Hindutva organizations
-
నేతాజీపై రాహుల్ గాంధీ పోస్ట్.. ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పశ్చిమ బెంగాల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై తన ఎక్స్ ఖాతాలో ఆయన చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదంగా మారడమే ఇందుకు కారణం. అఖిల భారతీయ హిందూ మహసభ(ABHM) ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. జనవరి 23వ తేదీన నేతాజీ జయంతి. ఆరోజున రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అయితే అందులో ఆయన పేర్కొన్న నేతాజీ మరణం తేదీపై ఏబీహెచ్ఎం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు దక్షిణ కోల్‌కతాలోని భవానిపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ఎల్గిన్ రోడ్‌లోని నేతాజీ(Netaji) పూర్వీకుల నివాసం వద్ద రాహుల్ పోస్టుకు నిరసనగా అఖిల భారతీయ హిందూ మహసభ ధర్నాకు దిగింది. నేతాజీ తొలుత కాంగ్రెస్‌ను, ఆపై దేశాన్ని విడిచిపెట్టారు. అందుకు ఆ పార్టీ విధానాలే కారణం. ఇప్పుడు రాహుల్ గాంధీ దానిని కొనసాగిస్తున్నారేమో. రాబోయే రోజుల్లో దేశ ప్రజలే ఆయన్ని(రాహుల్‌ను) శిక్షిస్తారు. నేతాజీ జీవితంపై ఎవరైనా వక్రీకరణలు చేస్తే మా స్పందన ఇలాగా ఉంటుంది అని ఏబీహెచ్ఎం హెచ్చరించింది. నేతాజీ అదృశ్యం.. ఆయన మరణం చుట్టూరా నెలకొన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేతాజీ ఆగష్టు 18, 1945న చనిపోయారంటూ రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అయితే.. అదే తేదీన నేతాజీ సైగాన్ నుంచి మంచూరియా వెళ్తున్న క్రమంలో తైహోకూ (ప్రస్తుత తైపాయి) వద్ద ఆ విమానం కూలిపోయిందనే ప్రచారం ఒకటి ఉంది. -
కమలనాథుల్లో కొత్త ఉత్సాహం
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు, హిందూత్వవాదులు నిర్దోషులుగా బయటపడడం కాషాయం కూటమిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వివాదాస్పద కట్టడాన్ని కుట్ర ప్రకారం కూల్చలేదని, అప్పటికప్పుడు జరిగిపోయిన సంఘటన అంటూ పదే పదే చెబుతూ వస్తున్న బీజేపీ నాయకులు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నారు. బిహార్ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాబ్రీ తీర్పుతో మరో భావోద్వేగ అంశాన్ని ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అవకాశం బీజేపీకి వచ్చింది. కమలనాథులు రామ మందిర నిర్మాణాన్ని తమ ఖాతాలో వేసుకుంటూనే మసీదు కూల్చివేతతో అంటిన మట్టిని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడం, ఇప్పుడు మసీదు కూల్చివేతలో బీజేపీ ప్రమేయం లేదని కోర్టు తేల్చి చెప్పడంతో రాజకీయంగా తమకు బాగా లబ్ధి చేకూరుతుందని బీజేపీ వర్గాలు యోచిస్తున్నాయి. కోర్టు తీర్పుని జై శ్రీరామ్ నినాదాలతో స్వాగతించామని అగ్రనేత ఎల్కే అడ్వాణీ వ్యాఖ్యానించారు. అటు రాముడికి గుడి కడుతున్నారన్న పేరు ప్రతిష్టలు రావడంతో పాటు, మసీదు కూల్చివేత అప్రతిష్ట కూడా పార్టీకి అంటకుండా తీర్పు వెలువడడం బీజేపీలో మంచి ఉత్సాహాన్ని నింపింది. మొత్తమ్మీద రామజన్మభూమి ఉద్యమం పార్టీకి అన్ని రకాలుగా కలిసొచ్చిందనే విశ్లేషణలు వినబడుతున్నాయి. తీర్పుపై ఎవరేమన్నారు.. ► సీబీఐ కోర్టు తీర్పు చరిత్రాత్మకం. ‘జై శ్రీరామ్.. అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని వేడుకుంటున్నాను. –మురళీ మనోహర్ జోషి, బీజేపీ ► కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. ఆలస్యమైనా చివరికి న్యాయమే గెలిచింది. –రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి ► 472 ఏళ్లుగా సాగిస్తున్న పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. ఆలయాల రక్షణకు, వాటి ఆస్తుల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం. –వినోద్ బన్సల్, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి ► రాజ్యాంగ స్ఫూర్తికి 2019నాటి సుప్రీంకోర్టు తీర్పుకు ఈ తీర్పు విరుద్ధం. –రణ్‌దీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ► ప్రభుత్వాలు పక్షపాత ధోరణితో వ్యవహరించరాదు. న్యాయం పూర్తిగా వక్రీకరించబడింది. –సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి ► సీబీఐ కోర్టు తీర్పు దురదృష్టకరం. దీనిపై ప్రభుత్వం కోర్టులో సవాల్ చేయాలి. –ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ► ఈ కుట్రలో భాగస్వాములెవరన్నదీ బహిరంగ సత్యం. దీనిపై సీబీఐ అప్పీలుకు వెళ్లాలి. –వలీ రహ్మానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రధాన కార్యదర్శి ► పట్టపగలే జరిగిన మసీదు విధ్వంసాన్ని ప్రపంచమంతా చూసింది. ఎవరి ప్రోద్బలంతో ఈ ఘటన జరిగిందో అందరికీ తెలుసు. –మౌలానా అర్షద్ మదానీ, జమైత్ ఉల్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు ► ఆ నిర్మాణాన్ని కూల్చివేశారనడానికి సంబంధించి ఎన్నో సాక్ష్యాలున్నా కోర్టు పట్టించుకోలేదు. దీనిపై ముస్లింలు హైకోర్టుకు వెళ్లవచ్చు. దీనిపై అంగీకారం కుదిరితే బోర్డు కూడా పార్టీగా చేరవచ్చు. బాధితులు, తనవంటి ఎందరో సాకు‡్ష్యలు కూడా అవసరమైతే అప్పీలుకు వెళ్లే హక్కుంది. –జఫర్యాబ్ జిలానీ, ఏఐఎంపీఎల్బీ సభ్యుడు, సీనియర్ లాయర్ ► చారిత్రక మసీదు ధ్వంసానికి బాధ్యులైన వారిని నిర్దోషులుగా పేర్కొనడం సిగ్గు చేటు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత ప్రభుత్వం మైనారిటీలకు, వారి ప్రార్థనా స్థలాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. –పాకిస్తాన్ విదేశాంగ శాఖ ► కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలో సీబీఐ పంజరంలో చిలక మాదిరిగా మారిపోయింది. బాబ్రీ కేసులో నిజాయతీగా వ్యవహరించడంలో సీబీఐ విఫలమైంది. –ఎంకే స్టాలిన్, డీఎంకే అధ్యక్షుడు -
ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చేవి: రంజిత్ భార్య
లక్నో: విశ్వహిందూ మహాసభల నాయకుడు రంజిత్ బచ్చన్ ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయన భార్య కలింది మాట్లాడుతూ.. రంజిత్‌కు రాడికల్ గ్రూప్‌ల నుంచి తరచూ బెదిరింపు కాల్స్, మెసెజ్‌లు వచ్చేవని పేర్కొన్నారు. అయితే ఆయనకు వస్తున్న బెదిరింపులపై పోలీసులకు ఎప్పుడు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో తనకు ఎప్పటికీ హాని జరగదని ఆయన చాలా నమ్మకంగా ఉండేవారన్నారు. కాగా గతంలో మేము మా బిడ్డను కోల్పోయాము, ఇప్పుడు నా భర్తను కోల్పోయానంటూ ఆమె ఆవేధన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన భర్తను హత్య చేసిన నిందితులను త్వరలో పట్టుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. (చదవండి: విశ్వహిందూ మహాసభ చీఫ్ కాల్చివేత..!) ఇక రంజిత్ హత్య కేసుపై లక్నో పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టగా సీసీటీవీ వీడియో ఆధారంగా నిందితుడి ఫొటోను విడుదల చేశారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు క్రైం బ్రాంచ్ పోలీసుల బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నిందితుడి ఆచూకి తెలిపిన వారికి రూ. 50 వేలు బహుమతిని ఇవ్వనున్నట్లు పోలీసులు ప్రకటించారు. కాగా ఆదివారం ఉదయం హజ్రత్‌గంజ్ ప్రాంతంలో మార్నింగ్ వాక్ వెళ్లిన రంజిత్ బచ్చన్, అతని సోదరునిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. తలలో బుల్లెట్ దూసుకుపోవడంతో బచ్చన్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన సోదరుడు చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. -
విశ్వహిందూ మహాసభ చీఫ్ కాల్చివేత..!
లక్నో : విశ్వహిందూ మహాసభ చీఫ్ రంజిత్ బచ్చన్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన లక్నోలోని హజరత్గంజ్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్ వెళ్లిన బచ్చన్, అతని సోదరునిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. తలలో బుల్లెట్ దూసుకుపోవడంతో బచ్చన్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన సోదరుడు చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. నిందితుల కోసం ఆరు క్రైం బ్రాంచ్ పోలీసుల బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఇటీవల కాలంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హిందుత్వ ప్రతినిధులను కాల్చిచంపిన ఘటనల్లో ఇది రెండోది. గత అక్టోబర్‌లో హిందూ సమాజ్‌పార్టీ నాయకుడు కమలేశ్ తివారీని దుండగులు లక్నోలోని నక ప్రాంతంలో కాల్చి చంపారు. 2015లో ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తివారీ వార్తల్లో నిలిచారు. ఆయన వ్యాఖ్యలపై అప్పట్లో ముస్లిం సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసిన తివారీ డిపాజిట్ కోల్పోయారు. పలు కేసుల్లో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. -
విద్యార్థులకు కత్తుల పంపిణీ..!
ఆగ్రా : స్వాతంత్ర సమరయోధుడు, హిందూ మహాసభ దిగ్గజ నాయకుడు వీర్ సావర్కర్ (వినాయక్ దామోదర్ సావర్కర్) జయంత్యుత్సవాలు మంగళవారం దేశవ్యాప్తంగా జరిగాయి. దానిలో భాగంగా అఖిల భారత హిందూ మహాసభ నాయకులు ఆగ్రాలో 10, 12 తరగతుల పిల్లలకు కత్తుల్ని పంపిణీ చేశారు. హిందూ సమాజం సాధికారత సాధించేందుకు.. ముఖ్యంగా యువత ఆత్మరక్షణ, దేశ రక్షణకు జాగురూకులై ఉండేందుకు కత్తులను పంపిణీ చేస్తున్నామని హిందూమహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్ చెప్పారు. విద్యార్థులకు కత్తులతో పాటు భగవద్గీత ప్రతులను కూడా అందిస్తున్నామని తెలిపారు. మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయని, ఆత్మ రక్షణ కోసం యువతులకు ఆయుధ శిక్షణ అవసరమని పేర్కొన్నారు. ఇక సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. ప్రజల్లో దేశభక్తి రగిల్చి ఎందరికో ధీరోదాత్తమైన స్ఫూర్తిని అందించిన సావర్కర్ కృషి మరువలేనిదని అన్నారు. జాతీనిర్మాణం కోసం పనిచేసిన ఆయన సదాస్మరణీయుడని ట్వీటర్లో పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో హిందూకీకరణ.. హిందువుల్లో సైనికీకరణ.. అనేది సావర్కర్ నినాదం. నరేంద్రమోదీ దేశ ప్రధానిగా ఎన్నికై సావర్కర్ కలను నెరవేర్చారు. ఇక రెండోది. దేశ రక్షణ కోసం ప్రతి హిందువు సైనికుడిగా మారాలి. అందుకోసమే.. యువతకు కత్తులను అందిస్తున్నాం’అని హిందూ మహాసభ అదికార ప్రతినిధి అశోక్ పాండే చెప్పారు. దేశంలో ఇప్పటికే మతపరమైన దాడులు జరగుతున్న నేపథ్యంలో అఖిల భారత హిందూ సభ అత్యుత్సాహం ప్రదర్శించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. We bow to Veer Savarkar on his Jayanti. Veer Savarkar epitomises courage, patriotism and unflinching commitment to a strong India. He inspired many people to devote themselves towards nation building. pic.twitter.com/k1rmFHz250 — Narendra Modi (@narendramodi) May 28, 2019 -
అత్యవసర విచారణ అక్కర్లేదు
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చింది. 2019 జనవరిలో తాము ఏర్పాటు చేయబోయే ధర్మాసనం అయోధ్య కేసు విచారణ తేదీలను ఖరారు చేస్తుందని తెలిపింది. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంపై బీజేపీతోపాటు పలు హిందుత్వ సంఘాలు నిరసన తెలిపాయి. రామమందిర నిర్మాణంలో జాప్యంతో హిందువుల్లో సహనం నశిస్తోందని కేంద్రమంత్రి గిరిరాజ్ కిశోర్ వ్యాఖ్యానించగా మందిర నిర్మాణం కోసం వెంటనే ఆర్డినెన్స్, లేదా పార్లమెంట్లో చట్టం తేవాలని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ), ఆర్ఎస్ఎస్ కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. కాగా, అయోధ్య వివాదంలో కోర్టులు ఏమీ చేయలేవని శివసేన పేర్కొంది. మాకు వేరే ప్రాథమ్యాలున్నాయి.. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ తేదీలను వచ్చే ఏడాది జనవరిలో ఖరారు చేయనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘అయోధ్య వివాదాస్పద భూమిపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సముచిత ధర్మాసనం విచారణ చేపడుతుంది. విచారణ తేదీలను ఆ ధర్మాసనం వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో నిర్ణయిస్తుంది’ అని తెలిపింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై వెంటనే విచారణ చేపట్టాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, రామ్‌లల్లా తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ లాయర్ సీఎస్ వైద్యనాథన్ కోరగా స్పందించిన ధర్మాసనం..‘మాకు వేరే ప్రాథామ్యాలున్నాయి. ఈ వివాదంపై జనవరి, ఫిబ్రవరి లేక మార్చిలోనా ఎప్పుడు విచారణ చేపట్టాలో ఆ ధర్మాసనం నిర్ణయిస్తుంది’ అని పేర్కొంది. వివాదాస్పద ప్రాంతంలోని 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్ లల్లా వర్గాల మధ్య సమానంగా విభజించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. హిందువుల్లో సహనం నశిస్తోంది: న్యాయస్థానాలపై తమ ప్రభుత్వానికి గౌరవం, విశ్వాసం ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అయితే, మెజారిటీ ప్రజలు ఈ విషయంలో త్వరగా తుది తీర్పు వెలువరించాలని కోరుతున్నారన్నారు. రామ మందిరం ఆలస్యంపై హిందువుల్లో సహనం నశిస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ కిశోర్ అన్నారు. ప్రభుత్వం ముందున్న మార్గాలు అయోధ్య పరిష్కారంపై ఒత్తిడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ముందు 4 మార్గాలున్నట్లు భావిస్తున్నారు. అవి 1. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా ఎదురుచూడటం, 2. రామాలయం నిర్మాణానికి వీలుగా ఆర్డినెన్స్ తేవడం, 3. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం, 4. రథయాత్ర మాదిరి ఉద్యమాన్ని ప్రారంభించడం. వెంటనే ఆర్డినెన్స్ తేవాలి: హిందుత్వ సంస్థలు ‘త్వరలో ఈ వివాదాన్ని కోర్టు తేల్చాలి. మందిరం నిర్మాణానికి ఎదురవుతున్న అవరోధాలను ప్రభుత్వం తొలగించాలి. వెంటనే రామాలయాన్ని నిర్మించాలి. ఆలయ నిర్మాణంతోనే దేశంలో మతసామరస్యం, ఐక్యతా భావం పెంపొందుతాయి’ అని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి అరుణ్ కుమార్ తెలిపారు.రామాలయాన్ని నిర్మించటానికి వీలుగా కేంద్రం చట్టం తేవాలని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ కోరారు. లేని పక్షంలో జనవరిలో అలహాబాద్ కుంభమేళాలో తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తామన్నారు. రాముని జన్మస్థలం అయోధ్యలోనే రామమందిరం కట్టాలని కోరుతున్నాం. అంతేతప్ప, పాకిస్తాన్లో కాదని శివసేన పేర్కొంది. -
భీమా-కోరేగావ్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు
పుణె: ఈ జనవరి ఒకటో తేదీన చోటుచేసుకున్న భీమా-కోరేగావ్ ఘటనలో ప్రధాన నిందితుడు మిలింద్ ఎక్‌బోతేను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్‌బోతే ముందస్తు బెయిల్‌కు చేసుకున్న దరఖాస్తును సుప్రీం కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి చాలా రోజులు గడుస్తున్నా మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నిందితుల్ని పట్టుకోకుండా వారికి కొమ్ము కాస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. విపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ బీజేపీ ప్రభుత్వం స్పందించింది. ఘటన సందర్భంగా నమోదైన చిన్న చిన్న కేసుల్ని ఉపసంహరించుకున్నామని సర్కార్ ప్రకటించింది. తీవ్ర ఆరోపణలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసేందుకు అడిషనల్ డీజీపీతో కమిటీ వేస్తున్నట్లు తెలిపింది. ఆ ఘటనలో జరిగిన రూ.13 కోట్ల ఆస్తుల నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించింది. హిందుత్వ నినాదాలతో దాడి.. భీమా-కోరేగావ్ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా 200వ జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్న దళితులపై కోరేగావ్‌లో జనవరి 1న దాడి జరిగింది. కొందరు హిందూత్వ నినాదాలు చేస్తూ వారిపై విరుచుకుపడ్డారు. ‘సమస్త హిందూ ఏక్తా అఘాదీ’ ఛీఫ్ మిలింద్ ఎక్‌బోతే అతని అనుచరులు ఈ దాడికి నేతృత్వం వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డ విషయం విదితమే. -
గౌరీలంకేష్లా చావాలని లేదు
సాక్షి, బెంగళూర్ : గత 8 నెలలుగా, మితవాదులు, హిందూ అతివాద సంస్థలపై వ్యంగ్య పోస్టులతో విరుచుకుపడుతున్న ఫేస్బుక్ పేజీ ఆగిపోయింది. ‘హ్యుమన్స్ ఆఫ్ హిందుత్వ’ ను నిలుపుదల చేసి, డిలేట్ చేస్తున్నట్లు ఆ పేజీ అడ్మిన్ గురువారం ప్రకటించారు. సత్యనాశ్ అనే సైట్లో ఈ మేరకు ఓ సందేశం ఉంచారు. ‘‘నా పేజీ గురించి ఇప్పటిదాకా వ్యతిరేకత, అభ్యంతరాలు రాలేదు. కానీ, గత కొన్ని రోజులుగా నన్ను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారు. వాటిని నేను తేలికగా తీసుకోదల్చుకోలేదు. నేనో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా. ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవ్. బీజేపీ పాలనలో నేను ఉన్నా. గౌరీ లంకేష్, అఫ్రజుల్ ఖాన్(రాజస్థాన్ లవ్ జిహాద్ బాధితుడు)లా చావాలని నాకు లేదు. నా కుటంబమే నాకు ముఖ్యం’’ అని అడ్మిన్ ఆ సందేశంలో పేర్కొన్నాడు. కాగా, అజ్ఞాతంలో ఉంటూనే ఆ పేజీ నిర్వాహకుడు మెసేంజర్ల ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చేవాడు. పేజీ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ప్రభావవంతమైన ఫోటోలు, పోస్టులతో చర్చనీయాంశమైంది. కాగా, ప్రస్తుతం కన్నడనాట మీడియా స్వేచ్ఛ అంశంపై హాట్ హాట్‌గా చర్చ కొనసాగుతోంది. -
మధ్యప్రదేశ్ చర్చి, క్రైస్తవ పాఠశాలపై దాడి
జబల్పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో హిందుత్వ సంస్థలు క్రైస్తవ పాఠశాల , చర్చిపై దాడికి దిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఈ నెల 20 న చోటు చేసుకుంది. వికార్ ఫాదర్ థాంక్చన్ జోస్ మత మార్పిళ్లకు పాల్పుడుతున్నారంటూ ధర్మసేన, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయన నివాసం, థామస్ స్కూల్, చర్చి ప్రాంగణాల్లో విధ్వంసాలకు పాల్పడ్డారు.