సాక్షి,గుంటూరు: ఆడపిల్లలాగానే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాడు.. మాయ మాటలతో మోసం చేస్తాడు.. ఆర్ధిక స్థితి సరిగా లేదంటూ.. డబ్బులు అడుగుతాడు.. లేదంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తానంటూ.. బెదిరింపులకు దిగుతాడు. ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని సైతం బెదిరింపులకు గురి చేసి ఆమె ఫిర్యాదు చేయటంతో పోలీసులకు దొరికిపోయాడు. నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్టేషన్ సీఐ ఎం. హైమారావు వివరాలను మీడియాకు వెల్ల డించారు. గుంటూరులోని సంజీవయ్య నగర్‌కు చెందిన పి.రామ్‌ప్రకాష్ అలియాస్ మున్నా జేకేసి లా కళాశాలలో బీఏ ఎల్‌ఎల్‌బీ నాల్గవ సంవత్స రం చదువుతున్నాడు.రెండు సంవత్సరాలుగా జీజీహెచ్‌లో కలెక్షన్ బాయ్‌గా పని కూడా చేస్తున్నాడు.
ఈ క్రమంలో తన సెల్‌ఫోన్‌లో ‘రామ్‌పూనూరి 2’ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్‌లో చాట్ చేస్తూ.. ఉంటాడు. అమ్మాయిలతో చాట్ చేయాలనే దురుద్దేశ్యంతో గత ఏడాది డిశెంబర్‌లో ‘ప్రియా1239301’ పేరుతో మరో అకౌంట్ తెరిచి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతూ ఉండేవాడు. సుమారు 350 మంది మహిళలు తనఫ్రెండ్స్ గ్రూపులో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో శ్రీనివాసరావుపేటకు చెందిన ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం అభ్యసిస్తున్న ఒక విద్యార్థినికి రిక్వెస్ట్ పెట్టగా, ఆమె రామ్‌ప్రకాష్ రిక్వెస్ట్‌ను అంగీకరించింది. అయితే విద్యార్థినికి మాయమాటలు చెప్పి, తన ఆర్థికస్థితి సరిగ్గా లేదని నమ్మబలికి ఆమె వద్ద నుంచి రూ.85 వేల వరకు తీసుకుని జల్సాలకు వాడుకున్నాడు.
దీంతో పాటు విద్యార్థిని భయపెట్టి ఆమె అకౌంట్ పాస్‌వర్డ్, ఐడీ తీసుకుని ఆమె ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో విద్యార్థిని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరటంతో, డబ్బులు అడిగితే తన ఫోటోలు మార్ఫింగ్ చేసి, ఆశ్లీలంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. విషయాన్ని విద్యార్థిని తల్లితండ్రులకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జీజీహెచ్‌లోని సైకిల్ స్టాండ్ వద్ద గురువారం నిందితు డిని అరెస్ట్ చేసి కోర్టు కు హాజరుపరిచినట్లు తెలిపారు.రామ్ ప్రకాష్ ఇతరత్రా వేరే మహిళలతో ఇదే విధంగా వ్యవహరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి పోలీసులు ఓ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment