
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ తృటిలో తప్పించుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ఒక మహిళను కాపాడేందుకు సీఎం పినరయి కారు పైలెట్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేశారు. దీంతో సీఎం కాన్వాయ్‌లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారుకు స్వల్ప నష్టం వాటిల్లింది.
ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ద్విచక్రవాహనం నడుపుతున్న ఒక మహిళ అకస్మాత్తుగా కుడి మలుపు తీసుకోవడాన్ని చూడవచ్చు. దీంతో ఆమె వెనుక ఉన్న తెల్లటి ఎస్‌యూవీ ఆగిపోయింది. తరువాత ఆ ఎస్‌యూవీ వెనుక వస్తున్న అంబులెన్స్‌తో సహా ఆరు ఎస్కార్ట్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
కొట్టాయం పర్యటన ముగించుకున్న సీఎం విజయన్ తిరిగి తిరువనంతపురం వస్తుండగా వామనపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం భద్రతా సిబ్బంది వెంటనే వాహనాల నుంచి దిగి పరిస్థితిని పరిశీలించారు. వైద్య సిబ్బంది కూడా అంబులెన్స్ నుండి బయటకు వచ్చి అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ద్విచక్రవాహనాన్ని నడిపిన ఆ మహిళను పోలీసులు విచారిస్తున్నారు.
ब्रेक लगाया..लेकिन बहुत देर हो गई थी
VIDEO केरल की राजधानी से आया है. ये काफिला है मुख्यमंत्री पिनाराई विजयन की कारों का. स्कूटी सवार महिला जो दाएं मुड़ रही थी, उसको बचाने के चक्कर में आपस में भिड़ गईं काफिले की गाड़ियां.#Kerala #RoadAccident pic.twitter.com/hyKKwYANgx— NDTV India (@ndtvindia) October 28, 2024
ఇది కూడా చదవండి: సీ295 ప్రాజెక్ట్ ఎందుకంత ప్రత్యేకం?