Friend Request
-
‘హాయ్ బేబీ’ అంటూ వలపు వల.. టెంప్ట్ అయ్యారా కొంప కొల్లేరే..!
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యూజర్ల సంఖ్య పెరగడంతో సైబర్ కేటుగాళ్ల దీన్నే అదునుగా మార్చుకుని నెట్టింట ఇష్టారాజ్యంగా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు డబ్బు వస్తాయంటూ ఆశ చూపి మోసం చేస్తుండగా, మరికొందరు ఆన్లైన్లో పరిచయం పెంచుకుని కాస్త సన్నిహిత్యంగా మెలిగిన తర్వాత మన ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర చిత్రాలు పంపి డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. బాధితుడికి ఫేస్బుక్ అకౌంట్‌కి ఓ యువతి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇక ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించగానే కాస్త క్లోజ్‌గా మెలుగుతూ అతని వాట్సాప్ నెంబర్‌ను పంపాలని కోరడంతో బాధితుడు పంపాడు. కొన్ని రోజుల తర్వాత సదరు వ్యక్తి నుంచి అభ్యంతరకర కంటెంట్‌తో ఉన్న వీడియో అతనికి వచ్చింది. ఏంటని చూడగా.. అందులో అడల్ట్ కంటెంట్ వీడియోని మార్ఫ్డ్ చేసి బాధితుడి ముఖాన్ని పెట్టారు. దీనీ చూసిన అతను షాక్‌కి గురయ్యాడు. ఆ వీడియో పంపిన తర్వాత నిందితుడు డబ్బుల కోసం బెదిరింపులు మొదలుపెట్టాడు. భయంతో బాధితుడు రూ.1,96,000 వరకు సమర్పించుకున్నాడు. ఇంకా పంపాలని బెదించగా బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు రాకెట్ గుట్టు రట్టు చేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారుకు కాల్ చేసేందుకు ఉపయోగించిన నెంబర్లు అస్సాంకు చెందినవిగా, వాటిని రాజస్ధాన్‌లోని భరత్పూర్ జిల్లా నుంచి వాడినట్టు గుర్తించారు. నిందితుడు అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన ముగ్గురు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. వీరు ఫేస్బుక్ సహా సోషల్ మీడియా వేదికల్లో యువతుల పేరుతో పరిచయం పెంచుకుని బాధితుల వద్ద డబ్బుల గుంజుకోవడమే పనిగా పెట్టుకున్నారని పోలీసులు దర్యాప్తులో తేలింది. చదవండి: ఘోరం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌పై.. కజిన్ అత్యాచారం -
చదివింది ఎల్ఎల్బీ.. ‘ప్రియా1239301’ పేరుతో గాలం, చిక్కారో అంతే
సాక్షి,గుంటూరు: ఆడపిల్లలాగానే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాడు.. మాయ మాటలతో మోసం చేస్తాడు.. ఆర్ధిక స్థితి సరిగా లేదంటూ.. డబ్బులు అడుగుతాడు.. లేదంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తానంటూ.. బెదిరింపులకు దిగుతాడు. ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని సైతం బెదిరింపులకు గురి చేసి ఆమె ఫిర్యాదు చేయటంతో పోలీసులకు దొరికిపోయాడు. నగరంపాలెం పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్టేషన్ సీఐ ఎం. హైమారావు వివరాలను మీడియాకు వెల్ల డించారు. గుంటూరులోని సంజీవయ్య నగర్‌కు చెందిన పి.రామ్‌ప్రకాష్ అలియాస్ మున్నా జేకేసి లా కళాశాలలో బీఏ ఎల్ఎల్బీ నాల్గవ సంవత్స రం చదువుతున్నాడు.రెండు సంవత్సరాలుగా జీజీహెచ్‌లో కలెక్షన్ బాయ్‌గా పని కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో తన సెల్ఫోన్లో ‘రామ్పూనూరి 2’ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్‌లో చాట్ చేస్తూ.. ఉంటాడు. అమ్మాయిలతో చాట్ చేయాలనే దురుద్దేశ్యంతో గత ఏడాది డిశెంబర్లో ‘ప్రియా1239301’ పేరుతో మరో అకౌంట్ తెరిచి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతూ ఉండేవాడు. సుమారు 350 మంది మహిళలు తనఫ్రెండ్స్ గ్రూపులో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో శ్రీనివాసరావుపేటకు చెందిన ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం అభ్యసిస్తున్న ఒక విద్యార్థినికి రిక్వెస్ట్ పెట్టగా, ఆమె రామ్‌ప్రకాష్ రిక్వెస్ట్‌ను అంగీకరించింది. అయితే విద్యార్థినికి మాయమాటలు చెప్పి, తన ఆర్థికస్థితి సరిగ్గా లేదని నమ్మబలికి ఆమె వద్ద నుంచి రూ.85 వేల వరకు తీసుకుని జల్సాలకు వాడుకున్నాడు. దీంతో పాటు విద్యార్థిని భయపెట్టి ఆమె అకౌంట్ పాస్వర్డ్, ఐడీ తీసుకుని ఆమె ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో విద్యార్థిని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరటంతో, డబ్బులు అడిగితే తన ఫోటోలు మార్ఫింగ్ చేసి, ఆశ్లీలంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. విషయాన్ని విద్యార్థిని తల్లితండ్రులకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జీజీహెచ్‌లోని సైకిల్ స్టాండ్ వద్ద గురువారం నిందితు డిని అరెస్ట్ చేసి కోర్టు కు హాజరుపరిచినట్లు తెలిపారు.రామ్ ప్రకాష్ ఇతరత్రా వేరే మహిళలతో ఇదే విధంగా వ్యవహరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి పోలీసులు ఓ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. -
ఫేస్బుక్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకపోతే చంపేస్తా..
ఉత్తర డకోటా: ధూమపానం, మద్యపానం హానికరం అంటుంటారు. కానీ వీటిని మించిన అనర్థాలు సోషల్ మీడియా వల్ల పుట్టుకొస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ దీనికి బానిసలవుతూ ఎక్కువ కాలం ఆన్లైన్లోనే గడిపేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని ఉత్తర డకోటాకు చెందిన 29 ఏళ్ల కలేబ్ బర్క్‌జిక్.. తన మాజీ బాస్‌కు డిసెంబర్ 24న ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అతడు కావాలని చేశాడో, పనిలో పడి మర్చిపోయాడో తెలీదు కానీ ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయకుండా మిన్నకుండిపోయాడు. రెండు రోజులు గడిచినా ఇంకా ఎలాంటి స్పందన లేకపోవడం కలేబ్ సహించలేకపోయాడు. 'నా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చెయ్, లేదంటే నిన్ను చంపడానికి కూడా వెనుకాడను' అంటూ బెదిరింపులకు దిగాడు. (చదవండి: అమెరికాలో నల్లజాతీయుల మరణానికి కారణం ఇదే!) దీంతో ఆ మాజీ బాస్ కోపంతో ఈ సారి మాత్రం కావాలనే కలేబ్‌ను ఫ్రెండ్ లిస్టులో చేర్చుకోలేదు. ఇది అస్సలు సహించలేకపోయిన కలేబ్ అతడి చర్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆవేశంగా ఆయన ఇంటికి వెళ్లి ధడేలుమని తలుపు తన్ని మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతే కాదు, స్నాప్‌చాట్ వంటి ఇతర సోషల్ మీడియాల్లోనూ పలురకాలుగా వేధింపులకు గురి చేశాడు. దీంతో సహనం నశించిన బాస్ పోలీసులకు ఆశ్రయించాడు. వారు బర్క్‌జిక్‌ను అదుపులోకి తీసుకోగా అతడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 27న ఈ కేసు విచారణకు రానుంది. (చదవండి: ఈ ఫొటో తీస్తుంటే మొహమాటపడ్డారు..) -
ఫేస్బుక్ ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’తో జరభద్రం
మల్కాజిగిరికి చెందిన అభిషేక్ గౌడ్ నకిలీ ఫేస్బుక్ యూజర్ ఐడీ ‘వర డార్లింగ్’ను సృష్టించి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపేవాడు. ప్రొఫైల్‌లో అమ్మాయి ఫొటో ఉండటంతో అమ్మాయిగా భావించి పలువురు యువతులు ఆమోదించారు. ఆ తర్వాత అతను వీడియో చాట్‌కు రావాలని నగ్నంగా కనబడాలని కోరే వాడు. ఈ ప్రతిపాదనను తిరస్కరించిన అమ్మాయిల ముఖాన్ని మార్ఫింగ్ చేసి బాధితుల ఫేస్బుక్ మెసేంజర్‌కు పంపేవాడు. గతేడాది అక్టోబర్ 10న రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ బాధితురాలిని కూడా ఇదే తరహాలో మెసేజ్ పంపాడు. తన మెసేజ్‌లకు స్పందించకపోతే ఆ ఫొటోలను ఫేస్బుక్ ఫ్రెండ్స్‌తో పాటు పోర్న్ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తానని బెదిరించడంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో గత డిసెంబర్ 4న నిందితుడిని అరెస్టు చేశారు. సాక్షి, సిటీబ్యూరో: ఇలాంటి ఘటనలు కేవలం ఒకరు, ఇద్దరు యువతులకే పరిమితం కావడం లేదు. వందల సంఖ్యలో విద్యార్థినులు, యువతులు, మహిళలు ఇదే తరహా వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్‌లో తమ చిత్రాలు, వీడియోలను అప్లోడ్ చేస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వీటిని విశ్లేషించిన పోలీస్ అధికారులు అపరిచితులు పంపిన చిత్రా లు, పోస్ట్‌లకు స్పందించవద్దని సూచిస్తున్నారు. ఫేస్బుక్ ఖాతాలతో జరభద్రం... ఫేస్బుక్ ఖాతాలతోనే విద్యార్థినులు, యువతులు, మహిళలకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని సైబర్ క్రై మ్ అధికారులు పేర్కొంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన చిత్రాలు, కామెంట్స్‌కు ‘లైక్’ కొట్టడం ప్రమాదాలను కొనితెచ్చుకోవడమేనన్నారు. స్నేహితులతో గడిపిన సందర్భాలు, దేవాలయాలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, విహారయాత్రలు, పెళ్లిళ్ల సమయంలో తీసుకున్న ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో సైబర్ నేరగాళ్లు వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. ఫేస్బుక్ అకౌంట్లోకి వస్తున్న నేరగాళ్లు, యువతులు, విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతూ హెచ్చరికలు చేస్తున్నారు. నిందితుల్లో బాధితులకు తెలిసిన వారు కూడా ఉండటం గమనార్హం. ఫేస్బుక్, ట్విట్టర్లలో ఖాతాలున్న యువతులు, విద్యార్థినుల వ్యక్తిగత వివరాలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలను నేరగాళ్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. తమ చిత్రాలను అసభ్యంగా మార్చి ఫేస్బుక్లో ఉంచుతున్నారని సైబర్ క్రై మ్ పోలీస్ ఠాణాకు వస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బ్లాక్‌మెయిలింగ్, డబ్బులు డిమాండ్... యువతులు, విద్యార్థినులు ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను అప్లోడ్ చేస్తుండటం కూడా తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఈ ఫొటోలను డౌన్లోడ్ చేస్తున్న నిందితులు ఫేస్బుక్ ద్వారా వారితోనే చాట్చేస్తూ ప్రేమ పేరుతో వల వేస్తున్నారు. దారిలోకి రాకుంటే వారి వ్యక్తిగత ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. గతంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్న బీటెక్ విద్యార్థి మాజీద్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులతో ఫేస్బుక్లో అమ్మాయిగా పరిచయం పెంచుకొని వ్యక్తిగత వివరాలు సేకరించి వేధింపులకు గురిచేశాడు. కొందరి నుంచి డబ్బులు డిమాండ్ చేసి తన ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. చివరకు ఓ విద్యార్థి ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో అతడి ఆగడాలకు అడ్డుకట్ట పడింది. ఎవరైనా వేధింపులు తీవ్రమైనప్పుడు మాత్రమే తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న సైబర్ నేరగా>ళ్లు బ్లాక్మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బు తీసుకునేందుకు ఫేస్‌బుక్‌ను వేదికగా వాడుకుంటున్నారు. సగానికిపైగా ఇవే... గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 1,200కు పైగా కేసులు నమోదు కాగా, ఇందులో 600కుపైగా కేసులు సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిల వేధింపులకు సంబంధించినవే. సెక్షన్ 292, 201, 354 (ఈ), 507 ఐపీసీ, సెక్షన్ 66 (సీ), 66 (ఈ ),67, 67 (ఏ) ఐటీ యాక్ట్ కింద నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వ్యక్తిగత చిత్రాలు..వీడియోలొద్దు ఫేస్బుక్లో నిక్షిప్తం చేసిన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేస్తున్న నేరగాళ్ల సంఖ్య పెరుగుతోంది. అమ్మాయిలు ఫేస్బుక్లో తెలియని వారి నుంచి వచ్చిన ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌లను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయవద్దు. అమ్మాయే కదా అని స్పందిస్తే ఆ తర్వాత వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడంతో పాటు ఫొటోలను సేకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కొందరు శారీరకంగా లొంగదీసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. మరికొందరు డబ్బుల కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలు అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. –మహేష్ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్ -
facebook tips
ఫేస్బుక్.. ప్రస్తుతం స్కూల్ విద్యార్థుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్న సామాజిక మాధ్యమం. ఇక యువతీ, యువకుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఒక్క పోస్టింగ్ లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో ఎంతో మంది స్నేహితులను సంపాదించుకోవచ్చు. అలాగే వివాదస్పద అంశాలను పోస్ట్ చేసినా, కామెంట్ చేసినా కష్టాలూ తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో ఫేస్‌బుక్‌ను సురక్షితంగా వినియోగించుకోవడానికి సూచనలు.. ♦ మొబైల్ నంబర్, అడ్రస్, ఈ–మెయిల్ ఐడీకి సంబంధించిన వివరాలను ఫేస్బుక్ ప్రొఫైల్‌లో పెట్టకూడదు. ♦ సాధ్యమైనంత వరకు "keep me logged in' ఆప్షన్‌పై క్లిక్ చేయకపోవడం ఉత్తమం. ఈ చర్య అన్ని సందర్భాల్లో మంచిది కాదు. ♦ ఇతరుల లేదా పబ్లిక్ కంప్యూటర్ నుంచి వీలైనంత వరకు లాగిన్ కాకపోవడం మంచిది. ♦ పరిచయం లేని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయకూడదు. ♦ ఇతరులతో చాట్ చేస్తున్నప్పుడు చాట్ బాక్స్‌లో వ్యక్తిగత వివరాలను పోస్ట్ చేయకూడదు. ♦ మీ ప్రయాణ, ఉద్యోగ, కుటుంబ, వ్యక్తిగత వివరాలను ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేయకపోవడం మంచిది. ♦ పటిష్ట పాస్వర్డ్.. అంటే ఎంపిక చేసుకునే పాస్‌వర్డ్‌లో అక్షరాలు, విరామ చిహ్నాలు ఉండే విధంగా చూసుకోవాలి. ♦ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఫేస్బుక్ అకౌంట్‌ను లాగ్ అవుట్ చేయడం మరవద్దు. ♦ ఫేస్బుక్ అకౌంట్ వినియోగిస్తున్న పర్సనల్ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ♦ మీరు పంపే పోస్టులు ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే చేరే విధంగా ‘ప్రైవసీ సెట్టింగ్స్’లో మార్పులు చేసుకోవాలి. ♦ వివాదాస్పద, అనవసర పోస్ట్‌లను ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేయడం మంచిది కాదు. ♦ ఫేస్బుక్ అకౌంట్‌కి సెక్యూరిటీ చాలా అవసరం. సెక్యూరిటీ సరిగా లేకుంటే ఇతరులు మీ ఫేస్బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి అసభ్య సందేశాలు, చిత్రాలు పోస్ట్ చేసే ప్రమాదం ఉంది. ♦ నకిలీ అకౌంట్లతో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అలాగే మీరు పోస్ట్ చేసిన అంశానికి లైక్‌లు రాలేదని బెంగ వద్దు. ♦ నచ్చిన వీడియోలను సేవ్ చేసుకోవడం కోసం ఆ వీడియోపై రైట్ క్లిక్ చేసి సేవ్ వీడియో ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే.. ఖాళీ సమయంలో ఆ వీడియోను చూడొచ్చు. ♦ క్రోమ్ బ్రౌజర్ నుంచి డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లోకి వెళ్లడం ద్వారా బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు. అలాకాకుండా ప్లేస్టోర్ నుంచి ఫేస్బుక్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకుంటే విరామం లేకుండా ఆన్‌లో ఉండటం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది. ♦ చాటింగ్ వద్దనుకుంటే డిజేబుల్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ♦ మెసేజ్‌లు, నోటిఫికేషన్స్‌ను మ్యూట్ చేయాలనుకుంటే facebook app > messagesలోకి వెళ్లి మ్యూట్ చేయదలచిన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. తర్వాత మెనూ పైన కనిపించే ఐకాన్‌ను క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు ఓపెన్ అవుతాయి. వాటిలో మ్యూట్ నోటిఫికేషన్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ♦ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుంచి ఫ్రెండ్స్‌కి మెసేజ్ పంపిన ప్రతిసారి లొకేషన్ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఈ లొకేషన్‌ను "Turn off"‘ చేయాలంటే ముందుగా ఫేస్బుక్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. మెసెంజర్ లొకేషన్ ఆప్షన్‌ను అన్‌టిక్ చేయడం ద్వారా మెసేజ్ లొకేషన్ టర్న్ ఆఫ్ అవుతుంది. ♦ ఫేస్బుక్ యాప్‌లో గ్రూప్ మెసేజ్‌లు క్రియేట్ చేయాలంటే.. ముందుగా మెసేజ్ ఐకాన్‌పై క్లిక్ చేసి గ్రూప్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కావాల్సిన వ్యక్తులను గ్రూప్‌లోకి యాడ్ చేసుకుని మెసేజ్ టైప్‌చేసి సెండ్ చేయాలి. ♦ ఫేస్బుక్లో ఏదైనా కామెంట్‌ను కాపీ చేయాలంటే ఆ కామెంట్‌పై కొద్ది సేపు టాప్ చేసి ఉంచితే మెనూ ఓపెన్ అవుతుంది. మెనూలోని "copy comment'’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే ఆ కామెంట్ కాపీ అవుతుంది. ♦ ఫేస్బుక్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలనుకుంటే మీ ఫేస్బుక్ అకౌంట్లోకి లాగినై ఆ తర్వాత వేరొక ట్యాబ్‌లో www.facebook.com/help/delete_ account సాయంతో దరఖాస్తు చేసుకుంటే 14 రోజుల తర్వాత అకౌంట్ పూర్తిగా డిలీట్ అవుతుంది. -
ఫేస్బుక్ ... మత్తెక్కించి దోచేస్తాడు
పంజగుట్ట: ఫేస్బుక్ ద్వారా స్నేహం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన 10 తులాల బంగారు నగలు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పంజగుట్ట ఠాణాలో పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వర రావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... మెహిదీపట్నం హుడా కాలనీకి చెందిన రియాజ్ అహ్మద్ అలియాస్ మహ్మద్ యాహ ఉల్ హసన్ అలియాస్ అకిత్ (32) ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నాడు. ఇతను ఫేస్బుక్లో కొద్దిగా అమాయకంగా కనిపిస్తున్న వారి ఫొటోలు ఎంపిక చేసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. వారు యాక్సెప్ట్ చేయగానే వారి ఫొటోలకు మంచి కామెంట్లు, లైక్‌లు కొట్టడంతో పాటు ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ ఫోన్ నెంబర్లు తీసుకుంటాడు. ఫోన్లు చేసి పరిచయం మరింత పెంచుకుం టాడు. తర్వాత ఒక్కసారి పర్సనల్‌గా కలిసి మాట్లాడుకుందామని పిలుస్తాడు. మాటల్లో పెట్టి వారితో మత్తు పదార్థాలు కలిపిన మంచినీళ్లు, కూల్‌డ్రింక్స్ తాగిస్తా డు. మత్తు వచ్చి పడిపోగానే వారి వద్ద ఉన్న బంగారు నగలు, పర్సులు, ఫోన్, ల్యాప్‌టాప్ తీసుకొని ఉడాయిస్తాడు. ఈ విధంగా నగరంలోని పంజగుట్ట, గచ్చిబౌలి, జవహర్‌నగర్, నేరేడ్మెట్ ఠాణాల పరిధిలో మొత్తం నలుగురిని దోచుకున్నాడు. ఈ ఘటనలపై ఆయా ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. కాగా, చోరీ సొత్తును నిందితుడు సోమవారం విక్రయిస్తుండగా పంజగుట్ట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.ఫేస్బుక్లో అపరిచితులు ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే దాన్ని యాక్సెప్ట్ చేయరాదని, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ మోహన్‌కుమార్, క్రైమ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు. -
సినీనటుడు ఆదిత్య సందడి
విజయనగరం టౌన్ : పట్టణంలో ఫ్రెండ్ రిక్వెస్ట్ చిత్రం హీరో ఆదిత్యతో పాటు సినిమా టీమ్ సందడి చేసింది. ప్రమోషన్ వర్క్‌లో భాగంగా పట్టణమంతా కలియతిరిగింది. ఈ సందర్భంగా స్థానిక మహారాజా కళాశాలలో విద్యార్థులతో హీరో ఆదిత్య మమేకమయ్యారు. గతంలో తాను లాహిరి..లాహిరి..లాహిరి చిత్రంలో సైడ్ హీరోగా వేసి ప్రస్తుతం ఫ్రెండ్ రిక్వెస్ట్ చిత్రంలో హీరోగా నటిస్తున్నానని తెలిపారు. హీరోను చూసేందుకు కళాశాలల విద్యార్థులు ఉత్సాహాన్ని చూపారు. పట్టణానికి చెందిన మున్నా మైఖేల్ డ్యాన్స్ అకాడమీ నిర్వహకుడు మున్నా, విశాఖకు చెందిన వెన్నెల ఈవెంట్స్ నిర్వాహకులు, ఫ్రెండ్ రిక్వెస్ట్ చిత్రం టీమ్ తదితరులు పలు ప్రాంతాల్లో పర్యటించారు. -
హీరో నిరాహార దీక్ష
లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన ఆదిత్య ఓం దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా 'ఫ్రెండ్ రిక్వెస్ట్'. ఈ శుక్రవారం విడుదల అయిన ఈ సినిమాకు అవసరం మేర థియేటర్లు కేటాయించనందుకు నిరసనగా ఆదిత్య ఓం, సహ నిర్మాత విజయ్ వర్మ చిత్రబృందంతో నిన్న ఫిలిం చాంబర్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 150 థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేశామన్నారు. అయితే నైజాంలో బిందు పిక్చర్స్ శ్రీనివాస్ 30 థియేటర్లలో రిలీజ్ చేస్తామని చెప్పి కేవలం ఒక్క థియేటర్లో.. అది కూడా రెండు షోస్ మాత్రమే వేస్తామని చివరి నిమిషంలో చెప్పారన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అమలు చేస్తున్నట్టుగా ప్రాంతీయ చిత్రాలకు థియేటర్ల కేటాయింపు పద్దతిని ఇక్కడ కూడా అమలు చేసేవరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. వీరికి భారత్ ఏక్తా ఆందోళన్ నేషనల్ కన్వీనర్ మల్లు రమేష్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కె సురేష్ బాబు, మోహన్ గౌడ్లు మద్దతు పలికారు. ఫిలిం చాంబర్ ఈసీ మెంబర్ అశోక్ కుమార్, జనరల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
సోషల్ మీడియాకు బానిసలైతే...
‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘ధనలక్ష్మి ఐలవ్ యూ, ‘మీ ఇంటికొస్తే ఏమిస్తారు.. మా ఇంటి కొస్తే ఏం తెస్తారు’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు ఆదిత్య ఓం. తొలిసారి ఆయన దర్శకునిగా మారి, తెరకెక్కించిన చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. మోడరన్ సినిమాపై విజయవర్మ పాకలపాటి నిర్మాణ నిర్వహణలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెలాఖరులో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుంది. యూత్‌ఫుల్ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. దర్శకునిగా నాకు మంచి పేరు తెస్తుంది’’ అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాణ నిర్వాహకుడు, సహ నిర్మాత విజయవర్మ మాట్లాడుతూ -‘‘నేటి యువత సోషల్ మీడియాకు ఎలా బానిసలవుతున్నారు? దాని వల్ల ఎటువంటి అనర్థాలు ఏర్పడుతున్నాయి? అనే పాయింట్‌తో ఈ చిత్రం నిర్మించాం’’ అని తెలిపారు. ఆదిత్య ఓం ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం: లవన్ వీరన్, కెమెరా: సిద్ధార్థ్. -
స్నేహితుడి రిక్వెస్ట్
లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంలో చలాకీగా నటించిన ఆదిత్యా ఓం తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తున్నాడు. అతనిప్పుడు దర్శక, నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ఆదిత్యా ఓం స్వీయదర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆదిత్యా ఓం మాట్లాడుతూ -‘‘సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ నెలాఖరులోగా అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. త్వరలోనే పాటలను, నవంబరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కథ మీద నమ్మకంతో ఈ సినిమా చేశామని, అవసరమైతే సొంతంగా అయినా విడుదల చేస్తామని మరో నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి చెప్పారు. చెరుపల్లిని దత్తత తీసుకున్న ఆదిత్య సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటితో కలిసి ఆదిత్యా ఓం ‘ఎడ్యులైట్‌మెంట్’ అనే స్వచ్చంద సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రాచలం దగ్గర్లోని చెరుపల్లి గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. తమ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా విద్యా వ్యవస్థలో మార్పుల కోసం గత నెల సెప్టెంబరు 3న న్యూఢిల్లీలో, అక్టోబరు 2న ముంబైలో నిరాహార దీక్ష చేశామని ఆదిత్యా ఓం తెలిపారు. -
జీవితాన్ని మార్చే రిక్వెస్ట్
ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ కొంత మంది జీవితాలను తలకిందులు చేసి, భయానక పరిస్థితులను సృష్టిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. విజయ్‌వర్మ పాకలపాటి నిర్మాణ నిర్వహణలో ఆదిత్యా ఓం హీరోగా నటిస్తూ, తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్, సుదర్శన్, మనీషా కేల్కర్, రిచాసోనీ ముఖ్యతారలు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది. ఇప్పుడొస్తున్న హార ర్ చిత్రాలకు విభిన్నంగా ఉంటుంది. సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: లవన్, వీరల్. -
ఫేస్'బుక్' కావొద్దు
ఒక పోస్టింగ్.. ఒక రిక్వెస్ట్ ద్వారా స్నేహితులను సంపాదించుకోవచ్చు. దానిపై పెట్టిన అనవసర కామెంట్ అనర్థాలను తెచ్చిపెట్టవచ్చు. అవును మరి.. ఫేస్‌బుక్‌తో ఉన్న ముప్పు ఇది. ఒక ఫేస్బుక్ అకౌంట్ మనిషి తలరాతను నిమిషాల్లో మార్చేగల శక్తి దానికి ఉంది. ప్రస్తుతం ట్రెండీగా కొనసాగుతున్న ఈ సామాజిక సంబంధాలవేదికతో జాగ్రత్తగా ఉండాల్సిందే..! ఫేస్బుక్.. ఇప్పుడు స్కూల్ పిల్లాడి నుంచి తాతయ్య దాకా అందరూ వినియోగిస్తున్న సామాజిక వెబ్సైట్. చాలామంది యువతీ యువకులైతే ఇందులో ఏదైనా పోస్ట్ చేయకపోతే నిద్ర కూడా పట్టదు.. ఫ్రెండ్స్ నుంచి వచ్చే పోస్టింగ్‌లకు లైక్ కొట్టనిదే పొద్దు పోదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వివిధ అంశాలపై పలు దేశాలను సైతం ప్రభావితం చేసిన శక్తిమంతమైన సామాజిక నెట్వర్కింగ్ సైట్‌గా పేరు తెచ్చుకుంది ఫేస్బుక్. దీంతో లాభాలే కాదు.. నష్టాలూ అదే స్థాయిలో ఉన్నారుు. సామాజిక మాధ్యమాలతో కలిగే నష్టాలు ఏంటి.. వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి అంశాలపై ప్రత్యేక కథనం. ⇒ అపరిచిత వ్యక్తుల స్నేహం అసలే వద్దు ⇒ అనవసర కామెంట్లకు దూరంగా ఉండడమే మేలు ⇒ పర్సనల్ డేటా.. ఫొటోలు అప్లోడ్ చేయొద్దు ⇒ లేదంటే లైఫ్ రిస్క్‌లో పడడం ఖాయం బినామీ అకౌంట్లతో బీకేర్‌ఫుల్ కొందరు బినామీ పేర్లతో ఫేస్బుక్ అకౌంట్లు తెరుస్తున్నారు. వీటిలో అమ్మాయిల పేర్లు, ఫొటోలతో అకౌంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రిక్వెస్ట్‌లతో ఫ్రిండ్‌షిప్ పెంచుకుని వారితో చాటింగ్ చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫ్రెండ్స్‌కు షేర్ చేయడం వంటి చర్యలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటివన్నీ బినామీ అకౌంట్ల నుంచే పంపుతున్నారు. వీటి వల్ల వచ్చే సమస్యలతో అమాయకులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటువంటి సంఘట నలు వెలుగులోకి వచ్చి కేసుల వరకూ వెళితే గానీ బినామీల సంగతి బయటకు రావడం లేదు. పోలీస్ దర్యాప్తుల్లో నేరాలకు పాల్పడ్డవారిని గుర్తించి ఫేస్బుక్అకౌంట్ గురించి ఆరా తీసినా చాలా సందర్భాల్లో ఫలితం దక్కడం లేదు. ఆ నోట.. ఈ నోట.. ఫేస్బుక్ మాట ఫేస్బుక్.. ఈ మధ్యకాలంలో యువత నోట్లో బాగా నానుతున్న మాట. స్నేహితులను ఆన్లైన్లో కలుసుకోవడంతోపాటు ఏ సందర్భమైనా అందరితో పంచుకునేందుకు, శుభాకాంక్షలు తెలుపుకునేందుకు వీలుగా దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. విద్య, సినిమాలు, రాజకీయాలు, సరదా కబుర్లు, జన్మదిన, వివాహశుభాకాంక్షలు, విషాద సంఘటనలు సందర్భం ఏదైనా ఫేస్బుక్లో ఇట్టే ప్రత్యక్షమవ్వాల్సిందే. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటూ విస్తరించినసోషల్ నెట్‌వర్క్‌గా ఫేస్బుక్ ప్రాచుర్యం పొందింది. యువత రోజువారీ కార్యకలాపాల్లో ఫేస్బుక్ ఒక భాగమైపోయింది. ఫేస్బుక్లో లాగిన్ అయి ఏదో ఒకటిపోస్టు చేస్తేనే కాస్తంత సరదా... ఓ పనరుుపోరుుం దనే ఫీలింగ్ చాలామంది యువతది. తల్లిదండ్రులు దృష్టి సారించాలి సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తే అదోవిజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైంపాస్‌కు వాడుకుంటే పలు అనర్థాలకు దారి తీస్తుందని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ దిశగా పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లతో ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి. లేదంటే పిల్లలు ఈ వ్యసనానికి బానిసలయ్యే అవకాశం ఉంది. లైక్‌లు లేవని బెంగ వద్దు ఫేస్బుక్ అంటేనే ఫేక్‌బుక్ వంటిది. అలాంటిది తాము ఎన్నిసార్లు పోస్టుచేసినా ఎవరూ లైక్ కొట్టడం లేదని అసలే కుంగిపోవద్దు. ఎన్ని ఎక్కువ లైక్‌లు వస్తే అంత పాపులర్ అరుు నట్లు.. తక్కువగా వస్తే పట్టించుకోవడం లేదని అసలే ఆలోచించొద్దు. లేదా తమను ఫ్రెండ్ జాబితా నుంచి తొలగించారని మదనపడడంలాంటివి చేయొద్దు. ఎన్నోరకాల సామాజిక వెబ్సైట్ల మాదిరిగానే దీన్ని పరిగణించాలి. ఏ మేరకు వినియోగించాలి.. ♦ స్నేహితులతో టచ్‌లో ఉండడం.. కొత్త స్నేహాలను సంపాదించుకోవడం. ప్రపంచసమాచార వేదికపై అప్డేట్గా ఉండడం. ♦ ప్రపంచంలోని కొత్త, మంచి విషయూలనునేర్చుకోవడం. ♦ ఏ ఫొటో, కామెంట్ పోస్టింగ్ చేసినా తమ ఇమేజ్ను పెంచేలా.. నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. ♦ ఉద్యోగ, వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. ♦ ఫొటోలు, కామెంట్స్ పోస్టింగ్ విషయంలోగందరగోళం ఉండరాదు. నోటి నుంచి జారిన మాట.. ఫేస్బుక్లో ఎంటర్ చేసిన కామెంట్ ఒకటేనని గుర్తుంచుకోవాలి. ♦ ఫేస్‌బుక్‌లోకి వెళ్లగానే పెద్దసంఖ్యలో ఫొటోలు, కామెంట్లు పెట్టడం వృథా. అంతగా చదివే ఓపిక ఎవరికీ ఉండదని గుర్తుంచుకోవాలి. ♦ ఫొటో అప్లోడ్ చేసే ముందే దాన్ని ఒకటికిరెండుసార్లు చూడండి.. కామెంట్లను చదవండి అంతేకానీ పోస్ట్ చేశాక తలలు పట్టుకుంటే చేసేదేమీ ఉండదు. ఇవి అసలే వద్దు ♦ అందరికీ తెలిసేలా ఫోన్ నంబర్లు, ఇంటి వివరాలు, చిరునామాలు, ఫొటోలు పెట్టొద్దు. ♦ తమ కార్యాలయం.. చేస్తున్న ఉద్యోగంపై రహస్య సమాచారాన్ని లీక్ చేయడం ఉండొద్దు. ♦ మందుకొట్టి బైక్ డ్రైవ్ చేశానని, మొన్న ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేశానని పోస్ట్‌చేసి అనవసర రిస్క్‌లు వద్దు. ♦ ఒకప్పటి ప్రేమలు, పెళ్లిళ్లపై వ్యాఖ్యలు వద్దు. ♦ స్నేహితుల పోస్ట్‌లు.. కామెంట్లపై తీవ్రంగా స్పందించడం.. సవాల్ విసరడం లాంటివి చేయొద్దు. ♦ స్నేహితుల ఫొటోలు వారి అనుమతి లేకుండా పోస్ట్ చేయడం మంచిది కాదు. ♦ మనసు బాగోలేనప్పుడు ఫేస్‌బుక్‌లోకి వెళ్లవద్దు. ♦ ఆఫీసు విషయూలు.. కుటుంబ సమస్యలు.. పర్సనల్‌ముచ్చట్లు వద్దు. ♦ వ్యంగమైన చిత్రాలు పెట్టడం.. ♦ మరొకరిని కించ పరిచేలా ఫొటోలు మార్ఫింగ్ చేయడం.. కామెంట్లు పెట్టడం చేయొద్దు. ♦ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తికి డబ్బులు లావాదేవీలు జరపడం.. వినోదాలకు పిలిస్తే వెళ్లడం లాంటివి అసలేవద్దు. ♦ రెచ్చగొట్టే.. అవమానపరిచే ఫొటోలకు లైక్‌లు కొట్టడంచిక్కుల్లో పడేందుకేనని గుర్తుంచుకోవాలి. అమ్మాయిలూ.. జర జాగ్రత్త ఫేస్బుక్ అనేది స్నేహానికి వారధి మాత్రమేనన్న విషయాన్ని మరిచిపోయి చాలా మంది దానికి బానిసలవుతున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా సెల్‌ఫోన్, కంప్యూటర్ముందు కూర్చుని పోస్టులు, లైక్‌లు, కామెంట్లు, షేర్లుతో కాలం గడిపేస్తున్నారు. ఫేస్బుక్ మాయలోపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అడ్డంగా బుక్ అవుతూ ఊచలు లెక్కిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్లో స్నేహం చేయడం వల్ల ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సెట్టింగ్స్ తప్పనిసరి... ఫేస్బుక్ నుంచి ప్రమాదంలోకి పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. అలాగే విలువైన వ్యక్తిగత సమాచారం ఫేస్బుక్లో పెట్టకపోవడం ఉత్తమం. మనం పోస్టు చేసే చిత్రాలు, కామెంట్స్‌ని మన సమీపం వారే చూసేలా సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. వచ్చిన ప్రతి ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’కు ఓకే చెప్పకూడదు. తెలిసిన వారా లేదాఅని ఆక్సెప్ట్ చేయడం మంచిది. అనవసర ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఓకే చేయడం సమస్యలకు స్వాగతం పలికినట్లేనని గుర్తుంచుకోవాలి. చాలావరకు ఫేస్బుక్ అకౌంట్లలో అసత్యాలే ఎక్కువగా ఉంటాయి. ఎవరో కావాలనే యువతుల పేర్లు.. ఫొటోలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు. అలాంటివారే రిక్వెస్ట్‌లు పంపిస్తుంటారు. వాటిబారిన పడి మోసపోవద్దు. -
విపరీత పరిణామాలు
‘లాహిరి లాహిరి లాహిరిలో’ఫేం ఆదిత్య ఓం నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘ఫన్ ఫ్రీక్డ్ ఫేస్బుక్’. ఈ చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. సాగరిక చెత్రి, జల్ చిత్ర, శీతల సింగ్, అంచిత్కౌర్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రధారులు. హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఆదిత్య ఓం మాట్లాడుతూ -‘‘సామాజిక మాధ్యమానికి యువతరం ఏ రీతిగా బానిసలవుతున్నారు? పర్యవసానంగా ఎలాంటి విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని చెప్పారు. 20 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌ని హైదరాబాద్, వైజాగుల్లో పూర్తి చేస్తామని నిర్మాణ నిర్వాహకులు పి.విజయ్‌వర్మ తెలిపారు. -
ఫ్రెండ్ రిక్వెస్ట్ మూవీ స్టిల్స్
-
ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో బుక్కయ్యాడు..
వాషింగ్టన్: దొంగతనం చేస్తే ఎవరైనా ఏం చేస్తారు.. కొద్దిరోజులు సెలైంట్‌గా ఉంటారు. తాను దొంగతనం చేసిన వ్యక్తికి.. ఆ ప్రాంతానికీ దూరంగా ఉంటారు. కానీ అమెరికాలో ఓ దొంగ అత్యుత్సాహం అతడిని కటకటాల పాలు చేసింది. దొంగతనం చేసిన తర్వాత సెలైంట్‌గా ఉండటం మానేసి.. దొంగతనం చేసిన వ్యక్తికే ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి అడ్డంగా బుక్కైపోయాడు. నమ్మశక్యం కానీ ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఓ బస్ టెర్మినల్‌లో ఓ యువతి వేచిచూస్తూ ఉండగా.. అక్కడికి రిలై ముల్లిన్స్ (28) అనే దొంగ ముసుగు వేసుకుని వచ్చాడు. యువతిని బెదిరించి పర్సు, ఐపాడ్ లాక్కుని పరారయ్యాడు. అయితే ఆ సమయంలో బాధితురాలు దొంగ ముఖాన్ని చూడలేకపోయినా.. అతని చేతిపై త్రికోణాకృతిలో ఉన్న పచ్చబొట్టును గుర్తించింది. ఇది జరిగిన కొద్ది రోజులకు ఆ యువతికి ఫేస్బుక్లో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తీరా చూస్తే ఆ రిక్వెస్ట్ వచ్చింది దొంగ ముల్లిన్స్ నుంచి. దొంగ చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఆ యువతి అతడిని గుర్తుపట్టేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముల్లిన్స్ కటకటాల పాలయ్యాడు. -
ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపి.. దొరికిపోయిన దొంగ!
మంచి రద్దీ ప్రదేశంలో ఓ దొంగ ఓ మహిళ పర్సు దొంగిలించాడు. దాన్ని తీసుకుని అతడు పారిపోతుంటే.. పూర్తిగా చూడకపోయినా అతడి చేతిమీదున్న టాటూను బాధితురాలు చూసింది. సరే ఏం చేస్తాం అనుకుని ఊరుకుంది. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా సదరు దొంగ.. ఆ బాధితురాలికి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అంతే, దొరికిపోయాడు!! ఈ సంఘటన అమెరికాలో జరిగింది. రిలీ ముల్లిన్స్ (28) అనే యువకుడు తన చేతిమీద త్రికోణాకారంలో టాటూ వేసుకున్నాడు. ఆమె పర్సు దొంగిలించిన తర్వాత, అందులో ఉన్న ఐడీ కార్డు మీద పేరు చూసి.. ఆ పేరును ఫేస్బుక్లో సెర్చ్ చేశాడు. దొరకడంతో వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె రోజూలాగే తన ఫేస్బుక్ చూసుకుంది. వచ్చిన రిక్వెస్ట్ చూసి, అతగాడి ఫొటో చూడగానే అనుమానం వచ్చింది. తీరా చూస్తే చేతిమీద త్రికోణాకారపు టాటూ కూడా ఉంది. వెంటనే అతడే తనమీద దాడిచేసి పర్సు దొంగిలించాడని గుర్తించి పోలీసులకు చెప్పడంతో.. వాళ్లు వచ్చి అతడికి అరదండాలు తగిలించి సమర్యాదగా తీసుకెళ్లారు.