సాక్షి,నెట్‌వర్క్: ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధించేందుకు సాక్షి మీడియా ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆదివారం నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్ బీ- 2014 పోటీలకు విశేష స్పందన లభించింది. రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్పెల్ బీ జిల్లా స్థాయి సెకండ్ రౌండ్‌లో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన బాలబాలికలతో పరీక్ష కేంద్రాలన్నీ సందడిగా కనిపించాయి. చదివే తరగతి, వయసుల వారీగా నాలుగు విభాగాలుగా విభజించి పరీక్షలు నిర్వహించారు. సాక్షి టీవీ లైవ్ ద్వారా హైదరాబాద్ నుంచి వక్తలు ప్రశ్నలు వేయగా, పరీక్షా కేంద్రంలో ఉన్న విద్యార్థులు ఆంగ్లంలో తర్జుమా చేసి సమాధానాలు రాశారు. శాస్త్ర విజ్ఞానంతో నిర్వహిస్తున్న ఇలాంటి పరీక్షలు మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమయ్యాయని, ఈ పరిస్థితిలో జిల్లాల్లోనూ నిర్వహించడం సంతోషకరమని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అన్నారు. అక్షర దోషాలు లేకుండా పదాలు రాయడం.. వాటిని పలికే విధానం.. కొత్త కొత్త ఇంగ్లిష్ పదాలు విద్యార్థులకు తెలియజేయడానికి ఇదెంతగానో ఉపకరిస్తుందన్నారు. తెలుగులో సైతం ఇలాంటి స్పెల్ బీ పరీక్ష నిర్వహించాలని పలువురు సూచించారు.
‘సాక్షి’ స్పెల్‌బీకి విశేష స్పందన
Published Mon, Nov 10 2014 2:30 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement