ప్రధాని ‘పోస్టు’ అద్భుతం: ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్
* ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శ్యాండ్‌బర్గ్
* ఒబామా తర్వాత మోడీకే ఎక్కువమంది స్నేహితులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన తల్లి దీవెనలను పొందుతున్న ఫొటోతో కూడిన పోస్టు అద్భుతమని, అది వ్యక్తిగతంగా తనకెంతో ఇష్టమైనదనిసామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) షెరిల్ శ్యాండ్‌బర్గ్ చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న షెరిల్ గురువారం ప్రధానితో భేటీ కానున్నారు.
ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందిన రాజకీయవేత్తల్లో మోడీ రెండోస్థానంలో ఉన్నట్టు ఆమె తెలిపారు. ఆయనకు కోటీ ఎనభై లక్షల మందికి పైగా ఫేస్‌బుక్ స్నేహితులు ఉన్నారన్నారు. 4 కోట్ల మందికి పైగా స్నేహితులతో అమెరికా అధ్యక్షుడు ఒబామా మొదటి స్థానంలో ఉన్నట్టు ఓ ఇంటర్వూలో వెల్లడించారు. దేశంలో ఇటీవల ముగిసిన ఎన్నికలను ప్రస్తావిస్తూ.. సోషల్ మీడియూ ప్రాధాన్యతను భారత రాజకీయవేత్తలు ఇప్పుడెలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నట్టు చెప్పారు.
భారత్‌లో ఫేస్‌బుక్‌తో సంబంధాలు లేనివారు ఇంకా 100 కోట్ల మంది ఉన్నారని, వారిని కూడా ఫేస్‌బుక్‌లోకి తేవడమే తమ ముందున్న సవాలని అన్నారు. గోప్యత విషయంలో తాము జాగ్రత్తగా వ్యవహరిస్తామనే విషయూన్ని యూజర్లు అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నట్టు షెరిల్ చెప్పారు. మనో విశ్లేషణ ప్రయోగం గురించి యూజర్లకు తెలియజెప్పడంలో ఫేస్‌బుక్ విఫలమైందని ఆమె అంగీకరించారు. యూజర్ల భావోద్రేకాలను నియంత్రించేందుకు ప్రయత్నించారనడాన్ని ఆమె ఖండించారు.
2012లో యూజర్లకు తెలియకుండా వారి భావోద్రేకాలపై ఫేస్‌బుక్ నిర్వహించిన అధ్యయనంపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యూరుు. విద్య, అవకాశాల పరంగా ముందున్నప్పటికీ లింగ అసమానత అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతుల్లోనూ సమస్యగానే మిగిలిందని బుధవారం ఫిక్కీ మహిళా సంఘం ఏర్పాటు చేసిన సదస్సులో షెరిల్ చెప్పారు.