టోగో జైలు నుంచి విడుదలైన సునీల్ | Indian merchant navy captain released from Togo jail | Sakshi
Sakshi News home page

టోగో జైలు నుంచి విడుదలైన సునీల్

Published Thu, Dec 19 2013 8:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

Indian merchant navy captain released from Togo jail

పశ్చిమ ఆఫ్రికాలోని టోగో జైలు నుంచి భారతీయ నౌక కెప్టెన్ సునీల్ జేమ్స్తో పాటు మరో భారతీయుడు నావికుడు విజయన్ విడుదలయ్యారు. ఈ మేరకు టోగోలో భారత రాయబారి కె.జీవ సాగర్ సమాచారం అందించారని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గురువారం ఇక్కడ వెల్లడించారు. వారిద్దరు ఈ రోజు భారత్కు బయలుదేరతారని తెలిపారు. ఈ ఏడాది జులైలో వారిద్దరిని టోగో దేశాధికారులు అరెస్ట్ చేశారు.

 

అయితే డిసెంబర్ 2వ తేదీని సునీల్ జేమ్స్ 11 మాసాల వయస్సు గల కుమారుడు వివన్ తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. దీంతో టోగో జైల్లో ఉన్న తన భర్తను విడుదల చేయాని సునీల్ భార్య అదితితోపాటు విజయన్ కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో అంశంపై ఆ దేశ ఉన్నతాధికారులతో చర్చించాలని టోగోలోని భారత రాయబారి జీవ సాగర్ని భారత ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జీవ సాగర్ టోగో ఉన్నతాధికారగణంతో సంప్రదింపులు జరిపి భారతీయ నావికలు ఇద్దరు విడుదలకు మార్గం సుగమం చేశారు. సునీల్ విడుదల కావడంతో ఆయన కుటుంబ సభ్యులు గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement