ఫేస్‌'బుక్‌' కావొద్దు | careful while use facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌'బుక్‌' కావొద్దు

Published Sat, Jan 3 2015 1:00 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్‌'బుక్‌' కావొద్దు - Sakshi

ఫేస్‌'బుక్‌' కావొద్దు

ఒక పోస్టింగ్.. ఒక రిక్వెస్ట్ ద్వారా స్నేహితులను సంపాదించుకోవచ్చు. దానిపై పెట్టిన అనవసర కామెంట్ అనర్థాలను తెచ్చిపెట్టవచ్చు. అవును మరి.. ఫేస్‌బుక్‌తో ఉన్న ముప్పు ఇది. ఒక ఫేస్‌బుక్ అకౌంట్ మనిషి తలరాతను నిమిషాల్లో మార్చేగల శక్తి దానికి ఉంది. ప్రస్తుతం ట్రెండీగా కొనసాగుతున్న ఈ సామాజిక సంబంధాలవేదికతో జాగ్రత్తగా ఉండాల్సిందే..! ఫేస్‌బుక్.. ఇప్పుడు స్కూల్ పిల్లాడి నుంచి తాతయ్య దాకా అందరూ వినియోగిస్తున్న సామాజిక వెబ్‌సైట్.

చాలామంది యువతీ యువకులైతే ఇందులో ఏదైనా పోస్ట్ చేయకపోతే నిద్ర కూడా పట్టదు.. ఫ్రెండ్స్ నుంచి వచ్చే పోస్టింగ్‌లకు లైక్ కొట్టనిదే పొద్దు పోదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వివిధ అంశాలపై పలు దేశాలను సైతం ప్రభావితం చేసిన శక్తిమంతమైన సామాజిక నెట్‌వర్కింగ్ సైట్‌గా పేరు తెచ్చుకుంది ఫేస్‌బుక్. దీంతో లాభాలే కాదు.. నష్టాలూ అదే స్థాయిలో ఉన్నారుు. సామాజిక మాధ్యమాలతో కలిగే నష్టాలు ఏంటి.. వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి అంశాలపై ప్రత్యేక కథనం.   
 
 
అపరిచిత వ్యక్తుల స్నేహం అసలే వద్దు
అనవసర కామెంట్లకు దూరంగా ఉండడమే మేలు
పర్సనల్ డేటా.. ఫొటోలు అప్‌లోడ్ చేయొద్దు
లేదంటే లైఫ్ రిస్క్‌లో పడడం ఖాయం

 
బినామీ అకౌంట్లతో బీకేర్‌ఫుల్
కొందరు బినామీ పేర్లతో ఫేస్‌బుక్ అకౌంట్లు తెరుస్తున్నారు. వీటిలో అమ్మాయిల పేర్లు, ఫొటోలతో అకౌంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రిక్వెస్ట్‌లతో ఫ్రిండ్‌షిప్ పెంచుకుని వారితో చాటింగ్ చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫ్రెండ్స్‌కు షేర్ చేయడం వంటి చర్యలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు.

ఇలాంటివన్నీ బినామీ అకౌంట్ల నుంచే పంపుతున్నారు. వీటి వల్ల వచ్చే సమస్యలతో అమాయకులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటువంటి సంఘట నలు వెలుగులోకి వచ్చి కేసుల వరకూ వెళితే గానీ బినామీల సంగతి బయటకు రావడం లేదు. పోలీస్ దర్యాప్తుల్లో నేరాలకు పాల్పడ్డవారిని గుర్తించి ఫేస్‌బుక్‌అకౌంట్ గురించి ఆరా తీసినా చాలా సందర్భాల్లో ఫలితం దక్కడం లేదు.
 
ఆ నోట.. ఈ నోట.. ఫేస్‌బుక్ మాట
ఫేస్‌బుక్.. ఈ మధ్యకాలంలో యువత నోట్లో బాగా నానుతున్న మాట. స్నేహితులను ఆన్‌లైన్‌లో కలుసుకోవడంతోపాటు ఏ సందర్భమైనా అందరితో పంచుకునేందుకు, శుభాకాంక్షలు తెలుపుకునేందుకు వీలుగా దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. విద్య, సినిమాలు, రాజకీయాలు, సరదా కబుర్లు, జన్మదిన, వివాహశుభాకాంక్షలు, విషాద సంఘటనలు సందర్భం ఏదైనా ఫేస్‌బుక్‌లో ఇట్టే ప్రత్యక్షమవ్వాల్సిందే. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటూ విస్తరించినసోషల్ నెట్‌వర్క్‌గా ఫేస్‌బుక్ ప్రాచుర్యం పొందింది. యువత రోజువారీ కార్యకలాపాల్లో ఫేస్‌బుక్ ఒక భాగమైపోయింది. ఫేస్‌బుక్‌లో లాగిన్ అయి ఏదో ఒకటిపోస్టు చేస్తేనే కాస్తంత సరదా... ఓ పనరుుపోరుుం దనే ఫీలింగ్ చాలామంది యువతది.
 
తల్లిదండ్రులు దృష్టి సారించాలి
సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తే అదోవిజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైంపాస్‌కు వాడుకుంటే పలు అనర్థాలకు దారి తీస్తుందని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ దిశగా పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లతో ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి. లేదంటే పిల్లలు ఈ వ్యసనానికి బానిసలయ్యే అవకాశం ఉంది.
 
లైక్‌లు లేవని బెంగ వద్దు
ఫేస్‌బుక్ అంటేనే ఫేక్‌బుక్ వంటిది. అలాంటిది తాము ఎన్నిసార్లు పోస్టుచేసినా ఎవరూ లైక్ కొట్టడం లేదని అసలే కుంగిపోవద్దు. ఎన్ని ఎక్కువ లైక్‌లు వస్తే అంత పాపులర్ అరుు నట్లు.. తక్కువగా వస్తే పట్టించుకోవడం లేదని అసలే ఆలోచించొద్దు. లేదా తమను ఫ్రెండ్ జాబితా నుంచి తొలగించారని మదనపడడంలాంటివి చేయొద్దు. ఎన్నోరకాల సామాజిక వెబ్‌సైట్ల మాదిరిగానే దీన్ని పరిగణించాలి.  
 
ఏ మేరకు వినియోగించాలి..

స్నేహితులతో టచ్‌లో ఉండడం.. కొత్త స్నేహాలను సంపాదించుకోవడం. ప్రపంచసమాచార వేదికపై అప్‌డేట్‌గా ఉండడం.
ప్రపంచంలోని కొత్త, మంచి విషయూలనునేర్చుకోవడం.
ఏ ఫొటో, కామెంట్ పోస్టింగ్ చేసినా తమ ఇమేజ్‌ను పెంచేలా.. నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి.
ఉద్యోగ, వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు.
ఫొటోలు, కామెంట్స్ పోస్టింగ్ విషయంలోగందరగోళం ఉండరాదు. నోటి నుంచి జారిన మాట.. ఫేస్‌బుక్‌లో ఎంటర్ చేసిన కామెంట్ ఒకటేనని గుర్తుంచుకోవాలి.
ఫేస్‌బుక్‌లోకి వెళ్లగానే పెద్దసంఖ్యలో ఫొటోలు, కామెంట్లు పెట్టడం వృథా. అంతగా చదివే ఓపిక ఎవరికీ ఉండదని గుర్తుంచుకోవాలి.
ఫొటో అప్‌లోడ్ చేసే ముందే దాన్ని ఒకటికిరెండుసార్లు చూడండి.. కామెంట్లను చదవండి అంతేకానీ  పోస్ట్ చేశాక తలలు పట్టుకుంటే చేసేదేమీ ఉండదు.
 
ఇవి అసలే వద్దు

అందరికీ తెలిసేలా ఫోన్ నంబర్లు, ఇంటి వివరాలు, చిరునామాలు, ఫొటోలు పెట్టొద్దు.
తమ కార్యాలయం.. చేస్తున్న ఉద్యోగంపై రహస్య సమాచారాన్ని లీక్ చేయడం ఉండొద్దు.
మందుకొట్టి బైక్ డ్రైవ్ చేశానని, మొన్న ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేశానని పోస్ట్‌చేసి అనవసర రిస్క్‌లు వద్దు.
ఒకప్పటి ప్రేమలు, పెళ్లిళ్లపై వ్యాఖ్యలు వద్దు.
స్నేహితుల పోస్ట్‌లు.. కామెంట్లపై తీవ్రంగా స్పందించడం.. సవాల్ విసరడం లాంటివి చేయొద్దు.
స్నేహితుల ఫొటోలు వారి అనుమతి లేకుండా పోస్ట్ చేయడం మంచిది కాదు.
మనసు బాగోలేనప్పుడు ఫేస్‌బుక్‌లోకి వెళ్లవద్దు.
ఆఫీసు విషయూలు.. కుటుంబ సమస్యలు.. పర్సనల్‌ముచ్చట్లు వద్దు.
వ్యంగమైన చిత్రాలు పెట్టడం..
మరొకరిని కించ పరిచేలా ఫొటోలు మార్ఫింగ్ చేయడం.. కామెంట్లు పెట్టడం చేయొద్దు.
ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తికి డబ్బులు లావాదేవీలు జరపడం.. వినోదాలకు పిలిస్తే వెళ్లడం లాంటివి అసలేవద్దు.
   రెచ్చగొట్టే.. అవమానపరిచే ఫొటోలకు లైక్‌లు కొట్టడంచిక్కుల్లో పడేందుకేనని గుర్తుంచుకోవాలి.
 
అమ్మాయిలూ.. జర జాగ్రత్త

ఫేస్‌బుక్ అనేది స్నేహానికి వారధి మాత్రమేనన్న విషయాన్ని మరిచిపోయి చాలా మంది దానికి బానిసలవుతున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా సెల్‌ఫోన్, కంప్యూటర్‌ముందు కూర్చుని పోస్టులు, లైక్‌లు, కామెంట్లు, షేర్లుతో కాలం గడిపేస్తున్నారు. ఫేస్‌బుక్ మాయలోపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అడ్డంగా బుక్ అవుతూ ఊచలు లెక్కిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌లో స్నేహం చేయడం వల్ల ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
 
సెట్టింగ్స్ తప్పనిసరి...

ఫేస్‌బుక్ నుంచి ప్రమాదంలోకి పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. అలాగే విలువైన వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్‌లో పెట్టకపోవడం ఉత్తమం. మనం పోస్టు చేసే చిత్రాలు, కామెంట్స్‌ని మన సమీపం వారే చూసేలా సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. వచ్చిన ప్రతి ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’కు ఓకే చెప్పకూడదు.

తెలిసిన వారా లేదాఅని ఆక్సెప్ట్ చేయడం మంచిది. అనవసర ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఓకే చేయడం సమస్యలకు స్వాగతం పలికినట్లేనని గుర్తుంచుకోవాలి. చాలావరకు ఫేస్‌బుక్ అకౌంట్లలో అసత్యాలే ఎక్కువగా ఉంటాయి. ఎవరో కావాలనే యువతుల పేర్లు.. ఫొటోలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు. అలాంటివారే రిక్వెస్ట్‌లు పంపిస్తుంటారు. వాటిబారిన పడి మోసపోవద్దు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement