
ఉత్తర డకోటా: ధూమపానం, మద్యపానం హానికరం అంటుంటారు. కానీ వీటిని మించిన అనర్థాలు సోషల్ మీడియా వల్ల పుట్టుకొస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ దీనికి బానిసలవుతూ ఎక్కువ కాలం ఆన్‌లైన్‌లోనే గడిపేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని ఉత్తర డకోటాకు చెందిన 29 ఏళ్ల కలేబ్ బర్క్‌జిక్.. తన మాజీ బాస్‌కు డిసెంబర్ 24న ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అతడు కావాలని చేశాడో, పనిలో పడి మర్చిపోయాడో తెలీదు కానీ ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయకుండా మిన్నకుండిపోయాడు. రెండు రోజులు గడిచినా ఇంకా ఎలాంటి స్పందన లేకపోవడం కలేబ్ సహించలేకపోయాడు. 'నా ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చెయ్, లేదంటే నిన్ను చంపడానికి కూడా వెనుకాడను' అంటూ బెదిరింపులకు దిగాడు. (చదవండి: అమెరికాలో నల్లజాతీయుల మరణానికి కారణం ఇదే!)
దీంతో ఆ మాజీ బాస్ కోపంతో ఈ సారి మాత్రం కావాలనే కలేబ్‌ను ఫ్రెండ్ లిస్టులో చేర్చుకోలేదు. ఇది అస్సలు సహించలేకపోయిన కలేబ్ అతడి చర్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆవేశంగా ఆయన ఇంటికి వెళ్లి ధడేలుమని తలుపు తన్ని మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతే కాదు, స్నాప్‌చాట్ వంటి ఇతర సోషల్ మీడియాల్లోనూ పలురకాలుగా వేధింపులకు గురి చేశాడు. దీంతో సహనం నశించిన బాస్ పోలీసులకు ఆశ్రయించాడు. వారు బర్క్‌జిక్‌ను అదుపులోకి తీసుకోగా అతడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 27న ఈ కేసు విచారణకు రానుంది. (చదవండి: ఈ ఫొటో తీస్తుంటే మొహమాటపడ్డారు..)
Comments
Please login to add a commentAdd a comment