
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సాక్షి మీడియా తన కార్యాచరణను కొనసాగిస్తోంది. స్పెల్ బీ-మ్యాథ్ బీ పోటీలను నిర్వహిస్తోంది. ఏప్రిల్ 17న జరిగిన 2021-22 స్పెల్ బీ-మ్యాథ్ బీ రెండో రౌండ్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి భారీ స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు.
తిరుపతి, కడప, అనంతపూర్, కర్నూలు, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తాడేపల్లి గూడెం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్ సెంటర్లలో నేడు (ఆదివారం) పరీక్షలు జరిగాయి. పరీక్షల అనంతరం విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దాం...
Comments
Please login to add a commentAdd a comment