గద్వాల, న్యూస్‌లైన్: మావోయిస్టు పార్టీ కర్ణాటక రాష్ట్ర సభ్యుడు చంద్రశేఖర్ గోరబాల అలియాస్ చంద్రశేఖర్ ఆజాద్‌పై జిల్లా పోలీసులు పెట్టిన మారణాయుధాల కేసును జిల్లా మూడో అదన పు సెషన్స్ కోర్టు జడ్జి ప్రభాకర్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. న్యాయవాది మనోహర్ కథనం ప్ర కారం... 2010 జూన్ 12 రాత్రి కర్ణాటక నుంచి అయిజ మీదుగా కర్నూలుకు ఆయుధాలతో వెళ్తున్నాడనే ఆరోపణలతో అయిజ పోలీసులు చంద్రశేఖర్ ఆజాద్‌ను అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు గద్వాల కోర్టులో హాజరుపరచగా, జ డ్జి రిమాండ్ విధించారు. ఏకే-47, అత్యాధునిక ఆయుధాలతో చంద్రశేఖర్‌ను అరెస్టు చేసినట్లు అప్పట్లో జిల్లా పోలీసులు మీడియా ముందు చూపించారు.
నాటినుంచి చర్లపల్లి జైలులో విచారణ ఖైదీగా ఉంటున్న ఆయన గద్వాల కోర్టుకు హాజరవుతూ వచ్చారు. రెండున్నర ఏళ్ల విచారణ అనంతరం చంద్రశేఖర్ పై మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు మోపిన ఆయుధాల కేసులో సాక్షాధారాలు చూయించలేకపోయారు. దీంతో శుక్రవారం గద్వాల ఏడీజే ప్రభాకర్ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. తీర్పు కాపీ వచ్చే వరకు పోలీసుల అదుపులు ఉండాల్సి ఉన్నందున, తీర్పు వెలువడిన అనంతరం చర్లపల్లి జైలు అధికారులు చంద్రశేఖర్‌ను హైదరాబాద్‌కు తీసుకెళ్లారని న్యాయవాది మనోహర్ వివరించారు.
అయిజ ఎక్కడుందో తెలియదు..
ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. తనను కర్ణాటకలో అదుపులోకి తీసుకుని, అయిజలో అరెస్టు చేసినట్లు చూపించారని ఆరోపించారు. అయిజ ఎక్కడుంతో తనకు ఇప్పటి వరకు తెలియదన్నారు. ఏది ఏమైనా చివరకు న్యాయమే గెలుస్తుందన్న వాస్తవానికి నిదర్శమే కోర్టు తీర్పు అని ఆయన పేర్కొన్నారు.
మావోయిస్టు నేత చంద్రశేఖర్‌పై కేసు కొట్టివేత
Published Sat, Nov 23 2013 4:15 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM
Advertisement