Girls & Boys
-
పసిప్రాయం ఎగ‘తాళి’!
వారిలో ఆలోచన శక్తి, సమస్యలను అధిగమించే పరిస్థితి ఉండదు. దీంతో గృహహింస, లైంగిక వేధింపులు, సామాజికంగా విడిపోవడం వంటి పరిస్థితులకు గురవుతారు. త్వరగా వృద్ధాప్యం వచ్చి వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుంది. రక్తహీనత ఏర్పడుతుంది. కారణాలు పేదరికం, అక్షరాస్యతలో బాలికల శాతం తక్కువగా ఉండడం. వారికి తక్కువ హోదా కల్పించడం, ఆర్థిక భారంగా భావించడం.. సాంఘికాచారాలు, సంప్రదాయాలు బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. దుష్పరిణామాలు బాల్య వివాహాలవల్ల చిన్న వయస్సులోనే బాలికలు గర్భం దాలిస్తే కాన్పు కష్టం కావటం, ప్రసూతి మరణాలు, శిశు మరణాలు అధికంగా ఉంటాయి. సాక్షి, అమరావతి : వివాహ భారంతో పసిప్రాయం నలిగిపోతోంది. మూడుముళ్ల బంధం పేరుతో బాలికల మెడలో పడుతున్న తాళి వారి జీవితానికి గుదిబండగా మారుతోంది. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు చేస్తే నేరమని చట్టాలు చెబుతున్నా మైనర్ వివాహాలు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 అమలులోకి వచ్చినప్పటికీ పెళ్లీడు రాక ముందే జరుగుతున్న వివాహాలకు అడ్డుకట్ట పడట్లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఇటీవల చేసిన సర్వేలు సైతం దేశంలోను, రాష్ట్రంలోను జరుగుతున్న బాల్య వివాహాలపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనెసెఫ్) లెక్కల ప్రకారం.. 40 శాతం కంటే ఎక్కువ బాల్య వివాహాలతో భారతదేశం ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. అలాగే, దేశంలో పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లో 73 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 71, రాజస్థాన్‌లో 68, బీహార్‌లో 67, ఉత్తరప్రదేశ్‌లో 64 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రానికి వస్తే.. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు వరుస స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో బాలికలే ఎక్కువ.. బాల్య వివాహాల్లో ఎక్కువగా బాలికలే ఉండటం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015–2016 లెక్కల ప్రకారం దేశంలోని బాల్య వివాహాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో జరుగుతున్న 45 శాతం పెళ్లిళ్లలో 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహాలు జరగడం గమనార్హం. ఇది గ్రామాల్లో 35.5 శాతం, పట్టణాల్లో 26.3 శాతంగా ఉంది. పురుషుల విషయానికొస్తే.. 21 ఏళ్లు నిండని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 13.2 శాతం, పట్టణాల్లో 8.8 శాతం మందికి వివాహాలు జరుగుతున్నాయి. అలాగే, ఏపీకి సంబంధించి చైల్డ్‌లైన్–1098కు 2017–18 కాలంలో వచ్చిన ఫిర్యాదుల్లో 1,700.. 2018–19లో 1,900 బాల్య వివాహాలు జరిగాయి. అయితే, ఇలా వెలుగు చూడనివి మరెన్నో ఉన్నాయి. బాల్య వివాహాలకు బీజం ఇలా.. ఫ్రెంచి, పోర్చుగీసు, డచ్, బ్రిటీషు వాళ్లు భారతదేశాన్ని పాలించే కాలంలో కొంతమంది విదేశీ అధికారులు భారతీయ కన్యలను బల వంతంగా వివాహమాడటం, బలాత్కరించడం జరిగేది. వివాహితుల జోలికి రారనే ఉద్దేశ్యంతో తమ ఆడబిడ్డలను కాపాడుకునేందుకు భారతీ యులు తమ పిల్లలకు బాల్యంలోనే పెళ్లిళ్లు చేసే వారనే ప్రచారం ఉంది. రానురాను కుటుంబాల మధ్య సంబంధాలను పటిష్ఠ పరచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో ఫలానా వాడికి భార్య పుట్టిందని ఇరువర్గాల వారు నిర్ణయించుకుని మొదట బొమ్మల పెళ్లిచేసి పెద్దయ్యాక వివాహం చేసేవారు. తాము చనిపోయే లోపు తమ వారసుల పెళ్లిళ్లు చూడాలనే వృద్ధుల కోరికను తీర్చడానికి కూడా పురుషుడి వయస్సు ఎక్కువైనా జరిపించే వారు. అనం తరం కాలంలో.. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తల కారణంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. అయినా ఇవి జరుగుతూనే ఉన్నాయి. నిరోధించే చట్టాలు బ్రిటిష్ పాలకులు 1929లో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ యాక్ట్ తెచ్చారు. అనంతరం.. భారత ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 (ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్) 2007 జనవరి 10న ఆమోదం పొంది, 2007 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం 18 ఏళ్లలోపు ఆడపిల్లలు, 21 ఏళ్ల లోపు మగపిల్లలు బాలల కిందకే వస్తారు. ఈ వయస్సులోపు వారికి పెళ్లి చేస్తే జిల్లా కలెక్టర్, ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, మెట్రోపాలి టన్ మేజిస్ట్రేట్, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, వీఆర్ఓ, వీఆర్ఏలకు ఫిర్యాదు చేయవచ్చు. వివాహ నమోదు చట్టంతో కూడా వీటికి చెక్ పెట్టవచ్చు. అలాగే, బాల్యవివాహం చేసిన వారెవరైనా నేరస్థులే. పెళ్లికి హాజరవ డమూ నేరమే. వీరికి రెండేళ్ల వరకు కఠిన కారా గార శిక్ష.. రూ.లక్ష వరకు జరిమానా విధించ వచ్చు. ఈ నేరాలకు బెయిల్ కూడా ఉండదు. బాల్య వివాహం సామాజిక దురాచారం తగిన వయసు రాకుండానే పెళ్లి చేయడంవల్ల బాలికలు సమస్యల సుడిగుండంలో కూరుకుపోతున్నారు. శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను కుంగదీసే ఈ వివాహాలు సమర్థనీయం కాదు. సామాజిక దురాచారంగా ఉన్న ఈ వ్యవస్థను నిరోధించేలా కఠిన చర్యలు తీసుకోవాలి. – మణెమ్మ, సామాజిక కార్యకర్త నిరోధానికి కఠిన చర్యలు చేపట్టాలి బాల్య వివాహాల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలి. దురదృష్టం ఏమిటంటే రాష్ట్రంలో గతం నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బాల్య వివాహాలపై స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేస్తే వాటిని నిలుపుదల చేయిస్తున్నారు. కానీ, కేసులు పెట్టి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. – ఎన్. రామ్మోహన్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి -
ఫేస్'బుక్' కావొద్దు
ఒక పోస్టింగ్.. ఒక రిక్వెస్ట్ ద్వారా స్నేహితులను సంపాదించుకోవచ్చు. దానిపై పెట్టిన అనవసర కామెంట్ అనర్థాలను తెచ్చిపెట్టవచ్చు. అవును మరి.. ఫేస్‌బుక్‌తో ఉన్న ముప్పు ఇది. ఒక ఫేస్బుక్ అకౌంట్ మనిషి తలరాతను నిమిషాల్లో మార్చేగల శక్తి దానికి ఉంది. ప్రస్తుతం ట్రెండీగా కొనసాగుతున్న ఈ సామాజిక సంబంధాలవేదికతో జాగ్రత్తగా ఉండాల్సిందే..! ఫేస్బుక్.. ఇప్పుడు స్కూల్ పిల్లాడి నుంచి తాతయ్య దాకా అందరూ వినియోగిస్తున్న సామాజిక వెబ్సైట్. చాలామంది యువతీ యువకులైతే ఇందులో ఏదైనా పోస్ట్ చేయకపోతే నిద్ర కూడా పట్టదు.. ఫ్రెండ్స్ నుంచి వచ్చే పోస్టింగ్‌లకు లైక్ కొట్టనిదే పొద్దు పోదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వివిధ అంశాలపై పలు దేశాలను సైతం ప్రభావితం చేసిన శక్తిమంతమైన సామాజిక నెట్వర్కింగ్ సైట్‌గా పేరు తెచ్చుకుంది ఫేస్బుక్. దీంతో లాభాలే కాదు.. నష్టాలూ అదే స్థాయిలో ఉన్నారుు. సామాజిక మాధ్యమాలతో కలిగే నష్టాలు ఏంటి.. వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి అంశాలపై ప్రత్యేక కథనం. ⇒ అపరిచిత వ్యక్తుల స్నేహం అసలే వద్దు ⇒ అనవసర కామెంట్లకు దూరంగా ఉండడమే మేలు ⇒ పర్సనల్ డేటా.. ఫొటోలు అప్లోడ్ చేయొద్దు ⇒ లేదంటే లైఫ్ రిస్క్‌లో పడడం ఖాయం బినామీ అకౌంట్లతో బీకేర్‌ఫుల్ కొందరు బినామీ పేర్లతో ఫేస్బుక్ అకౌంట్లు తెరుస్తున్నారు. వీటిలో అమ్మాయిల పేర్లు, ఫొటోలతో అకౌంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రిక్వెస్ట్‌లతో ఫ్రిండ్‌షిప్ పెంచుకుని వారితో చాటింగ్ చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫ్రెండ్స్‌కు షేర్ చేయడం వంటి చర్యలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటివన్నీ బినామీ అకౌంట్ల నుంచే పంపుతున్నారు. వీటి వల్ల వచ్చే సమస్యలతో అమాయకులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటువంటి సంఘట నలు వెలుగులోకి వచ్చి కేసుల వరకూ వెళితే గానీ బినామీల సంగతి బయటకు రావడం లేదు. పోలీస్ దర్యాప్తుల్లో నేరాలకు పాల్పడ్డవారిని గుర్తించి ఫేస్బుక్అకౌంట్ గురించి ఆరా తీసినా చాలా సందర్భాల్లో ఫలితం దక్కడం లేదు. ఆ నోట.. ఈ నోట.. ఫేస్బుక్ మాట ఫేస్బుక్.. ఈ మధ్యకాలంలో యువత నోట్లో బాగా నానుతున్న మాట. స్నేహితులను ఆన్లైన్లో కలుసుకోవడంతోపాటు ఏ సందర్భమైనా అందరితో పంచుకునేందుకు, శుభాకాంక్షలు తెలుపుకునేందుకు వీలుగా దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. విద్య, సినిమాలు, రాజకీయాలు, సరదా కబుర్లు, జన్మదిన, వివాహశుభాకాంక్షలు, విషాద సంఘటనలు సందర్భం ఏదైనా ఫేస్బుక్లో ఇట్టే ప్రత్యక్షమవ్వాల్సిందే. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటూ విస్తరించినసోషల్ నెట్‌వర్క్‌గా ఫేస్బుక్ ప్రాచుర్యం పొందింది. యువత రోజువారీ కార్యకలాపాల్లో ఫేస్బుక్ ఒక భాగమైపోయింది. ఫేస్బుక్లో లాగిన్ అయి ఏదో ఒకటిపోస్టు చేస్తేనే కాస్తంత సరదా... ఓ పనరుుపోరుుం దనే ఫీలింగ్ చాలామంది యువతది. తల్లిదండ్రులు దృష్టి సారించాలి సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తే అదోవిజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైంపాస్‌కు వాడుకుంటే పలు అనర్థాలకు దారి తీస్తుందని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ దిశగా పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లతో ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి. లేదంటే పిల్లలు ఈ వ్యసనానికి బానిసలయ్యే అవకాశం ఉంది. లైక్‌లు లేవని బెంగ వద్దు ఫేస్బుక్ అంటేనే ఫేక్‌బుక్ వంటిది. అలాంటిది తాము ఎన్నిసార్లు పోస్టుచేసినా ఎవరూ లైక్ కొట్టడం లేదని అసలే కుంగిపోవద్దు. ఎన్ని ఎక్కువ లైక్‌లు వస్తే అంత పాపులర్ అరుు నట్లు.. తక్కువగా వస్తే పట్టించుకోవడం లేదని అసలే ఆలోచించొద్దు. లేదా తమను ఫ్రెండ్ జాబితా నుంచి తొలగించారని మదనపడడంలాంటివి చేయొద్దు. ఎన్నోరకాల సామాజిక వెబ్సైట్ల మాదిరిగానే దీన్ని పరిగణించాలి. ఏ మేరకు వినియోగించాలి.. ♦ స్నేహితులతో టచ్‌లో ఉండడం.. కొత్త స్నేహాలను సంపాదించుకోవడం. ప్రపంచసమాచార వేదికపై అప్డేట్గా ఉండడం. ♦ ప్రపంచంలోని కొత్త, మంచి విషయూలనునేర్చుకోవడం. ♦ ఏ ఫొటో, కామెంట్ పోస్టింగ్ చేసినా తమ ఇమేజ్ను పెంచేలా.. నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. ♦ ఉద్యోగ, వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. ♦ ఫొటోలు, కామెంట్స్ పోస్టింగ్ విషయంలోగందరగోళం ఉండరాదు. నోటి నుంచి జారిన మాట.. ఫేస్బుక్లో ఎంటర్ చేసిన కామెంట్ ఒకటేనని గుర్తుంచుకోవాలి. ♦ ఫేస్‌బుక్‌లోకి వెళ్లగానే పెద్దసంఖ్యలో ఫొటోలు, కామెంట్లు పెట్టడం వృథా. అంతగా చదివే ఓపిక ఎవరికీ ఉండదని గుర్తుంచుకోవాలి. ♦ ఫొటో అప్లోడ్ చేసే ముందే దాన్ని ఒకటికిరెండుసార్లు చూడండి.. కామెంట్లను చదవండి అంతేకానీ పోస్ట్ చేశాక తలలు పట్టుకుంటే చేసేదేమీ ఉండదు. ఇవి అసలే వద్దు ♦ అందరికీ తెలిసేలా ఫోన్ నంబర్లు, ఇంటి వివరాలు, చిరునామాలు, ఫొటోలు పెట్టొద్దు. ♦ తమ కార్యాలయం.. చేస్తున్న ఉద్యోగంపై రహస్య సమాచారాన్ని లీక్ చేయడం ఉండొద్దు. ♦ మందుకొట్టి బైక్ డ్రైవ్ చేశానని, మొన్న ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేశానని పోస్ట్‌చేసి అనవసర రిస్క్‌లు వద్దు. ♦ ఒకప్పటి ప్రేమలు, పెళ్లిళ్లపై వ్యాఖ్యలు వద్దు. ♦ స్నేహితుల పోస్ట్‌లు.. కామెంట్లపై తీవ్రంగా స్పందించడం.. సవాల్ విసరడం లాంటివి చేయొద్దు. ♦ స్నేహితుల ఫొటోలు వారి అనుమతి లేకుండా పోస్ట్ చేయడం మంచిది కాదు. ♦ మనసు బాగోలేనప్పుడు ఫేస్‌బుక్‌లోకి వెళ్లవద్దు. ♦ ఆఫీసు విషయూలు.. కుటుంబ సమస్యలు.. పర్సనల్‌ముచ్చట్లు వద్దు. ♦ వ్యంగమైన చిత్రాలు పెట్టడం.. ♦ మరొకరిని కించ పరిచేలా ఫొటోలు మార్ఫింగ్ చేయడం.. కామెంట్లు పెట్టడం చేయొద్దు. ♦ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తికి డబ్బులు లావాదేవీలు జరపడం.. వినోదాలకు పిలిస్తే వెళ్లడం లాంటివి అసలేవద్దు. ♦ రెచ్చగొట్టే.. అవమానపరిచే ఫొటోలకు లైక్‌లు కొట్టడంచిక్కుల్లో పడేందుకేనని గుర్తుంచుకోవాలి. అమ్మాయిలూ.. జర జాగ్రత్త ఫేస్బుక్ అనేది స్నేహానికి వారధి మాత్రమేనన్న విషయాన్ని మరిచిపోయి చాలా మంది దానికి బానిసలవుతున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా సెల్‌ఫోన్, కంప్యూటర్ముందు కూర్చుని పోస్టులు, లైక్‌లు, కామెంట్లు, షేర్లుతో కాలం గడిపేస్తున్నారు. ఫేస్బుక్ మాయలోపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అడ్డంగా బుక్ అవుతూ ఊచలు లెక్కిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్లో స్నేహం చేయడం వల్ల ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సెట్టింగ్స్ తప్పనిసరి... ఫేస్బుక్ నుంచి ప్రమాదంలోకి పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. అలాగే విలువైన వ్యక్తిగత సమాచారం ఫేస్బుక్లో పెట్టకపోవడం ఉత్తమం. మనం పోస్టు చేసే చిత్రాలు, కామెంట్స్‌ని మన సమీపం వారే చూసేలా సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. వచ్చిన ప్రతి ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’కు ఓకే చెప్పకూడదు. తెలిసిన వారా లేదాఅని ఆక్సెప్ట్ చేయడం మంచిది. అనవసర ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఓకే చేయడం సమస్యలకు స్వాగతం పలికినట్లేనని గుర్తుంచుకోవాలి. చాలావరకు ఫేస్బుక్ అకౌంట్లలో అసత్యాలే ఎక్కువగా ఉంటాయి. ఎవరో కావాలనే యువతుల పేర్లు.. ఫొటోలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు. అలాంటివారే రిక్వెస్ట్‌లు పంపిస్తుంటారు. వాటిబారిన పడి మోసపోవద్దు.