
యశవంతపుర: కొందరు వ్యక్తులు యూ ట్యూబ్‌లో పాత్రికేయురాలు గౌరి లంకేశ్ ప్రసంగాలను చూపి తనను బ్రెయిన్ వాష్ చేయటం వల్లనే ఆమెను హత్య చేసినట్లు ఈ కేసులో కీలక నిందితుడు, షార్ప్ షూటర్ పరశురాం వాగ్మోరె సిట్ విచారణలో వెల్లడించాడు. గౌరిలంకేశ్ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రసంగాలను యూ ట్యూబ్‌లో చూపించి ఆమెను హత్య చేయాలని రెచ్చగొట్టిన్నట్లు అతడు చెప్పినట్లు సమాచారం.
ఇదే కాకుండా నీవు శ్రీకృష్ణుని పుత్రుడవు, భగవంతుని కొడుకువు అని రెచ్చగొట్టడంతో ఆమెను అంతమొందించడానికి అంగీకరించినట్లు తెలిపారు. గౌరి ఇంటి చుట్టూ అనేకసార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలిపాడు. ఆమెను మొదట తలకు గురిపెట్టి పిస్టల్‌తో కాల్చానని, గురి తప్పడంతో, విచ్చలవిడిగా కాల్పులు జరిపి హత్య చేసినట్లు పరశురాం హత్యాక్రమాన్ని వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment