Spell Bee
-
'సాక్షి స్పెల్ బీ, మ్యాథ్ బీ' కి విశేష స్పందన!
‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన మాథ్స్ బీ, స్పెల్ బీ పరీక్షకు విశేష స్పందన లభించింది. ఆదివారం సీతమ్మధార బాలయ్యశాస్త్రి లేఅవుట్లో గల శ్రీ విశ్వ పాఠశాలలో జరిగిన పరీక్షకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను నాలుగు కేటగిరీలుగా చేసి, మొదటిగా మ్యాథ్స్ బీ, ఆ తరువాత స్పెల్ బీ పరీక్ష నిర్వహించారు. మ్యాథ్స్ బీ సెమీఫైనల్ కాగా, స్పెల్ బీ క్వార్టర్ ఫైనల్ స్థాయిలో జరిగింది. వివిధ స్థాయిల్లో ఇప్పటికే జరిగిన పరీక్షలో ప్రతిభ చాటిన విదార్థులు పాల్గొన్నారు. ఇక్కడ సత్తా చాటిన విద్యార్థులు ఫైనల్‌కు వెళ్లనున్నారు. పోటీతత్వాన్ని పెంపొందించేలా నిర్వహిస్తున్న పరీక్ష కావటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పరీక్షపై ఎంతో ఆసక్తి కనబరిచి, వారే స్వయంగా తమ పిల్లలను పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వ్యాపి, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి. -
70 పాఠశాలలు.. 2 వేల మంది విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబరు 3లోని ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ‘సాక్షి’ ఏరినా వన్ స్కూల్ ఫెస్ట్‌కు విశేష స్పందన లభించింది. 70 పాఠశాలల నుంచి 2వేల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సాక్షి మ్యాథ్స్–బి సెమీఫైనల్స్, స్పెల్–బి క్వార్టర్ ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఆయా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2022–23 సంవత్సరానికిగాను నిర్వహించిన ఈ పోటీలకు డ్యూక్స్ వెఫే స్పాన్సర్ ప్రజెంటర్‌గా వ్యహరించింది. రాజమండ్రి ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. మొత్తం నాలుగు కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. వర్డ్ మీనింగ్ నేర్చుకున్నాను.. ‘సాక్షి’ ఏరీనా వన్ స్కూల్ ఫెస్ట్ స్పెల్–బీలో పాల్గొన్నాను. ఈ పోటీల వల్ల నేను స్పెల్లింగ్ నేర్చుకున్నాను. వర్డ్ మీనింగ్ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. కొత్త పదాలు ఎన్నో తెలిశాయి. ఇలాంటి పోటీలు నిర్వహించడం నాకు చాలా అనందంగా ఉంది. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చాను. – తేజేశ్వర్, 7వ తరగతి, జాన్సన్ గ్రామర్ స్కూల్, వనస్థలిపురం స్పెల్లింగ్ రాసే విధానం తెలిసింది స్పెల్లింగ్ ఎలా కరెక్ట్‌గా ఫాం చేయాలో ఈ పోటీల్లో బాగా నేర్చుకున్నాను. ఇలాంటి పోటీలు మాలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ పోటీల విధానం బాగా నచ్చింది. నేను ఉత్సాహంగా పాల్గొన్నాను. ఎన్నో కొత్త పదాలు, వాటి అర్థాలు తెలుసుకున్నాను. – సాన్వీ, 5వ తరగతి, డాక్టర్ కేకేఆర్ గౌతం స్కూల్, కుషాయిగూడ -
సాక్షి మీడియా ఆధ్వర్యంలో గుడివాడలో స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పరీక్షలు
-
సందడిగా ‘సాక్షి’ స్పెల్‌బీ సెమీ ఫైనల్స్
మూసాపేట/హైదరాబాద్: ‘సాక్షి’ స్పెల్‌బీ సెమీఫైనల్స్ పోటీలు ఆదివారం కేపీహెచ్‌బీ కాలనీలోని మెరిడియన్ స్కూలులో ఉత్సాహంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చదువుతున్న విద్యార్థులు దాదాపు 350 మందికి పైగా పాల్గొన్నారు. వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి విద్యార్థులు ‘సాక్షి’ స్పెల్‌బీ పోటీలకు హాజరయ్యారు. నాలుగు కేటగిరిల్లో నాలుగు బ్యాచ్‌లుగా విద్యార్థులు సెమీ ఫైనల్స్‌లో పోటీ పడ్డారు. మెయిన్ స్పాన్సర్స్‌గా డ్యూక్ వప్పీ అసోసియేషన్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమండ్రి) వ్యవహరించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పోటీల్లో పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది ‘సాక్షి’ నిర్వహిస్తున్న స్పెల్ బీ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచుతుంది. అంతేకాక పోటీ పరీక్షల సందర్భంగా భయాందోళనకు గురికాకుండా ఉండటం, ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. చిన్న వయస్సులోనే ఇటువంటి పోటీ పరీక్షల్లో పాల్గొనటం విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది. –వకుళ, మీర్పేట్ విద్యార్థిని తల్లి కొత్త పదాలు తెలుసుకున్నా ‘సాక్షి’ స్పెల్‌బీ ద్వారా కొత్త కొత్త ఇంగ్లీషు పదాలను తెలుసుకోవటంతోపాటు వాటి అర్థాలను కూడా తెలుసుకున్నాను. స్పెల్ బీలో పాల్గొనటం చాలా గర్వంగా ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులతో పోటీ పడి సెమీఫైనల్స్ వరకు రావటం ఆనందంగా ఉంది. – సహస్ర మారెడ్డి, మీర్పేట్ చాలా విషయాలు తెలిశాయి ఖమ్మంలోని ప్రైవేట్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాను.అక్కడి నుంచి వచ్చి స్పెల్ బీ పోటీలో పాల్గొన్నాను. ఫైనల్స్‌లో గెలుస్తాననే నమ్మకం కూడా నాకు ఉంది. ఈ పోటీల ద్వారా కొత్త స్నేహాలతో పాటు మరిన్ని విషయాలు బోధపడ్డాయి. –హంశ్రిత, ఖమ్మం విద్యార్థిని పోటీతత్వం పెరుగుతుంది ‘సాక్షి’ స్పెల్‌బీలో విద్యార్థులకు కానీ, వారి తల్లిదండ్రులకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది. – అరుణ, విద్యార్థిని తల్లి -
‘సాక్షి’ స్పెల్ బీ-మ్యాథ్ బీ పోటీలకు విశేష స్పందన
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సాక్షి మీడియా తన కార్యాచరణను కొనసాగిస్తోంది. స్పెల్ బీ-మ్యాథ్ బీ పోటీలను నిర్వహిస్తోంది. ఏప్రిల్ 17న జరిగిన 2021-22 స్పెల్ బీ-మ్యాథ్ బీ రెండో రౌండ్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి భారీ స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి, కడప, అనంతపూర్, కర్నూలు, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తాడేపల్లి గూడెం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్ సెంటర్లలో నేడు (ఆదివారం) పరీక్షలు జరిగాయి. పరీక్షల అనంతరం విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దాం... -
తెలివిటీగలు..ప్రైజ్ మనీ రూ. 35 లక్షలు..!
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే తమ ఉనికిని చాటుకోవడంలో భారతీయులు ఎల్లప్పుడూ ముందుంటారు. ప్రతిష్టాత్మకమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీల్లో గత దశాబ్దకాలంగా అమెరికాలోని భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలవడమే ఇందుకు నిదర్శనం. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను వెనక్కినెట్టి మరీ మన చిన్నారులే విజేతలుగా నిలుస్తూ.. భారత మేధా స్థాయిని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. కఠిన పదాల ఉచ్ఛారణను అనుసరించి వాటి స్పెల్లింగ్ చెప్పడం ఈ పోటీ ప్రధాన లక్షణం. మొదటి విన్నర్ ఫ్రాంక్ స్పెల్లింగ్ బీ అనే పదం 1875లో మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం అయింది. విద్యార్థుల్లో పోటీతత్త్వాన్ని పెంచేందుకు ‘ద కొరియర్ జర్నల్’ అనే వార్తా పత్రిక 1925లో ‘యునైటెడ్ స్టేట్స్ స్పెల్లింగ్ బీ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాషింగ్టన్లో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ పోటీలో ఫ్రాంక్ నౌహసర్ అనే పదకొండేళ్ల పిల్లాడు తొలి విజేతగా చరిత్రకెక్కాడు. గ్లాడియస్ (లాటిన్లో ఖడ్గం అని అర్థం) అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి ట్రోఫీని అందుకున్నాడు. అమెరికాలోని కెంటెకీలో జన్మించిన ఫ్రాంక్ తదనంతర కాలంలో అమెరికన్ పేటెంట్ లాయర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు. జర్మన్ సంతతికి చెందిన ఆయన మార్చి 11, 2011లో మరణించారు. ‘స్పెల్‌బౌండ్’ డాక్యుమెంటరీ 1941లో ‘స్క్రిప్స్ హవార్డ్ న్యూస్ సర్వీస్’.. స్పెల్లింగ్ బీ స్పాన్సర్షిప్ బాధ్యతలు చేపట్టింది. అప్పటినుంచి ఈ పోటీని ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ గా వ్యవహరిస్తున్నారు. ప్రతీ ఏటా విధిగా నిర్వహించే ఈ పోటీల్లో 2008 నుంచి భారత సంతతి విద్యార్థులే విజేతలుగా నిలుస్తుండడం విశేషం. అయితే భారతీయులకు స్పెల్లింగ్ బీపై మక్కువ ఏర్పడింది మాత్రం ‘స్పెల్‌బౌండ్’ అనే డాక్యుమెంటరీతోనే అంటారు ఆంత్రపాలజిస్టులు. లక్షా ఇరవై వేల పదాలు టెక్సాస్‌కు చెందిన విజయ్ రెడ్డి అందరిలాగే తన కొడుకు చేతన్‌ను స్పెల్ బీ చాంపియన్‌గా చూడాలనుకున్నారు. ఎన్నో ఆశలతో పోటీలో అడుగుపెట్టిన చేతన్.. ఏడవ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే కొడుకును తీర్చిదిద్దే క్రమంలో ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌పై ఆసక్తి పెంచుకున్న విజయ్ స్వయంగా ఓ కోచింగ్ సెంటర్‌ను నెలకొల్పారు. దానికి ‘జియోస్పెల్’ అని నామకరణం చేసి ఇప్పటి వరకు ముగ్గురు భారత సంతతి విద్యార్థులను చాంపియన్లుగా నిలబెట్టారు. సులభ పద్ధతిలో బోధనకై దాదాపు లక్షా ఇరవై వేల పదాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేశారు. అదే విధంగా తరచుగా పరీక్షలు నిర్వహించడం ద్వారా.. తన అకాడమీ విద్యార్థులకు పోటీ నేషనల్స్‌కు సన్నద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్‌రెడ్డి పర్యవేక్షణలో కోచింగ్ తీసుకున్న కార్తిక్ నెమ్మాని గతేడాది స్పెల్ బీ చాంపియన్ ట్రోఫీ అందుకోగా.. ఈ ఏడాది అభిజయ్ కొడాలి ఆ ఘనత సాధించాడు. కొడుకు కోసం స్పెల్ బీపై మక్కువ పెంచుకున్న విజయ్‌రెడ్డి ప్రస్తుతం దానిని పూర్తిస్థాయి బిజినెస్‌గా మలచుకుని.. విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. తనయుడు చేతన్‌తో విజయ్ ప్రైజ్ మనీ రూ. 35 లక్షలు కాగా తాజాగా జరిగిన స్పెల్లింగ్ పోటీల్లో భారత సంతతి విద్యార్థులు చాంపియన్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన రిషిక్ గంధశ్రీ (13), మేరీల్యాండ్‌కు చెందిన సాకేత్ సుందర్(13), న్యూజెర్సీకి చెందిన శ్రుతికా పధి (13), టెక్సాస్‌కు చెందిన సోహుం సుఖ్తంకర్ (13), అభిజయ్ కొడాలి(12), రోహన్ రాజా (13), క్రిస్టఫర్ సెర్రావ్(13), అలబామాకు చెందిన ఎరిన్ హొవార్డ్ (14)లు విజేతల జాబితాలో ఉన్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, కెనడా, ఘనా, జమైకా తదితర దేశాల నుంచి వచ్చిన దాదాపు 562 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా, 8 మందిని నిర్ణేతలు విజేతలుగా ప్రకటించారు. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. కాగా ఇద్దరి కన్నా ఎక్కువ మందిని విజేతలుగా ప్రకటించడం 94 ఏళ్ల స్పెల్‌బీ చరిత్రలో ఇదే తొలిసారి. వీరిలో ఒక్కొక్కరు దాదాపు రూ.35 లక్షల చొప్పున నగదును, బహుమతులను గెలుచుకున్నారు. భారతీయుల్లో పోటీ తత్త్వం : షాలినీ శంకర్, ఆంత్రోపాలజిస్టు వలసదారులుగా పరాయి దేశంలో ఉన్నప్పటికీ.. మాతృభాషతో పాటు ఇతర భాషలపై పట్టు సాధించాలనే ఆసక్తి భారతీయుల్లో మెండుగా ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో అగ్రపథాన నిలిచే ఇండో అమెరికన్లలో చాలా మంది స్పెల్లింగ్ బీని ఎంతో ప్రతిష్టాత్మంగా భావిస్తారు. తమ పిల్లలను ఈ పోటీల్లో భాగస్వామ్యం చేయడాన్ని గర్వంగా ఫీలవుతారు. అంతేకాదు స్పెల్ బీ పోటీల్లో ఛాంపియన్లుగా నిలిచిన విద్యార్థులు ఇతర అంతర్జాతీయ స్పెల్లింగ్ పోటీల్లోనూ విజేతలుగా నిలుస్తున్నారు. – సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
మాకివే ఒలింపిక్స్; కచ్చితంగా గెలవాలి!!
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే తమ ఉనికిని చాటుకోవడంలో భారతీయులు ఎల్లప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ఎన్నారైలు తమ పిల్లలను కూడా అగ్రపథంలో నిలపడంలో విజయం సాధిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో గత దశాబ్దకాలంగా అమెరికాలోని భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలవడమే ఇందుకు నిదర్శనం. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను వెనక్కినెట్టి మరీ మన చిన్నారులే విజేతలుగా నిలుస్తూ.. భారత మేథా స్థాయిని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. కఠిన పదాల ఉచ్ఛారణను అనుసరించి వాటి స్పెల్లింగ్ చెప్పడం ఈ పోటీ ప్రధాన లక్షణం. మొదటి విన్నర్ ఫ్రాంక్.. స్పెల్లింగ్ బీ అనే పదం 1875లో మొదటిసారిగా అచ్చయింది. విద్యార్థుల్లో పోటీతత్త్వాన్ని పెంచేందుకు ద కొరియర్ జర్నల్ అనే వార్తా పత్రిక 1925లో యునైటెడ్ స్టేట్స్ స్పెల్లింగ్ బీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాషింగ్టన్లో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ పోటీలో ఫ్రాంక్ నౌహసర్ అనే పదకొండేళ్ల పిల్లాడు తొలి విజేతగా చరిత్రకెక్కాడు. గ్లాడియస్(లాటిన్లో ఖడ్గం అని అర్థం) అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి ట్రోఫీని అందుకున్నాడు. అమెరికాలోని కెంటెకీలో జన్మించిన ఫ్రాంక్ తదనంతర కాలంలో అమెరికన్ పేటెంట్ లాయర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు. జర్మన్ సంతతికి చెందిన ఆయన మార్చి 11, 2011లో మరణించారు. ఆ డాక్యుమెంటరీ స్ఫూర్తిగా.. 1941లో స్క్రిప్స్ హవార్డ్ న్యూస్ సర్వీస్ స్పెల్లింగ్ బీ స్పాన్సర్షిప్ బాధ్యతలు చేపట్టింది. అప్పటినుంచి ఈ పోటీని ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ గా వ్యవహరిస్తున్నారు. ప్రతీ ఏటా విధిగా నిర్వహించే ఈ పోటీల్లో 2008 నుంచి భారత సంతతి విద్యార్థులే విజేతలుగా నిలవడం విశేషం. ఇండియానాకు చెందిన సమీర్ మిశ్రా స్పెల్లింగ్ బీ-2008 ట్రోఫీ సాధించాడు. అయితే భారతీయులకు స్పెల్లింగ్ బీపై మక్కువ ఏర్పడింది మాత్రం స్పెల్‌బౌండ్ అనే డాక్యుమెంటరీతోనే అంటారు ఆంత్రపాలజిస్టులు. 1999 నేషనల్ బీ పోటీలో గెలుపొందిన నుపుర్ లాలా విజయగాథ ఇండో అమెరికన్లకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొంటున్నారు. సమీర్ మిశ్రా భారతీయుల్లో పోటీ తత్త్వం మెండు.. ‘ వలసదారులుగా పరాయి దేశంలో ఉన్నప్పటికీ.. మాతృభాషతో పాటు ఇతర భాషలపై పట్టు సాధించాలనే ఆసక్తి భారతీయుల్లో మెండుగా ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో అగ్రపథాన నిలిచే ఇండో అమెరికన్లలో చాలా మంది స్పెల్లింగ్ బీని ఎంతో ప్రతిష్టాత్మంగా భావిస్తారు. తమ పిల్లలను ఈ పోటీల్లో భాగస్వామ్యం చేయడాన్ని గర్వంగా ఫీలవుతారు. అంతేకాదు స్పెల్ బీ పోటీల్లో ఛాంపియన్లుగా నిలిచిన విద్యార్థులు ఇతర అంతర్జాతీయ స్పెల్లింగ్ పోటీల్లోనూ విజేతలుగా నిలుస్తున్నారు. ఫౌండేషన్ సహకారంతో.. నార్త్ సౌత్ ఫౌండేషన్ అనే నాన్ ప్రాఫిట్ సంస్థ 1993 నుంచి భారత సంతతి విద్యార్థులకు.. స్పెల్లింగ్, వొకాబులరీ, భూగోళశాస్త్రం, గణితం తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తోంది. దాదాపు 92 దేశాలకు చెందిన పదాలు, వాటి చరిత్రకు సంబంధించిన వివరాలు సహా ఇందులో భాగంగా ఉంటాయి. వివిధ దేశాలకు చెందిన సుమారు 16 వేల మంది విద్యార్థులు పాల్గొనే ఈ పోటీలో ఇండో అమెరికన్లే ఛాంపియన్లుగా నిలవడంలో ఈ సంస్థ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఎటువంటి లాభాపేక్ష, పబ్లిసిటీ లేకుండా విద్యార్థులకు తన వంతు సహాయం చేస్తోంది. వారి పాత్ర అభినందనీయం అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ స్పెల్లింగ్ పోటీలో భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలవడంలో వారి తల్లిదండ్రులదే కీలక పాత్ర అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ పోటీ కోసం ప్రత్యేకంగా కోచ్‌లను నియమించడం, వారే స్వయంగా పిల్లల కోసం సమయం కేటాయించడం ద్వారా పదేళ్లుగా ఈ విన్నింగ్ రికార్డును కొనసాగించడం సాధ్యమవుతోంది. ఇండో అమెరికన్ల పోటీతత్త్వం, వారి విజయం వెనుక రహస్యాల గురించిన పలు విషయాల గురించి బ్రేకింగ్ ద బీ అనే డాక్యుమెంటరీలో తల్లిందండ్రుల పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు.. స్పెల్లింగ్ బీ పోటీలో దాదాపు శౌరవ్ దాసరి అనే ఇండో అమెరికన్ గత పదేళ్లుగా విసుగు చెందక పాల్గొంటూనే ఉన్నాడు. శౌరవ్‌తో పాటు అతడి సోదరిని కూడా ఈ పోటీలో భాగస్వామ్యం చేయడం గురించి వారి తండ్రి గణేష్ మాట్లాడుతూ.. ‘ విద్య ప్రాధాన్యత తెలిసిన తల్లిదండ్రుల నుంచే పిల్లలు స్ఫూర్తి పొందుతారు. నేను, నా భార్య ఉష సాంకేతిక రంగంలో పట్టా పొందిన మేము నిపుణుల కోటా కింద వీసా సంపాదించి ఇక్కడకు వచ్చాం. 2017లో మా పిల్లలకు స్పెల్ బీ వయోపరిమితి ముగిసింది. ఆ తర్వాత స్పెల్పండిట్ అనే కోచింగ్ కంపెనీ ప్రారంభించి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు. నుపుర్ లాలా 2025 నాటికే మనదే హవా ఇక డల్లాస్‌కు చెందిన విజయ్ రెడ్డి తన కొడుకును చాంపియన్‌గా తీర్చిదిద్దేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఈ విషయంలో ఆయన భార్య కూడా తన వంతు సహాయం చేస్తున్నారు. అయితే వారి కుమారుడు చేతన్ ఏడోస్థానంలోనే నిలిచినప్పటికీ అతడిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇది మాకు ఒలంపిక్స్ వంటిది. తను కచ్చితంగా గెలవాలని మా ఆశ అని చెప్పే విజయ్‌రెడ్డి ప్రతీ అంశాన్ని చాలెంజింగ్‌గా తీసుకుంటారు. అందుకే స్పెల్‌బీ విద్యార్థుల కోసం జియోస్పెల్ అనే కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించి మెరికల్లా వారిని తీర్చిదిద్దుతున్నారు’ అని ఆంత్రపాలజిస్ట్ షాలినీ శంకర్ పేర్కొన్నారు. 2025 నాటికి స్పెల్లింగ్ బీలో పూర్తి స్థాయిలో భారతీయుల హవానే కొనసాగడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కాగా తాజాగా జరిగిన స్పెల్లింగ్ పోటీల్లో భారత సంతతి విద్యార్థులు చాంపియన్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన రిషిక్ గంధశ్రీ(13), మేరీల్యాండ్‌కు చెందిన సాకేత్ సుందర్(13), న్యూజెర్సీకి చెందిన శ్రుతికా పధి (13), టెక్సాస్‌కు చెందిన సోహుం సుఖ్తంకర్ (13), అభిజయ్ కొడాలి(12), రోహన్ రాజా (13), క్రిస్టఫర్ సెర్రావ్(13), అలబామాకు చెందిన ఎరిన్ హొవార్డ్(14)లు విజేతల జాబితాలో ఉన్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, కెనడా, ఘనా, జమైకా తదితర దేశాల నుంచి వచ్చిన దాదాపు 562 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా, 8 మందిని నిర్ణేతలు విజేతలుగా ప్రకటించారు. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. కాగా ఇద్దరి కన్నా ఎక్కువ మందిని విజేతలుగా ప్రకటించడం 94 ఏళ్ల స్పెల్‌బీ చరిత్రలో ఇదే తొలిసారి. వీరిలో ఒక్కొక్కరు దాదాపు రూ.35 లక్షల చొప్పున నగదును, బహుమతులను గెలుచుకున్నారు. -
సాక్షి మ్యాథ్స్ బీ తెలంగాణ ఫైనల్స్ కేటగిరి 1
-
సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ విజేతలు వీరే
హైదరాబాద్ : ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ–2017 (కేటగిరీ–3, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషపై, మ్యాథ్స్ విషయంలో అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. స్పెల్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లో ది ఆగాఖాన్ అకాడమీలో చదువుతున్న వెగా దర్శి కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ బ్రాంచ్‌లో చదువుతున్న వి. సాయి అఖిల్ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్‌బీ ద్వితీయ బహుమతి : హైదరాబాద్‌లోని వికాస్ ది కాన్సెప్ట్ స్కూల్, బాచుపల్లిలో చదువుతున్న టి. సౌజన్య లక్ష్మి కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ ద్వితీయ బహుమతి : హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న అరిట్రో రే కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్‌బీ తృతీయ బహుమతి : హైదరాబాద్‌లోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, బంజారాహిల్స్ బ్రాంచ్‌లో చదువుతున్న నిహారిక కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ తృతీయ బహుమతి : హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం బ్రాంచ్‌లో చదువుతున్న హరి వైష్ణవి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. -
సాక్షి స్పెల్‌బీ గ్రాండ్ ఫినాలే TS కేటగిరీ–4
-
సాక్షి స్పెల్‌బీ గ్రాండ్ ఫినాలే AP కేటగిరీ–4
-
సాక్షి స్పెల్‌బీ గ్రాండ్ ఫినాలే TS కేటగిరీ–3
-
సాక్షి స్పెల్‌బీ గ్రాండ్ ఫినాలే AP కేటగిరీ–2
-
సాక్షి ఇండియా స్పెల్‌బీ 2016 - ఏపీ క్యాటగిరి 4
-
సాక్షి ఇండియా స్పెల్‌బీ 2016 - ఏపీ క్యాటగిరి 1
-
సాక్షి ఇండియా స్పెల్‌బీ - ఏపీ క్యాటగిరి 4 - Part 2
-
లోటస్ పాండ్‌లో స్పెల్ బీ పోటేలు
-
విజయవాడ కాలేజ్‌లో స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్
-
’సాక్షి’ ఇండియా స్పెల్‌బీ 2015 ప్రిలిమ్స్ ఎగ్జామ్
-
సాక్షి జియో బీ -Part 4
-
సాక్షి జియో బీ -Part 3
-
సాక్షి జియో బీ - Part 2
-
Chit chat with Spell bee Champion schools
-
సాక్షి జియో బీ 17th Dec 2014
-
సాక్షి జియో బీ 16th Dec 2014
-
స్పెల్ బి ఫైనల్: తెలంగాణ క్యాటగిరి - 4
-
స్పెల్ బి ఫైనల్: తెలంగాణ క్యాటగిరి - 3
-
స్పెల్ బి ఫైనల్: తెలంగాణ క్యాటగిరి - 2
-
స్పెల్ బి ఫైనల్: తెలంగాణ క్యాటగిరి - 1
-
స్పెల్ బి ఫైనల్: ఏపీ క్యాటగిరి - 4
-
స్పెల్ బి ఫైనల్: ఏపీ క్యాటగిరి - 3
-
స్పెల్ బి ఫైనల్: ఏపీ క్యాటగిరి - 2
-
స్పెల్ బి ఫైనల్: రౌండ్ 1 - ఏపీ క్యాటగిరి 1
-
స్పెల్ బి ఫైనల్: రౌండ్ 2 - ఏపీ క్యాటగిరి 1
-
సాక్షి స్పెల్ బీ - 2014 : మూడో రౌండ్ - జవాబులు
-
సాక్షి స్పెల్ బీ - 2014 : మూడో రౌండ్, కేటగిరీ 4
-
సాక్షి స్పెల్ బీ - 2014 : మూడో రౌండ్, కేటగిరీ 3
-
సాక్షి స్పెల్ బీ - 2014 : మూడో రౌండ్, కేటగిరీ 2
-
సాక్షి స్పెల్ బీ - 2014 : మూడో రౌండ్, కేటగిరీ 1
-
‘సాక్షి’ స్పెల్‌బీకి విశేష స్పందన
సాక్షి,నెట్వర్క్: ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు సాధించేందుకు సాక్షి మీడియా ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆదివారం నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్ బీ- 2014 పోటీలకు విశేష స్పందన లభించింది. రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్పెల్ బీ జిల్లా స్థాయి సెకండ్ రౌండ్లో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన బాలబాలికలతో పరీక్ష కేంద్రాలన్నీ సందడిగా కనిపించాయి. చదివే తరగతి, వయసుల వారీగా నాలుగు విభాగాలుగా విభజించి పరీక్షలు నిర్వహించారు. సాక్షి టీవీ లైవ్ ద్వారా హైదరాబాద్ నుంచి వక్తలు ప్రశ్నలు వేయగా, పరీక్షా కేంద్రంలో ఉన్న విద్యార్థులు ఆంగ్లంలో తర్జుమా చేసి సమాధానాలు రాశారు. శాస్త్ర విజ్ఞానంతో నిర్వహిస్తున్న ఇలాంటి పరీక్షలు మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమయ్యాయని, ఈ పరిస్థితిలో జిల్లాల్లోనూ నిర్వహించడం సంతోషకరమని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అన్నారు. అక్షర దోషాలు లేకుండా పదాలు రాయడం.. వాటిని పలికే విధానం.. కొత్త కొత్త ఇంగ్లిష్ పదాలు విద్యార్థులకు తెలియజేయడానికి ఇదెంతగానో ఉపకరిస్తుందన్నారు. తెలుగులో సైతం ఇలాంటి స్పెల్ బీ పరీక్ష నిర్వహించాలని పలువురు సూచించారు. -
సాక్షి స్పెల్ బీ 2014 : రెండో రౌండ్ సమాధానాలివే!
-
సాక్షి స్పెల్ బీ - 2014 : సెకండ్ రౌండ్, కేటగిరీ 4
-
సాక్షి స్పెల్ బీ - 2014 : సెకండ్ రౌండ్, కేటగిరీ 3
-
సాక్షి స్పెల్ బీ - 2014 : సెకండ్ రౌండ్, కేటగిరీ 2
-
సాక్షి స్పెల్ బీ - 2014 : సెకండ్ రౌండ్, కేటగిరీ 1
-
'సాక్షి స్పెల్ బీ'కి విశేష స్పందన
-
సాక్షి.. ఇండియా స్పెల్‌బీకి విశేష స్పందన
రెండు కేటగిరీల్లో పరీక్ష నిర్వహణ హాజరైన వివిధ పాఠశాలల విద్యార్థులు వరంగల్ చౌరస్తా : విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందించేందుకు సాక్షి, ఇండియా స్పెల్ బీ సంయుక్తంగా బుధవారం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. వరంగల్ ఎల్లంబజార్‌లోని రిషి హైస్కూల్లో నిర్వహించిన ఈ పరీక్షకు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తొలుత 1, 2 కేటగిరీలకు, రెండో విడతలో 3, 4 కేటగిరీలుగా విభజించి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. అనంతరం పరీక్షకు హాజరైన విద్యార్థులందరికీ సాక్షి దినపత్రిక ప్రకటనల విభాగం జిల్లా మేనేజర్ ఓంప్రకాష్, పాఠశాల ఉపాధ్యాయుడు వేణుగోపాల్ ప్రశంసాపత్రాలు అందజేశారు. కాగా, ఇక్కడి పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులు రీజినల్ స్థాయికి అర్హత సాధిస్తారని నిర్వహకులు తెలిపారు. వొకాబులరీ పెరుగుతుంది స్పెల్ బీ పరీక్షకు హాజరుకావడం వల్ల వొకాబులరీ పెరుగుతుంది. అంతేకాకుండా ఆంగ్ల పదాల ఉచ్ఛారణ తెలుస్తోంది. కమ్యూని కేషన్ స్కిల్స్ పెరుగుతాయనే నమ్మకం ఉంది. పరీక్షకు హాజరుకావడం సంతోషాన్ని కలిగిస్తోంది. - శ్రీలేఖ, 9వ తరగతి, రిషి హైస్కూల్ పదాల్లోని తప్పులను తెలుసుకోవచ్చు ఈ పరీక్షలకు హాజరుకావడం వల్ల ఇంగ్లిస్ పదాల్లో దొర్లిన తప్పుల ను గుర్తించవచ్చు. వీటిపై కొద్దిగా కసరత్తు చేస్తే భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం కొత్త పదాలను తెలుసుకున్నాను. ఈ పరీక్ష మిగతా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పనికొస్తుంది. - భువనశ్రీ, 4వ తరగతి, గోల్డెన్ త్రిషోల్డ్ స్కూల్ బృహత్తర కార్యక్రమం విద్యార్థుల్లో మేథాశక్తి పెంపొందించడానికి సాక్షి బృహత్తర కార్యక్రమం చేపట్టింది. ఈ పరీ క్ష ద్వారా విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు పెరుగుతోం ది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడితే విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తోంది. - వేణుగోపాల్, పాఠశాల ఉపాధ్యాయుడు పోటీ పరీక్షల్లో అర్హత సాధిస్తా.. సాక్షి నిర్వహిస్తున్న స్పెల్ బీ పోటీ పరీక్షల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తాననే నమ్మకం కలిగింది. అలాగే, ఇంగ్లిష్ పట్ల మరింత అవగాహన కలుగుతోంది. ఎన్నో కొత్త పదాలు తెలుసుకునేందుకు అవకాశం లభిస్తుంది. - ప్రణీలాష్, 4వ తరగతి, ప్లాటినం జూబ్లీ హైస్కూల్ -
సాక్షి స్పెల్ బీ ఫైనల్స్ 2013 Part - 5
-
సాక్షి స్పెల్ బీ ఫైనల్స్ 2013 విజేతలు వీరే
-
సాక్షి స్పెల్ బీ ఫైనల్స్ 2013 Part - 4
-
సాక్షి స్పెల్ బీ ఫైనల్స్ 2013 Part - 3
-
సాక్షి స్పెల్ బీ ఫైనల్స్ 2013 Part - 2
-
సాక్షి స్పెల్ బీ 2013 ఫైనల్స్
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 2 - కేటగిరి 3
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 2 - కేటగిరి 2
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 2 - కేటగిరి 1
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 2 ఫైనల్స్
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 1 - Category 3
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 1 - Category 2
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 1 - Category 1
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 1
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 3 - Category 3
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 3 - Category 2
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 3 - Category 1
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 3 - Category 4
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 4 - Category 3
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 4 - Category 2
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 4 - Category 1
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 4 - Category 4
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 6 - Category 3
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 6 - Category 2
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 6 - Category 1
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 6
-
Sakshi India Spell Bee 2013 జోనల్ ఫైనల్స్ - జోన్ 5
-
సాక్షి ఇండియా స్పెల్ బీ జోనల్ ఫైనల్స్
-
సాక్షి ఇండియా స్పెల్ బీ జోనల్ కేటగిరి 3
-
సాక్షి ఇండియా స్పెల్ బీ జోనల్ కేటగిరి 2
-
సాక్షి ఇండియా స్పెల్ బీ జోనల్ కేటగిరి 1
-
సాక్షి ఇండియా స్పెల్ బీ జోనల్ కేటగిరి 4
-
సాక్షి ఇండియా స్పెల్ బి సెకండ్ ఎడిషన్