నా చావు కోరుకున్నాడు: జుకెర్బెర్గ్ | an extremist wanted me dead | Sakshi
Sakshi News home page

నా చావు కోరుకున్నాడు: జుకెర్బెర్గ్

Published Sat, Jan 10 2015 4:24 PM | Last Updated on Sat, Mar 23 2019 8:36 PM

నా చావు కోరుకున్నాడు: జుకెర్బెర్గ్ - Sakshi

నా చావు కోరుకున్నాడు: జుకెర్బెర్గ్

ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ ఒక్కసారిగా సంచలనం రేపాడు. పాకిస్థానీ తీవ్రవాది ఒకరు తనను ఉరితీసి చంపాలని కోరుకున్నాడంటూ తన ఫేస్బుక్ పేజీలో రాసి.. భారత, పాకిస్థానీ అనుకూలుర మధ్య తీవ్ర వివాదం రేకెత్తించాడు. ప్యారిస్ నగరంలోని చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయం మీద ఐఎస్ ఉగ్రవాదులు దాడి చేసి చంపడంతో... కొన్నాళ్ల క్రితం నాటి ఈ వివాదాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చాడు. మహమ్మద్ ప్రవక్త సమాచారాన్ని ఫేస్బుక్ నుంచి తొలగించడానికి నేను నిరాకరించాను, ఈ కారణంగా పాకిస్థాన్కి చెందిన  ఓ అతివాది నా మరణాన్ని కోరుకున్నాడని జుకెర్ బెర్గ్ అన్నారు.

అయితే, ఎవరో ఒకరు చేసిన తప్పుతో జాతి మొత్తాన్ని నిందించడం సరైంది కాదని పాకిస్థానీయుడొకరు జుకెర్బెర్గ్ పేజీలోనే పోస్ట్ చేశాడు. దానికి జుకెర్బెర్గ్ కూడా దీటుగానే స్పందించాడు. తనకు పాకిస్థానీలలో కూడా మంచి స్నేహితులున్నారని, తాను మొత్తం అందరి మీద వ్యాఖ్యలు చేయడంలేదని.. కేవలం అతివాదులను ఉద్దేశించి మాత్రమే వ్యాఖ్యానించానని అన్నాడు. దీంతో ఒకవైపు భారత అనుకూలరు, మరోవైపు పాకిస్థాన్ అనుకూల వాదుల మధ్య ఫేస్బుక్ వేదికగా తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం నడుస్తోంది. దీనంతటికీ మూలం.. జుకెర్బెర్గ్ పెట్టిన వ్యాఖ్యలే!!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement