ప్రజలకు చేరువయేందుకు,పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ వినూత్న ఆలోచన చేశారు.
తిరువనంతపురం: ప్రజలకు చేరువయేందుకు,పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ వినూత్న ఆలోచన చేశారు. ఇందు కోసం ఆయన అధికారిక ఫేస్ బుక్ ఖాతాను తెరిచారు. ప్రజలకు ఎప్పటి కప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు తెలిసేందుకు, వారినుంచి సలహాలు,విమర్శలు స్వీకరించేందుకు ఈ ఖాతాను తెరిచామని సీఎం తెలిపారు.ముఖ్యమంత్రి అధికారిక ఫేస్ బుక్ ఖాతాకి ఇప్పటి వరకు 88 వేలకు పైగా లైకులు లభించాయి.