
స్థానిక సంస్థల ఎన్నికలపై డైలమా?
స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం బుధవారం తేల్చి చెప్పింది.
న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికలపై డైలమా నెలకొంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లింది. ఇబ్బందులపై ఎల్లుండిలోగా లిఖితపూర్వకంగా దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది. దాంతో ఎన్నికల కమిషన్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేయనుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మరోసారి సందిగ్ధత ఏర్పడింది.