాతం పైగా రూ. 10,122 కోట్లు సమకూరాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొత్తం విరాళాల్లో 10 శాతం రూ. 1547 కోట్ల విరాళాలను స్వీకరించింది. పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ 8 శాతంతో రూ. 823 కోట్ల విరాళాలను స్వీకరించింది. ఈ జాబితాలో 30 పార్టీలకు అందిన విరాళాలతో పోలిస్తే బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. ఇంకా ఈ జాబితాను పరిశీలిస్తే సీపీఎం రూ. 367 కోట్లు, ఎన్సీపీ రూ. 231 కోట్లు, బీఎస్పీ రూ. 85 కోట్లు, సీపీఐ రూ 13 కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా సమీకరించాయి. 2017 నుంచి 2022 వరకు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ పొందిన విరాళాల కంటే బీజేపీఐదు రెట్లు ఎక్కువ విరాళాలను పొందింది. -
అదానీ–హిండెన్‌బర్గ్ అంశంపై సుప్రీం కోర్టు ఆరా
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ తీవ్ర అస్థిరత నుండి పెట్టుబడిదారులకు రక్షణ కల్పించేందుకు క్యాపిటల్ మార్కెట్ల రెగ్యులేటర్ ఏమి చేయాలనుకుంటోందని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదానీ–హిండెన్‌బర్గ్ వ్యవహారానికి సంబంధించి దాఖలైన బ్యాచ్ పిటిషన్ల విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సెబీకి ఈ ప్రశ్న సంధించింది. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు అనుమతించడానికి ప్రధాన కారణాలలో స్టాక్ మార్కెట్ తీవ్ర అస్థిరతి ఒకటని తెలిపింది. ‘‘పెట్టుబడిదారుల తన పెట్టుబడి విలువను భారీగా కోల్పోయే ఈ తరహా అస్థిరతనుండి ఇన్వెస్టర్‌ను రక్షించడానికి సెబీ ఏమి చేయాలనుకుంటోంది. నిబంధనలను కఠినతరం చేసే దిశలో ఆలోచన చేస్తోందా?’’ అని జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలు కూడా ఉన్న త్రిసభ్య ధర్మాసనం సెబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. అన్ని స్థాయిల్లో నిబంధనల పటిష్టతకు సెబీ తగిన చర్యలు తీసుకుంటోందని మెహతా ఈ సందర్భంగా సమాధానం ఇచ్చారు. మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి సెబీ తీసుకుంటున్న చర్యలను అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. దీనితో ఈ అంశంపై తన ఉత్తర్వులను బెంచ్ రిజర్వ్ చేసుకుంది. 24 కేసుల్లో 22 కేసుల దర్యాప్తు పూర్తి! కాగా, అదానీ గ్రూపుపై ఆరోపణలకు సంబంధించిన 24 కేసుల్లో 22 కేసుల దర్యాప్తు ముగిసిందని సొలిసిటర్ జనరల్ తొలుత ధర్మాసనానికి తెలియజేశారు. మిగిలిన రెండింటి కోసం విదేశీ నియంత్రణ సంస్థల నుండి సమాచారం అవసరమని తెలిపారు. వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వెల్లడించారు. షార్ట్ సెల్లింగ్‌కు సంబంధించినంత వరకు తప్పు జరిగినట్లు సెబీ ఏదైనా గుర్తించిందా అని బెంచ్ అడిగిన ప్రశ్నకు మెహతా సమాధానం చెబుతూ తప్పు ఎక్కడ జరిగినట్లు గుర్తించినా, సెబీ చట్టం ప్రకారం రెగ్యులేటర్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించినంతవరకు, సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ నుండి సూచనలు అందినట్లు తెలిపారు. బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నియంత్రణ వైఫల్యం లేదని సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ మేలో సమర్పించిన మధ్యంతర నివేదికలో పేర్కొంది. అయితే 2014 నుంచి 2019 మధ్య చేసిన పలు సవరణలు నియంత్రణ సంస్థ దర్యాప్తు సామర్థ్యాన్ని నిరోధించిందని అలాగే విదేశీ సంస్థల సంస్థల నుండి వచ్చిన నిధుల విషయంలో ఉల్లంఘనలపై దర్యాప్తు అసంపూర్తిగా ఉందని పేర్కొంది. మోసపూరిత లావాదేవీలు, షేర్ ధరల తారుమారు వంటి ఆరోపణలతో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. ఇవి సత్యదూరాలని స్పష్టం చేసింది. గ్రూప్ కార్యకలాపాలనీ చట్టప్రకారం, పారదర్శకంగా జరుగుతున్నట్లు స్పష్టం చేసింది. -
Delhi: బైక్ ట్యాక్సీ కంపెనీలకు సుప్రీం షాక్!
రైడ్ షేరింగ్ సంస్థలకు సుప్రీం కోర్ట్ భారీ షాకిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించే వరకు ఢిల్లీలో ద్విచక్రవాహనాలు నడపకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 30 నాటికి టూవీలర్ నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను నడిపేలా నూతన విధానాన్ని తీసుకువస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అప్పటి వరకు దేశ రాజధానిలో టూవీలర్ ట్యాక్సీ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ రైడ్ షేరింగ్ సంస్థల్ని ఉద్దేశిస్తూ కీలక నోటీసులు జారీ చేసింది. అందులో వాణిజ్య అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించడం మోటారు వాహనాల చట్టం 1988ని ఉల్లంఘించడమేనంటూ టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థల్ని హెచ్చరించింది. [BREAKING] Supreme Court stays bike taxi operations of Rapido, Uber in DelhiRead more here: https://t.co/NdU2GfNFWI pic.twitter.com/FCcmpELJif— Bar & Bench (@barandbench) June 12, 2023 అంతేకాదు ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించిన సంస్థలకు మొదటి నేరం కింద రూ. 5,000, రెండవసారి తప్పు చేస్తే రూ. 10,000 జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తామని రవాణా శాఖ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. అంతేకాదు రైడింగ్ సర్వీసులు అందించే వాహన యజమాని (డ్రైవర్) డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు రద్దు అవుతుందని తెలిపింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన ఓ రైడ్ షేరింగ్ సంస్థకు షోకాజు నోటీసులు అందించింది. ఆ నోటీసులపై స్పందించిన సదరు సంస్థ తమకు అందిన నోటీసులు వివిధ ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రైడ్ షేరింగ్ టూ వీలర్ వాహనాల కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వడం రైడ్ షేరింగ్ సంస్థలకు ఎదురు దెబ్బ తగిలినట్లైంది. చదవండి👉 యాపిల్ కంపెనీలో రూ. 138 కోట్ల ఘరానా మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష! -
ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్‌కు మీరు అర్హులేనా? ఇలా అప్లయ్ చేసుకోండి!
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సంస్థ ఉద్యోగులు ఎక్కువ పెన్షన్ పొందేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో అప్లయ్ చేసుకునే వీలు కల్పించింది. ఉద్యోగులు పెన్షన్ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్) నెలకు రూ.15,000 ఉండాలి. ఆ వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఈపీఎస్(ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం)లో జమ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 4న సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. అధిక పెన్షన్ పొందేందుకు అర్హులైన ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో అప్లయి చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఈపీఎఫ్ఓ రిటైర్డ్ ఫండ్ బాడీ పోర్టల్‌ను సిద్ధం చేసింది. ఈపీఎఫ్ఓలో ఎలా అప్లయ్ చేయాలి ♦ అర్హులైన ఈపీఎఫ్ఓ ఖతాదారులు ఈ-సేవ పోర్టల్(e-Sewa portal)ను సందర్శించాలి ♦అందులో అధిక పెన్షన్ అప్లయ్ చేసేలా Pension on Higher Salary: Exercise of Joint Option under para 11(3) and para 11(4) of EPS-1995 on or before 3rd May 2023 అనే ఆప్షన్ పాపప్ అవుతుంది. ♦ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో అధిక పెన్షన్ కోసం (pensionOnHigherWages) అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ♦ అనంతరం అప్లికేషన్ ఫారమ్ ఫర్ జాయింట్ ఆప్షన్‌తో యూఏఎన్ నెంబర్, పేరు, మీ పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ వివరాల్ని ఎంటర్ చేసి ఓటీపీ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. ♦ ట్యాప్ చేసిన తర్వాత మీరు అర్హులైతే అధిక పెన్షన్ పొందే సౌలభ్యం కలుగుతుంది. లేదంటే రిజెక్ట్ అవుతుంది. -
ముకేశ్ అంబానీ కుటుంబానికి జెడ్ ప్లస్ భద్రత.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు జెడ్ ప్లస్ (z plus security) భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖేష్ అంబానీ, అతని కుటుంబం దేశంలోనే ఉన్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారికి భద్రత కల్పిస్తుందని తెలిపింది. విదేశాలకు వెళ్లినప్పుడు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారికి భద్రతా ఏర్పాట్లు చేయాలని కోర్టు చెప్పింది. కోర్టు ఆదేశాలతో ముఖేష్ అంబానీ కుటుంబానికి భారత్‌తో పాటు ఇతర దేశాల్లో సైతం జెడ్ ప్లస్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహించే కమాండోలు వారికి రక్షణగా నిలవనున్నారు. అయితే అత్యంత ఖరీదైన జెడ్ ప్లస్ కేటగిరీకి అయ్యే ఖర్చు ముఖేష్ అంబానీయే భరించాలని సుప్రీం కోర్టు కృష్ణ మురారి, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. జెడ్ ప్లస్ భద్రత ఎందుకు? ఇటీవల కాలంలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. దీంతో భద్రత దృష్ట్యా కేంద్రం అంబానీలకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. అయితే వీరికి భద్రత కల్పించడంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ హైకోర్టుల్లో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో..ఒక వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉన్నప్పుడు..ఆయనకు కల్పించే భద్రతను ప్రాంతానికి లేదా నగరానికి పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. ముకేశ్ అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు మన దేశంలోనూ, విదేశాల్లోనూ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనికోసం అయ్యే ఖర్చులను అంబానీలే భరించాలని స్పష్టం చేసింది. -
నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘ఆమెకు ప్రాణహాని ఉంది నిజమే’
న్యూఢిల్లీ: నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఆగస్టు 10వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నూపుర్ శర్మకు ప్రాణహాని ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆమెపై ఎక్కడా కొత్త కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, తనపై దాఖలైన తొమ్మిది కేసులను ఒకేదానిగా ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ నూపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నూపుర్ శర్మను చంపేస్తామని బెదిరింపులు ఎక్కువయ్యాయని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నూపుర్ శర్మకు ప్రాణహాని ఉన్నది నిజమేనని వ్యాఖ్యానించింది. ఆమెకు ఊరటనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నూపుర్ శర్మపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేసే విషయంపై ఆగస్టు 10లోగా స్పందన తెలపాలని ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, బెంగాల్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, జుమ్ముకశ్మీర్, అస్సాం ప్రభుత్వాలను సుప్రీంకోర్టు అడిగింది. జులై1న నూపుర్ శర్మ పిటిషన్ విచారణ సందర్భంగా ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది సుప్రీంకోర్టు. టీవీ డిబేట్లో బాధ్యత లేకుండా మాట్లాడటం వల్ల దేశంలో ఆమె అగ్గిరాజేసిందని మండిపడింది. దేశంలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు నూపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమని ధ్వజమెత్తింది. ఆ తర్వాతి నుంచే నూపుర్ శర్మను చంపేస్తామనే బెదిరింపులు చాలా ఎక్కువయ్యాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ ఛిస్తీ, యూపీ చెందిన వ్యక్తి.. నూపుర్ శర్మను హతమారుమాస్తామని బెదిరించిన విషయాలను ప్రస్తావించారు. చదవండి: వాట్సాప్ స్టేటస్‌గా నూపుర్ శర్మ వీడియో.. కత్తులతో నిర్దాక్షిణ్యంగా పొడిచారు?! -
సుప్రీంకోర్టులో ఉద్ధవ్ థాక్రేకు షాక్.. సీఎం షిండేకు ఊరట..!
సాక్షి, న్యూఢిల్లీ: శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. అంతేకాదు ఈ పిటిషన్‌పై విచారణ జరిగేవరకు షిండే వర్గంలోని 16 మంది రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని న్యాయస్థానం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సూచించింది. పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఎటూ తేలకముందే మహారాష్ట్రలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ షిండేను ఆహ్వానించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని థాక్రే వర్గం గతవారం సుప్రీంను ఆశ్రయించింది. ఈ 16 మంది బలపరీక్షతో పాటు స్పీకర్ ఎన్నిక ఓటింగ్‌లోనూ పాల్గొన్నారని పేర్కొంది. వారి అనర్హత వేటు విషయంపై సుప్రీంకోర్టే తీర్పు చెప్పాలని కోరింది. అయితే ఈ పిటిషన్‌పై సోమవారమే విచారణ జరుగుతుందని థాక్రే వర్గం భావించింది. కానీ లిస్టింగ్‌లో ఇది కన్పించలేదు. దీంతో పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని థాక్రే వర్గం కోరింది. అయితే దీన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాల్సి ఉందని, కొంత సమయం పడుతుందని కోర్టు తెలిపింది. ఆ తర్వాతే విచారణ చేపడతామని చెప్పింది. మంగళవారం కూడా థాక్రే పిటిషన్‌పై విచారణ జరిగే సూచనలు కన్పించడం లేదు. చదవండి: O. Panneerselvam: పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. పళనికి పార్టీ పగ్గాలు -
Noida Twin Towers Case : ఒక్క టవరే కూల్చండి.. ప్లీజ్
నిబంధనలు ఉల్లంఘించి 40 అంతస్థుల జంట భవనాల నిర్మాణం కేసులో బిల్డర్ వెనక్కి తగ్గాడు. ఇంతకాలం నిబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టామంటూ చెబుతూ వచ్చినవారు తప్పును ఒప్పుకున్నారు. భారీ శిక్ష నుంచి మినహాయించాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని వేడుకున్నారు. అలహాబాద్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా 40 అంతస్థుల ట్విన్ టవర్స్‌ని సూపర్ టెక్ అనే సంస్థ నిర్మించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలు కాగా.. విచారించిన కోర్టు జంట భవనాలను కొట్టి వేయాలంటూ తీర్పు ఇచ్చింది. సుప్రీం ఫైర్ అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సూపర్ టెక్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసు వివరాలను పూర్తిగా విచారించిన సుప్రీం కోర్టు అలహాబాద్ హై కోర్టు తీర్పునే సమర్థిస్తూ జంట భవనాలను రెండు నెలల్లోగా నేలమట్టం చేయాలంటూ తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పుపై సూపర్ టెక్ సంస్థ రివ్యూ పిటీషన్ వేసింది. మన్నించండి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తీర్పు వ్యతిరేకంగా రావడంతో సూపర్‌టెక్ సంస్థ దారికొచ్చింది. ట్విన్ టవర్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఒక్క భవనాన్ని కూల్చివేసేలా తీర్పును మార్చాలంటూ వేడుకుంది. ఈ అవకాశం ఇస్తే మిగిలిన ఒక్క భవనాన్ని పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తామంటూ బతిమాలింది. భవన నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని, ఎంతో సిమెంటు, స్టీలు వినియోగించామని అదంతా వృథా అవుతుందని పేర్కొంది. రెండు భవనాలను కూల్చేస్తే శిథిలాలతో ఆ ప్రాంతం నిండిపోతుందని పేర్కొంది. మొత్తంగా చేసిన తప్పును ఒప్పుకుని శిక్షలో మినహాయింపు ఇవ్వాలని వేడుకుంది. 915 అపార్ట్మెంట్లు నోయిడా ప్రాంతంలో సూపర్ టెక్ సంస్థ నిర్మించిన జంట భవనాల్లో మొత్తం 915 అపార్ట్మెంట్లు, 21 షాపులు ఉన్నాయి. ఇందులో 633 అపార్ట్మెంట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. అయితే గ్రీన్ జోన్ పరిధిలో ఈ భవన నిర్మాణం చేపట్టడంతో వివాదం రాజుకుంది కళ్లు మూసుకున్నారా ? గ్రీన్ జోన్లో 40 అంతస్థులతో జంట భవనాలు నిర్మిస్తుంటే కళ్లు మూసుకున్నారా అంటూ నోయిడా అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు అపార్ట్మెంట్ బుక్ చేసుకున్న వారికి రెండు నెలల్లోగా వడ్డీతో సహా డబ్బులు వాపస్ ఇవ్వాలంటూ బిల్డర్‌కు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. చదవండి : నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది? -
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం: సజ్జల
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ యంత్రాంగం ముందుకెళ్తుందని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని.. ప్రజారోగ్యం దృష్ట్యా తాము కోర్టుకు వెళ్లామని తెలిపారు. చదవండి: సమగ్ర వివరాలతో సిద్ధం కావాలి: సీఎం జగన్ ‘‘ఉద్యోగ సంఘాల ఆవేదనను ఎస్ఈసీ అర్థం చేసుకోలేదు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాలన్న విషయాన్ని గమనించలేదు. ఈ సమస్య రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది. మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి.. పంచాయతీ ఎన్నికలు తీసుకురావడంలోనే కుట్ర కోణం ఉంది. తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎస్ఈసీ కేంద్రానికి లేఖ రాయడం సరికాదు. ప్రభుత్వంతో చర్చించాలన్న ఆలోచన ఇప్పటికీ ఎస్ఈసీకి లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం.. గెలవడం మా పార్టీకి కొత్త కాదు. చంద్రబాబులా ఎన్నికలకు భయపడి వెనకడుగు వేయం. ఎస్ఈసీ కేంద్రానికి లేఖ రాయడం అర్ధం లేని చర్య. ఉద్యోగ సంఘాలు తమ అభ్యంతరాలను చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైనా ఇదే ఇబ్బంది ఉంటుంది. సిబ్బందికి ఏదైనా జరిగితే ఎస్ఈసీదే పూర్తి బాధ్యత.వ్యాక్సినేషన్‌పై ఎలా ముందుకెళ్లాలనేది కేంద్రంతో చర్చిస్తామని’’ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: ఎన్నికలు వాయిదా వేసిన గోవా ఎస్ఈసీ -
మనిషా, పశువా లేదా పశువా, మనిషా!
జైపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల వ్యాపారి పెహ్లూ ఖాన్ మూక హత్య జరిగి ఏడాది గడిచిందో లేదో రాజస్థాన్‌లోని అదే అల్వార్ జిల్లాలో శనివారం నాడు మరో మూక హత్య చోటు చేసుకుంది. అల్వార్ జిల్లా లాల్వండి గ్రామంలో రక్బర్ ఖాన్, ఆయన మిత్రుడు అస్లాంలు కలిసి రెండు ఆవులను, వాటి దూడలను తోలుకొని వెళుతుండగా వారిపై సాయుధులైన గోరక్షకులు దాడి జరిపారు. తమపై అనుమానాలుంటే పోలీసులకు పట్టించి విచారించాల్సిందిగా వేడుకున్న వినకుండా తీవ్రంగా కొట్టారని అదే దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అస్లాం తెలిపారు. దేశంలో కొనసాగుతున్న మూక హత్యలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని నివారించడం కోసం పార్లమెంట్ ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకరావాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం మరింత విచారకరం. మూక హత్యలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల పహారాను పెంచాల్సిందిగా సుప్రీం కోర్టు చేసిన సూచనలను కూడా ఇక్కడ పట్టించుకోక పోవడం రాజస్థాన్ ప్రభుత్వం వైఫల్యం. ఇక శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసు వ్యవస్థ మరీ దారుణంగా ఉంది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రక్బర్ ఖాన్‌ను అస్పత్రికి తీసుకెళ్లడానికి పోలీసులకు నాలుగున్నర గంటలు పట్టిందంటే వారి అలసత్వం అర్థమవుతూనే ఉంది. ముందుగా స్వాధీనం చేసుకున్న గోవులను గోరక్షణ శాలకు తరలించడంపై దృష్టి పెట్టిన పోలీసులు గాయపడిన ఖాన్‌ను పట్టించుకోకపోగా, మార్గమధ్యంలో తీరిగ్గా టీ తాగి మరీ ఆస్పత్రికి తీసుకెళ్లారని స్థానిక మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. ఓ మనిషి ప్రాణంకన్నా ఓ గోవు ప్రాణానికి ఎక్కువ విలువనిస్తున్న వసుంధర రాజె ప్రభుత్వం దృక్పథం వంటబట్టి పోలీసులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా, సహజసిద్ధంగానే వారి నరాల్లోనే నిర్లక్ష్యం పేరుకుపోయిందా? మనిషి ప్రాణానికి రూ.26, గోవు ప్రాణానికి రూ.70 దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద రోజుకు 26.65 రూపాయలను ఖర్చు చేస్తోంది. అదే ఆవు సంరక్షణకు రోజుకు 70 రూపాయలను, దూడపై రోజుకు 35 రూపాయలను ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని 33 రకాల ప్రజల లావాదేవీలపై ‘ఆవు సెస్సు’ విధించడం ద్వారా రాబడుతోంది. రాష్ట్రంలోని పలు గోసంరక్షణ శాలలను ఆధునీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి సరిగ్గా మేత అందుతుందో, లేదో పర్యవేక్షించడం కోసం సీసీటీవీ కెమేరాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా రాజస్థాన్‌లో గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. ఈ శాఖకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకన్నా ఏటా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. రాష్ట్రంలో గోవుల సంఖ్య ఇప్పటికే 5 లక్షలు దాటిందని ఓ అంచనా. సకల చరాచర ప్రపంచంలో జంతువుల పట్ల కారణ్యం కలిగి ఉండాలని వాదించే నేటి రోజుల్లో పాలిచ్చే ఆవు పట్ల మరింత శ్రద్ధ ఉండాల్సిందే. కానీ మానవ జీవితాలను పణంగా పెట్టి కాదు. మనిషి ప్రాణాలకన్నా గోవు ప్రాణాలకే విలువ ఇవ్వదల్చుకుంటే ‘మనిషివా, పశువువా!’ అని తిట్టేబదులు ‘పశువువా, మనిషివా!’ అంటూ ఇక తిట్టాలి కాబోలు. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న ఓ సగటు రిక్షా కార్మికుడు రోజుకు 70 రూపాయల నుంచి వంద రూపాయలు సంపాదిస్తున్నాడు. అందులో 28 రూపాయలు గుడిశె అద్దెకు చెల్లించాలి. మిగతా డబ్బుతో భార్య, ఇద్దరు పిల్లలను పోషించాలి. దారిద్య్ర రేఖకు దిగువనున్న రాష్ట్ర పేద ప్రజల్లో 30 శాతం మంది ఇలాంటి రిక్షా కార్మికులే ఉన్నారు. మోది ప్రతిష్టను దెబ్బతీయడానికా! దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం కొంత మంది కుట్ర పన్ని ఇలాంటి మూక హత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి అర్జున్ మెఘ్వాల్ ఆరోపించడం, హిందువులకు చెడ్డ పేరు తీసుకరావడం కోసం పోలీసులే ఖాన్‌ను చంపేశారని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజ ఆరోపించడంలో అర్థముందా! -
స్టోన్ క్రషర్ల కాలుష్యంపై సుప్రీంలో పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ : అనంతపురం జిల్లా నేమికల్లు, ఉంతకల్లులో గ్రామాల్లో స్టోన్ క్రషర్లు కారణంగా విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడుతోందని హీరోజీరావు అనే రైతు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. స్టోన్ క్రషర్ల నుంచి వచ్చే దుమ్ము కారణంగా పంట పొలాలకు నష్టం జరుగుతోందని.. ప్రజలు, పశువులు రోగాల బారిన పడుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. పెట్రో ఉత్పత్తులను మండించడంతో వెలువడే ఉద్గారాల కాలుష్యం ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొటున్నారని తెలిపారు. కాలుకాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలు పాటించకుండా నడుస్తున్న స్టోన్ క్రషర్లు జనావాసాలను సైతం దుమ్మూ ధూళితో కప్పేస్తున్నాయని పేర్కొన్నారు. క్రషర్లు, క్వారీల యజమానులు పీసీబీ నిబంధనలను లెక్క చేయటం లేదన్నారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులకు చెందిన జాయింట్ కమిటీచే వెంటనే క్రషింగ్ యూనిట్లను తనిఖీ చేసి, చుట్టు ప్రక్కల గ్రామాలను సందర్శించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తనిఖీ బృదానికి అన్ని రకాల సహాయసహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్‌కు అదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను జూలై 19కి వాయిదా వేసింది. -
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ టోకరా!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 1999 గ్రూప్–2 పోస్టులకు సంబంధించి తాజాగా విడుదల చేసిన జాబితాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా జాబితాను రూపొందించడంతో తాము అవకాశాలు కోల్పోతున్నామని ఆ పరీక్షల్లో మెరిట్ సాధించి నిరుద్యోగులుగా ఉన్న అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. 78 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతోపాటు మరో 70 ఎగ్జిక్యూటివ్ పోస్టులు మెరిట్ జాబితాల్లో ఉన్నవారికి దక్కకుండా పోతున్నాయని అంటున్ను. ఆదినుంచి వివాదాలమయమే.. 1999లో 104 ఎగ్జిక్యూటివ్, 141 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి 2000లో పరీక్ష నిర్వహించింది. అదే ఏడాది ఎగ్జిక్యూటివ్ పోస్టులను, 2002లో ఏఎస్ఓ పోస్టులను భర్తీ చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో 2004లో 973 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 199 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఇదే నోటిఫికేషన్‌కు జతచేసి మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చారు. అయితే మెరిట్లో తమకంటే తక్కువగా ఉన్నవారిని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపిక చేయడం వల్ల తాము నష్టపోయామని ఏఎస్‌ఓలుగా ఎంపికైనవారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈలోగా ఏపీపీఎస్సీ ఇదే నోటిఫికేషన్ కింద 2011లో మరో 111 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. 2015లో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు వాద, ప్రతివాదనల అనంతరం 2015, ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు మళ్లీ జాబితాలు రూపొందించి పోస్టులు కేటాయించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జాబితాలు రూపొందించినా పలు లోపాలతో వాటిపై మళ్లీ వివాదాలు ఏర్పడ్డాయి. ఫలితంగా విడుదల చేసిన జాబితాలను ఏపీపీఎస్సీ ఆరుసార్లు మార్పు చేసింది. చివరికి 2000లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు పొందిన వారిని, సుప్రీంకోర్టులో కేసు వేసి తమకు ఎగ్జిక్యూటివ్ పోస్టులు వద్దన్న ఏఎస్ఓలను మినహాయించి కొత్త జాబితా విడుదల చేసింది. మొత్తం 1424 పోస్టులను నోటిఫై చేసిన ఏపీపీఎస్సీ తాజా జాబితా నుంచి 487 పోస్టులను మినహాయించింది. క్యారీఫార్వర్డ్ అయ్యాయన్న కారణంతో వీటిని మినహాయించి 937 పోస్టులకు మాత్రమే జాబితా ఇచ్చింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా క్యారీఫార్వర్డ్ పోస్టులతో సహా మొత్తం అన్ని పోస్టులకూ కొత్తగా జాబితా రూపొందించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా గతంలో అన్యాయం జరిగిందన్న ఏఎస్‌ఓలతో మాట్లాడి ఎగ్జిక్యూటివ్ పోస్టులు కావాలో వద్దో ఆప్షన్ తీసుకొని ఆ మేరకు మార్పులు చేయాలని సూచించింది. అయితే ఏపీపీఎస్సీ 141 మంది ఏఎస్ఓల నుంచి ఆప్షన్ తీసుకోకుండానే వారిని ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో కలిపేసింది. అలాగే గతంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో జాయిన్ కాని 78 మంది పేర్లనూ జాబితాలో చేర్చింది. ఫలితంగా రోస్టర్ పాయింట్లు మారిపోయాయి. 141 మంది ఏఎస్ఓ పోస్టుల్లో అప్పట్లో 137 మాత్రమే భర్తీ కాగా అందులో 87 మంది మాత్రమే జాయినయ్యారు. వారిలో కూడా 24 మంది రాజీనామా చేయగా ప్రస్తుతం 63 మంది మాత్రమే పనిచేస్తున్నారు. జాయిన్ కాని వారిని, రాజీనామా చేసిన వారిని కూడా కమిషన్ తాజా జాబితాల్లో చేర్చింది. అలాగే అప్పట్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికై జాయిన్ కాని వారిని కూడా కొత్త జాబితాల్లోకి చేర్చడంతో ఈ పోస్టులు దక్కాల్సిన మెరిట్ జాబితాల్లోని తదుపరి అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోందని నిరుద్యోగులు వాపోతున్నారు. ఆ పోస్టుల్లో ఇప్పుడూ ఎవరూ జాయినయ్యే పరిస్థితి లేదని ఫలితంగా అవి మిగిలిపోయే అవకాశమే ఉంటుందని పేర్కొంటున్నారు. వాటిని తదుపరి నోటిఫికేషన్లలోకి మళ్లించేందుకే ఏపీపీఎస్సీ ఇలా చేస్తోందన్న అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. -
అభిశంసన అంటే ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఏడుగురు ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా శుక్రవారం నాడు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలుసుకొని ఓ లేఖను అందజేశాయి. ఆ లేఖపై కాంగ్రెస్ పార్టీతోపాటు సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు చెందిన 71 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు చేశారు. ప్రతిపక్షానికి చెందిన డీఎంకే మాత్రం అభిశంసన తీర్మానానికి దూరంగా ఉంది. సీబీఐ ప్రత్యేక జడ్జీ బ్రిజ్మోహన్ హరికిషన్ లోయ అనుమానాస్పద మృతిపై స్వతంత్య్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గురువారం నాడు దీపక్ మిశ్రా నాయకత్వంతోని సుప్రీం కోర్టు బెంచీ కొట్టివేసిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకొచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి వీలు కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని 124 సెక్షన్ కిందనే ఆయన్ని తొలగించవచ్చు. తప్పుడు ప్రవర్తన, అసమర్ధుడు అనే కారణంగా ఆయనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. సుప్రీం కోర్టుకు చెందిన ఏ జడ్జీనైనా పదవీ విరమణకన్నా ముందే తొలగించాలంటే పార్లమెంట్లో అభిశంసన తీర్మానం నెగ్గితే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగిస్తారు. అభిశంసన తీర్మానాన్ని ఇరు సభల్లో మెజారిటీ సభ్యులు ఆమోదించడంతోపాటు ఓటింగ్ రోజున ఇరు సభల్లో సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది అభిశంసనకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. జడ్జీల (ఇంక్వైరీ) యాక్ట్–1969, జడ్జీల (ఇంక్వైరీ) రూల్స్–1969 చట్టాల కింద జడ్జీలను తొలగించేందుకు రాజ్యాంగంలోని 124వ అధికరణ వీలు కల్పిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియను అభిశంసనగా వ్యవహరిస్తారు. -
సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఆందోళన
సాక్షి, కరీంనగర్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు తప్పుడుగా నమోదవుతున్నాయంటూ, ఇందులో ప్రాథమిక విచారణ అవసరమని, తక్షణ అరెస్టులు ఆపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ సోమవారం దళిత ముస్లిం లిబరేషన్ యునైటెడ్ ఫ్రంట్, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైనట్లు దళిత ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మెండి చంద్రశేఖర్, దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉదయమే దళిత, ప్రజా సంఘాలకు చెందిన నేతలు పెద్దఎత్తున స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు రం గప్రవేశం చేసి దళితులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరిగింది. దళిత ముస్లిం లిబరేషన్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌తోపాటు దళితులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పో లీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. దళిత సంఘాల నేతలు సుద్దాల లక్ష్మణ్, మేడి మహేశ్, ఇంజం వెంకటస్వామి, కల్లెపల్లి శంకర్, మాదరి శ్రీనివాస్, గోష్కి శంకర్, మేడి అంజయ్య, గోష్కి అజయ్, గంటల రేణుక, మాల మాలతి, యనమల మంజుల, తీట్ల ఈశ్వరి, సముద్రాల అజయ్, బడుగు లింగయ్య, గసికంటి కుమార్, బొలుమాల సదానందం, బొగ్గుల మల్లేశం, కోహెడ వినోద్, గాలిపెల్లి శ్రీనివాస్, సానది వెంకటేష్, గంటల మహేందర్, గోర్రె రాజయ్య, పోత్తూరి రమేశ్, మైసని మనోహర్, చిన్న రుద్రవరపు పాల్గొన్నారు. సంఘాల ఆధ్వర్యంలో.. కేవీపీఎస్, ఆర్పీఐ, టీఎంఆర్పీఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని నీరుగార్చేలా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లగుడ్డలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.సురేష్, చందు, చిరంజీవి, రాజయ్య, కుతాడి శివరాజ్, లింగంపల్లి బాబు, వెంకన్న, కృష్ణ, ఆంజనేయలు తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో దుర్వినియోగంకాని చట్టం ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : షెడ్యూల్ కులాలు, తెగల వేధింపుల నిరోధక బిల్లు అమల్లోకి వచ్చిన దాదాపు 29 ఏళ్ల తర్వాత ఇప్పుడు సుప్రీం కోర్టు ఈ బిల్లు దుర్వినియోగం అవుతోందని, దీన్ని సడలించాల్సిన అవసరం ఉందని భావించడం విచిత్రం. ఆ మాటకొస్తే ఈ బిల్లుపై ఎప్పటి నుంచో అలాంటి ప్రచారం ఉంది. ఇంతకు ఆ ప్రచారం ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? వారి ప్రచారంలో నిజముందా ? నిజంగానే చట్టం దుర్వినియోగం అవుతుందా ? అయితే ఎందుకు అవుతుంది ? ఇలాంటి అంశాలన్నింటినీ అన్ని కోణాల నుంచి పరిశీలించి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన బాధ్యత సుప్రీం కోర్టుది. మరి అలాంటి కోర్టే చట్టం దుర్వినియోగం అవుతుందని అభిప్రాయపడింది. సమాజంలో వివిధ వర్గాల వేధింపుల నుంచి ఎస్సీ, ఎస్టీలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 1989లో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీల చట్టంగా పిలుస్తారు. సుప్రీం కోర్టు మాత్రం ఈ చట్టాన్ని ఈ నెల 20వ తేదీన అట్రాసిటీల చట్టంగా పేర్కొంది. ఈ చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా నిందితులను అరెస్ట్ చేయవచ్చనే నిబంధనను తక్షణం తొలగించాలంటూ ఆదేశించింది. ఈ చట్టం కింద ఫిర్యాదు అందితే పోలీసులు విధిగా వారం రోజుల్లోగా ప్రాథమిక దర్యాపు జరిపి, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని సూచించింది. ఈ చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయాల్సి వస్తే, వారి పై అధికారి నుంచి తప్పనిసరి అనుమతి తీసుకోవాలని కూడా సూచించింది. ఇప్పుడు ఈ సూచనలు చేసిన జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏకే గోయెల్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనమే ఇంతకు ముందు వరకట్నంను నిరోధించే భారతీయ శిక్షా స్మృతిలోని 498ఏ సెక్షన్ కూడా దుర్వినియోగం అవుతోందని ఆరోపించింది. అరెస్ట్‌లకు ముందే ఆరోపణలు నిజమైనవా, కావా? అన్న విషయాన్ని ఒకటి, రెండు సార్లు తనిఖీ చేసుకోవాలని సూచించింది. అయితే, ఈ సూచనలను ఆ తర్వాత మూడు నెలలకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని మరో బెంచీ కొట్టి వేసింది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీల చట్టం దుర్వినియోగం అవుతోందంటూ సుప్రీం కోర్టు సూచించిన సవరణలను దళిత, ఆదివాసి గ్రూపులు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సమాజంలో ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా రోజు రోజుకూ దాడులు పెరుగుతుంటే ఈ సెక్షన్ కింద శిక్షలు మాత్రం ఎందుకు తగ్గుతున్నాయని ఆ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) కూడా ఈ విషయాన్ని రుజువు చేసున్నాయి. 2009 నుంచి 2014 వరకు ఎస్సీలపై దాడులు 40 శాతం పెరగ్గా, షెడ్యూల్డ్ తెగలపై 118 శాతం పెరిగాయి. 2007 నుంచి 2016 మధ్య ఈ చట్టం కింద ఎస్సీలపై జరిగిన దాడుల్లో 28.8 శాతం కేసుల్లో శిక్షలు పడగా, షెడ్యూల్ తెగల కేసుల్లో 25. 2 శాతం కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. అన్ని నేరాలకు సంబంధించిన మొత్తం కేసుల్లో భారతీయ శిక్షాస్మృతి కింద 42.5 శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఒక్క 2016 సంవత్సరంనే ప్రమాణంగా తీసుకుంటే ఎస్సీ కేసుల్లో 25.7 శాతం కేసుల్లో, ఎస్టీ కేసుల్లో 20.8 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. అదే అన్ని నేరాలకు సంబంధించిన కేసుల్లో 46.8 శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో శిక్ష పడుతున్న కేసులు జాతీయ సగటు కన్నా కొన్ని రాష్ట్రాల్లో అతి తక్కువగాను ఉంటున్నాయి. 2016వ సంవత్సరాన్నే ప్రమాణికంగా తీసుకుంటూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీల చట్టం కింద ఒక్కరికి కూడా శిక్ష పడలేదు. అదే కర్ణాటకలో రెండు శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఎస్సీ, ఎస్టీల చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో అమాయకులను ఈ చట్టం కింద ఇరికించే ప్రమాదం కూడా ఉందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై కేంద్రం ఆదేశాల మేరకు ఇదివరకే పోలీసులు ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపి ఈ చట్టం కింద దాఖలైన కేసుల్లో 9 నుంచి పది శాతం కేసుల్లో మాత్రమే చట్టం దుర్వినియోగం జరిగినట్లు తేల్చారు. ఆ మాటకొస్తే అన్ని చట్టాల్లోనూ దుర్వినియోగం అవుతున్న సందర్భాలు కనిపిస్తాయి. ఎస్సీ, ఎస్టీల చట్టం దుర్వినియోగం అవుతోందని, దాన్ని సవరించాలంటూ గతేడాది ముంబైలో దాదాపు మూడు లక్షల మందితో ర్యాలీ నిర్వహించారు మరాఠీలు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించగా ఒక్క కేసులో కూడా దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లేవని మహారాష్ట్ర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన అధికారిక నివేదికలో స్పష్టం చేశారు. ప్రతి చట్టం కింద తప్పుడు కేసులు నమోదవడం కొత్త విషయం ఏమీ కాదని, ఏ చట్టం అందుకు మినహాయింపు కాదని ముంబై హైకోర్టులో మానవ హక్కుల కేసులనే వాదించే న్యాయవాది మిహిర్ దేశాయ్ కూడా తెలిపారు. ఎక్కువ కేసులు దాఖలైనప్పటికీ తక్కువ కేసుల్లో శిక్షలు పడ్డాయంటే మిగతా కేసులన్నీ తప్పుగా దాఖలైన కేసులు కావని ఆయన అన్నారు. ‘ప్రొసీజర్ లాప్సెస్’, అంటే దర్యాప్తు సందర్భంగా, కోర్టు విచారణ సందర్భంగా తప్పులు జరగడం వల్ల కేసులను కొట్టి వేస్తారని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ లాంటి చట్టాలకు సంబంధించిన కేసులను ఉన్నత స్థాయి అధికారులు మాత్రమే దర్యాప్తు జరపాలని చట్టం నిర్దేశిస్తోందని, అయినా పని ఒత్తిడి కారణంగానో, మరో కారణంగానో ఈ కేసుల దర్యాప్తును దిగువ స్థాయి పోలీసులకు కూడా అప్పగిస్తున్నారని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో సాధారణంగా తక్కువ శిక్షలు పడడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ కేసుల్లో నిందితులు పలుకుబడి కలిగిన వ్యక్తులు కావడం వల్ల నిందితులపై ఒత్తిడి తెచ్చి రాజీ చేసుకుంటారు. బాధితులు తాము ఎస్సీ లేదా ఎస్టీలమంటూ సరైన ఆధారాలు చూపించలేకపోతారు. కుల వివక్ష కారణంగానే తమపై దాడి జరిగిదంటూ బాధితులు నిరూపించలేకపోతారు. వారికి దర్యాప్తు అధికారుల సహకారం కూడా అంతంత మాత్రమే. దుర్వినియోగం జరుగుతోంది కనుక మహిళలకు సంబంధించి 498ఏ సెక్షన్‌ను, ఈ ఎస్టీ, ఎస్టీల చట్టాలను కొట్టివేయాలనుకుంటే ఇంతకన్నా దుర్వినియోగం అవుతున్న చట్టాలు, సెక్షన్లు ఇంకా ఎక్కువనే ఉన్నాయి. యూఏపీఏ (అన్‌లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్), ఢిల్లీ విఐపీ ప్రాంతాల్లో నిత్యం అమల్లో ఉండే 144వ సెక్షన్ అన్ని చట్టాలకన్నా ఎక్కువ దుర్వినియోగం అవుతున్నాయి. -
కొత్త చికిత్స విధానాన్ని అమలు చేయండి
న్యూఢిల్లీ: క్షయ వ్యాధి చికిత్స కోసం రోగికి వారానికి మూడు సార్లు మందులు ఇచ్చే విధానాన్ని కాకుండా రోజూ మందులు ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘వాడే మందులు ఒకటే అయినప్పుడు రోజూ ఎందుకివ్వకూడదు?’ అని ప్రశ్నించింది. మందును రోజూ ఇవ్వాలంటూ ఈ వ్యాధి నిపుణుడైన డాక్టర్ రమణ్ కక్కర్ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈమేరకు పేర్కొంది. ప్రస్తుత విధానం అశాస్త్రీయమని, ఖర్చు తగ్గించుకోవడానికి తక్కువ మోతాదు మందులిస్తున్నారని కక్కర్ ఆరోపించారు. -
టీచర్లను పీఏలుగా నియమించొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యక్తిగత సహాయకులు(పీఏ)గా టీచర్లను నియమించొద్దని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. డిప్యుటేషన్‌పై పీఏలుగా పనిచేస్తున్న వారిని వెనక్కు పిలవాలని సలహాయిచ్చింది. తెలంగాణలో 'జీరో స్కూల్స్'పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి అమికస్ క్యురీ అందజేసింది. ఎంఈవో, డీఈవో పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ పాఠశాలలపై ఎందుకు నమ్మకం కలిగించలేకపోతున్నారని అడిగింది. అన్ని అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. 398 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
'నీట్'పై సుప్రీంకోర్టు తుది తీర్పు
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్త ఉమ్మడి ప్రవేశ పరీక్ష 'నీట్' తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చేసింది. రాష్ట్రాలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించడం కుదరదని స్పష్టం చేసింది. అవసరమైతే నీట్-2 తేదీ మార్చుకోవచ్చని సూచించింది. 'నీట్'పై ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం వెలువరించిన తీర్పు కాపీని సోమవారం రాత్రి వెబ్ సైట్ లో పెట్టారు. నీట్-1 రాసిన వారు కూడా నీట్- 2 రాయొచ్చని పేర్కొంది. నీట్-2 రాయాలనుకుంటున్న విద్యార్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని సూచించింది. గత ఉత్తర్వులను సవరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం ససేమీరా అంది. 'నీట్' వల్ల రాష్ట్రాల హక్కులు, స్థానిక రిజర్వేషన్లకు ఎలాంటి భంగం వాటిల్లదని పేర్కొంది. మైనారిటీ కాలేజీల హక్కులకు ఎటువంటి నష్టం జరగదని తెలిపింది. 'నీట్' పర్యవేక్షణకు మాజీ చీఫ్ జస్టిస్ లోధా నేతృత్వంలో కమిటీ నియమించనున్నట్టు వెల్లడించింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని ఎన్జీఓలు వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. నేషనల్ ఎలిజిబిలిడీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను దేశవ్యాప్తంగా రెండు విడతలుగా నిర్వహించాలని ఇటీవల ఆదేశించడం తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 1న నీట్ తొలి విడత పరీక్ష జరగగా.. జూలై 24న రెండో విడత 'నీట్' జరగాల్సి ఉంది. -
మెమన్ పిటిషన్‌పై 27న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల కేసులో తనకు విధించిన మరణ శిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ యాకూబ్ మెమన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 27నవిచారించనున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు వెల్లడించారు. చాలా సున్నితమైన ఈ అంశాన్ని జస్టిస్ ఏఆర్ దవే నేతృత్వంలోని బెంచ్‌కు అప్పగించానని శుక్రవారం తెలిపారు. యాకూబ్కుశిక్షను ఈ నెల 30న అమలు చేయనుండడం తెలిసిందే. మెమన్ తరఫున న్యాయవాది రాజు రామచంద్రన్ పిటిషన్‌ను ప్రస్తావించగా, మరణశిక్షలకు వ్యతిరేకంగా పోరాడుతున్న డెత్ పెనాల్టీ లిటిగేషన్ క్లినిక్ తరఫున టీఆర్ అంధ్యారుజినా హాజరయ్యారు. మెమన్‌కు డెత్ నోటీసు ఇవ్వలేదని అంధ్యారుజినా చెప్పారు. మెమన్ నాగపూర్ జైలు ఉండగా, డెత్ వారెంట్ ప్రక్రియను ముంబై జైలులో అమలుచేస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ముంబైలోని టాడా కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడం చట్ట విరుద్ధమన్నారు. -
మహిళా మేకప్ ఆర్టిస్టులకు ఊరట
న్యూఢిల్లీ: మహిళా మేకప్ ఆర్టిస్టులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బాలీవుడ్ లో పనిచేసేందుకు వారికి అనుమతినిచ్చింది. లింగ, స్థానికత ఆధారంగా మహిళా మేకప్ ఆర్టిస్టులపై వివక్ష తగదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరించింది. సినిమా పరిశ్రమలో మహిళా మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రసర్స్ పనిచేయకుండా నిరోధించే నిబంధనను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. -
న్యాయస్థానాల ఏర్పాటు మా పనికాదు: సుప్రీం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ వేగం పుంజుకోవడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పెండింగ్ లో కేసులను సత్వరమే పరిష్కారించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఇందుకోసం అదనపు కోర్టులు ఏర్పాటు చేయాలని, న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎమ్ లేధా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. కొత్త కోర్టులు తాము ఏర్పాటు చేయలేమని, ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. లా సెక్రటరీలు, అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ఈ దిశగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి కోర్టుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. నెల రోజుల్లోగా ఈ ప్రతిపాదనతో రావాలని కేంద్రాన్ని కోరింది. నేషనల్ పాంథర్స్ పార్టీ అధ్యక్షుడు భీమ్ సింగ్ వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.