ఫేస్బుక్లో ముంబై అమ్మాయి కథ హల్చల్ | This Mumbai Woman Refused to Marry at 15. Her Story's Gone Viral | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో ముంబై అమ్మాయి కథ హల్చల్

Published Fri, Aug 14 2015 8:57 AM | Last Updated on Thu, Jul 26 2018 12:50 PM

ఫేస్బుక్లో ముంబై అమ్మాయి కథ హల్చల్ - Sakshi

ఫేస్బుక్లో ముంబై అమ్మాయి కథ హల్చల్

ఫేస్బుక్లో ముంబై టీనేజ్ అమ్మాయి కథ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ పోస్ట్కు 49 వేల లైక్లు, 3200 షేర్లు వచ్చాయి. నెటిజన్లను అంతగా ఆకర్షించిన కథనం ఏంటంటే.. ముంబై టీనేజ్ అమ్మాయి వయసు 15 ఏళ్లు. చిన్న వయసులోనే ఈ అమ్మాయికి ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధం చూశారు. పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంత చిన్న వయసులో తాను పెళ్లి చేసుకోనంటూ నిరాకరించింది. పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఏం చేసింది.. తన ఆశయాలు ఏంటి.. తదితర విషయాలను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.

'నేను ఆ అబ్బాయిని కూడా చూశా. పెళ్లి చేసుకోనని ఇంట్లోకి వాళ్లకు స్పష్టంగా చెప్పాను. నన్ను రక్షించుకోవడం కోసం..  ఇంట్లో నుంచి పారిపోయి పోలీసులకు ఈ విషయం చెబుతానని బెదిరించాను. ఇద్దరు పిల్లలున్న, విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్లు చెప్పారు. 15 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలకు నేనెలా తల్లినికాగలను. నా గురించి ఇంట్లో వాళ్లు ఎందుకు ఆలోచించరు. నేనింకా చదువుకోవాలి. స్వతహాగా సంపాదించాలి. ఇతరులపై ఆధారపడి బతకాల్సిన అవసరం నాకు లేదు. ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నది నా ఆశయం. నా కల సాకారమయ్యేంత వరకు ఆగను' అని ఆ అమ్మాయి పేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ టీనేజ్ అమ్మాయి కథ చాలామందిని ఆకర్షించింది. ఈ అమ్మాయిని అభినందిస్తూ.. ఆశయ సాధనకు అండగా ఉంటామంటూ వందలాదిమంది నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement