mars planet
-
ఎర్త్ టూ మార్స్.. వయా మూన్!
చంద్రుడిపై ఓ వెయ్యి గజాలు కొని పెట్టేస్తే బెటరేమో! అలాగే అమ్మాయి పేరు మీద అంగారకుడిపై ఓ ఎకరం కొని పెడితే పెళ్లి టైమ్‌కి పరుగులు ఉండవు మరి!! ఇక భూమ్మీద ఉన్న తల్లిదండ్రులు ఇలాంటి కబుర్లు చెప్పుకోవలసిన సమయం దగ్గర్లోనే ఉందంటున్నారు. ఎందుకంటే.. భూమ్మీద కొన్నేళ్లుపోతే నిలబడ్డానికే చోటు ఉండదు. ఈ వెధవ కాలుష్యం... గొడవలూ ఎవడు పడతాడు. శుభ్రంగా మరో గ్రహంపై సెటిలైపోతే విశ్రాంత జీవితం ప్రశాంతంగా ఉంటుందని లెక్కలు వేసుకునే కాలం వచ్చేస్తోంది. అంగారక అలియాస్ అరుణ గ్రహం లేదంటే ఇంగ్లిష్‌లో మార్స్! పేర్లేవైతేనేం...అక్కడో పెద్ద మంచుగడ్డ సైంటిస్టులకు నిద్రలేకుండా చేస్తోంది. ఆ మంచు నిధిని చూసినప్పటి నుంచి ఖగోళశాస్త్ర వేత్తలు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. పొరుగూరి కెళ్లినంత తేలిగ్గా మార్స్ వెళ్లిపోదాం సామాను సర్దుకుని రెడీగా ఉండండంటున్నారు. ఎందుకంటే అంతరిక్షంలో మనిషి మకాం వేయడం ఖాయమనే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. మరీ ముఖ్యంగా మనిషి జీవించడానికి చంద్రుడితో పాటు.. అంగారకుడిపైనా అవకాశాలున్నాయని పరిశోధకులు టెలిస్కోప్ గుద్ది మరీ చెబుతున్నారు. భూమ్మీద ఉన్న మావయ్యని.. చందమామపై ఉన్న అత్తయ్య దగ్గరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అందరూ కలిసి... అంగారకుడిపై వినోదయాత్రకు బయలు దేరదాం అని ఇప్పుడెవరైనా అంటే పిచ్చి పట్టిందేమో అని భయం భయంగా చూస్తారేమోకానీ.. మరో యాభై ఏళ్ల తర్వాత అది అత్యంత సహజమైన పరిణామమవుతుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటోంది. ఆ మధ్య చంద్రుడిపైనా, అంగారకుడిపైనా కూడా నీటి జాడలు కచ్చితంగా ఉన్నాయని తేలడం తోనే అక్కడ మనిషి జీవించడానికి అనువైన వాతావరణం ఉంటుందని ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ముందుగా చంద్రుడిపై గ్రామాలు కట్టేస్తారట. ఆ గ్రామాల్లో చక్కటి ఇళ్లు నిర్మించేసి భూమి నుంచి వలస వచ్చేవారి కోసం సిద్ధంగా ఉంచుతారట. చంద్రుడిపై విస్తారంగా ఇళ్లు కట్టేశాక కాలనీ కోసం అంగారకుడిపైకి వెళ్తారట. అంగారకుడి పైనా విశాలమైన కాలనీలు నిర్మించి.. మనుషులు మకాం పెట్టడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తారట. ఇదంతా ఎందుకంటే... ఇప్పటికే మితిమీరిన జనాభాతో భూమి కిక్కిరిసిపోతోంది. మరో యాభై ఏళ్లు దాటితే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. భూమిపై కాలు మోపడానికి కూడా ఖాళీ స్థలం ఉండకపోవచ్చు. అప్పుడు కొత్తగా పుట్టబోయే వారికి భూమ్మీద నివసించడానికి చోటే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో రాబోయే తరాల భూగ్రహ వాసులు ఏం చేయాలి? దానికి సమాధానంగానే చంద్రుడు, అంగారకుడిపై దృష్టి సారించారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఆ కాలనీలు కానీ కట్టడం పూర్తయితే... భూమి నుంచి పెద్ద సంఖ్యలో జనం కొత్త గ్రహాలకు వలసపోతారన్నమాట! మరో వందేళ్లు దాటిందనుకోండి భూమిపై ఉన్న వారికి చంద్రుడిపైనా, అంగారకుడిపైనా కూడా చుట్టాలు ఉండచ్చు. భూమిపై ఉండేవారు మునుముందు తమ చుట్టాలను చూసి రావడానికి చంద్రుడిపైకి, అంగారకుడిపైకి అంతరిక్ష నౌకల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. భూమ్మీద జనాభా పెరిగిపోవడంతో పాటు.. రోజురోజుకీ పెరిగిపోతోన్న కాలుష్యం భూమిని ప్రమాదకరమైన గ్రహంగా మార్చేస్తోంది. భూమి చుట్టూరా ఉన్న వాతావరణమంతా విషమయమై పోతోంది. అంతులేని భూతాపం భూమిపై మానవ జాతి మనుగడకే సవాల్ విసురుతోంది. గాలితో పాటు భూమిలోని నీరు, అంతరిక్షం కూడా కలుషితమైపోతున్నాయి. వీటికితోడు మానవాళి వినాశనానికి దారి తీసే అణ్వాయుధాల భయమూ పెరుగుతోంది. ఏ క్షణంలో ఏ దేశం అణు బాంబును ప్రయోగిస్తుందో తెలీని ఉత్కంఠ నెలకొంది. అడిలైడ్‌లో 4వేల మంది అంతరిక్ష పరిశోధకులతో జరిగిన వార్షిక సమావేశంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ కొత్త గ్రహాలపై కాలనీల ఏర్పాటు గురించి ఆశావహ దృక్పథంతో ప్రచారం చేసింది. అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని అందులో 17 ఏళ్లుగా నివసిస్తున్నామని ఈ సమావేశంలో స్పేస్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది. చంద్రుడి ఉపరితలంపై శాశ్వత ఆవాసాల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందనే తాము భావిస్తున్నామని ఏజెన్సీకి చెందిన శాస్త్రవేత్త పియరో మెస్సినా వివరించారు. రానున్న పదేళ్లల్లో చంద్రుడిపై గ్రామం నిర్మాణానికి సంబంధించి అనువైన సమాచారాన్ని సేకరించి ప్రణాళికలు రూపొందించేందుకు మిషన్లను తయారు చేస్తున్నట్లు మెస్సినా పేర్కొన్నారు. మొత్తం మీద ‘మా పెద్దబ్బాయి భూమ్మీద పని చేస్తున్నాడు. రెండో అబ్బాయి చంద్రుడిపైనా... మా అమ్మాయి అంగారకుడిపైనా ఉద్యోగాలు చేసుకుంటున్నారు’ అని తల్లిదండ్రులు మురిసి పోయే రోజులు దూరంలో లేవన్నమాట. అప్పుడు మూడు గ్రహాలపైనా చుట్టాలుంటారు. అన్నీ బానే ఉన్నాయి కానీ... అసలు సౌర వ్యవస్థలో ప్రాణులు జీవించడానికి ఆస్కారమున్న గ్రహాలున్నాయా అని? మనిషి ఆశాజీవి కదా! అసాధ్యమన్నదే తన డిక్షనరీలో లేదనుకుంటాడు. ప్రకృతినీ తాను శాసించేయగలనని అనుకుంటూనే ఉంటాడు. సాధ్యం కాని ఎన్నో ఘనతలను ఇలాంటి ధీమాతోనే సాధించి పారేశాడు కూడా! మరయితే మనిషి వేరే గ్రహాలపై కాపురం పెట్టేస్తాడా? ఏమో... గుర్రం ఎగరావచ్చు!! -
నాస్తికత కూడా ఒక విశ్వాసమే అని మరచారు!
స్పందన అక్టోబర్ 10న ‘దైవికం’లో ‘ఖగోళ అవిశ్వాసి’ అనే శీర్షికతో స్టీఫెన్ హాకింగ్ మీద మాధవ్ శింగరాజు రాసిన ఆర్టికల్‌కి స్పందనగా ఈ ఉత్తరం. సైన్సు అన్న పదానికి నిర్వచనం, పరిధి అవగాహన చేసుకోకుండా ఆయన దీనిని రాశారనుకోవాలి. ఒక ప్రసిద్ధ మత పెద్ద దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఒక ఆస్తికుడికి వచ్చేంత బాధను ఆయన అనుభవించినట్లున్నారు! స్టీఫెన్ అలా మాట్లాడకపోవడం వింత కాదని, మన శాస్త్రవేత్తలు అంగారక గ్రహం మీదకు రాకెట్టు పంపేటప్పుడు పూజ చేయడం ఒక వైచిత్రి అని ఆయన గమనించలేకున్నారు. ‘సైన్సు లేని మతం కుంటిది, మతం లేని సైన్సు గుడ్డిది’ అన్న 20వ శతాబ్ది సువిఖ్యాత ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా ‘దేవుడి పట్ల నమ్మకం పిల్ల చేష్ట’, ‘మతానికి చెందిన కథలు మూఢనమ్మకాలు’ అని తన చివరి రోజుల్లో ప్రకటించాడని వాల్టన్ నెజాక్సన్ ఇటీవలి ఐన్‌స్టీన్ బయోగ్రఫీలో ప్రస్తావించాడని తెలిస్తే ఐన్‌స్టీన్‌ని మాధవ్ గారు ఎన్ని మాటలు అని ఉండేవారో! మాధవ్ గారు సకల సృష్టినీ ఒకే కళ్లద్దాల ద్వారా చూస్తున్నట్లున్నారు. అందుకే ఆయన ‘విశ్వాసం’ అనే పదాన్ని ఆస్తికులకు ధారాదత్తం చేశారు. విశ్వాసం, నమ్మకం వంటి పదాలు పలు రకాల విషయాలకు ఆపాదితాలు అని మరిచారు. అసలు నాస్తికత కూడా ఒక విశ్వాసమే అని మరవడం దారుణం. ప్రపంచమంతా దైవం, దాని ఆధారిత మతాల పట్ల నమ్మకం లేకపోవడం వల్ల గాక... ఆ నమ్మకం, విశ్వాసం ముదిరి మూఢంగా, మూర్ఖంగా తయారై సాటి జీవుల పట్ల వైషమ్యాలు, కక్షలు, హననాలకు కారణం అవుతున్నప్పుడు, ఇటువంటి వ్యాఖ్యల వల్ల (స్టీఫెన్ హాకింగ్ చేసిన వ్యాఖ్యల వల్ల ) వాటి కాఠిన్యం కాస్తయినా తగ్గి సకల సృష్టికి మంచి జరుగుతుందని ఆశిద్దాం. - ఒక అజ్ఞేయతావాది (Agnostic) -
11.70 కోట్ల కి.మీ. దూరంలో ‘మంగళ్యాన్’!
బెంగళూరు: అంగారకుడిపై పరిశోధనల కోసం ఇస్రో గతేడాది నవంబరులో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్-మంగళ్యాన్) ఉపగ్రహం భూమి నుంచి 11.70 కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది. సెకనుకు 23 కి.మీ. వేగంతో దూసుకుపోతున్న మామ్ మరో 92 రోజుల్లో 2.40 కోట్ల కి.మీ. ప్రయాణించి మార్స్ కక్ష్యను చేరుకోనుందని ఇస్రో వెల్లడించింది. మామ్ నుంచి భూమిపై ఉన్న గ్రౌండ్ స్టేషన్లకు సంకేతాలు అందేందుకు 6 నిమిషాల 30 సెకన్లు పడుతోంది. ఉపగ్రహం మార్స్ వైపుగా సరైన మార్గంలోనే వెళ్లేందుకుగాను జూన్ 11న రెండో మార్గ సవరణ ప్రక్రియను నిర్వహించారు. -
భూమి, చంద్రుడి వయసు 6 కోట్ల ఏళ్లు ఎక్కువ..!
సౌరకుటుంబంలో మన భూగోళం గ్రహంగా రూపుదిద్దుకుని సుమారు 450 కోట్ల సంవత్సరాలు అయిందని అంచనా. అలాగే భూమి ఏర్పడిన కొంత కాలానికే అంగారకుడి సైజులో గల ఓ గ్రహం వంటి వస్తువు ఢీకొట్టిందని, ఫలితంగా భూమి నుంచి వేరుపడిన ముక్కలు కలిసి చంద్రుడిగా ఏర్పడ్డాయనీ శాస్త్రవేత్తలు చెబుతారు. అయితే ఇప్పటిదాకా ఉన్న అంచనాల కంటే భూమి, చంద్రుడి వయసులు మరో 6 కోట్ల ఏళ్లు ఎక్కువగానే ఉండొచ్చంటున్నారు ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లారెన్‌కు చెందిన అవీస్, బెర్నార్డ్ మార్టీలు. వివిధ వాయువుల(ఐసోటోపుల) శాతాలను, స్థితులను బట్టి భూమిపై వాతావరణపరంగా కీలక పరిణామాలను అంచనా వేసే రేడియో డేటింగ్ పద్ధతిలోనే తాము కూడా పరిశోధించామని వీరు వెల్లడించారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలలో లభించిన 340 కోట్లు, 270 కోట్ల ఏళ్లనాటి క్వార్ట్జ్ ఖనిజాలలో చిక్కుకుపోయిన జెనాన్ వాయువుపై అధ్యయనం చేసిన తాము రేడియో డేటింగ్ పద్ధతిలో కాలాన్ని అంచనా వేసినట్లు తెలిపారు. -
అక్కడకు వెళ్లడం సాధ్యమేనా...
అంగారకుడు... అదొక గ్రహం... అక్కడ మానవాళి మనుగడ సాధ్యమే... అక్కడ నీళ్లు ఉన్నాయి... అక్కడ మట్టి ఉంది... అక్కడ వాతావరణం ఉంది... అక్కడ గాలి ఉంది... ఇన్ని ఉన్నచోటికి మనుషులు వెడితే ఎంత బాగుంటుంది! ఇది సాధ్యమేనా..? అక్కడకు వెళ్లగలమా..? మేం తీసుకువెడతాం అంటున్నారు డచ్ సంస్థవారు. అంగారకుడు... ఎర్రటి గ్రహం... ఊహించుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఒక దేశం నుంచి మరొక దేశం వెళితేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అటువంటిది ఒక గ్రహం నుంచి మరొక గ్రహం మీదకు వెళ్లడమంటే మరింత అద్భుతంగా ఉంటుంది. అక్కడకు తీసుకువెళ్లడానికి కొంతమందిని ఎంపిక చేసింది డచ్ కంపెనీ. ఎంపికైనవారి మనోభావాలు... అటూఇటూ తిరగాలి... ‘‘నాకు ఏలియన్స్‌ని కలవాలని ఉంది. ఈ విశ్వంలో మనం మాత్రమే కాకుండా ఇంకా వేరేవారు ఉండి ఉంటారని నా ప్రగాఢ విశ్వాసం. వీలైతే నాకు భూమి మీద, అంగారకుడి మీద కూడా అటూఇటూ తిరుగుతూ నివసించాలని ఉంది’’ అంటారు ఢిల్లీలోని గుర్గావ్లో నివసిస్తున్న ఇంజనీరింగ్ చదువుతున్న 21 ఏళ్ల అమూల్య నిధి రస్తోంగీ. 2024లో డచ్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంగారకుడి మీదకు తీసుకువెళ్లడానికి ఆసక్తి ఉన్నవారి కోసం పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రెండు మిలియన్ల అప్లికేషన్లు వచ్చాయి. అందులో నుంచి 1058 మందిని ఎంపిక చేశారు. అంగారకుడి మీద నివాస స్థానాలు ఏర్పాటుచేయాలని ఈ సంస్థ ఆశిస్తోంది. ఈ సెలక్ట్ అయిన వారి నుంచి వివిధ అంశాల మీద పోటీ నిర్వహించి చివరగా ఇరవైనాలుగు మందిని ఎంచుకుని, వారిని అంగారకుడి మీదకు పంపుతారు. ఈ భారీ ప్రాజెక్టుకి, భారతదేశం నుంచి అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయి. అందులోనుంచి ఆరవెరైండు మందిని ఎంపిక చేశారు. ఇక్కడకు వెళ్లేవారికి ముందుగా ఏడు సంవత్సరాల ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఈ ప్రాజెక్టు 2015 లో ప్రారంభం అవుతుంది. ఈ శిక్షణ వల్ల వారు శారీరకంగా, సాంఘికంగా తక్కువ మందితో ఉండటం అలవాటవుతుంది. భారతదేశం నుంచి ఎంపికైనవారిలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు, స్టాక్ బ్రోకర్ల నుంచి వైట్‌కాలర్ ప్రొఫెషనల్స్ వరకు ఉన్నారు. వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేదు... కలకత్తాకు చెందిన 24 ఏళ్ల ‘ఎనర్జీ ప్రొఫెషనల్’ ఆరిందమ్ సాహా, ఈ ప్రయాణం కోసం వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. ‘‘అంగారకుడి మీదకు వెడదామనుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకురారు. అందువల్ల నేను వివాహం గురించి ఆలోచన చేయట్లేదు. నాకు అమ్మాయిలతో స్నేహం కూడా లేదు. అంతేకాదు అసలు పెళ్లి మీదే వ్యామోహం లేదు’’ అన్నారు సాహా. ముంబైకి చెందిన 45 ఏళ్ల స్టాక్ బ్రోకర్ ఆశిశ్ మెహతా, ‘అంగారకుడి మీదకు వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను’’ అంటారు. ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను... ‘‘ఇరవయ్యో యేట నా వివాహం జరిగింది. ఇప్పుడు మా అబ్బాయికి 19, అమ్మాయికి 17. నేను ఇప్పటికి సుమారు 60 మిలియన్ల రూపాయలు దాచాను. మా కుటుంబానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశానని భావిస్తున్నాను. పది సంవత్సరాల తర్వాత అంగారకుడి మీదకు బయలుదేరేటప్పటికి మా అబ్బాయికి 29, అమ్మాయికి 27 వస్తాయి. అప్పటికి వారి చదువులు, పెళ్లిళ్లు కూడా పూర్తవుతాయి. బహుశ మనవల్ని, మనవరాళ్లని కూడా చూస్తానేమో!’’ అన్నారు. ఇంకా... ‘‘వచ్చిన అప్లికేషన్లలో మమ్మల్ని ఎంచుకుని, మాకు శిక్షణ ఇప్పించినప్పటికీ, అంగారక గ్రహం మీదకు వెళ్లాక ఎలా మనగలుగుతామోననే భయం మాత్రం ఉంది. అక్కడి వాతావరణం బరువుగా కాకుండా తేలికగా, బాగా చల్లగా ఉంటుంది. నీరు గడ్డకట్టి ఉంటుంది. అది కూడా భూగర్భంలో మాత్రమే లభిస్తుంది. రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. అక్కడకు వెళ్లడానికి నిధులు, సాంకేతికత ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి’’ అని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇది సాధ్యం కాదు... భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న ప్రొఫెసర్ జెరార్డ్ హూఫ్ట్, ఈ ప్రాజెక్టు గురించి విని ఆశ్చర్యపోయారు. ఎంపిక చేయబడినవారిని అంగారకుడి మీదకు పంపడానికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ‘‘వీరి ప్రయాణానికి తగిన నిధులు ఎక్కడినుంచి వస్తాయో నాకు అర్థం కావడంలేదు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రణాళిక’’ అన్నారు ఆయన. అయితే అంగారక గ్ర హం కో ఫౌండర్ అయిన బాస్ లాన్స్డ్రాప్ మాత్రం, అంగారకుడి మీదికి పది సంవత్సరాల మానవులను విజయవంతంగా పంపగలనని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా ఖర్చవుతుంది... ఈ మిషన్‌కు తమకు ఆరు బిలియన్ పౌండ్ల ధనం అవసరమవుతుందని, ఆ ధనాన్ని పెద్దపెద్ద పారిశ్రామికవేత్తల నుంచి సేకరిస్తామని, అదేవిధంగా ఈ ఈవెంట్‌ని ప్రసారం చేసేవారి దగ్గర నుంచి కూడా కొంత సేకరిస్తామని చెప్పారు. ‘‘లండన్ ఒలింపిక్స్ ఈవెంట్ ద్వారా, వాణిజ్య ప్రకటనల ద్వారా నాలుగు బిలియన్ల డాలర్లు సేకరించగలిగితే అంగారకుడి మీదకు వెళ్లడం ఎందుకు సాధ్యం కాదు? అంటారు ఆయన. ‘‘ఒలింపిక్స్ చూసినట్టుగానే మా ఈవెంట్‌ను కూడా ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇదొక అద్భుతమైన సంఘటన’’ అన్నారు ఆరిందమ్ సాహా. ఈ యాత్రకు ఎంపికైనవారు అంగారకుడి మీద నివాసాలు ఏర్పడతాయని ఆశావహంగా ఉన్నారు. ‘‘నేనొక ఉదాహరణగా ఉండాలనుకుంటున్నాను’’ అంటున్నారు విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న వినోద్ కోటియా. ‘‘భూమికి ఏదో జరిగిపోతుందని నేను ఎన్నటికీ అనుకోను. జీవితంలో లభించిన అదృషం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను’’ అన్నారు వినోద్ కోటియా. - డా.వైజయంతి -
మరుగుజ్జు గ్రహంపై నీటిఆవిరి!
వాషింగ్టన్: అంగారక, గురు గ్రహాల మధ్య గ్రహశకలాలు తిరిగే ఆస్టరాయిడ్ బెల్ట్‌లో సీరీజ్ అనే మరుగుజ్జు గ్రహం నుంచి నీటి ఆవిరి విడుదలవుతోందట. సూర్యుడికి దగ్గరగా వెళ్లినప్పుడల్లా సీరీజ్ వేడెక్కుతోందని, ఫలితంగా దాని నుంచి నీటి ఆవిరి విడుదలవుతోందని ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈఎస్ఏ) శాస్త్రవేత్తలు హెర్షెల్ స్పేస్ టెలిస్కోపు సాయంతో కనుగొన్నారు. ఆస్టరాయిడ్ బెల్ట్‌లో అతిపెద్ద వస్తువు అయిన సీరీజ్ సుమారు 950 కి.మీ. సైజు ఉంటుంది. దీనిని తొలుత 1801 సంవత్సరంలో కనుగొన్నారు. ఆస్టరాయిడ్కు ఎక్కువ.. గ్రహానికి తక్కువ.. కావడంతో సీరీజ్ను మరుగుజ్జు గ్రహం(డ్వార్ఫ్ ప్లానెట్)గా ధ్రువీకరించారు. ఆస్టరాయిడ్ బెల్ట్‌లో ఒక వస్తువుపై నీటి ఆవిరిని గుర్తించడం ఇదే తొలిసారి. సీరీజ్ ఉపరితలంలో మంచు, అంతర్భాగంలో శిలలు, భారీ ఎత్తున మంచు ఉంటుందని, ఆ మంచును కరిగిస్తే గనక.. భూమిపై ఉన్న మంచినీటి కంటే ఎక్కువ పరిమాణంలోనే నీరు వెలువడుతుందని అంచనా. -
‘మామ్’ పర్యవేక్షణలో స్వల్ప అంతరాయం!
చెన్నై: చంద్రుడి క క్ష్యను దాటి అరుణగ్రహం దారిలో నిరంతరాయంగా దూసుకుపోతున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్-మంగళ్యాన్) ఉపగ్రహంపై పర్యవేక్షణలో గత ఆదివారం ఐదు నిమిషాలపాటు అంతరాయం కలిగిందట. గత ఆదివారం తెల్లవారుజామున మామ్‌లోని ద్రవ ఇంధన ఇంజన్‌ను మండించి దానిని భూకక్ష్య నుంచి అంగారక గ్రహం దారిలోకి పంపిన సంగతి తెలిసిందే. అయితే అందుకు కొన్ని సెకన్లకు ముందుగానే.. మామ్‌ను పర్యవేక్షించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)దక్షిణాఫ్రికాలో ఏర్పాటుచేసుకున్న హార్ట్బీస్తోక్(హెచ్‌బీకే) గ్రౌండ్ స్టేషన్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఉపగ్రహాన్ని అరుణగ్రహం దారిలోకి మళ్లిస్తున్నా.. ఈ గ్రౌండ్ స్టేషన్‌కు ఐదు నిమిషాలపాటు సమాచారమేదీ అందలేదట. ఇస్రో ఈ మేరకు సోమవారం తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించింది. -
అరుణగ్రహం దిశగా భారత్ ప్రయాణం ప్రారంభం
సి. హరికృష్ణ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ భూమి ఆవల రోదసి శోధనలో భాగంగా అంగారక గ్రహం అధ్యయనానికి ఉద్దేశించిన ‘మంగళయాన్’ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా పీఎస్ఎల్వీ-సీ25 నౌక ద్వారా ప్రయోగించింది. ఈ క్రమంలో 40 కోట్ల కిలోమీటర్ల దూరంలోని అంగారక గ్రహాన్ని చేరే ప్రయత్నంలో తొలిదశ విజయవంతమైంది. మొట్టమొదటిది పీఎస్ఎల్వీ-సీ25 ద్వారా మంగళయాన్(మార్స ఆర్బిటార్) ను 246.9 కిలోమీటర్ల పెరీజీ, 23,560 కిలోమీటర్ల అపాజీ కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగంతో కలిపి 1993 నుంచి ఇప్పటి వరకూ ఇస్రో 25 సార్లు పీఎస్ఎల్వీని ప్రయోగించింది. ఇందులో 1993 సెప్టెంబర్ 20న నిర్వహించిన మొదటి పీఎస్ఎల్వీ ప్రయోగం (పీఎస్ఎల్వీ-డీ1) మాత్రమే విఫలమైంది. దీన్ని మినహాయిస్తే మిగతా ప్రయోగాలు వరుసగా విజయవంతమయ్యాయి. మొత్తం మీద ఇస్రోకిది 109వ ప్రయోగం.. గ్రహాంతర పరిశోధనల్లో ఇదే మొట్టమొదటిది. సామర్థ్యం పెంచిన స్ట్రాప్ ఆన్ మోటార్ల ద్వారా పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ రూపంలో పీఎస్ఎల్వీ-సీ25ని ఇస్రో ప్రయోగించింది. గతానికి భిన్నంగా మొదటిసారిగా దీర్ఘ కాలంపాటు నిర్వహించిన పీఎస్ఎల్వీ ప్రయోగంగా పీఎస్ఎల్వీ-సీ25 రికార్డుకెక్కింది. గత పీఎస్ఎల్వీ ప్రయోగాలు అత్యధికంగా 18 నిమిషాలు కాగా, పీఎస్ఎల్వీ-సీ25 ప్రయాణం 44 నిమిషాలపాటు సాగింది. పీఎస్ఎల్వీలోని నాలుగో దశ బర్న అవుట్ జరిగిన 37 నిమిషాలకు మార్స ఆర్బిటర్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 300 రోజుల ప్రయాణం మంగళయాన్ భూకక్ష్యను వీడి డిసెంబర్ 1న అంగారక ప్రయాణానికి సిద్ధమవుతుంది. ఈ లోపల మంగళయాన్లోని ఆన్బోర్డ ఇంజిన్లలోని ద్రవ ఇంధనాన్ని ఐదు దశల్లో మండించి కక్ష్యను పెంచుతారు. భూమి కక్ష్యను విజయవంతంగా వీడి 300 రోజులపాటు సాగే ప్రయాణం పూర్తయితే 2014, సెప్టెంబర్ 24న మంగళయాన్ అంగారక కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. మార్స ఆర్బిటార్‌లో ప్రధానంగా ఐదు పరికరాలు ఉన్నాయి. ఒకటి మీథేన్ సెన్సర్ ఫర్ మార్స (ఎంఎస్ఎం). అంగారక వాతావరణంలో మీథేన్‌ను పసిగట్టే ప్రయత్నం చేస్తుంది. అంగారక వాతావరణంలోని ప్రతి బిలియన్ భాగాల్లో మీథేన్ (పీపీబీ పార్ట్స పర్ బిలియన్) ను ఈ పరికరం లెక్కిస్తుంది. ఈ వాయువు జీవం ఉనికిని సూచికగాను, భవిష్యత్‌లో అక్కడ జీవావిర్భావం జరిగే అవకాశాలను తెలియజేస్తుంది (భూమిపై జీవరసాయనాల ఆవిర్భావం, తద్వారా జీవ ఆవిర్భావంలో మీథేన్ పాత్ర చాలా కీలకమైందిగా ఇప్పటికే ఆధారాలతో సహా గుర్తించారు). అంగారక ఉపరితలం నుంచి పరావర్తనం చెందే సౌరకాంతి ఆధారంగా ఇది పని చేస్తుంది. ఈ నేపథ్యంలో సౌర కిరణం పడిన అంగారక గ్రహ భాగాన్ని మాత్రమే ఇది అధ్యయనం చేస్తుంది. రెండో పరికరం లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ (ఎల్సీపీ).. అంగారకుడు తన వాతావరణాన్ని ఎలా కోల్పోతాడో తెలుసుకోవడానికి ఉద్దేశించింది. ముఖ్యంగా అంగారకుడిపై వాతావరణ లైమన్ ఆల్ఫా ఉద్గారాన్ని బట్టి హైడ్రోజన్‌కు చెందిన డ్యుడీరియం, ప్రొటియం అనే ఐసోటోపుల నిష్పత్తిని ఇది లెక్కిస్తుంది. ఈ పరికరంలో ఒక అతి నీలలోహిత డిటెక్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు. మూడో పరికరం మార్స ఎక్సోస్ఫెరిక్ న్యూట్రల్ కంపొజిషన్ అనలైజర్. అంగారక వాతావరణంలోని అత్యంత బాహ్య ప్రాంతంలో తటస్థ వాయు పరమాణవులను విశ్లేషిస్తుంది. నాలుగో పరికరం.. థర్మల్ ఇన్ప్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్. ఇది అంగారక ఉపరితల ఉష్ణోగ్రతలను తెలుసుకోవడంతోపాటు అంగారక పటలంలోని ఖనిజ సంఘటనాన్ని అధ్యయనం చేస్తుంది. చివరి ఐదో పరికరం.. మార్స్ కలర్ కెమెరా. ఇది అంగారక ఉపరితలాన్ని చిత్రీకరిస్తుంది. అంగారక వాతావరణ పరిస్థితులను ముఖ్యంగా ధూళి తుపానులను అవగాహన చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. అంగారకుని చంద్రులు, ఫోబోస్, డైమోస్లను కూడా ఇది చిత్రీకరిస్తుంది. ప్రధాన లక్ష్యం అంగారక మిషన్ మొత్తం వ్యయం 450 కోట్లు. మార్స ఆర్బిటర్ బరువు 1,337 కిలోలు. దీనిలో 825 కిలోల ప్రొపెల్లెంట్ ఇంధనాన్ని లోడ్ చేశారు. దీనిలోని సాంకేతిక పరికరాల బరువు 13 కిలోలు. మంగళయాన్ ప్రయోగంలోని ప్రధాన లక్ష్యం జీవం ఆవిర్భావానికి కీలక సూచికగా వ్యవహరించే మీథేన్ అంగారకుడిపై ఉందా? లేదా? అనే అంశాన్ని పరిశీలించడం. అంగారకుడిపై ఒకప్పుడు ఉన్న నీరు ఎలా మాయమైందో తెలుసుకోవడం, దాని ఉపరితలం పటలంలోని మూలకాలు, ఖనిజాలను అధ్యయనం చేయడం, ప్రత్యేకంగా అక్కడి వాతావరణాన్ని పరిశోధించడం, భవిష్యత్‌లో మరిన్ని సంక్లిష్టమైన ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం వంటివి. ఆసక్తి ఇందుకే ఇప్పటి వరకు, రష్యా, అమెరికా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్, చైనా దేశాలు మాత్రమే అంగారక ప్రయోగాలను నిర్వహించాయి. ఈ క్రమంలో నిర్వహించిన 51 ప్రయోగాల్లో 21 ప్రయోగాలు మాత్రమే విజయవంతమయ్యాయి. వీటిలో అత్యధిక విజయాలు అమెరికా సొంతం. ఇంత స్థాయిలో అంగారక ఉపగ్రహంపై మానవ ఆసక్తికి ప్రధాన కారణం.. భవిష్యత్తులో అంగారకుడిపై మానవ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం. అంతేకాకుండా అంగారక గ్రహాన్ని జీవులకు అనుకూలంగా మార్చే ప్రయత్నం. ఇందుకోసం అంతరిక్ష శాస్త్త్రవేత్తలు ఎన్నో రకాల పరిశోధనలు చేస్తున్నారు. పాన్స్పెర్మియా సిద్ధాంతం భూమిపై జీవ ఆవిర్భావాన్ని కూడా ఇదే తరహాలో వివరించే సిద్ధాంతం ఒకటి ప్రచారంలో ఉంది. ఇది పాన్స్పెర్మియా సిద్ధాంతం. దీని ప్రకారం భూమిపై జీవం ఆవిర్భవించ లేదు. భూమి ఆవల నుంచి గ్రహ శకలాల ద్వారా గాని, గ్రహాంతర వాసుల ద్వారా గానీ భూమిపైకి జీవులు చేరి భూమిపై జీవ పరిణామం చెందిందని ఈ సిద్ధాంతం సారాంశం. 3.5 బిలియన్ ఏళ్ల క్రితం నాటి భూమికి, ఇప్పటి భూమికి చాలా తేడా ఉంది. అప్పటి పూర్తి ప్రతికూల నిర్జీవ పరిస్థితుల్లో జీవం ఆవిర్భవించి పరిణామం చెందిన క్రమాన్ని కొద్దిపాటి నిదర్శనాలతో ఏఐ ఒపారిన్, జెబీఎస్ హాల్డేన్ అనే శాస్త్త్రవేత్తలు వివరించారు. ఇలాంటి విషయాలపైనే అంతరిక్ష శాస్త్త్రవేత్తలు ప్రస్తుతం పూర్తిస్థాయి అధ్యయనాన్ని నిర్వహిస్తున్నారు. టెర్రాఫార్మింగ్ అంగారకునిపై పూర్వం జీవులకు అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల, భవిష్యత్తులో కొన్ని మార్పులతో జీవ మనుగడ పరిస్థితులను పునరిద్ధరించవచ్చునని శాస్త్త్రవేత్తల భావన. దీన్నే టెర్రాఫార్మింగ్ అంటారు. ఇందులో భాగంగా తొలుత అంగారకునిపై కార్బన్ డై ఆక్సైడ్‌ను ఏర్పర్చి, ఆ తర్వాత దాన్ని వినియోగించి కిరణజన్య సంయోగక్రియను నిర్వహించే లెకైన్, బ్యాక్టీరియా, కొన్ని శైవలాలను ప్రవేశపెడతారు. ఇలా కొన్ని వందల ఏళ్ల తర్వాత మొక్కలను కూడా ప్రవేశపెట్టి, అడవులను నిర్మించగలిగితే క్రమంగా ఆక్సిజన్ శాతం పెరిగి ఇతర జీవులు మనుగడకు సాధ్యమయ్యే విధంగా అంగారకుడిని మార్చడానికి వీలుంటుంది. మంగళయాన్‌కు ముందు అంగారక గ్రహ అన్వేషణ కోసం జరిగిన ప్రయోగాలు: 1964: అమెరికా మరైనర్-4 అనే ఆర్బిటర్‌ను ప్రయోగించింది. అది అంగారకుడిని 1965లో చేరి స్వల్పస్థాయిలో చిత్రీకరణ, దానిపై క్రేటర్లను కూడా గుర్తించింది. 1971: సోవియట్ యూనియన్ మార్స-3 అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా మార్సపై ల్యాండ్ చేసింది. అంగారక ఉపరితలాన్ని చేరిన మొదటి మానవ నిర్మిత పరికరమైనప్పటికీ.. చేరిన 15 నిమిషాలు మాత్రమే దాని నుంచి భూమికి సిగ్నళ్లు అందాయి. తర్వాత దాని నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఇదే ఏడాది అమెరికా మరైనర్-9 అనే ఆర్బిటర్‌ను ప్రయోగించింది. అంగారక కక్ష్యలోకి ప్రవేశించినపుడు ఇది ధూళి తుపాను, ఒక భారీ అగ్ని పర్వతాన్ని గుర్తించింది (ఇది మౌంట్ ఎవరెస్ట్ కంటే మూడు రెట్లు పొడవైనది. దీనికి ఒలంపస్ మాన్స్ అని పేరు పెట్టారు). 1975: అమెరికాకు చెందిన నాసా 1975 ఆగస్టు 20న వైకింగ్-1, సెప్టెంబర్ 9న వైకింగ్-2లను ప్రయోగించింది. ఇవి 1976లో అంగారక ఉపరితలంపై ల్యాండ్ అయ్యాయి. అమెరికా అంతరిక్ష చరిత్రలో అంగారక గ్రహంపై ల్యాండ్ అయిన మొదటి స్పేస్ క్రాఫ్ట్స్గా ఇవి గుర్తింపు పొందాయి. 1988: సోవియట్ యూనియన్ ఫోబోస్-1,2 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ రెండు విఫలమయ్యాయి. 1992: అమెరికా ప్రయోగించిన మార్స అబ్జర్వర్ విఫలమైంది. 1996: అమెరికా ప్రయోగించిన మార్స గ్లోబల్ సర్వేయర్ విజయవంతమైంది. 9 ఏళ్ల 52 రోజులపాటు అంగారకుని అధ్యయనం చేసింది. అత్యధిక కాలంపాటు అంగారకున్ని అధ్యయనం చేసిన ఘనత దీనికుంది. అదే ఏడాది మార్స పాత్ఫైండర్ను అమెరికా ప్రయోగించింది. దీనిలోని సొజోర్నర్ అనే రోబోటిక్ రోవర్ అమూల్యమైన సమాచారాన్ని సేకరించింది. రష్యా అదే ఏడాది ప్రయోగించిన ఉపగ్రహం విఫలమైంది. 1998: జపాన్ ప్రయోగించిన నొజొమి ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. 1999: అమెరికా ప్రయోగం విఫలమైంది. ల్యాండ్ అవుతున్న సమయంలో మార్స వాతావరణం ఆర్బిటర్‌తో సంబంధం తెగిపోగా, మార్స పోలార్ ల్యాండర్ ల్యాండ్ అయ్యే సమయంలో అంగారకునిపై కూలిపోయింది. 2001: అమెరికా మార్స ఒడిస్సే ఆర్బిటర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది ఇప్పటికీ సేవలను అందిస్త్తోంది. 2003: యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మార్స ఎక్స్‌ప్రెస్‌ను విజయవంతంగా ప్రయోగించినప్పటికీ దాని ల్యాండర్ బీగిల్-2 అంగారకుని ఉపరితలంపైన కూలిపోయింది. మార్స ఎక్స్‌ప్లోరర్ ఇప్పటికీ అంగారక గ్రహ సమాచారాన్ని అందిస్తూనే ఉంది. 2004: స్పిరిట్, ఆపర్చునిటీ అనే రెండు రోవర్లను అమెరికా విజయవంతంగా ప్రయోగించింది. ఎనిమిది ఏళ్లపాటు స్పిరిట్ ఎన్నో పరిశోధనలు చేసింది. ఆపర్చునిటీ ఇప్పటికీ పని చేస్తూనే ఉంది. 2005: అమెరికా ప్రయోగించిన ఆర్బిటర్ ఇప్పటికీ పని చేస్తూనే ఉంది. 2008: అమెరికా మార్సఫీనిక్స్.. అంగారక ఉత్తర ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. 2011: రష్యా ప్రయోగించిన ఫోబోస్- గ్రంట్ మిషన్ విఫలమైంది. అంగారక ఉపగ్రహం ఫోబోస్ నుంచి నేల నమూనాలను సేకరించి తిరిగి ఒక క్యాప్సూల్ ద్వారా భూమికి వచ్చే లక్ష్యంతో ఈ మిషన్‌ను రష్యా రూపొందించింది. ఇందులో గ్రంట్ అనే చైనా పరికరం కూడా ఒకటి ఉంది. అదేఏడాది అమెరికా మార్ససైన్సలో లేబొరేటరీ, దానిలోని క్యూరియాసిటీ రోవర్‌ను విజయవంతంగా అంగారకునిపైకి ప్రయోగించింది. -
అసలు పరీక్ష మొదలైంది!
భూ కక్ష్య నుంచి మార్స్ కక్ష్య వరకూ సవాళ్లే గ్రహాంతర అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో విజయవంతంగా తొలి అడుగు వేసింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని భూమికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది. అయితే అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఆర్బిటర్ అంగారక గ్రహం వరకూ సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. దీనిని అంగారక కక్ష్యా మార్గంలోకి ప్రవేశపెట్టడం వరకూ జరిగేది ఒక ఎత్తై ఆ తరువాత అరుణగ్రహం చేరేవరకూ ఉపగ్రహం ఇతర గ్రహాల ప్రభావానికి లోనుకాకుండా చూసుకోవడం, చేరిన తరువాత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టడం కూడా భారత శాస్త్రవేత్తలకు సవాలు విసిరే అంశాలే. మంగళవారం విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టిన మార్స్ ఆర్బిటర్ మరో 11 రోజుల తరువాత గానీ అంగారకుడి కక్ష్య మార్గంలోకి చేరదు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నారు. మొత్తం ఐదు దశల్లో కక్ష్య ఎత్తును పెంచేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల ఏడో తేదీ తెల్లవారుజామున చేపట్టే తొలి దశలో ఉపగ్రహం ప్రయాణించే కక్ష్యను భూమి నుంచి 28,790 కిలోమీటర్ల దూరానికి పెంచుతారు. రెండు మూడు దశలు 8, 9 తేదీల్లో చేపడతారు. ఈ రెండు దశల్లో అపోగీ (భూమి నుంచి దూరంగా ఉండే దశ) 40 వేలు, 71,650 కిలోమీటర్లు చొప్పున ఉంటుంది. చివరి రెండు దశలను ఈ నెల 11, 16వ తేదీల్లో చేపడతారు. దీంతో ఉపగ్రహం అపోగీ ఏకంగా లక్ష నుంచి 1.92 లక్షల కిలోమీటర్లకు చేరుతుంది. ఆ తరువాత అన్నీ సవ్యంగా సాగితే డిసెంబర్ ఒకటో తేదీ అర్ధరాత్రి 0.42 గంటల సమయంలో ఆర్బిటర్‌ను మార్స్ కక్ష్య మార్గంలోకి ప్రవేశపెడతారు. దీనిని అత్యంత ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడి నుంచి ఆర్బిటర్ సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2014 సెప్టెంబర్ 24వ తేదీన అంగారక గ్రహపు నిర్దేశిత కక్ష్యలోకి ఖచ్చితంగా చేర్చదలచుకున్న స్థానానికి ఒక 50 కిలోమీ టర్లు అటూ ఇటూగా చేరాలి. ఆర్బిటర్ అంగారకుడి సమీపంలోకి వెళ్లేందుకు దాదాపు 300 రోజుల సమయంపడుతుంది. ఈ క్రమంలో ఏదైనా తేడా వచ్చి ఉపగ్రహం దారితప్పినా, లేదా అంగారక గ్రహ కక్ష్యను చేరిన తరువాత ఈ రకమైన సమస్య వచ్చినా.. దాని మార్గాన్ని సవరించి మళ్లీ దారిలో పెట్టేందుకు కొంత ఇంధనాన్ని కేటాయించారు. మార్గ సవరణ కోసం ఇంధనాన్ని ఉపయోగిస్తే దాని ప్రభావం ఆర్బిటర్ ఆయుష్షుపై పడుతుంది. ఏ విధమైన సవరణలు లేకున్నా ఈ ఉపగ్రహం గరిష్టంగా కొన్ని నెలలు మాత్రమే పనిచేస్తుంది. మార్గ సవరణ కోసం ఎంత ఇంధనం ఉపయోగిస్తే అంతమేరకు ఆర్బిటర్ జీవితకాలం తరిగిపోతుంది. మార్స్ ఆర్బిటర్ అంగారకుడి వైపు వెళుతున్నపుడు.. దానిని నియంత్రించేందుకు, ఇతరత్రా పంపించే సమాచార సంకేతాలు ఆర్బిటర్‌ను చేరటానికి 20 నిమిషాల సమయం పడుతుంది. అలాగే అది తిరిగి పంపించే సంకేతాలు భూమి మీది నియంత్రణ స్టేషన్లను చేరటానికి మరో 20 నిమిషాలు పడుతుంది. అంటే.. దాదాపు 40 నిమిషాల పాటు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆర్బిటర్ అంగారకుడిని సమీపిస్తుండగానే దాని వేగాన్ని తగ్గించాలి. అలాగైతేనే అంగారక గ్రహపు కక్ష్యలోకి ఈ ఆర్బిటర్ వెళ్లగలదు. అలాకాకుండా అదే వేగం తో ప్రయాణిస్తే ఆర్బిటర్ అరుణగ్రహాన్ని దాటి దూసుకెళ్లిపోతుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన పక్షంలో మార్స్ ఆర్బిటర్ తనకు తానుగా సేఫ్ మోడ్ (సురక్షితమైన వ్యవస్థ)లోకి వెళ్లేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అమర్చారు. ఈ విధానంలో.. భూమి నుంచి సంకేతాలతో ఆజ్ఞలు అందే వరకూ మార్స్ ఆర్బిటర్ తనకు తానే సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఏంటెనాను భూమి వైపు తిప్పి, సోలార్ ప్యానళ్లను సూర్యుడి వైపు తిప్పి సాధ్యమైనంత ఎక్కువ సౌరశక్తిని సంగ్రహించుకుంటుంది. - సైన్స్ బ్యూరో, సాక్షి ప్రయోజనం లేదా? అంగారక యాత్ర ద్వారా దేశానికి ఇప్పటికిప్పుడు వచ్చే ప్రయోజనమేదీ ఉండదు. అయితే కేవలం రూ. 450 కోట్ల ఖర్చుతో గ్రహాంతరాలకు సైతం తాము ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలమని ఇస్రో ఈ ప్రయోగంతో ప్రపంచానికి చాటింది. కేవలం 15 నెలల వ్యవధిలో ఇంతటి సంక్లిష్టమైన ప్రయోగానికి రూకల్పన చేయడం, రాకెట్, ఉపగ్రహాలను నిర్మించి ప్రయోగించడం ఇస్రో సత్తాకు నిదర్శనమనడంలో ఎటువంటి సందేహమూ లేదు. భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు, అంగారకుడిపైకి ల్యాండర్ లేదా రోవర్ వంటి అత్యాధునిక పరికరాలను పంపించేందుకు ఈ ప్రయో గం పునాదిగా నిలుస్తుంది. -
రజతోత్సవానికి సిద్ధమైన పీఎస్ఎల్వీ సిరీస్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఐదు దశాబ్దాల్లో ఎన్నో శ్లాఘనీయమైన విజయాలను సాధించింది. ఇందులో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)దే అగ్రస్థానం. నవంబర్ ఐదున మార్స్ ఆర్బిట్ మిషన్‌ను పీఎస్ఎల్వీ - సీ25 ద్వారా ప్రయోగించనున్నారు. దీంతో పీఎస్ఎల్వీ 25 ప్రయోగాలను పూర్తిచేసుకోనుంది. అంగారక గ్రహం మీద పరిశోధనకు ఉపగ్రహం పంపటం ద్వారా పీఎస్ఎల్వీ సిరీస్ రాకెట్ రజతోత్సవాన్ని జరుపుకోనుండటం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 1963లో ప్రయోగాలకు శ్రీకారం కేరళలోని తుంబా ఈక్విటోరియల్ రాకెట్ కేంద్రం నుంచి 1963లో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. 1975లో రష్యా నుంచి మొదటి ఆర్యభట్ట ఉపగ్రహంతో మన ప్రయోగాల పరంపర మొదలైంది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి 1979 ఆగస్ట్ 10న ఎస్ఎల్వీ - 3 ఈ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. 1979 నుంచి ఇప్పటివరకు చేపట్టిన 39 ప్రయోగాల్లో ఎనిమిది మినహా, మిగిలినవి విజయవంతమయ్యాయి. ఇటీవల ప్రయోగించ తలపెట్టిన జీఎస్ఎల్వీ- డీ5ను సాంకేతిక లోపంతో ఆపేసిన విషయం తెలిసిందే. ఇస్రో ప్రయోగించిన ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహకనౌకల్లో పీఎస్ఎల్వీ మాత్రమే తిరుగులేనిదిగా నిలిచింది. 1993లో పీఎస్ఎల్వీ - డీ1 ప్రయోగాలకు శ్రీకారం 1993 సెప్టెంబర్ 20న మొదటిసారిగా పీఎస్ఎల్వీ - డీ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 ప్రయోగాలు చేశారు. మొదటి ప్రయోగం మినహా మిగిలినవి విజయవంతమయ్యాయి. 1993లో చేసిన మొదటి ప్రయోగం అపజయం కావడంతో 1994 అక్టోబర్ 15న పీఎస్ఎల్వీ - డీ2 ద్వారా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (దూరపరిశీలన ఉపగ్రహం)ను కక్ష్యలోకి విజయవంతంగా పంపారు. 1996 మార్చి 21న పీఎస్ఎల్వీ - డీ3లో కూడా ఐఆర్ఎస్ శాటిలైట్‌ను పంపారు. పీఎస్ఎల్వీ - సీ1 నుంచి సీ25 వరకు అన్ని ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ - 1 మిషన్‌ను పీఎస్ఎల్వీ - సీ11 రాకెట్ ద్వారానే ప్రయోగించడం విశేషం. ఈ రాకెట్ ద్వారా ఇప్పటివరకు ఎక్కువగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగించారు. కల్పన ఉపగ్రహం, జీశాట్ - 12 అనే కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ను ప్రయోగించారు. పీఎస్ఎల్వీతో రెండురకాలుగా ఉపయోగం పీఎస్ఎల్వీ రాకెట్ రెండురకాల ప్రయోగాలకు ఉపయోగపడుతుంది. తక్కువ బరువున్న ఉపగ్రహాలను భూమికి దగ్గరగా ఉన్న సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోకి మోసుకెళ్లాలంటే స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా చేస్తారు. అదే బరువైన ఉపగ్రహాలను భూమికి అతి దూరంగా ఉండే జియో సింక్రోనస్ ఆర్బిట్ (భూస్థిర కక్ష్య), భూస్థిర మధ్యం తర బదిలీ కక్ష్యలోకి తీసుకెళ్లాలంటే ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను ఉపయోగిస్తారు. ఒకేసారి పది ఉపగ్రహాలను మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టిన ఘనత, వాణిజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగపడే రాకెట్‌గా పీఎస్ఎల్వీ గుర్తింపు పొందింది. రాకెట్లో ఉపయోగించే కొన్ని విడిభాగాలను మళ్లీ ఉపయోగించుకోవడానికి వీలుండే స్పేస్ క్యాప్సూల్స్ రికవరీ ప్రయోగం నిర్వహించిందీ పీఎస్ఎల్వీ ద్వారానే కావడం విశేషం. విదేశాలకు చెందిన 37 ఉపగ్రహాలను ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రో ఆదాయం తెచ్చిపెడుతోంది. నవంబర్ 5 మధ్యాహ్నం 2.36 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ - సీ25 షార్ నుంచి చేసే 40వ ప్రయోగం కాగా, పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో 25వది. ప్రస్తుతం అంగారకుడిపై పరిశోధనలు చేయడానికి మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను పంపేందుకు సర్వం సిద్ధం చేశారు. భవిష్యత్తులో చంద్రయాన్ - 2 ఉపగ్రహ ప్రయోగాన్నీ పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారానే చేయనుండటం విశేషం. -
అంగారక యాత్రకు ఆరాటం
అమెరికా, చైనా, బ్రెజిల్, ఇండియా, రష్యా, బ్రిటన్, మెక్సికో, కెనడా, స్పెయిన్, ఫిలి ప్పైన్స్ దేశాల నుంచి ఇప్పటికే అంగారక గ్రహ ప్రయాణానికి దరఖాస్తులు వచ్చాయి. 140 దేశాల ప్రజలు ఇలా ఆసక్తి చూపిస్తున్న వారిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం కుజగ్రహం మీదకు వెళ్లదలచిన భారతీయుల నుంచి అందిన దరఖాస్తులు 20,747. ఇరవై ఒకటవ శతాబ్దంలో మానవుడు అక్షరాలా విశ్వ విజేత అనిపించుకోవడం దాదాపు ఖాయంగా కనిపి స్తోంది. అంగారక గ్రహవాసిగా తిరిగి భూలోకానికి రాని విధంగా మనుగడ సాగించడానికి చేస్తున్న అంతరిక్ష శాస్త్రీయ పరిశోధనలలో మనిషి ఇప్పుడే విజయం సాధిస్తు న్నాడు. భూగోళం నుంచి ఏడు కోట్ల ఎనభై మూడు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారక గ్రహంపైన నివా సానికి ప్రపంచం ఉవ్విళ్లూరుతోంది. సూర్యుని చుట్టూ తిరిగే ఈ గ్రహంపైన మనిషి జీవించగలిగే వాతావరణం ఉందని రుజువు కావడంతో కేవలం కాలుమోపడమే కాకుండా నివాసం ఏర్పరచుకోవాలని భూగ్రహం మీది నాగరిక సమాజం కలలు కంటోంది. అమెరికా, చైనా, బ్రెజిల్, ఇండియా, రష్యా, బ్రిటన్, మెక్సికో, కెనడా, స్పెయిన్, ఫిలిప్పైన్స్ దేశాల నుంచి ఇప్పటికే అంగారక గ్రహ ప్రయాణానికి దరఖాస్తులు వచ్చాయి. 140 దేశాల ప్రజలు ఇలా ఆసక్తి చూపిస్తున్నవారిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం కుజగ్రహం మీదకు వెళ్లదలచిన భార తీయుల నుంచి అందిన దరఖాస్తులు 20,747. ఐరన్ ఆక్సైడ్ ధూళితో కప్పి ఉండే అంగారకుడు లేదా కుజుడు (మార్స్) 1,44,789,500 చదరపు కిలోమీటర్ల ఉపరితల ప్రాంతం కలిగిన గ్రహం. దీనికే ఎర్ర గ్రహమని మరో పేరు. అర్ధ శతాబ్దిగా భూగోళం నుంచి సమీప క్రమంలో నెలకొని ఉన్న ఈ గ్రహంపైకి ప్రయాణించడా నికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎర్రటి లోహ భస్మా న్ని దుప్పటిలా కప్పుకున్న కుజుని పరిభ్రమణం, రుతు చక్ర స్థితిగతులలో భూమిని పోలి ఉంటాడు. ప్రాచీన కాలంలో దీనినే ప్రపంచంలో రోమన్ల యుద్ధ అధిదేవత అని పిలిచేవారు. నాట్ ఫర్ ప్రాఫిట్ ఫౌండేషన్‌కు సంబంధించిన ఇం టర్ ప్లానెటరీ గ్రూప్ మాతృ సంస్థ అయిన మార్స్-1 పథ కం డచ్ దేశస్థులు నిర్వహిస్తున్నారు. ఈ పథకం వ్యవస్థా పకుడు లాన్స్ డోర్ఫ్ అంగారక గ్రహంపై స్థిరనివాసానికి పిలుపునిచ్చాడు. 2023 నాటికి అక్కడ నివాసయోగ్యమైన కాలనీ నిర్మించే ప్రతిపాదనలున్నాయి. ఈ మల్టీ బిలియన్ డాలర్ ప్రాజెక్టులో నమోదు చేయించుకున్న వారికి ఆయా దేశాలలో అమలులో ఉన్న తలసరి ఆదాయాన్ని బట్టి రుసుం నిర్ణయించారు. 18 సంవత్సరాలు పైబడిన వారికే ఈ నమోదు అర్హత. మల్టీ కాంటినెంటల్ గ్రూపుగా 40 మం దిని ఈ యాత్రకు ఎంపిక చేస్తారు. వీరిలో ఇద్దరు పురు షులు, ఇద్దరు మహిళలను ఎంపికచేసి సెప్టెంబర్ 2022లో అంగారక గ్రహంపైకి పంపుతారు. 7 నెలల అంతరిక్ష యానం తరువాత 2023 ఏప్రిల్ నాటికి అంగారక గ్రహం పై వారు కాలు మోపుతారు. 2 ఏళ్ల తరువాత వెళ్లే మరో నలుగురితో సహా వారెవరూ తిరిగి భూలోకానికి రాకుండా అక్కడే స్థిరనివాసం ఉంటారు. భారతీయులతో సహా ఎన్నో దేశాల ప్రజలు ఆసక్తి చూపుతున్న కుజగ్రహంలో నివాసయోగ్య పరిస్థితులు ఎలాంటివి? 1965లో రోదసీ వాహనం మేరినర్-4 ప్రథ మంగా ఆ గ్రహం గురించి ఆసక్తికరమైన వివరాలు మోసు కొచ్చింది. 2005లో లభించిన రాడార్ డేటా అక్కడ నీటి ఐస్ లభ్యతను ధృవీకరించింది. 2007లో రోవర్, స్పిరిట్ నీటి పరమాణువులు కలిగిన రసాయనిక మిశ్రీత నమూ నాలను సేకరించగలిగాయి. 2008 జూలైలో ఘనీభవించిన నీటి (వాటర్ ఐస్) నమూనాను ఫోన్సిక్ లాండర్ ప్రత్యక్షం గా సేకరించింది. ఒడిసీ, ఎక్స్‌ప్రెస్, రినైజాన్స్ పేర్లతో వెళ్లిన అంతరిక్ష వాహనాలు కూడా విశేషమైన సమా చారాన్ని ఇచ్చాయి. వేసవిలో కూడా అక్కడ నీళ్ల కదలికలు స్పష్టమయ్యాయి. మనిషి మనుగడకు ప్రాణాధారమైన లిక్విడ్ వాటర్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ల ఉనికికి సంబంధించి కూడా ఆధారాలు లభించాయి. అయితే జీవాణువుల ఉత్పత్తికి ఆధారమైన మిథేన్ వాయు వు ఎర్రగ్రహంపై అంతగా లేదని నాసా తేల్చడం కొంత నిరుత్సాహపరుస్తోంది. అంటే ఇంకొంత పరిశోధన మిగిలే ఉంది. కానీ 2020 కల్లా మిథేన్ లభ్యత సమస్య పరి ష్కారం కాగలదని నాసా శాస్త్రజ్ఞులే అంటున్నారు. అంగా రక గ్రహంపై థోలిఐటిక్ రాతిపొరలు ఉన్నాయి. వాటిలో ఇనుము, మెగ్నీషియం, అల్యూమినియం, కాల్షియం, పొటాషియం వంటి మూలకాలు; సిలికాన్ ఆక్సిజన్ తది తర ఖనిజాలు లభించే అవకాశాలు ఉన్నాయని తేలడంతో కార్పొరేట్ రంగం కూడా అంగారక గ్రహంపై ఆసక్తి చూపుతోంది. ఈ యాత్రికులలో కొందరు ఉత్సుకతతోను ఇంకొందరు ఒక కొత్త లోకంలో నివాసం అర్రులు చాస్తున్నారు. ఫలితమే ఈ యాత్ర! - జయసూర్య -
మార్స్‌పై మీథేన్ వాయువు లేదట!
క్యూరియాసిటీ పరీక్షల్లో వెల్లడి వాషింగ్టన్: అరుణగ్రహం(మార్స్)పై జీవం ఆనవాళ్ల అన్వేషణలో బిజీగా ఉన్న క్యూరియాసిటీ శోధక నౌక(రోవర్) కొత్త సంగతి తేల్చింది. ఆ గ్రహంపై అసలు మీథేన్ వాయువే లేదని వెల్లడించింది. గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది జూన్ వరకూ క్యూరియాసిటీ ఆరు సార్లు నిర్వహించిన పరీక్షల ఫలితాలను తాము విశ్లేషించగా.. మీథేన్ ఆనవాళ్లేమీ లభించలేదని ఈ మేరకు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాధారణంగా సూక్ష్మజీవుల జీవక్రియల వల్లే మీథేన్ ఎక్కువగా ఉత్పత్తి అయి వాతావరణంలోకి విడుదల అవుతుంటుంది. అందువల్ల మీథేన్ వాయువు ఉంటే సూక్ష్మజీవుల ఉనికిపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే క్యూరియాసిటీకి మార్స్ ఉపరితలంపై మీథేన్ ఆనవాళ్లే లభించకపోవడంతో అక్కడ సూక్ష్మజీవుల ఉనికిపై ఇప్పటిదాకా ఉన్న ఆశలు గల్లంతయ్యాయి. కీలకమైన ఈ పరిశోధనలో యూని వర్సిటీ ఆఫ్ మిచిగన్‌కు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త సుశీల్ ఆత్రేయ కూడా పాలు పంచుకున్నారు.