అంగారక యాత్రకు ఆరాటం | more than 20 thousand indians interested to visit Mars | Sakshi
Sakshi News home page

అంగారక యాత్రకు ఆరాటం

Published Thu, Oct 10 2013 2:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM

అంగారక యాత్రకు ఆరాటం

అంగారక యాత్రకు ఆరాటం

అమెరికా, చైనా, బ్రెజిల్, ఇండియా, రష్యా, బ్రిటన్, మెక్సికో, కెనడా, స్పెయిన్, ఫిలి ప్పైన్స్ దేశాల నుంచి ఇప్పటికే అంగారక గ్రహ ప్రయాణానికి దరఖాస్తులు వచ్చాయి. 140 దేశాల ప్రజలు ఇలా ఆసక్తి చూపిస్తున్న వారిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం కుజగ్రహం మీదకు వెళ్లదలచిన భారతీయుల నుంచి అందిన దరఖాస్తులు 20,747.
 
 ఇరవై ఒకటవ శతాబ్దంలో మానవుడు అక్షరాలా విశ్వ విజేత అనిపించుకోవడం దాదాపు ఖాయంగా కనిపి స్తోంది. అంగారక గ్రహవాసిగా తిరిగి భూలోకానికి రాని విధంగా మనుగడ సాగించడానికి చేస్తున్న అంతరిక్ష శాస్త్రీయ పరిశోధనలలో మనిషి ఇప్పుడే విజయం సాధిస్తు న్నాడు. భూగోళం నుంచి ఏడు కోట్ల ఎనభై మూడు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారక గ్రహంపైన నివా సానికి ప్రపంచం ఉవ్విళ్లూరుతోంది. సూర్యుని చుట్టూ తిరిగే ఈ గ్రహంపైన మనిషి జీవించగలిగే వాతావరణం ఉందని రుజువు కావడంతో కేవలం కాలుమోపడమే కాకుండా నివాసం ఏర్పరచుకోవాలని భూగ్రహం మీది నాగరిక సమాజం కలలు కంటోంది.
 
 అమెరికా, చైనా, బ్రెజిల్, ఇండియా, రష్యా, బ్రిటన్, మెక్సికో, కెనడా, స్పెయిన్, ఫిలిప్పైన్స్ దేశాల నుంచి ఇప్పటికే అంగారక గ్రహ ప్రయాణానికి దరఖాస్తులు వచ్చాయి. 140 దేశాల ప్రజలు ఇలా ఆసక్తి చూపిస్తున్నవారిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం కుజగ్రహం మీదకు వెళ్లదలచిన భార తీయుల నుంచి అందిన దరఖాస్తులు 20,747.
 ఐరన్ ఆక్సైడ్ ధూళితో కప్పి ఉండే అంగారకుడు లేదా కుజుడు (మార్స్) 1,44,789,500 చదరపు కిలోమీటర్ల ఉపరితల ప్రాంతం కలిగిన గ్రహం. దీనికే ఎర్ర గ్రహమని మరో పేరు. అర్ధ శతాబ్దిగా భూగోళం నుంచి సమీప క్రమంలో నెలకొని ఉన్న ఈ గ్రహంపైకి ప్రయాణించడా నికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎర్రటి లోహ భస్మా న్ని దుప్పటిలా కప్పుకున్న కుజుని పరిభ్రమణం, రుతు చక్ర స్థితిగతులలో భూమిని పోలి ఉంటాడు. ప్రాచీన కాలంలో దీనినే ప్రపంచంలో రోమన్ల యుద్ధ అధిదేవత అని పిలిచేవారు.
 
 నాట్ ఫర్ ప్రాఫిట్ ఫౌండేషన్‌కు సంబంధించిన ఇం టర్ ప్లానెటరీ గ్రూప్ మాతృ సంస్థ అయిన మార్స్-1 పథ కం డచ్ దేశస్థులు నిర్వహిస్తున్నారు. ఈ పథకం వ్యవస్థా పకుడు లాన్స్ డోర్ఫ్ అంగారక గ్రహంపై స్థిరనివాసానికి పిలుపునిచ్చాడు. 2023 నాటికి అక్కడ నివాసయోగ్యమైన కాలనీ నిర్మించే ప్రతిపాదనలున్నాయి. ఈ మల్టీ బిలియన్ డాలర్ ప్రాజెక్టులో నమోదు చేయించుకున్న వారికి ఆయా దేశాలలో అమలులో ఉన్న తలసరి ఆదాయాన్ని బట్టి రుసుం నిర్ణయించారు. 18 సంవత్సరాలు పైబడిన వారికే ఈ నమోదు అర్హత. మల్టీ కాంటినెంటల్ గ్రూపుగా 40 మం దిని ఈ యాత్రకు ఎంపిక చేస్తారు. వీరిలో ఇద్దరు పురు షులు, ఇద్దరు మహిళలను ఎంపికచేసి సెప్టెంబర్ 2022లో అంగారక గ్రహంపైకి పంపుతారు. 7 నెలల అంతరిక్ష యానం తరువాత 2023 ఏప్రిల్ నాటికి అంగారక గ్రహం పై వారు కాలు మోపుతారు. 2 ఏళ్ల తరువాత వెళ్లే మరో నలుగురితో సహా వారెవరూ తిరిగి భూలోకానికి రాకుండా అక్కడే స్థిరనివాసం ఉంటారు.
 
 భారతీయులతో సహా ఎన్నో దేశాల ప్రజలు ఆసక్తి చూపుతున్న కుజగ్రహంలో నివాసయోగ్య పరిస్థితులు ఎలాంటివి? 1965లో రోదసీ వాహనం మేరినర్-4 ప్రథ మంగా ఆ గ్రహం గురించి ఆసక్తికరమైన వివరాలు మోసు కొచ్చింది. 2005లో లభించిన రాడార్ డేటా అక్కడ నీటి ఐస్ లభ్యతను ధృవీకరించింది. 2007లో రోవర్, స్పిరిట్ నీటి పరమాణువులు కలిగిన రసాయనిక మిశ్రీత నమూ నాలను సేకరించగలిగాయి. 2008 జూలైలో ఘనీభవించిన నీటి (వాటర్ ఐస్) నమూనాను ఫోన్సిక్ లాండర్ ప్రత్యక్షం గా సేకరించింది. ఒడిసీ, ఎక్స్‌ప్రెస్, రినైజాన్స్ పేర్లతో వెళ్లిన అంతరిక్ష వాహనాలు కూడా విశేషమైన సమా చారాన్ని ఇచ్చాయి. వేసవిలో కూడా అక్కడ నీళ్ల కదలికలు స్పష్టమయ్యాయి. మనిషి మనుగడకు ప్రాణాధారమైన లిక్విడ్ వాటర్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్‌ల ఉనికికి సంబంధించి కూడా ఆధారాలు లభించాయి.
 
 అయితే జీవాణువుల ఉత్పత్తికి ఆధారమైన మిథేన్ వాయు వు ఎర్రగ్రహంపై అంతగా లేదని నాసా తేల్చడం కొంత నిరుత్సాహపరుస్తోంది. అంటే ఇంకొంత పరిశోధన మిగిలే ఉంది. కానీ 2020 కల్లా మిథేన్ లభ్యత సమస్య పరి ష్కారం కాగలదని నాసా శాస్త్రజ్ఞులే అంటున్నారు. అంగా రక గ్రహంపై థోలిఐటిక్ రాతిపొరలు ఉన్నాయి. వాటిలో ఇనుము, మెగ్నీషియం, అల్యూమినియం, కాల్షియం, పొటాషియం వంటి మూలకాలు; సిలికాన్ ఆక్సిజన్ తది తర ఖనిజాలు లభించే అవకాశాలు ఉన్నాయని తేలడంతో కార్పొరేట్ రంగం కూడా అంగారక గ్రహంపై ఆసక్తి చూపుతోంది. ఈ యాత్రికులలో కొందరు ఉత్సుకతతోను ఇంకొందరు ఒక కొత్త లోకంలో నివాసం అర్రులు చాస్తున్నారు. ఫలితమే ఈ యాత్ర!
 - జయసూర్య

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement