ఆర్‌ఎస్‌ఎస్ షష్ట్యాబ్ధి ఉత్సవాలు జిల్లాకేంద్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పథసంచాలన్ ఆకట్టుకుంది. దేశభక్తి, హిందూత్వం, ధర్మ పరిరక్షణ కోసం ఏర్పడిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంతీయ కార్యవాహ్ ఎక్కా చంద్రశేఖర్ అన్నారు. యువతతోనే మార్పు సాధ్యమని, రాజకీయాలకు అతీతంగా దేశ అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు.
కరీంనగర్ అర్బన్, న్యూస్‌లైన్ : రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా యువ త దేశ అభ్యున్నతికి పాటుపడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంతీయ కార్యవాహ్ ఎక్కా చంద్రశేఖర్ సూచించారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్ షష్ట్యాబ్ది ఉత్సవాలు ఆదివారం జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వ్యక్తి త్వ నిర్మాణంతోనే దేశంలో మార్పులు సాధ్యమన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ దేశభక్తి, హిందుత్వం, ధర్మ పరిరక్షణ కోసం ఏర్పడిన సంస్థ అని, దేశ ఉన్నతే లక్ష్యంగా పని చేస్తుం దని తెలిపారు. యువతతోనే మార్పు సాధ్యమని, ప్రతీ ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచిం చారు. దేశానికి సేవ చేసినా కన్నతల్లికి చేసినట్లుగా భా వించాలన్నారు. దేశ సరిహద్దులు తెలియని వారు కూ డా పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దే శంలో మూడు కోట్ల మంది విదే శీయులు అనుమతి లేకుండా జీవనం సాగిస్తున్నారని, దేశంలో భద్రత కరువైందని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏ పార్టీతో సం బంధం లేదని, యువతలో దేశభక్తి పెంపొందించడానికి కృషి చేస్తుందని అన్నారు.
ఆకట్టుకున్న పథసంచాలన్..
అంతకుముందు ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి 500 మంది కార్యకర్తలతో ప్రారంభమైన పథసంచాలన్ ఆకట్టుకుంది. రాజీవ్‌చౌక్, టవర్ సర్కిల్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, బస్టాండ్, తెలంగాణ చౌక్ మీదుగా కళాశాల మై దానానికి చేరింది. టవర్‌సర్కిల్‌లో వీహెచ్‌పీ, టవర్‌సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్, జ్యూయలరీ సంఘం స్వా గతం పలికారు. నిగమ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాం డెంట్ గోపాల్ రెడ్డి, విభాగ్ సంఘ్ చాలక్ మల్లోజుల కిషన్‌రావు, జిల్లా సంఘ్ చాలక్ గట్టు మురళీమనోహర్, నగర సంఘ్ చాలక్ సీహెచ్. రమణాచారి, బూర్ల దక్షిణామూర్తి, చక్రాల రామాంజనేయులు, జన్న సత్యనారాయణరెడ్డి, సుగుణాకర్‌రావు, బండి సంజయ్‌కుమార్, గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఎడవెల్లి విజేందర్‌రెడ్డి, కుమ్మరి కుంట సుధాకర్, ముక్కా హరీష్‌బాబు, కరండ్ల మధుకర్, బేతి మహేందర్‌రెడ్డి, శిరీష్, రమణారెడ్డి, ప్రశాం త్, రామారావు, చక్రధర్, రవీందర్ పాల్గొన్నారు.
యువతతోనే మార్పు
Published Mon, Feb 10 2014 2:25 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement