బెంగుళూరు: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గౌరి లంకేశ్ 2017లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ మేరకు గౌరి లంకేశ్ తల్లి ఇందిరా, చెల్లి కవిత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ శుక్రవారం జోడోయాత్రలో భాగంగా శుక్రవారం కర్ణాటక పర్యటిస్తున్నప్పుడూ దివగంత జర్నలిస్ట్ తల్లి, చెల్లి ఇద్దరు పాల్గొన్నారు.
భారతదేశ నిజమైన స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరి లంకేశ్ లాంటి వాళ్ల కోసం నిలబడతానని రాహుల్ గాంధీ అన్నారు. వాస్తవానికి గౌరి లంకేశ్ సెప్టెంబర్ 5, 2017న రాజరాజేశ్వరి నగర్‌లోని తన ఇంటికి వస్తున్న సమయంలో మోటరు సైకిల్‌పై వచ్చిన కొందరు అగంతకులు ఆమెపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ ట్విట్టర్‌లో.... "గౌరి లంకేశ్ సత్యం, ధైర్యం, స్వాతంత్య్రం కోసం నిలబడింది. గౌరి లంకేశ్ లాగా భారతదేశ నిజమైన స్ఫూర్తికోసం ప్రాతినిథ్యం వహిస్తున్న లెక్కలేనంతమంది వ్యక్తుల కోసం నిలబడతాను.
ఈ భారత జోడో యాత్ర వారి స్వరం. దీన్ని ఎప్పటికి నిశబ్దంగా ఉంచలేరు" అని రాహుల్ ట్విట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 3,750 కి.మీ భారత జోడో యాత్ర సెప్టంబర్ 8న కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విభజన రాజకీయాలను ఎదుర్కోవాలని కోరింది. గురువారం కర్ణాటకలో సాగుతున్న జోడోయాత్రలో సోనియా గాంధీ పాల్గొనడంతో పార్టీ శ్రేణుల్లో కొండంత నూతన ఉత్సాహం వచ్చింది.
Gauri stood for Truth
— Rahul Gandhi (@RahulGandhi) October 7, 2022
Gauri stood for Courage
Gauri stood for Freedom
I stand for Gauri Lankesh and countless others like her, who represent the true spirit of India.
Bharat Jodo Yatra is their voice.
It can never be silenced. pic.twitter.com/TIpMIu36nY
Comments
Please login to add a commentAdd a comment