‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ కేసీఆర్! | Telangana CM at the forefront of Indian of the year race | Sakshi
Sakshi News home page

‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ కేసీఆర్!

Published Wed, Jan 28 2015 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ కేసీఆర్!

‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ కేసీఆర్!

31 శాతం ఓట్లతో మొదటిస్థానం..
సీఎంను కలిసిన సీఎన్‌ఎన్-ఐబీఎన్  వైస్ ప్రెసిడెంట్

 
సాక్షి, హైదరాబాద్: ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ’ రేస్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందంజలో ఉన్నారు. సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఇంగ్లిష్ న్యూస్ చానల్ ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహిస్తున్న పోటీలో 31 శాతం ఓట్లతో కేసీఆర్ మొదటిస్థానంలో ఉన్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి విజయన్ 21 శాతం ఓట్లతో రెండోస్థానంలో ఉన్నారు.
 
10 శాతం ఓట్ల తేడా ఉండడంతో సీఎ కేసీఆర్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక, ప్రకటన ఇక  లాంఛనమేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎన్‌ఎన్-ఐబీఎన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీవాస్తవ మంగళవారం సచివాలయంలో సీఎంను కలిసి అభినందించారు. ‘పెద్ద పెద్ద సినీస్టార్లను పక్కకు నెట్టి, కొత్త రాష్ట్రం సీఎంగా అతితక్కువ కాలంలోనే కేసీఆర్ మంచి పాపులారిటీ పొందారు’ అని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ఈ నెల 31 దాకా ఆన్‌లైన్ ఓటింగ్‌కు గడువు ఉంది. ఫిబ్రవరిలో ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ను ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement