సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబరు 3లోని ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ‘సాక్షి’ ఏరినా వన్ స్కూల్ ఫెస్ట్‌కు విశేష స్పందన లభించింది. 70 పాఠశాలల నుంచి 2వేల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సాక్షి మ్యాథ్స్–బి సెమీఫైనల్స్, స్పెల్–బి క్వార్టర్ ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఆయా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
2022–23 సంవత్సరానికిగాను నిర్వహించిన ఈ పోటీలకు డ్యూక్స్ వెఫే స్పాన్సర్ ప్రజెంటర్‌గా వ్యహరించింది. రాజమండ్రి ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. మొత్తం నాలుగు కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు.
వర్డ్ మీనింగ్ నేర్చుకున్నాను..
‘సాక్షి’ ఏరీనా వన్ స్కూల్ ఫెస్ట్ స్పెల్–బీలో పాల్గొన్నాను. ఈ పోటీల వల్ల నేను స్పెల్లింగ్ నేర్చుకున్నాను. వర్డ్ మీనింగ్ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. కొత్త పదాలు ఎన్నో తెలిశాయి. ఇలాంటి పోటీలు నిర్వహించడం నాకు చాలా అనందంగా ఉంది. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చాను.
– తేజేశ్వర్, 7వ తరగతి, జాన్సన్ గ్రామర్ స్కూల్, వనస్థలిపురం
స్పెల్లింగ్ రాసే విధానం తెలిసింది
స్పెల్లింగ్ ఎలా కరెక్ట్‌గా ఫాం చేయాలో ఈ పోటీల్లో బాగా నేర్చుకున్నాను. ఇలాంటి పోటీలు మాలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ పోటీల విధానం బాగా నచ్చింది. నేను ఉత్సాహంగా పాల్గొన్నాను. ఎన్నో కొత్త పదాలు, వాటి అర్థాలు తెలుసుకున్నాను.
– సాన్వీ, 5వ తరగతి, డాక్టర్ కేకేఆర్ గౌతం స్కూల్, కుషాయిగూడ
Comments
Please login to add a commentAdd a comment