్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి అత్యాచార ఘటన కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసు విచారణను లైవ్ స్ట్రీమ్ చేస్తామని, ఆ విషయంలో తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది.
మంగళవారం సుప్రీం కోర్టు ఆర్జీ కర్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి ఘటన కేసును విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా .. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నందుకు తన మహిళా లాయర్లకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ సున్నితమైన అంశంలో విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయోద్దని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
కపిల్ సిబల్ విజ్ఞప్తిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పందించారు. కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయలేమని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసు విచారణ లైవ్ స్ట్రీమ్ లో కొనసాగుతుందని స్పష్టం చేశారు.
‘నా ఛాంబర్‌లోని మహిళా న్యాయవాదులకు బెదిరింపులు వస్తున్నాయి. వారిపై యాసిడ్ దాడులు చేస్తామని, హత్యాచారం చేస్తామని చెదిరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారని అన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి బదులిస్తూ.. మహిళ న్యాయవాదుల భద్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment