Vijayan
-
రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సీఎం
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ తృటిలో తప్పించుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ఒక మహిళను కాపాడేందుకు సీఎం పినరయి కారు పైలెట్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేశారు. దీంతో సీఎం కాన్వాయ్‌లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారుకు స్వల్ప నష్టం వాటిల్లింది.ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ద్విచక్రవాహనం నడుపుతున్న ఒక మహిళ అకస్మాత్తుగా కుడి మలుపు తీసుకోవడాన్ని చూడవచ్చు. దీంతో ఆమె వెనుక ఉన్న తెల్లటి ఎస్యూవీ ఆగిపోయింది. తరువాత ఆ ఎస్యూవీ వెనుక వస్తున్న అంబులెన్స్‌తో సహా ఆరు ఎస్కార్ట్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.కొట్టాయం పర్యటన ముగించుకున్న సీఎం విజయన్ తిరిగి తిరువనంతపురం వస్తుండగా వామనపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం భద్రతా సిబ్బంది వెంటనే వాహనాల నుంచి దిగి పరిస్థితిని పరిశీలించారు. వైద్య సిబ్బంది కూడా అంబులెన్స్ నుండి బయటకు వచ్చి అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ద్విచక్రవాహనాన్ని నడిపిన ఆ మహిళను పోలీసులు విచారిస్తున్నారు. ब्रेक लगाया..लेकिन बहुत देर हो गई थीVIDEO केरल की राजधानी से आया है. ये काफिला है मुख्यमंत्री पिनाराई विजयन की कारों का. स्कूटी सवार महिला जो दाएं मुड़ रही थी, उसको बचाने के चक्कर में आपस में भिड़ गईं काफिले की गाड़ियां.#Kerala #RoadAccident pic.twitter.com/hyKKwYANgx— NDTV India (@ndtvindia) October 28, 2024ఇది కూడా చదవండి: సీ295 ప్రాజెక్ట్ ఎందుకంత ప్రత్యేకం? -
overthinkers club: అతిగా ఆలోచన ఆనందానికి శత్రువు
‘నేను చేసింది తప్పేమో’ ‘నేను చేసిన పని వల్ల ఇలా అవుతుందేమో’ ‘వాళ్లు అలా చేస్తే ఏం చేయాలి?’ ‘నా పరువు పోతుందేమో’... చిన్న చిన్న కారణాలకు కూడా ఎంతో ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటారు కొందరు. దీనిని ‘ఓవర్‌థింకింగ్’ అంటారు మానసిక నిపుణులు. ‘ఇలాంటివారిని ఒకచోట చేర్చి ఆలోచనలు పంచుకుంటే ధైర్యం వస్తుంది’ అంటుంది వర్షా విజయన్. ఈమె మొదలు పెట్టిన ‘ఓవర్‌థింకర్స్ క్లబ్’ ఇలాంటి క్లబ్‌ల అవసరాన్ని తెలియచేస్తోంది. ‘ఓ మీరూ అంతేనా?’ అంది ఒక మహిళ ఆ పార్క్‌కు వచ్చిన మరో మహిళతో. తిరువనంతపురానికి చెందిన 27 ఏళ్ల వర్షా విజయన్ ‘ఓవర్‌థింకర్స్ క్లబ్’ను ప్రారంభించింది. ఇదేదో ఒక భవంతో, క్లినిక్కో కాదు. పార్కులో కొంతమంది కలవడమే. సోషల్ మీడియా ద్వారా ఈ క్లబ్ గురించి ఆమె ప్రచారం చేసింది. ‘ప్రతి దానికీ తీవ్రంగా ఆలోచించే మనం ఈ ఆలోచనల నుంచి బయటపడదాం రండి’ అనే ఆమె పిలుపునకు స్పందించిన స్త్రీ, పురుషులు రకరకాల వయసుల వాళ్లు వారానికి ఒకసారో నెలలో రెండుసార్లు కలవసాగారు. ‘జీవితంలో మార్పులు సహజం. కాని జరగబోయే మార్పు గురించి చదువు, ఉద్యోగం, వివాహం, విడాకులు, పిల్లల ఆరోగ్యం లేదా తల్లిదండ్రుల చివరి రోజులు... వీటి గురించి రోజుల తరబడి ఆలోచిస్తూ ఉంటారు కొందరు. ఆ ఆలోచనలు పాజిటివ్ వైపు కాకుండా నెగెటివ్ వైపుగా వెళ్లడంతో ఆందోళన చెందుతుంటారు. దాని వల్ల డిప్రెషన్ వస్తుంది. అన్నింటికీ మించి ఏ నిర్ణయమూ జరక్క ఏ పనీ ముందుకు కదలదు. వర్తమానంలో ఉండే ఆనందాన్ని అనుభవించక ఎప్పుడో ఏదో నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళనతో బాధ పడుతుంటారు ఓవర్‌థింకర్లు’ అంటుంది వర్షా విజయన్. ఆలోచన.. అతి ఆలోచన ‘ఆలోచన మంచిదే. కాని అతి ఆలోచన మంచిది కాదు’ అంటుంది వర్షా విజయన్. ఓవర్‌థింకర్ల క్లబ్‌కు హాజరైన వారు ఒకరి మాటల్లో మరొకరు తెలుసుకునే విషయం ఏమిటంటే తమ చేతుల్లో లేని వాటి గురించి కూడా అధికంగా ఆలోచించడం. ఉదాహరణకు ఎప్పుడో పెట్టుకున్న శుభకార్యం రోజు వాన పడితే... వాన పడితే... వాన పడితే అని ఆలోచించడం. వానను ఆపడం మన చేతుల్లో లేదు. పడితే పడుతుంది... లేకపోతే లేదు. పడినప్పుడు అందుకు తగ్గ సర్దుబాట్లతో పనులు అవసరం అవుతాయి. అలా అనుకుని వదిలేయాలిగాని అదే పనిగా ఆలోచించడం ఆరోగ్యం కాదు. దాని వల్ల ఇవాళ్టి ఆనందాలు మిస్ అవుతాయి. ధ్యాస మళ్లించాలి ఓవర్‌థింకర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మెరుగ్గా ఉండొచ్చు అంటుంది వర్షా విజయన్ ► అతిగా ఆలోచించే చాలా విషయాలు పడే భయాలు దాదాపుగా నిజం కావు. పిల్లల్ని స్కూల్‌బస్ ఎక్కించాక దానికి ప్రమాదం జరిగితే.. ప్రమాదం జరిగితే అని ఆలోచించడం మంచిది కాదు. అలా లక్షసార్లలో ఒకసారి జరుగుతుంది. ఆ ఒకసారి గురించి అతి ఆలోచన చేయకూడదు ► ఎక్కువ ఆత్మవిమర్శ చేసుకోకుండా ఏదో ఉన్నంతలో బెస్ట్ చేద్దాం... చేశాం అని ముందుకెళ్లాలి. ఏదో ఒక మేరకు సంతృప్తి చెంది పని జరిగేలా చూడాలి ► ఆలోచనలు శ్రుతి మించుతుంటే స్నేహితులతో మాట్లాడాలి. చెప్పుకోవాలి. కొత్త పనులేవైనా నేర్చుకుని ధ్యాస మళ్లించాలి ∙సోషల్ మీడియాలో పనికిమాలిన పరిజ్ఞానం, వీడియోలు తగ్గించాలి ► ఈ క్షణంలో ఉండటం ప్రాక్టీస్ చేయాలి. అందుకు యోగా ఉపయోగపడుతుంది ► అన్ని మనం అనుకున్నట్టుగా జరగవు అనే వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి. సమస్య ఎదురైనప్పుడు చూసుకుందాంలే అనుకుని ధైర్యంగా ఉండాలి. ఓవర్‌థింకర్ల లక్షణాలు ► ఆత్మవిమర్శ అధికంగా చేయడం ► ఒక పని పూర్తిగా లోపరహితంగా చేయాలనుకోవడం (పర్ఫెక్షనిజం) ► జరిగిపోయిన ఘటనలు, మాటలు తలచుకుని వాటిలో ఏమైనా తప్పులు జరిగాయా, పొరపాట్లు జరిగాయా, వాటి పర్యవసానాలు ఏమిటి అని తల మునకలు కావడం ► ప్రయాణాల్లో ప్రమాదాలు ఊహించడం ► శుభకార్యాలప్పుడు అవి సరిగ్గా జరుగుతాయో లేదోనని ఆందోళన చెందడం ► చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పర్యవసానాలు ఊహించడం ► ఎవరికీ చెప్పుకోక ఆ ఆందోళనల్లోనే రోజుల తరబడి ఉండటం. -
నకిలీ పోలీస్ కమిషనర్ గాథ.. ఎంత చెప్పినా తక్కువేనయా!
సాక్షి, చెన్నై: ఆయనో నకిలీ పోలీస్ కమిషనర్. ఐడీ కార్డు, సైరన్‌తో కూడిన పోలీస్ వాహనం, యూనిఫాం అన్నీ నకిలీవే. అసలు పోలీసులతో సమానంగా చలామణి అవడమే కాకుండా అడ్డగోలుగా సంపాదించాడు. చివరకు వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల కథనం.. చెన్నైకి చెందిన విజయన్ (42)కు లారీ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇంటిపట్టునే ఉండిపోయాడు. దీంతో అతని భార్య ఏ పనీచేయకుండా ఉంటే ఎలా అని నిలదీస్తూ ఉండడంతో గెటప్ మార్చాడు. గ్రూప్–1 పాసై, డీఎస్పీ అయ్యానని, ఇటీవలే పోలీస్ కమిషనర్‌గా ఉద్యోగోన్నతి పొందినట్లు నమ్మబలికాడు. ఆ తర్వాత స్నేహితురాలి సహకారంతో జీప్ కొనుగోలు చేసి సైరన్‌తో కూడిన పోలీస్ వాహనంగా మార్చాడు. కేసుల విచారణకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి పలు ప్రాంతాలకు వెళ్లేవాడు. పోలీస్ అధికారి అవతారమెత్తాక పలువురి వద్ద డబ్బులు గుంజాడు. చివరకు పోలీస్ కమిషనర్ గెటప్‌లో వెళ్తుండగా దిండుగల్లు జిల్లా లక్ష్మీపురం టోల్గేట్ వద్ద అతని బండారం బట్టబయలైంది. వాహనాల తనిఖీలో ఇతను పోలీసులకు పట్టుబడ్డాడు. అతని నుంచి వాహనం, నకిలీ ఐడీ కార్డు, యూనిఫాం, తుపాకీ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో దిగిన ఫొటోలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సన్నిహితంగా ముచ్చట్లాడుతున్న ఫొటో సైతం ఉండడం గమనార్హం! అయితే తాను ఒక ప్రైవేట్ న్యూస్ చానల్లో విలేకరిగా పనిచేసేటపుడు వారితో ఫొటోలకు దిగినట్లు నిందితుడు విచారణలో పేర్కొన్నాడు. మరోవైపు– ఈ కేసు విచారణ సమయంలో పలువురు ఫోన్ ద్వారా ఒత్తిళ్లకు గురిచేసినట్లు పోలీసులు చెప్పడం గమనించతగ్గ అంశం. ప్రముఖుల పేర్లను, ఫొటోలను విజయన్ వాడుకున్నాడా? ఇతడిని అడ్డుపెట్టుకుని ప్రముఖులు సొమ్ము చేసుకున్నారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబును సైతం విచారించనున్నట్లు సమాచారం. -
‘పద్మశ్రీ’కి విజయన్ పేరు సిఫారసు
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఐఎమ్ విజయన్ను ‘పద్మశ్రీ’ పురస్కారానికి సిఫారసు చేసింది. కేరళకు చెందిన మాజీ స్ట్రయికర్ 90వ దశకంలో భారత్ తరఫున విశేషంగా రాణించాడు. 79 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన విజయన్ 40 గోల్స్ చేశాడు. 1993, 1997, 1999లలో ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. 2000 నుంచి 2003 వరకు జట్టు సారథిగా వ్యవహరించాడు. 2003లో ఆయనకు అర్జున అవార్డు లభించింది. అత్యున్నత నాలుగో పురస్కారమైన ‘పద్మశ్రీ’కి విజయన్ పేరును పరిశీలించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించామని ఏఐఎఫ్ఎఫ్ కార్యదర్శి కుశాల్ దాస్ తెలిపారు. పౌర పురస్కారానికి తనను సిఫార్సు చేయడం పట్ల విజయన్ సంతోషం వ్యక్తం చేశాడు. మరో వైపు భారత పురుషుల హాకీ జట్టు మాజీ సహాయ కోచ్ రమేశ్ పరమేశ్వరన్ ద్రోణాచార్య అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది హాకీ ఇండియా (హెచ్ఐ) కరియప్ప, రమేశ్ పఠానియాలను ఆ అవార్డు కోసం నామినేట్ చేయగా... పరమేశ్వరన్ సొంతంగా హాకీ కర్ణాటక అండతో దరఖాస్తు చేసుకున్నారు. -
వలస జీవులకు వరం.. కేరళ ప్రవాసీ విధానం
అరబ్ గల్ఫ్ దేశాలలో కేరళ రాష్ట్రవాసులు (మళయాళీలు) లేని సంస్థ దాదాపు ఉండదని చెప్పవచ్చు. వంద శాతం అక్షరాస్యత, ఎంత దూరమైనా వలసవెళ్లి జీవించే తత్వంతో వారికి గల్ఫ్‌లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. కేరళ మైగ్రేషన్ సర్వే ప్రకారం 22 లక్షల మంది మలయాళీలు విదేశాలలో ఉన్నారు. వీరిలో 90 శాతం గల్ఫ్ దేశాలలోనే నివసిస్తున్నారు. అంతర్గత, అంతర్జాతీయ ప్రవాసుల సమస్యలను ఆకళింపు చేసుకున్న కేరళ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే వినూత్నమైన ప్రవాసీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. 1996 డిసెంబర్ 6న కేరళ రాష్ట్ర ప్రభుత్వం డిపార్టుమెంట్ ఆఫ్ నాన్ రెసిడెంట్స్ కేరలైట్స్ అఫైర్స్ (నోర్కా) అనే సంస్థను స్థాపించింది. ‘నోర్కా’ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ‘నోర్కా రూట్స్’ అనే ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేశారు. భారత దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఉన్న, విదేశాలలో ఉన్న కేరళ ప్రవాసుల సమస్యల పరిష్కారానికి, వారితో స్థిరమైన భాగస్వామ్యానికి ‘నోర్కా’ ఏర్పాటు చేశారు. ప్రవాసుల సంక్షేమం కోసం ఇలాంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం భారతదేశంలోనే ప్రథమం. 351 మంది సభ్యులతో ‘లోక కేరళ సభ’ నూతనంగా ఏర్పాటు చేసిన ‘లోక కేరళ సభ’ (ప్రపంచ కేరళ వేదిక) తొలి సమావేశాలు ఈనెల 12, 13న కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగాయి. ముఖ్యమంత్రి పి.విజయన్ ఈ సమావేశాలను ప్రారంభించారు. ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రవాస భారతీయులు, ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్నవారు, శాస్త్రవేత్తలు, మేధావులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేరళీయులను మాతృభూమి కేరళతో సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, ఆర్థికంగా అనుసంధానపరిచే యోచనతో 351 మందితో కూడిన ‘లోక కేరళ సభ’ (ఎల్‌కేఎస్)ను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. ప్రవాసీ కేరళీయులు కష్టాలను, ఆకాంక్షలను తెలుపుకోవడానికి, వారి నైపుణ్యాన్ని, అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి వాడుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. ప్రవాసీ గుర్తింపు కార్డు, ఇన్సూరెన్స్ ప్రవాసీ కేరళీయులకు ‘ప్రవాసీ గుర్తింపు కార్డు’ ఇచ్చే పథకం ఆగస్టు 2008లో ప్రవేశపెట్టారు. విదేశాల్లో కనీసం ఆరు నెలలు నివాసం ఉండి, 18 ఏళ్ల వయస్సు పైబడిన వారికి మూడేళ్లు చెల్లుబాటు అయ్యేట్లుగా కార్డులు జారీ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300. ది న్యూ ఇండియా అస్సూరెన్స్ కంపెనీ రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పిస్తుంది. కనీసం ఐదేళ్లపాటు నెలనెలా పొదుపు చేసుకుని.. 60 ఏళ్ళు నిండినవారు పెన్షన్‌కు అర్హులు. సభ్యుడు చనిపోయిన తర్వాత జీవిత భాగస్వామికి కుటుంబ పెన్షన్ వస్తుంది. అనారోగ్యం లేదా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందుతుంది. తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు, ఆడపిల్లల పెళ్లికి, మహిళా సభ్యుల ప్రసూతికి ఆర్థికసాయం అందిస్తారు. అదేవిధంగా నివాస గృహాల నిర్మాణానికి, కొనుగోలుకు, ఖాళీ స్థలాల కొనుగోలుకు రుణ సౌకర్యం కల్పిస్తారు. పిల్లల చదువుకు (ఉన్నత విద్యతో సహా), శాశ్వత అంగవైకల్యం వలన విధులు నిర్వర్తించలేని వారిని ఆదుకుంటారు. 60 ఏళ్ళు నిండిన తర్వాత అంతర్జాతీయ ప్రవాసులు నెలకు రూ.ఒక వెయ్యి నుంచి రెండు వేలు, అంతర్గత ప్రవాసులు రూ.500 నుంచి రూ.ఒక వెయ్యి వరకు పెన్షన్ ఇస్తారు. సభ్యుడు మరణిస్తే వారసులకు అందులో సగం చెల్లిస్తారు. వివిధ పథకాల అమలులో ఆదర్శం నోర్కా లక్ష్యాల్లో కొన్ని.. ప్రవాసీ కేరళీయుల సంక్షేమం, విదేశాల్లో ఉన్నవారితో, రాష్ట్రంలో ఉన్నవారితో సాంస్కృతిక మార్పిడి, సాంఘిక భద్ర తకు యంత్రాగం ఏర్పాటు. అవసర మున్నవారిని ఆదుకోవడానికి సహాయ నిధి ఏర్పాటు, వార్షిక సదస్సులు ఏర్పాటు చేయడం, వాపస్ వచ్చినవారికి పునరావాస, పునరేకీకరణ కార్యక్రమాలు, ఉద్యోగ ప్రణాళిక, నైపుణ్య శిక్షణ, అభివృద్ధి, విశిష్ట నైపుణ్యం కలిగినవారితో మానవ వనరుల సమూహాన్ని ఏర్పాటు చేయడం, ఉద్యోగార్థుల, ఎన్నారైల డేటా బ్యాంకు (సమాచార నిధి) ఏర్పాటు, రాష్ట్రానికి పెట్టుబడులను సేకరించడం, అక్రమ రిక్రూటింగ్ ఏజెన్సీలను నియంత్రించడం. నోర్కా రూట్స్ సేవలు ఇలా.. విదేశాల్లో 46 ప్రవాసీ మలయాళీ సంఘాలు, ఇతర రాష్ట్రాలలో కూడా కొన్ని సంఘాలు నోర్కా గుర్తింపు పొందాయి. రెండేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. ఒక రోజు ప్రి డిపార్చర్ ఓరియెంటేషన్ ట్రైనింగ్ (పీడీఓటీ) ఇస్తారు. దీంట్లో ప్రయాణ ముందస్తు పరిస్థితులు విదేశాలలో ఉండే విధానాలపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తు న్నారు. విదేశాల నుంచి వాపస్ వచ్చినవారు స్వస్థలాలలో స్థిరపడటానికి నోర్కా రూట్స్ సంస్థ పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నది. రూ.20 లక్షల విలువైన ప్రాజెక్టులకు 15 శాతం పెట్టుబడి రాయితీ, వడ్డీలో 3 శాతం రాయితీ కల్పిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులకు తగిన అవగాహన, శిక్షణ కల్పిస్తు న్నారు. ప్రవాసీలు వారి మాతృభూమి అభివృద్ధిలో పాలుపంచు కోవడానికి మై విలేజ్ – మై డ్రీమ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. కేరళ ప్రవాసీ వెల్ఫేర్ బోర్డు కేరళ ప్రభుత్వం ‘ది నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వెల్ఫేర్ యాక్ట్ 2008’ను తెచ్చింది. ఈ చట్టం పరిధిలో ‘నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటైంది. దీనిని కేరళ ప్రవాసీ వెల్ఫేర్ బోర్డు, ప్రవాసీ వెల్ఫేర్ ఫండ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. విదేశాలలో కనీసం రెండేళ్లపాటు పనిచేసి వాపస్ వచ్చినవారు ఇందులో సభ్యత్వం తీసుకోవచ్చు. పెన్షన్, కుటుంబ పెన్షన్, వైద్య సహాయం, ఎక్స్‌గ్రేషియా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఈ చట్టంలో పొందుపర్చారు. వెల్ఫేర్ ఫండ్‌లో 2.25 లక్షల మంది పైగా సభ్యులున్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం 15 మంది సభ్యుల తో కేరళ ప్రవాసీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ బోర్డులో ఐదుగు రు ఎన్నారైలు (కువైట్, సౌదీ, యూఏఈ, ఒమన్, ఖతార్ దేశాల నుంచి ఒక్కొక్కరు), ఇద్దరు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు, కార్మిక, ఆర్థిక, న్యాయ శాఖల అధికారులు, రిక్రూటింగ్ లైసెన్సులు కలిగిన ఓవర్సీస్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్ – ఒడెపెక్, నోర్కా రూట్స్ అనే రెండు ప్రభుత్వరంగ సంస్థల అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ చిత్ర దర్శకుడు, కైరళి టీవీలో ప్రవాసలోకం అనే కార్యక్రమ వ్యాఖ్యాత పి.టి.కుంజు మహ్మద్ ను చైర్మన్‌గా నియమించారు. కేరళ ప్రవాసీ సంక్షేమ బోర్డులో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపువారు చేరడానికి అర్హులు. సభ్యులు విదేశాల్లో ఉన్నప్పుడు నెలకు రూ.300, ఇండియాకు వాపస్ వచ్చిన తర్వాత నెలకు రూ.100 పొదుపు చేయాలి. ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు నెలకు రూ.100 పొదుపు చేయాలి. విదేశాలలో ప్రస్తుతం పనిచేస్తున్నవారు, విదేశాల నుంచి వాపస్ వచ్చినవారు, ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్నవారు, ఇతర రాష్ట్రాల నుంచి కేరళకు వాపస్ వచ్చినవారు అనే నాలుగు రకాల సభ్యత్వాలు ఉన్నాయి. ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకుల ద్వారా రూ.200 చెల్లించి సభ్యులుగా చేరవచ్చు. స్వాంతన ప్రవాసీ కేరళీయులు విదేశాల నుంచి వాపస్ వచ్చి కష్టాల్లో ఉంటే వారిని ఆదుకోవడానికి ‘స్వాంతన’ ఆర్థిక సహాయ పథకం ప్రవేశపెట్టారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న, దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) కుటుంబాలను ఈ పథకం ద్వారా ఆదుకుంటారు. రిటర్నీలు (వాపస్ వచ్చినవారు), వారి కుటుంబ సభ్యులకు నాలుగు రకాలుగా సహాయం చేస్తారు. రిటర్నీలు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వైద్య చికిత్స ఖర్చులు అందిస్తారు. కుటుంబ సభ్యులు మరణించినప్పుడు సహాయం చేస్తారు. కనీసం రెండు సంవత్సరాలు విదేశాల్లో గానీ, రాష్ట్రం బయటగానీ నివసించినవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వారు పనిచేసిన కాలం కానీ, 10 సంవత్సరాలు కానీ ఏది తక్కువైతే అది వర్తిస్తుంది. వార్షి క ఆదాయం ఒక లక్ష రూపాయల లోపు ఉండాలి. సహాయం కోసం దరఖాస్తు చేసేనాటికి ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ పథకం వర్తించదు. ఎక్స్‌గ్రేషియా లక్ష రూపాయ లు. క్లిష్టమైన పరిస్థితులలో వైద్య సహాయం రూ.50 వేలు (కాన్సర్, గుండె, మూత్ర పిండా లు, పక్షవాతం, ప్రమాదాలలో తీవ్రమైన అంగ వైకల్యం). ఇతర రకాల చికిత్సకు రూ.20 వేలు, పెళ్లి ఖర్చులకు 15 వేలు, కృత్రిమ అవయవాలకు రూ.10 వేలు అందిస్తారు. కారుణ్యం మృతదేహాలను కేరళకు చేర్చడానికి ‘కారుణ్యం’ పేరిట ఒక నిధిని ఏర్పాటు చేశారు. శవాల తరలింపునకు విదేశాల నుంచి రూ.50 వేలు, ఇతర రాష్ట్రాల నుంచి రూ.15 వేలు సహాయం చేస్తారు. చట్టబద్ధమైన ప్రవాసులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కంపెనీ నుంచి, ఇండియన్ ఎంబసీ నుంచి ఎలాంటి సహాయం అందని పరిస్థితులలో మాత్రమే ఈ పథ కం వర్తిస్తుంది. సర్టిఫికెట్ అటెస్టేషన్ ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం చైర్మన్ ఫండ్‌కు జమచేస్తారు. స్వాంతన లాంటి ఎలాంటి పథకాలలో లబ్ధిచేకూరని వారు చైర్మన్ ఫండ్ ద్వారా సహాయం పొందవచ్చు. ఈ పథకాలే కాకుండా ఎస్పీ స్థాయి అధికారి పర్య వేక్షణ లో కేరళ పోలీస్ ఎన్నారై సెల్ పనిచేస్తుంది. ప్రవాసీ కేరళీయులు తమ ఫిర్యాదుల ను కేరళ పోలీస్ ఎన్నారై సెల్ spnri.pol@kerala.gov.inకు పంపవచ్చు. (మంద భీంరెడ్డి, అధ్యక్షులు, ప్రవాసీ మిత్ర email: mbreddy.hyd@gmail.com) సౌదీలో హెల్ప్‌లైన్ సౌదీ అరేబియాలో నివసించే ప్రవాస భారతీ యులకు సహాయం, సలహాల కోసం రియాద్‌లోని ఇండియన్ ఎంబసీ టోల్ ఫ్రీ నెంబర్ 800–247–1234 కు కాల్ చేయవచ్చు. భారత్‌లో ఉన్నవారు 00966–11–4884697 కు కాల్ చేయాలి. కాన్సులార్ టూర్లో భాగంగా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది ఈ నెల 23, 26 తేదీలలో జుబెల్ పట్టణంలోని విఎస్ఎఫ్ సెంటర్లో ఎన్నారైలను కలుసుకుంటారు. ఎన్నారైలు పాప్‌పోర్ట్, దౌత్య సంబంధ సేవలు గురించి, వేతనాలు తదితర సమస్యల గురించి అధికారులకు దరఖాస్తులు సమర్పించవచ్చు. లేబర్ క్యాంపుల్లో అవగాహన యూఏఈ దేశంలోని అబుదాబి, దుబాయి, షార్జా తదితర ప్రాంతాల లోని లేబర్ క్యాంపులలో ‘భారతీ య కార్మికుల వనరుల కేంద్రం’ (ఇండియన్ వర్కర్స్ రీసోర్స్ సెంటర్ – ఐడబ్ల్యూఆర్సీ) వారు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. టెలిఫోన్ కాల్స్ కుంభకోణంలో చిక్కుకోకుండా సిమ్ కార్డులను జాగ్రత్తపర్చు కోవాలని, స్థానిక చట్టాలను పాటించాలని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు కార్మి కులకు సూచిస్తున్నారు. మానసిక ఒత్తిడి, ఆర్థిక క్రమశిక్షణ గురించి కూడా వివరిస్తున్నారు. కార్మి కుల పలురకాల ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఫేస్బుక్ లైవ్‌లో చూపిస్తున్నారు. సలహాల కోసం 800 4632 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్చేయ వచ్చు. మరిన్ని వివరాలకు http://iwrcuae.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. -
ఎంజీఆర్ అల్లుడి హత్యకేసులో ఏడుగురికి జీవితఖైదు
చెన్నై: అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) అల్లుడు విజయన్ హత్య కేసులో చెన్నై సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఎంజీఆర్ పెంపుడు కుమార్తె బాను శ్రీధర్ సహా ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ఎంజీఆర్ మరో పెంపుడు కూతురు సుధ భర్త అయిన విజయన్ 2008, జూన్ 4న అళ్వార్ పేటలో హత్యకు గురైయ్యారు. ఆయనను కారుతో గుద్ది, ఇనుప రాడ్లతో మోది చంపారు. ఈ కేసులో మొదట అభిరామపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తర్వాత సీబీసీఐడీకి అప్పగించారు. దాదాపు 70 మంది కోర్టులో సాక్ష్యమిచ్చారు. కానిస్టేబుల్ కరుణ సహకారంతో సోదరి భర్తను బాను శ్రీధర్ చంపించినట్టు దర్యాప్తులో తేలింది. ఆస్తి తగాదాలతో ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు రుజువైంది. కానిస్టేబుల్ కరుణకు బాను రూ. 4లక్షలు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. బానుకు సహకరించిన ఆమె స్నేహితురాలు భువన ఇప్పటికి పరారీలో ఉంది. కోర్టు తీర్పుపై విజయన్ భార్య సుధ స్పందించారు. పోలీసులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. తన భర్తకు చివరికి న్యాయం దక్కిందన్నారు. -
కేరళ సీఎంగా విజయన్ ప్రమాణం
ఇద్దరు మహిళలు సహా 19 మందితో మంత్రివర్గం తిరువనంతపురం: సీపీఎం ఉక్కుమనిషి, 72 ఏళ్ల పినరయి విజయన్ కేరళ 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారమిక్కడి సెంట్రల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు చెందిన 19 మంది సభ్యులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కాగా, 13 మంది కొత్త వారున్నారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సదాశివం వీరితోప్రమాణం చేయించారు. విజయన్ ప్రమాణం మలయాళంలో సాగిం ది. 19 మంది కేబినెట్ మంత్రుల్లో సీఎం సహా 12 మంది సీపీఎం, నలుగురు సీపీఐకి చెందినవారు. ఎన్సీపీ, జనతాదళ్(ఎస్), కాంగ్రెస్(ఎస్)నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. అతిరథ మహారథులు: మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, మాజీ సీఎం ఊమెన్ చాందీ, వీఎస్ అచ్యుతానందన్, సీసీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మరో నేత ప్రకాశ్ కారత్, 1957 నాటి నంబూద్రిపాద్ కేబినెట్లో మంత్రిగా చేసిన 97 ఏళ్ల కేఆర్ గౌరీ అమ్మ, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఏకైక ఎమ్మెల్యే ఒ.రాజగోపాల్, సినీ ప్రముఖులు, మత, సాంస్కృతిక సారథులు ప్రమాణ స్వీకారోత్సవానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ నెల 16న జరిగిన శాసనసభ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ 140 స్థానాలకు గాను 91 స్థానాలు గెలిచింది.రాజధాని నగరం కమ్యూనిస్టు జెండాలతో ఎర్ర సముద్రాన్ని తలపించింది. అచ్యుతానందన్ సలాం... ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన విజయన్‌కు సీపీఎం సీనియర్ నాయకుడు, 92 ఏళ్ల వీఎస్ అచ్యుతానందన్.. సలాం చేశారు. విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తుందని ఆశిస్తూ కొత్తగా ఏర్పడిన మంత్రి వర్గానికి అభినందనలు తెలిపారు. కేరళలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను అచ్యుతానందన్ ఖండించారు. ప్రగతిశీల ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వారు ఎంతకైనా తెగిస్తారని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గీత కార్మిక కుటుంబం నుంచి... పినరయి విజయన్ పేద గీత కార్మిక కుటుంబం నుంచి వచ్చి సీఎం స్థాయికి ఎదిగారు. అనుక్షణం ప్రజా పోరాటాల్లో మమేకమయ్యారు. సొంత పార్టీ అయిన సీపీఎం సీనియర్ నేత, మాజీ సీఎం అచ్యుతానందన్‌ను రేసు నుంచి వెనక్కి నెట్టి సీఎం పీఠం దక్కించుకున్న విజయన్ మార్చి 21 1944లో కన్నూర్ జిల్లా పినరయిలో జన్మించారు. తలస్సెరిలో ఆయన బీఏ ఎకనామిక్స్ చదువుతున్నప్పుడు ‘కేరళ విద్యార్థి సమాఖ్య’ కన్నూర్ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. పాఠశాల విద్యత తర్వాత ఆయన కొంత కాలం చేనేత కార్మికుడిగా పనిచేశారు. 1970లో 26 ఏళ్లప్పుడు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1977,91, 96ల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమర్జెన్సీలో ఆరుగురు పోలీసులు ఆయన్ను లాకప్‌లో పెట్టి స్పృహతప్పేవరకు చితకబాదారు. విడుదలయ్యాక రక్తం మరకల చొక్కాతో అసెంబ్లీకి వెళ్లిన విజయన్ నాటి హోంమంత్రి, కాంగ్రెస్ నేత కె.కరుణాకరన్‌ను ఉద్దేశించి శక్తివంతమైన ఉపన్యాసం ఇచ్చారు. ఇది అసెంబ్లీ చరిత్రలో అద్భుతమైన ఘట్టం. ఆయన రాజకీయ ప్రాబల్యం ఉన్న తియ్య వర్గానికి చెందినవారు. పార్టీ నేత అచ్యుతానందన్‌తో ఆయన శత్రుత్వం బహిరంగంగానే చర్చకొచ్చేది. ఓ సమయంలో గీత దాటినందుకు ఇద్దరూ పార్టీ పొలిట్‌బ్యూరో నుంచి(2007) సస్పెండ్ అయ్యారు. -
కేరళ సీఎంగా విజయన్
ఏకగ్రీవంగా ఎంపిక చేసిన పార్టీ సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీలు తిరువనంతపురం: కేరళ సీఎంగా సీపీఎం సీనియర్ నాయకుడు పినరయి విజయన్(72) ప్రమాణ స్వీకారానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. సీనియర్ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్(92)ను కాదని విజయన్నే ఎంపిక చేశారు. దీనిపై అచ్యుతానందన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. కాగా, అచ్యుతానందన్‌ను ఫిడెల్ క్యాస్ట్రోతో పోల్చిన పార్టీ నేతలు ఆయన సేవలను పార్టీ అభివృద్ధికి వినియోగించుకుంటామన్నారు. విజయన్ కన్నూర్ జిల్లాలోని ధర్మధోర్ నియోజకవర్గం నుంచి 36 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. విజయన్ కేరళలో సీపీఎం తరఫున 4వ సీఎం కానున్నారు. ఎవరీ పినరయి విజయన్..? 1944 మార్చి 21న గీత కార్మిక కుటుంబంలో విజయన్ జన్మించారు. విజయన్ స్వస్థలం కన్నూర్ జిల్లాలోని పినరయి. కేరళలో అందరికీ పినరయి విజయన్‌గా సుపరిచితుడు. కేరళలో రాజకీయ ఆధిపత్యం కలిగిన తియ్యా సామాజిక వర్గానికి చెందినవారు. విద్యార్థి సంఘాల ద్వారా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కేరళ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా, కార్యదర్శిగా పనిచేశారు. 1970, 1977, 1991, 1996లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1996-98లో విద్యుత్ మంత్రిగా ఉన్నారు. 2007లో పార్టీ పొలిట్‌బ్యూరో నుంచి సస్పెండైనా.. కొంత కాలానికే తిరిగి పార్టీలో స్థానం సంపాదించారు. అవేవీ ఎల్డీఎఫ్ విజయాన్ని ఆపలేదు! తిరువనంతపురం: ఎన్నికలకు ముందు రాజకీయ ఘర్షణలు, అవినీతి ఆరోపణలున్నా ఇవేవీ ఎల్డీఎఫ్ విజయాన్ని అడ్డుకోలేక పోయాయి. కేరళలో ఎల్డీఎఫ్ వోటు వాటా కాస్తంత తగ్గినా సీట్లు మాత్రం గణనీయంగా (91) పెరిగాయి. బీజేపీ-బీడీజేస్ కూటమి ఆవిర్భావంతో చాలా నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ కనిపించింది. ఇదే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తన ఓటు వాటాను కోల్పోయేందుకు కారణమైంది. కేరళలో ఎక్కువగా ఉన్న మహిళా ఓటర్ల (1.05 కోట్లు)ను ఆకర్షించేందుకు యూడీఎఫ్ సర్కారు మద్యనిషేధం చేపట్టినా దీని ప్రభావం కనిపించలేదు. ఈ ఓట్లు చీలిపోయాయి. బీజేపీ ఒక సీటు మాత్రమే గెలిచినా.. ఏడు చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 2011లో 6.06శాతం ఉన్న ఎన్డీఏ ఓటు వాటా ఈసారి 14.4 శాతానికి పెరిగింది. ఇతరులు కూడా చాలాచోట్ల ఓట్లను పంచుకోవటం యూడీఎఫ్ అవకాశాలను దెబ్బకొట్టింది. -
చాయ్ అమ్ముతూ.. 17 దేశాలు చుట్టేశాడు!
రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మకున్న దామోదర్ దాస్.. ఇప్పుడు దేశ ప్రధాని. బహుశా చాయ్‌వాలాగా ఉన్నప్పుడు.. ఈ స్థాయికి చేరుకుంటానని ఆయన ఊహించి ఉండరేమో! దాదాపు మోదీ సమకాలీకుడే అయిన విజయన్ మాత్రం బోలెడు కలలు కన్నాడు. వాటిలో చాలా వాటిని నెరవేర్చుకున్నాడు కూడా! చాయ్ వాలాగా జీవితం ప్రారంభించిన విజయన్ ఒకప్పుడు.. చిన్న టీస్టాల్ ఓనర్. తన భార్యతో కలిసి.. భారత్ లోని అన్ని పర్యాటక ప్రాంతాలతో పాటు 17 విదేశాలూ చుట్టొచ్చాడు. విజయన్ 65 ఏళ్ల అనుభవం, 40 ఏళ్ల దాంపత్య జీవితం, 17 దేశాల పర్యటన అన్నింటినీ కలిపి 'ఇన్విజిబుల్ వింగ్స్' పేరుతో రూపొందించిన 9 నిమిషాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 'ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. కలలు నెరవేర్చుకోండి' అంటూ ఉత్సాహం రేకెత్తిస్తోంది. కొచ్చి నగరం, గాంధీనగర్‌లోని సలీమ్ రాజన్ రోడ్డు.. ఎర్రటి గోడపై తెల్లటి అక్షరాలు.. 'శ్రీబాలాజీ కాఫీ హౌస్'. అలుపు లేకుండా వచ్చే కస్టమర్లకు అలసిపోకుండా కాఫీ, టీలు అందిస్తుంటాడు.. 65 ఏళ్ల విజయన్. పక్కనే చేదోడుగా ఆయన భార్య మోహన. పరిచయస్తులు, చుట్టుపక్కలవారి దృష్టిలో వాళ్లిద్దరూ 'కొద్దిగా తేడా మనుషులు'. ఈ ఆరోపణపై విజయన్ వివరణ ఇస్తాడిలా.. 'మమ్మల్ని ఒక్కమాటైనా అనని వాళ్లు ఒక్కరూ లేరంటే అబద్ధం కాదు. టీస్టాల్ నడుపుకొనే మాకు.. విదేశీయానాలు అవసరమా? అనేది వారి ఆరోపణ. నా వరకైతే ప్రతి యాత్రా ఒక మలుపు. ఒక విజయం. ఎందుకంటే అది నా కల కాబట్టి' అని. భారతదేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చిన విజయన్, మోహనలు 17 విభిన్నదేశాల అందాలనూ ఆస్వాదించారు. అమెరికా వెళ్లేందుకు మాత్రం వారికింకా అనుమతి లభించలేదు. కారణం.. ఆర్థిక స్థితి. యూఎస్ వీసా కోసం ఆస్తులు చూపించడం తప్పనిసరి. మరి విజయన్ ఆస్తి.. ఒక్క టీస్టాలే! అయినాసరే, ఎప్పటికైనా అక్కడకు కూడా వెళతాననే ధీమాతో ఉన్నాడు విజయన్. ఎలా? అటే.. 'అదీ నా కలే కాబట్టి తప్పక నెరవేర్చుకుంటా' అంటాడు. విదేశీయానాల కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం, ఆనందం అనుభవించిన తర్వాత మూడు నాలుగు నెలలు రెట్టింపు కష్టంతో పనిచేసి అప్పు తీర్చడం ఈ వృద్ధ జంటకు అలవాటైన పని. -
చిత్తూరులో యువకుడి హత్య
రాళ్లతో కొట్టి చంపి.. బావిలో పడేశారు స్నేహితుల హస్తం ఉందని పోలీసుల అనుమానం చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని మాపాక్షి కి చెందిన ఆర్.విజయన్(25) హత్యకు గురయ్యాడు. రాళ్లతో కొట్టి చంపిన దుం డగులు అతడి మృతదేహాన్ని స్థానిక కైలాశపురం వద్ద ఉన్న నాగాలమ్మ ఆలయ సమీపంలోని పాడుబడ్డ బావిలో పడేశారు. శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందచేశారు. పోలీసుల కథనం మేరకు.. చి త్తూరు నగరంలోని మాపాక్షికి చెందిన కస్తూరి, రామ్మూర్తి పెద్ద కుమారుడు విజయన్ ఓటీకే రోడ్డులోని ఓ చెప్పుల దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి నగరంలో తిరుగుతున్నాడు. రాత్రి 7 గంట ల ప్రాంతంలో తల్లి కస్తూరి కూలి పని పూర్తిచేసుకుని ఫోన్ చేయగా, మాపాక్షి కి వెళ్లడానికి ఆమెను ద్విచక్రవాహనంలో తీసుకెళ్లి ఎంఎస్ఆర్ కూడలి వద్ద వదిలాడు. అతని స్నేహితుడు మహేం ద్ర సంతపేటకు రమ్మన్నాడని ఆమెకు చెప్పి వెళ్లిపోయూడు. రాత్రి ఇంటికి వెళ్లలేదు. విజయన్ తల్లి ఫోన్ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. శనివారం ఉదయం చెప్పుల దుకాణానికి కూడా వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు నగరంలోని స్నేహితులను విచారించారు. స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నాగాలమ్మ గుడి వద్ద స్థానికులు ఓ బావి వద్ద రక్తపు మరకలు ఉండడాన్ని గుర్తించారు. బావిలో మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐలు సూర్యమోహన్‌రావు, నిరంజన్‌కుమార్ అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య వెనుక స్నేహితుల హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతుడి మెడ, తల, వీపుపై రాళ్లతో కొట్టిన గుర్తులు, కత్తిగాట్లు ఉన్నాయి. బావి వద్ద ఉన్న గోడకు రక్తపు మరకలున్నాయి. మృతుడి జేబులో ఉన్న ద్విచక్రవాహనం తాళాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ‘ ఏడు నెలల ముందే నా అల్లుడు చనిపోయాడు. ఇప్పుడు నా ఇంటి పెద్ద దీపం ఆరిపోయింది... నేనెందుకు బతకాలిరా.. దేవుడా ’’ అంటూ మృతుని తల్లి కస్తూరి రోదించడం అందరినీ కలచివేసింది. ఎవరికీ ఏ హాని చేయని నా కొడుకును చంపడానికి చేతులెలా వచ్చాయిరా.. అంటూ ఆమె ఆర్తనాదాలు చేసింది. -
‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ కేసీఆర్!
31 శాతం ఓట్లతో మొదటిస్థానం.. సీఎంను కలిసిన సీఎన్ఎన్-ఐబీఎన్ వైస్ ప్రెసిడెంట్ సాక్షి, హైదరాబాద్: ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ’ రేస్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందంజలో ఉన్నారు. సీఎన్ఎన్-ఐబీఎన్ ఇంగ్లిష్ న్యూస్ చానల్ ఆన్లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహిస్తున్న పోటీలో 31 శాతం ఓట్లతో కేసీఆర్ మొదటిస్థానంలో ఉన్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి విజయన్ 21 శాతం ఓట్లతో రెండోస్థానంలో ఉన్నారు. 10 శాతం ఓట్ల తేడా ఉండడంతో సీఎ కేసీఆర్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక, ప్రకటన ఇక లాంఛనమేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎన్ఎన్-ఐబీఎన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీవాస్తవ మంగళవారం సచివాలయంలో సీఎంను కలిసి అభినందించారు. ‘పెద్ద పెద్ద సినీస్టార్లను పక్కకు నెట్టి, కొత్త రాష్ట్రం సీఎంగా అతితక్కువ కాలంలోనే కేసీఆర్ మంచి పాపులారిటీ పొందారు’ అని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ఈ నెల 31 దాకా ఆన్లైన్ ఓటింగ్‌కు గడువు ఉంది. ఫిబ్రవరిలో ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ను ప్రకటించనున్నారు. -
ఈ-సేవా కేంద్రాల ద్వారా చిన్న పాలసీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం తక్కువగా ఉండి ఏజెంట్లు విక్రయించడానికి అంతగా ఆసక్తి చూపని చిన్న పాలసీలను ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు బీమా అభివృద్ధి నియంత్రణ మండలి (ఐఆర్డీఏ) ప్రకటించింది. సంక్లిష్టమైన పథకాలు కాకుండా అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఉండే పథకాలను ఎంపిక చేసి వాటిని ఈ-సేవా, మీ-సేవా వంటి ఉమ్మడి కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నామని, వచ్చే రెండు మూడు నెలల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. ఇందుకోసం బీమా కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, చిన్న ప్రీమియాలున్న జీవిత బీమా పాలసీలతోపాటు, గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన ట్రాక్టర్, మోటార్ ఇన్సూరెన్స్ పథకాలను ఈ సేవా కేంద్రాల ద్వారా విక్రయించనున్నట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఫ్యాప్సీ) ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు. బీమా ఆవశ్యకతను అందరికీ అర్థమయ్యే విధంగా దీన్ని ఒక పాఠ్యాంశంగా చేసే యోచనలో ఉన్నామని, ప్రస్తుతం ఇది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిశీలనలో ఉందన్నారు. ప్రస్తుతం దేశీయ జీవిత బీమా మార్కెట్ విలువ జీడీపీలో 3.8%గా ఉందని, ఇది ఆరు శాతానికి చేరే అవకాశాలున్నాయన్నారు. బ్యాంకులు మంచి పాలసీలు సూచించాలి బ్యాంకులు తమ ఖాతాదారులకు మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని పాలసీల్లో మంచిదాన్ని సూచించాలే కాని ఒకే కంపెనీకి చెందిన పాలసీని సూచించడం సరికాదని విజయన్ అన్నారు. బ్యాంకులు ఏజెంట్‌గా కాకుండా బ్రోకరుగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే బ్యాంక్ అష్యూరెన్స్‌కు సంబంధించి ఆర్బీఐ మార్గదర్శకాలను విడుదల చేసి ఈ నెలాఖరు వరకు సూచనలు ఆహ్వానించిందని, వచ్చే రెండు మూడు నెలల్లో తుది మార్గదర్శకాలు వస్తాయని ఆశిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
టోగో జైలు నుంచి విడుదలైన సునీల్
పశ్చిమ ఆఫ్రికాలోని టోగో జైలు నుంచి భారతీయ నౌక కెప్టెన్ సునీల్ జేమ్స్‌తో పాటు మరో భారతీయుడు నావికుడు విజయన్ విడుదలయ్యారు. ఈ మేరకు టోగోలో భారత రాయబారి కె.జీవ సాగర్ సమాచారం అందించారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గురువారం ఇక్కడ వెల్లడించారు. వారిద్దరు ఈ రోజు భారత్‌కు బయలుదేరతారని తెలిపారు. ఈ ఏడాది జులైలో వారిద్దరిని టోగో దేశాధికారులు అరెస్ట్ చేశారు. అయితే డిసెంబర్ 2వ తేదీని సునీల్ జేమ్స్ 11 మాసాల వయస్సు గల కుమారుడు వివన్ తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. దీంతో టోగో జైల్లో ఉన్న తన భర్తను విడుదల చేయాని సునీల్ భార్య అదితితోపాటు విజయన్ కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో అంశంపై ఆ దేశ ఉన్నతాధికారులతో చర్చించాలని టోగోలోని భారత రాయబారి జీవ సాగర్ని భారత ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జీవ సాగర్ టోగో ఉన్నతాధికారగణంతో సంప్రదింపులు జరిపి భారతీయ నావికలు ఇద్దరు విడుదలకు మార్గం సుగమం చేశారు. సునీల్ విడుదల కావడంతో ఆయన కుటుంబ సభ్యులు గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.