చెన్నై: చంద్రుడి క క్ష్యను దాటి అరుణగ్రహం దారిలో నిరంతరాయంగా దూసుకుపోతున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్-మంగళ్‌యాన్) ఉపగ్రహంపై పర్యవేక్షణలో గత ఆదివారం ఐదు నిమిషాలపాటు అంతరాయం కలిగిందట. గత ఆదివారం తెల్లవారుజామున మామ్‌లోని ద్రవ ఇంధన ఇంజన్‌ను మండించి దానిని భూకక్ష్య నుంచి అంగారక గ్రహం దారిలోకి పంపిన సంగతి తెలిసిందే.
అయితే అందుకు కొన్ని సెకన్లకు ముందుగానే.. మామ్‌ను పర్యవేక్షించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)దక్షిణాఫ్రికాలో ఏర్పాటుచేసుకున్న హార్ట్‌బీస్తోక్(హెచ్‌బీకే) గ్రౌండ్ స్టేషన్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఉపగ్రహాన్ని అరుణగ్రహం దారిలోకి మళ్లిస్తున్నా.. ఈ గ్రౌండ్ స్టేషన్‌కు ఐదు నిమిషాలపాటు సమాచారమేదీ అందలేదట. ఇస్రో ఈ మేరకు సోమవారం తన ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించింది.