పరీక్ష రాస్తున్న విద్యార్థులు
‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన మాథ్స్ బీ, స్పెల్ బీ పరీక్షకు విశేష స్పందన లభించింది. ఆదివారం సీతమ్మధార బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లో గల శ్రీ విశ్వ పాఠశాలలో జరిగిన పరీక్షకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను నాలుగు కేటగిరీలుగా చేసి, మొదటిగా మ్యాథ్స్ బీ, ఆ తరువాత స్పెల్ బీ పరీక్ష నిర్వహించారు. మ్యాథ్స్ బీ సెమీఫైనల్ కాగా, స్పెల్ బీ క్వార్టర్ ఫైనల్ స్థాయిలో జరిగింది.
వివిధ స్థాయిల్లో ఇప్పటికే జరిగిన పరీక్షలో ప్రతిభ చాటిన విదార్థులు పాల్గొన్నారు. ఇక్కడ సత్తా చాటిన విద్యార్థులు ఫైనల్‌కు వెళ్లనున్నారు. పోటీతత్వాన్ని పెంపొందించేలా నిర్వహిస్తున్న పరీక్ష కావటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పరీక్షపై ఎంతో ఆసక్తి కనబరిచి, వారే స్వయంగా తమ పిల్లలను పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వ్యాపి, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి.
Comments
Please login to add a commentAdd a comment