బీసీసీఐ అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడంపై దృష్టి పెట్టిన రెండు వర్గాలు తమ తరహాలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
ఆసక్తికరంగా బీసీసీఐ అధ్యక్ష ఎన్నిక
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడంపై దృష్టి పెట్టిన రెండు వర్గాలు తమ తరహాలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ శుక్రవారం కొంత మంది తన మద్దతుదారులతో బెంగళూరులో సమావేశమయ్యారు. ఈస్ట్‌జోన్ సంఘాల ప్రతినిధులతో కూడా మాట్లాడేందుకు శ్రీనివాసన్ ప్రయత్నించినా వారెవరూ ఈ సమావేశానికి రాలేదని తెలిసింది. అమితాబ్ చౌదరికి మద్దతిచ్చే అవకాశాన్ని శ్రీని కొట్టిపారేయలేదు.
మరో వైపు గురువారం నాగపూర్‌లో పవార్‌తో జరిగిన సమావేశంలో కూడా ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. పవార్‌కు సంబంధించి నాలుగు ఓట్లు ఉండటంతో ఆయనతో శ్రీనివాసన్ చర్చించినా ఎలాంటి హామీ దక్కలేదు. పవార్ కూడా అధ్యక్ష పదవిపై ఆసక్తితో ఉండటమే ఇందుకు కారణం కావచ్చు. అటు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా రాజీవ్ శుక్లాకు మద్దతుగా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.