సోషల్ మీడియాకు బానిసలైతే... | Social media addict... | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాకు బానిసలైతే...

Published Wed, Jun 1 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

సోషల్ మీడియాకు బానిసలైతే...

సోషల్ మీడియాకు బానిసలైతే...

‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘ధనలక్ష్మి ఐలవ్ యూ, ‘మీ ఇంటికొస్తే ఏమిస్తారు.. మా ఇంటి కొస్తే ఏం తెస్తారు’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు ఆదిత్య ఓం. తొలిసారి ఆయన దర్శకునిగా మారి, తెరకెక్కించిన చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. మోడరన్ సినిమాపై విజయవర్మ పాకలపాటి నిర్మాణ నిర్వహణలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెలాఖరులో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుంది. యూత్‌ఫుల్ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. దర్శకునిగా నాకు మంచి పేరు తెస్తుంది’’ అని పేర్కొన్నారు.

చిత్ర నిర్మాణ నిర్వాహకుడు, సహ నిర్మాత విజయవర్మ మాట్లాడుతూ -‘‘నేటి యువత సోషల్ మీడియాకు ఎలా బానిసలవుతున్నారు? దాని వల్ల ఎటువంటి అనర్థాలు ఏర్పడుతున్నాయి? అనే పాయింట్‌తో ఈ చిత్రం నిర్మించాం’’ అని తెలిపారు. ఆదిత్య ఓం ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం: లవన్ వీరన్, కెమెరా: సిద్ధార్థ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement