మేం కళ్లు మూసుకోం...
న్యూఢిల్లీ: ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఎన్. శ్రీనివాసన్, మరో 12 మందిపై బీసీసీఐ విచారణ జరపాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీసీసీఐ స్వయంప్రతిపత్తి గల సంస్థ అయిన బీసీసీఐ ఈ వ్యవహారంపై మిన్నకున్నా తాము మాత్రం కళ్లు మూసుకోమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. జస్టిస్ ముకుల్ ముగ్దల్ కమిటీ తన నివేదికలో చేసిన ఆరోపణలపై విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేసింది.
కమిటీ ప్రతిపాదనలను శ్రీనివాసన్ సీరియస్గా తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఐపీఎల్-7కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా సుందర్ రామన్ను కొనసాగించేందుకు కోర్టు అనుమతించింది. సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలనే దానిపై నిర్ణయాన్ని జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ రిజర్వు చేసింది.