భువనగిరి, న్యూస్‌లైన్ : భువనగిరిలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో యువగర్జన నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పీవీ ఫౌండేషన్ అధినేత పీవీ శ్యాంసుందర్‌రావు పార్టీలో చేరుతున్న సందర్బంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హాజరువుతున్నారని తెలిపారు. ఆయనతో పాటు నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతా సాంబమూర్తి, రవీంద్రరాజు, ప్రేమ్‌కుమార్‌యాదవ్‌లు కూడా పాల్గొంటారని వివరించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే యువ గర్జన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. భువనగిరి నియోజకవర్గంతోపాటు జిల్లా నుంచి బీజేపీ కార్యకర్తలు, తెలంగాణ వాదులు పెద్దఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు.
ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు
యువగర్జన సభ జరిగే భువనగిరి జూనియర్ కళాశాల మైదానాన్ని బీజేపీ నాయకులు మంగళవారం పరిశీలించారు. సభావేదికతోపాటు, మైదానంలో కుర్చీల ఏర్పాటు, సభ కోసం వచ్చే కార్యకర్తలకు అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు. సమారు 10 వేల మంది కార్యకర్తలు హాజరవుతారని, ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో పెద్దఎత్తున నాయకుల కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
నేడు భువనగిరిలో బీజేపీ యువగర్జన
Published Wed, Oct 9 2013 4:43 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement