
గౌరీలంకేశ్, రిషికేశ్ దేవాడికర్ (ఫైల్)
బెంగళూరు: సీనియర్ పాత్రికేయురాలు, సామాజికవేత్త గౌరీలంకేశ్ హత్య కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఆపరేషన్ అమ్మ’ పేరుతో నిందితులు హత్యోదంతాన్ని సాగించినట్లు నిర్ధారణయింది. జార్ఖండ్‌కు చెందిన రిషికేశ్ దేవాడికర్‌ను సిట్ అధికారులు అరెస్ట్‌తోఈ విషయాలు తెలిసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యక్తి గౌరీలంకేశ్, సాహితీవేత్త ఎం.ఎం.కలబురిగిల హత్యకేసులో ప్రధాన నిందితుడని తేలింది.
తమ సంభాషణలు ఇతరులకు అర్థం కాకుండా దోషులు కోడ్ భాషను వినియోగించారు. గౌరీలంకేశ్‌ను టార్గెట్ చేసి ఆమెను అంతం చేసేవరకూ ‘అమ్మ’ అనే పదాన్ని రహస్య భాషగా వినియోగించినట్లు సమాచారం. హత్యకు వినియోగించిన పిస్టల్‌కు ‘సుదర్శన చక్ర’ అనే గుప్తనామం వాడారు. గౌరీలంకేశ్‌ను హత్య తర్వాత నిందితులు ‘సుదర్శన చక్ర కృష్ణుడి చేతికి చేరింది’ అని పరస్పరం సమాచారం అందజేసుకున్నట్లు సిట్ అధికారుల విచారణలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment