social website
-
భర్త శవం పక్కన భార్యా పిల్లలు నవ్వుతూ...
న్యూయార్క్: భర్త అర్ధాంతరంగా కన్నుమూశారన్న బాధ ఎవా హాలండ్ ముఖంలో ఇసుమంతా కూడా కనిపించడం లేదు. ముద్దొచ్చే ఇద్దరు పిల్లల్లో ముఖాల్లో కూడా చిరునవ్వే కనిపిస్తోంది. కేవలం 26వ ఏటనే మరణించిన భర్త శవ పేటిక పక్కన పిల్లలతో నిలబడి ఫొటో దిగింది. పైగా దాన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సోషల్ వెబ్సైట్లలో పోస్ట్ చేసింది. భర్త పోయాడని ఏడ్వకపోయినా కనీసం ఒక్క కన్నీటి చుక్కైన కార్చని ఈమె లాంటి కాఠిన్య భార్యలు కూడా ఉంటారా ఈ లోకంలో? అని తొందరపడి ఈసడించుకుంటాం. తాత, తండ్రి శవాల పక్కన ఫొటోలు దిగి సోషల్ వెబ్సైట్లలో పోస్ట్ చేస్తున్న వేలం వెర్రిగాళ్ల సరసన దయచేసి ఆమెను చేర్చవద్దు. 11 ఏళ్ల అనుబంధానికి చరమగీతం పాడి అర్ధాంతరంగా ఈలోకం వీడి వెళ్లిపోయిన భర్త మైక్ సెటిల్స్ పట్ల ఆమెకు అపార ప్రేమ. పిల్లలంటే కూడా భర్త మైక్‌కు ఎనలేని ప్రేమ. గుండె లోతుల్లో నుంచి ఉబికి వస్తున్న దు:ఖాన్ని దిగమింగి చిద్విలాసంగా నవ్వుతూ ఫొటోకు ఫోజ్ ఇచ్చిందంటే గుండె ఎంత దిటువు చేసుకుని ఉండాలి! తండ్రి పోయాడనే దు:ఖాన్ని పన్ల బిగువున దాచేసి తల్లి లాగే ఆ పిల్లలు కూడా నవ్వుతున్నారంటే వారికి ఆ తల్లి ఎవా హాలండ్ ఎంత నచ్చ చెప్పి ఉండాలి! మరి ఎందుకు అలా హాలండ్ ఫొటో దిగిందంటే సోషల్ వెబ్సైట్లలో మనల్ని ఆకర్శించడానికే. తన భర్త మైక్ డ్రగ్స్‌కు అలవాటు పడి మరణించాడని, అలాగే ఎవరూ కూడా తన భర్తలాగా డ్రగ్స్‌కు అలవాటుపడి చేచేతులా జీవితాన్ని పాడు చేసుకోవద్దనే ఈ సమాజానికి సందేశం ఇవ్వడానికే ఆమె అలా చేశారట. ఈ మేరకు ఆమె ఫేస్బుక్లో సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం..... ‘ఈ ఫొటో చూసిన వెంటనే మీకు ఇబ్బంది కలగవచ్చు. అసహ్యం కూడా వేయవచ్చు. ఇక్కడ ఫొటో పోస్ట్ చేయడం వెనకు నా ఉద్దేశం వేరు. మేము అమెరికాలోని ఒహాయో నగరంలో ఉంటున్నాం. మైక్, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అన్యోన్యంగా కాపురం చేశాం. ఎవాండేల్లోని జనరల్ ఎలక్ట్రిక్ ఏవియేషన్‌లో మైక్ పనిచేసేవాడు. పని ఒత్తిడంటూ నిద్ర మాత్రలు వేసుకునే వాడు. ఆ తర్వాతం మెల్లగా మైక్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. నచ్చచెప్పినా వినలేదు. చివరకు గతేడాది ‘డీ అడిక్షన్’ సెంటర్లో చేరాడు. కోలుకున్నాక తిరిగొచ్చాడు. ఫేస్బుక్లో తాను ఎలా డ్రగ్స్‌కు అలవాటు పడిందీ, ఎలా దాని నుంచి బయటపడిందీ చెప్పుకుంటూ వచ్చాడు. ఓసారి పన్ను నొప్పి తట్టుకోలేక మళ్లీ ఒక్క టాబ్లెట్ అంటూ డ్రగ్స్ మొదలు పెట్టాడు. పరిస్థితి విషమించింది. సెప్టెంబర్ రెండవ తేదీన 26వ ఏట చనిపోయాడు. జీవితం గురించి మైక్ ఎన్ని కలలు కన్నాడో, పిల్లల భవిష్యత్ గురించి ఎంత ఆలోచించాడో భార్యగా నాకు తెలుసు. కన్న కలలు తీరకుండానే పిల్లలను కూడా వదిలిపెట్టి వెళ్లి పోయాడు. ఈ వయస్సులో తండ్రిని పూడ్చే పరిస్థితి ఏ పిల్లలకు కలగకూడదన్నది నా తాపత్రయం, నా ప్రయత్నం. కొద్దిగా డ్రగ్స్ తీసుకున్నా ఫర్వాలేదని ఎవరూ అనుకోకూడదు. డ్రగ్స్ తీసుకునే ముందు మైక్ కూడా ఏమీ ఆలోచించి ఉంటారో ఒక్కసారి ఊహించండి. డ్రగ్స్ మిమల్ని చంపేస్తుంది’ అంటూ ఎవా హాలండ్ తన లేఖను ముగించింది. ముందుగా ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన రెండు, మూడు రోజుల తర్వాత ఆమె ఈ వివరణ ఇచ్చింది. ఆమె లేఖను ఫేస్బుక్లో దాదాపు మూడు లక్షల మంది షేర్ చేసుకున్నారు. కామెంట్లూ వచ్చాయి. అందరూ సానుకూలంగానే స్పందించారు. అందులో ఆమె పట్ల కొంత మంది సానుభూతి వ్యాఖ్యలు చేయగా, డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు మానేస్తామంటూ ఒట్టేసుకోవడం విశేషం. -
ట్విట్టర్ సీఈవో రేసులో విజయవాడ మహిళ
ముగ్గురితో పోటీ పడుతున్న పద్మశ్రీ వారియర్ మాంటిస్సోరి, మేరీస్ స్టెల్లా కళాశాలలో విద్యాభ్యాసం మోటరోలా, సిస్కో సంస్థల్లో విశేషానుభవం ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో స్థానం విజయవాడ: ప్రముఖ సోషల్ వెబ్సైట్ ట్విట్టర్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా విజయవాడకు చెందిన ఎల్లెపెద్ది పద్మశ్రీ వారియర్ పేరు పరిశీలనలో ఉంది. తమ సంస్థ సీఈఓగా మొత్తం నలుగురి పేర్లను ట్విట్టర్ యాజమాన్యం పరిశీలి స్తోంది. ఇందులో పద్మశ్రీ పేరు కూడా ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ పేరు తెరపైకి వచ్చింది. పద్మశ్రీ విజయవాడ గాంధీనగర్‌లో 1961లో జన్మించారు. నగరంలోని మాంటిస్సోరి పాఠశాల, మేరీస్ స్టెల్లా కళాశాలలో విద్యనభ్యసించారు. ముంబై ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో పీజీ చేశారు. మోహన్‌దాస్ వారియర్‌ను వివాహమాడారు. వారికి కర్నా వారియర్ అనే కుమారుడు ఉన్నారు. 1984 నుంచి 2007 వరకు 23 ఏళ్లపాటు మోటరోలా ఎనర్జీ సిస్టమ్స్‌లో పద్మశ్రీ పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగి ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె కృషి ఫలితంగా కంపెనీ 2004 సంవత్సరంలో నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డును పద్మశ్రీ అమెరికా అధ్యక్షుడి చేతుల మీదుగా అందుకున్నారు. 2007లో సిస్కో ఎనర్జీ సిస్టమ్స్‌లో సీటీవోగా చేరి 2015 జూన్ వరకు ఆ సంస్థలో కొనసాగారు. ఫోర్బ్స్ సంస్థ 2014లో విడుదల చేసిన 100 మంది ‘ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితా’లో ఆమె 71వ స్థానంలో నిలిచారు. -
ఫేస్'బుక్' కావొద్దు
ఒక పోస్టింగ్.. ఒక రిక్వెస్ట్ ద్వారా స్నేహితులను సంపాదించుకోవచ్చు. దానిపై పెట్టిన అనవసర కామెంట్ అనర్థాలను తెచ్చిపెట్టవచ్చు. అవును మరి.. ఫేస్‌బుక్‌తో ఉన్న ముప్పు ఇది. ఒక ఫేస్బుక్ అకౌంట్ మనిషి తలరాతను నిమిషాల్లో మార్చేగల శక్తి దానికి ఉంది. ప్రస్తుతం ట్రెండీగా కొనసాగుతున్న ఈ సామాజిక సంబంధాలవేదికతో జాగ్రత్తగా ఉండాల్సిందే..! ఫేస్బుక్.. ఇప్పుడు స్కూల్ పిల్లాడి నుంచి తాతయ్య దాకా అందరూ వినియోగిస్తున్న సామాజిక వెబ్సైట్. చాలామంది యువతీ యువకులైతే ఇందులో ఏదైనా పోస్ట్ చేయకపోతే నిద్ర కూడా పట్టదు.. ఫ్రెండ్స్ నుంచి వచ్చే పోస్టింగ్‌లకు లైక్ కొట్టనిదే పొద్దు పోదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వివిధ అంశాలపై పలు దేశాలను సైతం ప్రభావితం చేసిన శక్తిమంతమైన సామాజిక నెట్వర్కింగ్ సైట్‌గా పేరు తెచ్చుకుంది ఫేస్బుక్. దీంతో లాభాలే కాదు.. నష్టాలూ అదే స్థాయిలో ఉన్నారుు. సామాజిక మాధ్యమాలతో కలిగే నష్టాలు ఏంటి.. వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి అంశాలపై ప్రత్యేక కథనం. ⇒ అపరిచిత వ్యక్తుల స్నేహం అసలే వద్దు ⇒ అనవసర కామెంట్లకు దూరంగా ఉండడమే మేలు ⇒ పర్సనల్ డేటా.. ఫొటోలు అప్లోడ్ చేయొద్దు ⇒ లేదంటే లైఫ్ రిస్క్‌లో పడడం ఖాయం బినామీ అకౌంట్లతో బీకేర్‌ఫుల్ కొందరు బినామీ పేర్లతో ఫేస్బుక్ అకౌంట్లు తెరుస్తున్నారు. వీటిలో అమ్మాయిల పేర్లు, ఫొటోలతో అకౌంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రిక్వెస్ట్‌లతో ఫ్రిండ్‌షిప్ పెంచుకుని వారితో చాటింగ్ చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫ్రెండ్స్‌కు షేర్ చేయడం వంటి చర్యలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటివన్నీ బినామీ అకౌంట్ల నుంచే పంపుతున్నారు. వీటి వల్ల వచ్చే సమస్యలతో అమాయకులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటువంటి సంఘట నలు వెలుగులోకి వచ్చి కేసుల వరకూ వెళితే గానీ బినామీల సంగతి బయటకు రావడం లేదు. పోలీస్ దర్యాప్తుల్లో నేరాలకు పాల్పడ్డవారిని గుర్తించి ఫేస్బుక్అకౌంట్ గురించి ఆరా తీసినా చాలా సందర్భాల్లో ఫలితం దక్కడం లేదు. ఆ నోట.. ఈ నోట.. ఫేస్బుక్ మాట ఫేస్బుక్.. ఈ మధ్యకాలంలో యువత నోట్లో బాగా నానుతున్న మాట. స్నేహితులను ఆన్లైన్లో కలుసుకోవడంతోపాటు ఏ సందర్భమైనా అందరితో పంచుకునేందుకు, శుభాకాంక్షలు తెలుపుకునేందుకు వీలుగా దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. విద్య, సినిమాలు, రాజకీయాలు, సరదా కబుర్లు, జన్మదిన, వివాహశుభాకాంక్షలు, విషాద సంఘటనలు సందర్భం ఏదైనా ఫేస్బుక్లో ఇట్టే ప్రత్యక్షమవ్వాల్సిందే. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటూ విస్తరించినసోషల్ నెట్‌వర్క్‌గా ఫేస్బుక్ ప్రాచుర్యం పొందింది. యువత రోజువారీ కార్యకలాపాల్లో ఫేస్బుక్ ఒక భాగమైపోయింది. ఫేస్బుక్లో లాగిన్ అయి ఏదో ఒకటిపోస్టు చేస్తేనే కాస్తంత సరదా... ఓ పనరుుపోరుుం దనే ఫీలింగ్ చాలామంది యువతది. తల్లిదండ్రులు దృష్టి సారించాలి సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తే అదోవిజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైంపాస్‌కు వాడుకుంటే పలు అనర్థాలకు దారి తీస్తుందని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ దిశగా పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లతో ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి. లేదంటే పిల్లలు ఈ వ్యసనానికి బానిసలయ్యే అవకాశం ఉంది. లైక్‌లు లేవని బెంగ వద్దు ఫేస్బుక్ అంటేనే ఫేక్‌బుక్ వంటిది. అలాంటిది తాము ఎన్నిసార్లు పోస్టుచేసినా ఎవరూ లైక్ కొట్టడం లేదని అసలే కుంగిపోవద్దు. ఎన్ని ఎక్కువ లైక్‌లు వస్తే అంత పాపులర్ అరుు నట్లు.. తక్కువగా వస్తే పట్టించుకోవడం లేదని అసలే ఆలోచించొద్దు. లేదా తమను ఫ్రెండ్ జాబితా నుంచి తొలగించారని మదనపడడంలాంటివి చేయొద్దు. ఎన్నోరకాల సామాజిక వెబ్సైట్ల మాదిరిగానే దీన్ని పరిగణించాలి. ఏ మేరకు వినియోగించాలి.. ♦ స్నేహితులతో టచ్‌లో ఉండడం.. కొత్త స్నేహాలను సంపాదించుకోవడం. ప్రపంచసమాచార వేదికపై అప్డేట్గా ఉండడం. ♦ ప్రపంచంలోని కొత్త, మంచి విషయూలనునేర్చుకోవడం. ♦ ఏ ఫొటో, కామెంట్ పోస్టింగ్ చేసినా తమ ఇమేజ్ను పెంచేలా.. నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. ♦ ఉద్యోగ, వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. ♦ ఫొటోలు, కామెంట్స్ పోస్టింగ్ విషయంలోగందరగోళం ఉండరాదు. నోటి నుంచి జారిన మాట.. ఫేస్బుక్లో ఎంటర్ చేసిన కామెంట్ ఒకటేనని గుర్తుంచుకోవాలి. ♦ ఫేస్‌బుక్‌లోకి వెళ్లగానే పెద్దసంఖ్యలో ఫొటోలు, కామెంట్లు పెట్టడం వృథా. అంతగా చదివే ఓపిక ఎవరికీ ఉండదని గుర్తుంచుకోవాలి. ♦ ఫొటో అప్లోడ్ చేసే ముందే దాన్ని ఒకటికిరెండుసార్లు చూడండి.. కామెంట్లను చదవండి అంతేకానీ పోస్ట్ చేశాక తలలు పట్టుకుంటే చేసేదేమీ ఉండదు. ఇవి అసలే వద్దు ♦ అందరికీ తెలిసేలా ఫోన్ నంబర్లు, ఇంటి వివరాలు, చిరునామాలు, ఫొటోలు పెట్టొద్దు. ♦ తమ కార్యాలయం.. చేస్తున్న ఉద్యోగంపై రహస్య సమాచారాన్ని లీక్ చేయడం ఉండొద్దు. ♦ మందుకొట్టి బైక్ డ్రైవ్ చేశానని, మొన్న ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేశానని పోస్ట్‌చేసి అనవసర రిస్క్‌లు వద్దు. ♦ ఒకప్పటి ప్రేమలు, పెళ్లిళ్లపై వ్యాఖ్యలు వద్దు. ♦ స్నేహితుల పోస్ట్‌లు.. కామెంట్లపై తీవ్రంగా స్పందించడం.. సవాల్ విసరడం లాంటివి చేయొద్దు. ♦ స్నేహితుల ఫొటోలు వారి అనుమతి లేకుండా పోస్ట్ చేయడం మంచిది కాదు. ♦ మనసు బాగోలేనప్పుడు ఫేస్‌బుక్‌లోకి వెళ్లవద్దు. ♦ ఆఫీసు విషయూలు.. కుటుంబ సమస్యలు.. పర్సనల్‌ముచ్చట్లు వద్దు. ♦ వ్యంగమైన చిత్రాలు పెట్టడం.. ♦ మరొకరిని కించ పరిచేలా ఫొటోలు మార్ఫింగ్ చేయడం.. కామెంట్లు పెట్టడం చేయొద్దు. ♦ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తికి డబ్బులు లావాదేవీలు జరపడం.. వినోదాలకు పిలిస్తే వెళ్లడం లాంటివి అసలేవద్దు. ♦ రెచ్చగొట్టే.. అవమానపరిచే ఫొటోలకు లైక్‌లు కొట్టడంచిక్కుల్లో పడేందుకేనని గుర్తుంచుకోవాలి. అమ్మాయిలూ.. జర జాగ్రత్త ఫేస్బుక్ అనేది స్నేహానికి వారధి మాత్రమేనన్న విషయాన్ని మరిచిపోయి చాలా మంది దానికి బానిసలవుతున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా సెల్‌ఫోన్, కంప్యూటర్ముందు కూర్చుని పోస్టులు, లైక్‌లు, కామెంట్లు, షేర్లుతో కాలం గడిపేస్తున్నారు. ఫేస్బుక్ మాయలోపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అడ్డంగా బుక్ అవుతూ ఊచలు లెక్కిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్లో స్నేహం చేయడం వల్ల ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సెట్టింగ్స్ తప్పనిసరి... ఫేస్బుక్ నుంచి ప్రమాదంలోకి పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. అలాగే విలువైన వ్యక్తిగత సమాచారం ఫేస్బుక్లో పెట్టకపోవడం ఉత్తమం. మనం పోస్టు చేసే చిత్రాలు, కామెంట్స్‌ని మన సమీపం వారే చూసేలా సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. వచ్చిన ప్రతి ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’కు ఓకే చెప్పకూడదు. తెలిసిన వారా లేదాఅని ఆక్సెప్ట్ చేయడం మంచిది. అనవసర ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఓకే చేయడం సమస్యలకు స్వాగతం పలికినట్లేనని గుర్తుంచుకోవాలి. చాలావరకు ఫేస్బుక్ అకౌంట్లలో అసత్యాలే ఎక్కువగా ఉంటాయి. ఎవరో కావాలనే యువతుల పేర్లు.. ఫొటోలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు. అలాంటివారే రిక్వెస్ట్‌లు పంపిస్తుంటారు. వాటిబారిన పడి మోసపోవద్దు. -
అభిమాని వికృతం!
సోషల్ వెబ్సైట్ పేజీల్లో లెక్కకు మించి పెరుగుతున్న ఫ్యాన్స్ లిస్ట్ చూసి మురిసిపోయే తారలకు ఝలక్ ఇది. శాండల్‌వుడ్ భామ నికితా థక్రాల్ మైక్రో బ్లాగింగ్ పేజీలో ఓ తుంటరి తన ‘ప్రైవేట్ అసెట్స్’ ఫొటోలు పోస్ట్ చేశాడు. ఈ అసభ్యకర, అభ్యంతరకర ప్రవర్తనకు నికిత షాకైంది. ‘ఇది అభిమానులు నాతో మాట్లాడే ప్లేస్. మతిచెడినవారి వికృత చేష్టల కోసం కాదు. అతడు పంపిన పిక్చర్స్, మెసేజ్‌లు అసహ్యంగా, జగుప్సగా ఉన్నాయి. ఇలాంటివారు మరికొంత మంది కూడా ఉన్నారు. ఇది నా ఒక్కదాని సమస్య కాదు. చాలామంది మహిళలు ఈతరహా పోకిరీల చేష్టలకు బలవుతున్నారు’ అంటూ ట్వీట్ చేసింది నికిత. -
టెమ్టింగ్ పిక్చర్స్!
సెక్సీ సుందరి సన్నీ లియోన్ వెండి తెరపైనే కాదు... సామాజిక సైట్లలోనూ పిచ్చెక్కెస్తోంది. హాట్ హాట్ ఫొటోలు దిగి వాటిని ఇన్‌స్టాగ్రమ్‌లో అప్లోడ్ చేసిందీ నీలికళ్ల సుందరి. చూపులతోనే మతిపోగొట్టే ఈ చిన్నది... బీచ్‌లో బాతింగ్ మూమెంట్స్‌ను క్లిక్‌మనిపించి ఒకదాని వెంట ఒకటి కుర్రకారు మీదకు వదిలేసింది. మొదటి ఫొటో సన్ గ్లాసెస్, రంగుల క్యాప్‌తో కాస్త డీసెంట్‌గానే ఉన్నా... తరువాతది మాత్రం టూ పీస్ సెన్సేషనే. ఇక ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి..! లైక్‌ల మీద లైక్లేసేసి... ‘పెద్దల’ తారను ఇంప్రెస్ చేయాలని తెగ తాపత్రయ పడుతున్నారట అబ్బాయిలు. -
ట్విట్టర్లో కాజోల్!
ఇన్నాళ్లూ సెలైంట్‌గా ఉన్న ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్‌కు ఉన్నట్టుండి సామాజిక సైట్‌పై మనసు మళ్లింది. ట్విట్టర్లో ఖాతా తెరిచి అందరికీ హాయ్ చెప్పి మురిపించింది. ఆ వెంటనే ‘కొద్ది వారాలు మాత్రమే’ అంటూ కామెంట్‌ను కంటిన్యూ చేసి ఆ ఆనందాన్ని ఆవిరి చేసేసింది. ‘హాయ్ గయ్స్... ఓ మంచి కాజ్ కోసం ట్విట్టర్లో జాయినయ్యా’నని తొలి ట్వీట్ చేసింది. ఈ నెల 23, 24 తేదీల్లో జరిగే ‘యునెటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ’ (యూఎన్జీఏ) సెమినార్‌కు లైఫ్‌బాయ్ ‘హెల్ప్ ఏ చైల్డ్ రీచ్ ఫైవ్’ బ్రాండ్ అంబాసిడర్‌గా కాజల్ పాల్గొంటోంది. వాటి అప్డేట్స్ పోస్ట్ చేయడానికే కాజల్ ఖాతా తెరిచింది. -
ఫేస్‌బుక్‌పై రూ. 725 కోట్లకు దావా
న్యూయార్క్: సామాజిక వెబ్సైట్ ‘ఫేస్బుక్’పై ఒక అమెరికా మహిళ ఏకంగా రూ. 725 కోట్ల నష్టపరిహారం దావా వేసింది. అక్కడి టెక్సాస్‌కు చెందిన మరియం అలీ అనే మహిళ, ఇల్లినాయిస్కు చెందిన అదీల్‌షా ఖాన్ స్నేహితులు.. ఐదేళ్ల కింద ఏవో విభేదాలతో ఇద్దరూ విడిపోయారు. దీంతో ఆగ్రహించిన అదీల్‌షా... మరియం అలీ పేరిట ఫేస్బుక్ ఖాతాను తెరిచి, ఆమెకు సంబంధించిన నకిలీ అశ్లీల చిత్రాలను అప్లోడ్ చేశాడు. ఆ చిత్రాలను తొలగించాలని మరియం విజ్ఞప్తి చేసుకున్నా... ఫేస్బుక్ సంస్థ తొలగించలేదు. దీంతో తన విజ్ఞప్తిపై ఫేస్బుక్ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందంటూ మరియం.. ఈ దావా వేసింది. -
‘ఉద్వేగ అధ్యయనం’పై ఫిర్యాదు
ఫేస్బుక్ చర్య అనైతికమన్న ‘ఎపిక్’ వాషింగ్టన్: ప్రముఖ సామాజిక సంబంధాల వెబ్సైట్ ఫేస్బుక్ రెండేళ్ల కిందట తన యూజర్లపై నిర్వహించిన మానసిక ఉద్వేగ అధ్యయనం చ ట్టవిరుద్ధమని ఫిర్యాదు దాఖలైంది. ఇది మోసం, నైతిక ప్రమాణాలకు విరుద్ధమని, ఫేస్బుక్ ఉద్దేశపూర్వకంగా ప్రజల మనసులతో చెలగాటమాడిందని డిజిటల్ హక్కుల బృందం ఎలక్ట్రానిక్ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎపిక్) ఇటీవల యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ అధ్యయనానికి యూజర్ల అనుమతి తీసుకోలేదని, ఈ ప్రయోగం ఫేస్బుక్ నిబంధనలకే విరుద్ధమని పేర్కొంది. దీనికి నష్టపరిహారం చెల్లించాలని, అధ్యయనానికి అనుసరించిన పద్ధతులేంటో తెలపాలని డిమాండ్ చేసింది. 2012లో వారం పాటు 7 లక్షల మంది యూజర్లపై ఫేస్బుక్ రెండు వర్సిటీలతో కలిసి అధ్యయనం చేసింది. యూజర్ల వ్యక్తిగత సమాచారంలోని ఉద్వేగ సంబంధ సమాచారాన్ని మార్చి పంపండం వల్ల వారిపై ప్రభావం ఉంటుందో లేదో తేల్చడానికి దీన్ని చేపట్టారు. ఈ మార్పులు యూజర్లను ప్రభావితం చేస్తాయని, ప్రతికూల(నెగిటివ్) ఉద్వేగ సమాచారమున్న సందేశాలను తక్కువగా చదివిన యూజర్లు ప్రతికూల అప్డేట్లను తమ పేజీల్లో రాసే అవకాశం తక్కువని తేలింది. అయితే అధ్యయనం పద్ధతి నిర్వహించిన తీరు సరిగ్గా లేదని, అందుకు క్షమాపణ చెబుతున్నామని సంస్థ సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్ వివరణ ఇచ్చారు. -
ప్రధాని ‘పోస్టు’ అద్భుతం: ఫేస్బుక్ సీఓఓ షెరిల్
* ఫేస్బుక్ సీఓఓ షెరిల్ శ్యాండ్‌బర్గ్ * ఒబామా తర్వాత మోడీకే ఎక్కువమంది స్నేహితులు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన తల్లి దీవెనలను పొందుతున్న ఫొటోతో కూడిన పోస్టు అద్భుతమని, అది వ్యక్తిగతంగా తనకెంతో ఇష్టమైనదనిసామాజిక సంబంధాల వెబ్సైట్ ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) షెరిల్ శ్యాండ్‌బర్గ్ చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న షెరిల్ గురువారం ప్రధానితో భేటీ కానున్నారు. ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందిన రాజకీయవేత్తల్లో మోడీ రెండోస్థానంలో ఉన్నట్టు ఆమె తెలిపారు. ఆయనకు కోటీ ఎనభై లక్షల మందికి పైగా ఫేస్బుక్ స్నేహితులు ఉన్నారన్నారు. 4 కోట్ల మందికి పైగా స్నేహితులతో అమెరికా అధ్యక్షుడు ఒబామా మొదటి స్థానంలో ఉన్నట్టు ఓ ఇంటర్వూలో వెల్లడించారు. దేశంలో ఇటీవల ముగిసిన ఎన్నికలను ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియూ ప్రాధాన్యతను భారత రాజకీయవేత్తలు ఇప్పుడెలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నట్టు చెప్పారు. భారత్‌లో ఫేస్‌బుక్‌తో సంబంధాలు లేనివారు ఇంకా 100 కోట్ల మంది ఉన్నారని, వారిని కూడా ఫేస్‌బుక్‌లోకి తేవడమే తమ ముందున్న సవాలని అన్నారు. గోప్యత విషయంలో తాము జాగ్రత్తగా వ్యవహరిస్తామనే విషయూన్ని యూజర్లు అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నట్టు షెరిల్ చెప్పారు. మనో విశ్లేషణ ప్రయోగం గురించి యూజర్లకు తెలియజెప్పడంలో ఫేస్బుక్ విఫలమైందని ఆమె అంగీకరించారు. యూజర్ల భావోద్రేకాలను నియంత్రించేందుకు ప్రయత్నించారనడాన్ని ఆమె ఖండించారు. 2012లో యూజర్లకు తెలియకుండా వారి భావోద్రేకాలపై ఫేస్బుక్ నిర్వహించిన అధ్యయనంపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యూరుు. విద్య, అవకాశాల పరంగా ముందున్నప్పటికీ లింగ అసమానత అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతుల్లోనూ సమస్యగానే మిగిలిందని బుధవారం ఫిక్కీ మహిళా సంఘం ఏర్పాటు చేసిన సదస్సులో షెరిల్ చెప్పారు. -
ఇకపై లాలూ ట్వీట్లు
పాట్నా: ‘ఈ ఐటీ, వైటీతోఏమవుతుంది’ అని చెప్పే ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌లో కూడా మార్పు వచ్చింది. ఎప్పుడూ సాధారణ దేశవాళీ యాసతో, కట్టుతో కనిపించే లాలూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని కల్పించే సామాజిక అనుసంధాన వెబ్సైట్ల ఆవశ్యకత గుర్తించారు. ఆయన ట్విట్టర్లో మంగళవారం ఖాతా తెరిచా రు. ‘మార్పు మాత్రమే స్థిరమైనది. మార్పుతోనే మనం కూడా మారతాం. ట్విట్టర్లో ఖాతా తెరిచాను’ అని తొలి సందేశంలో పేర్కొన్నారు.