ఆమనగల్లు: ఫార్మాసిటీకి కావాల్సిన భూములను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం పరిశీలించనున్నారు. హెలికాప్టర్ నుంచే ఆయన భూములను పరిశీలించనుండడంతో అధికారులు ఆ భూముల్లో జెండాలు పాతారు. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఫార్మాసిటీ, ఫిల్మ్‌సిటీల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశ్రామిక వేత్తల బృందంతో కలిసి బుధవారం అందుకు సంబంధించిన భూములను హెలికాప్టర్ నుంచి పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ శర్మన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆమనగల్లు మండల పరిధిలో దిల్ సంస్థకు కేటాయించిన భూములను గుర్తించేందుకు వీలుగా ఆ భూముల్లో పచ్చజెండాలు పాతారు.
‘దిల్’కు 1642 ఎకరాలు
కేటాయింపు
మండలంలోని ఐదు గ్రామాల ప రిధిలో 1,642 ఎకరాలను దిల్ సంస్థకు ప్రభుత్వం 2007లో కేటాయించింది. ఆమనగల్లు గ్రామంలోని 16 సర్వే నెంబర్ లో 226 ఎకరాలు, 21 సర్వే నెంబర్‌లో 8.15 ఎకరాలు, సర్వే నెం.27లో 101 ఎకరాలు, సర్వే నెం.68లో 113ఎకరా లు, సర్వే నెం.643లో 18ఎకరాలు, స ర్వే నెం.646లో 40 ఎకరాలు, సర్వే నెం.1429లో 197 ఎకరాలు, ముద్విన్‌లో సర్వే నెం.179లో 267 ఎకరాలు, ఆకుతోటపల్లిలో సర్వే నెం.304లో 382 ఎకరాలు, చెన్నంపల్లిలో సర్వే నెం.23లో 57 ఎకరాలు, పోలెపల్లిలో సర్వే నెం.3లో 162 ఎకరాలు, సర్వే నెం.5 లో 68 ఎకరాలను దిల్ సంస్థకు కేటాయించారు.
భూముల పరిశీలన
జిల్లా సరిహద్దులను గుర్తించడానికి వీ లుగా అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. మండలంలోని జమ్ములబావితాండా సమీపంలో దాదాపు 570 ఎకరాలను రంగారెడ్డి జిల్లా అధికారులు తమ భూములుగా రికార్డుల్లో పేర్కొన్నారు. దీంతో జిల్లా సరిహద్దులోని భూములను జిల్లా ల్యాండ్ అండ్ సర్వే ఏడీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు శివకుమార్, శ్రీనివాస్‌రెడ్డి, సర్వేయర్ మహేశ్ కొలతలు వేస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి
ముఖ్యమంత్రి పరిశ్రమలకు కేటాయించిన భూములపై ఏరియల్ సర్వే చేయనున్నందున అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శర్మన్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మండలంలో దిల్ సంస్థకు కేటాయించిన భూములను గుర్తించడానికి వీలుగా జెండాలు ఏర్పాటు చేశామన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో ఏర్పాటు చేసిన వద్ద జిల్లాకు సంబందించిన భూముల ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
నేడు సీఎం ఏరియల్ సర్వే
Published Wed, Dec 3 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement