facebook tips
ఫేస్‌బుక్.. ప్రస్తుతం స్కూల్ విద్యార్థుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్న సామాజిక మాధ్యమం. ఇక యువతీ, యువకుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఒక్క పోస్టింగ్ లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో ఎంతో మంది స్నేహితులను సంపాదించుకోవచ్చు. అలాగే వివాదస్పద అంశాలను పోస్ట్ చేసినా, కామెంట్ చేసినా కష్టాలూ తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో ఫేస్‌బుక్‌ను సురక్షితంగా వినియోగించుకోవడానికి సూచనలు..
♦ మొబైల్ నంబర్, అడ్రస్, ఈ–మెయిల్ ఐడీకి సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పెట్టకూడదు.
♦ సాధ్యమైనంత వరకు "keep me logged in' ఆప్షన్‌పై క్లిక్ చేయకపోవడం ఉత్తమం. ఈ చర్య అన్ని సందర్భాల్లో మంచిది కాదు.
♦ ఇతరుల లేదా పబ్లిక్ కంప్యూటర్ నుంచి వీలైనంత వరకు లాగిన్ కాకపోవడం మంచిది.
♦ పరిచయం లేని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయకూడదు.
♦ ఇతరులతో చాట్ చేస్తున్నప్పుడు చాట్ బాక్స్‌లో వ్యక్తిగత వివరాలను పోస్ట్ చేయకూడదు.
♦ మీ ప్రయాణ, ఉద్యోగ, కుటుంబ, వ్యక్తిగత వివరాలను ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేయకపోవడం మంచిది.
♦ పటిష్ట పాస్‌వర్డ్.. అంటే ఎంపిక చేసుకునే పాస్‌వర్డ్‌లో అక్షరాలు, విరామ చిహ్నాలు ఉండే విధంగా చూసుకోవాలి.
♦ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఫేస్‌బుక్ అకౌంట్‌ను లాగ్ అవుట్ చేయడం మరవద్దు.
♦ ఫేస్‌బుక్ అకౌంట్ వినియోగిస్తున్న పర్సనల్ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
♦ మీరు పంపే పోస్టులు ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే చేరే విధంగా ‘ప్రైవసీ సెట్టింగ్స్’లో మార్పులు చేసుకోవాలి.
♦ వివాదాస్పద, అనవసర పోస్ట్‌లను ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేయడం మంచిది కాదు.
♦ ఫేస్‌బుక్ అకౌంట్‌కి సెక్యూరిటీ చాలా అవసరం. సెక్యూరిటీ సరిగా లేకుంటే ఇతరులు మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి అసభ్య సందేశాలు, చిత్రాలు పోస్ట్ చేసే ప్రమాదం ఉంది.
♦ నకిలీ అకౌంట్లతో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అలాగే మీరు పోస్ట్ చేసిన అంశానికి లైక్‌లు రాలేదని బెంగ వద్దు.
♦ నచ్చిన వీడియోలను సేవ్ చేసుకోవడం కోసం ఆ వీడియోపై రైట్ క్లిక్ చేసి సేవ్ వీడియో ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే.. ఖాళీ సమయంలో ఆ వీడియోను చూడొచ్చు.
♦ క్రోమ్ బ్రౌజర్ నుంచి డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లోకి వెళ్లడం ద్వారా బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు. అలాకాకుండా ప్లేస్టోర్ నుంచి ఫేస్‌బుక్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే విరామం లేకుండా ఆన్‌లో ఉండటం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది.
♦ చాటింగ్ వద్దనుకుంటే డిజేబుల్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
♦ మెసేజ్‌లు, నోటిఫికేషన్స్‌ను మ్యూట్ చేయాలనుకుంటే facebook app > messagesలోకి వెళ్లి మ్యూట్ చేయదలచిన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. తర్వాత మెనూ పైన కనిపించే ఐకాన్‌ను క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు ఓపెన్ అవుతాయి. వాటిలో మ్యూట్ నోటిఫికేషన్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
♦ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుంచి ఫ్రెండ్స్‌కి మెసేజ్ పంపిన ప్రతిసారి లొకేషన్ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఈ లొకేషన్‌ను "Turn off"‘ చేయాలంటే ముందుగా ఫేస్‌బుక్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. మెసెంజర్ లొకేషన్ ఆప్షన్‌ను అన్‌టిక్ చేయడం ద్వారా మెసేజ్ లొకేషన్ టర్న్ ఆఫ్ అవుతుంది.
♦ ఫేస్‌బుక్ యాప్‌లో గ్రూప్ మెసేజ్‌లు క్రియేట్ చేయాలంటే.. ముందుగా మెసేజ్ ఐకాన్‌పై క్లిక్ చేసి గ్రూప్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కావాల్సిన వ్యక్తులను గ్రూప్‌లోకి యాడ్ చేసుకుని మెసేజ్ టైప్‌చేసి సెండ్ చేయాలి.
♦ ఫేస్‌బుక్‌లో ఏదైనా కామెంట్‌ను కాపీ చేయాలంటే ఆ కామెంట్‌పై కొద్ది సేపు టాప్ చేసి ఉంచితే మెనూ ఓపెన్ అవుతుంది. మెనూలోని "copy comment'’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే ఆ కామెంట్ కాపీ అవుతుంది.
♦ ఫేస్‌బుక్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలనుకుంటే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగినై ఆ తర్వాత వేరొక ట్యాబ్‌లో www.facebook.com/help/delete_ account సాయంతో దరఖాస్తు చేసుకుంటే 14 రోజుల తర్వాత అకౌంట్ పూర్తిగా డిలీట్ అవుతుంది.