ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోరాటం ఉధృతమవుతోంది. రిషితేశ్వరికి న్యాయం జరగాలంటూ ఆమె పేరుతో ఫేస్ బుక్ పేజీని ప్రారంభించారు. రిషితేశ్వరికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ కేసుపై మీడియాలో వచ్చిన కథనాలు, నిందితుల ఫోటోలను పోస్ట్ చేశారు. రిషితేశ్వరి ఫేస్ బుక్ పేజీకి అనూహ్య స్పందన వస్తోంది. రిషితేశ్వరి మృతికి సంబంధించి పలు ప్రశ్నలను కూడా సంధించారు. రిషితేశ్వరి కేసులో చీకటి కోణాలు... 1. ఉరి వేసుకుని వేలాడుతున్న ఆమెను దించిందెవరు? 2. హాస్టల్ లో ఉన్న తోటి విద్యార్దినుల కంటే ముందు ఆమె మరణ వార్త బాయ్స్ హాస్టల్ కు ఎలా చేరింది? 3. ఉరి తాడు బిగించుకున్నప్పుడు ఆమెను మొదట చూసింది ఎవరు? 4. బాబూరావుకు ఎందుకు ఫోన్ చేశారు? 5. హాస్టల్ వార్డెన్ కు ఎందుకు సమాచారమివ్వలేదు? 6. ఉరి వేసుకుని చనిపోయినట్టు నిరూపితమవ్వటానికి కనీసం ఒక్క ఫోటో కూడా ఆధారం లేదు, ఎందుకని? 7. బాబూరావు సస్పెన్షన్ కు ముందుగానే నాటకీయంగా రాజీనామా ఎందుకిచ్చాడు? హైదరాబాద్ లో ఏం పైరవీలు నడుపుతున్నాడు? 8.బాబూరావును కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? 9. కాలేజీలో సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటు చేయాల్సిన యాంటీ ర్యాగింగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదు? 10.ముందు రోజు సినిమా హాల్లో ఏం జరిగింది? 11.ఆమెను వేధిస్తూ తీసిన వీడియో ఏమైంది? 12.రిషితేశ్వరిని వేదిస్తున్నారంటూ ఆమె చనిపోవటానికి పది రోజుల ముందు ఆమె పేరెంట్స్ ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? 13.విద్యార్ది సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నిన్న వినతి పత్రాన్నిచ్చి తాత్కాలికంగా ఆందోళనను విరమించుకున్నాక హడావిడిగా వర్శిటీకి ఇప్పుడెందుకు 10 రోజులు సెలవులిచ్చారు?
Published Sun, Jul 26 2015 4:49 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement