ఫేస్‌బుక్‌పై రూ. 725 కోట్లకు దావా | US woman to 725 crores of Compensation claim on facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌పై రూ. 725 కోట్లకు దావా

Published Fri, Aug 1 2014 6:17 PM | Last Updated on Fri, Aug 24 2018 5:25 PM

ఫేస్‌బుక్‌పై రూ. 725 కోట్లకు దావా - Sakshi

ఫేస్‌బుక్‌పై రూ. 725 కోట్లకు దావా

న్యూయార్క్: సామాజిక వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’పై ఒక అమెరికా మహిళ ఏకంగా రూ. 725 కోట్ల నష్టపరిహారం దావా వేసింది. అక్కడి టెక్సాస్‌కు చెందిన మరియం అలీ అనే మహిళ, ఇల్లినాయిస్‌కు చెందిన అదీల్‌షా ఖాన్ స్నేహితులు.. ఐదేళ్ల కింద ఏవో విభేదాలతో ఇద్దరూ విడిపోయారు.

దీంతో ఆగ్రహించిన అదీల్‌షా... మరియం అలీ పేరిట ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి, ఆమెకు సంబంధించిన నకిలీ అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేశాడు. ఆ చిత్రాలను తొలగించాలని మరియం విజ్ఞప్తి చేసుకున్నా... ఫేస్‌బుక్ సంస్థ తొలగించలేదు. దీంతో తన విజ్ఞప్తిపై ఫేస్‌బుక్ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందంటూ మరియం.. ఈ దావా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement