maths bee
-
'సాక్షి స్పెల్ బీ, మ్యాథ్ బీ' కి విశేష స్పందన!
‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన మాథ్స్ బీ, స్పెల్ బీ పరీక్షకు విశేష స్పందన లభించింది. ఆదివారం సీతమ్మధార బాలయ్యశాస్త్రి లేఅవుట్లో గల శ్రీ విశ్వ పాఠశాలలో జరిగిన పరీక్షకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను నాలుగు కేటగిరీలుగా చేసి, మొదటిగా మ్యాథ్స్ బీ, ఆ తరువాత స్పెల్ బీ పరీక్ష నిర్వహించారు. మ్యాథ్స్ బీ సెమీఫైనల్ కాగా, స్పెల్ బీ క్వార్టర్ ఫైనల్ స్థాయిలో జరిగింది. వివిధ స్థాయిల్లో ఇప్పటికే జరిగిన పరీక్షలో ప్రతిభ చాటిన విదార్థులు పాల్గొన్నారు. ఇక్కడ సత్తా చాటిన విద్యార్థులు ఫైనల్‌కు వెళ్లనున్నారు. పోటీతత్వాన్ని పెంపొందించేలా నిర్వహిస్తున్న పరీక్ష కావటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పరీక్షపై ఎంతో ఆసక్తి కనబరిచి, వారే స్వయంగా తమ పిల్లలను పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వ్యాపి, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి. -
70 పాఠశాలలు.. 2 వేల మంది విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబరు 3లోని ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ‘సాక్షి’ ఏరినా వన్ స్కూల్ ఫెస్ట్‌కు విశేష స్పందన లభించింది. 70 పాఠశాలల నుంచి 2వేల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సాక్షి మ్యాథ్స్–బి సెమీఫైనల్స్, స్పెల్–బి క్వార్టర్ ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఆయా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2022–23 సంవత్సరానికిగాను నిర్వహించిన ఈ పోటీలకు డ్యూక్స్ వెఫే స్పాన్సర్ ప్రజెంటర్‌గా వ్యహరించింది. రాజమండ్రి ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. మొత్తం నాలుగు కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. వర్డ్ మీనింగ్ నేర్చుకున్నాను.. ‘సాక్షి’ ఏరీనా వన్ స్కూల్ ఫెస్ట్ స్పెల్–బీలో పాల్గొన్నాను. ఈ పోటీల వల్ల నేను స్పెల్లింగ్ నేర్చుకున్నాను. వర్డ్ మీనింగ్ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. కొత్త పదాలు ఎన్నో తెలిశాయి. ఇలాంటి పోటీలు నిర్వహించడం నాకు చాలా అనందంగా ఉంది. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చాను. – తేజేశ్వర్, 7వ తరగతి, జాన్సన్ గ్రామర్ స్కూల్, వనస్థలిపురం స్పెల్లింగ్ రాసే విధానం తెలిసింది స్పెల్లింగ్ ఎలా కరెక్ట్‌గా ఫాం చేయాలో ఈ పోటీల్లో బాగా నేర్చుకున్నాను. ఇలాంటి పోటీలు మాలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ పోటీల విధానం బాగా నచ్చింది. నేను ఉత్సాహంగా పాల్గొన్నాను. ఎన్నో కొత్త పదాలు, వాటి అర్థాలు తెలుసుకున్నాను. – సాన్వీ, 5వ తరగతి, డాక్టర్ కేకేఆర్ గౌతం స్కూల్, కుషాయిగూడ -
సాక్షి మీడియా ఆధ్వర్యంలో గుడివాడలో స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పరీక్షలు
-
సాక్షి మ్యాథ్‌బీ–2018 తెలంగాణ రాష్ట్ర విజేతలు వీరే
హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి మ్యాథ్‌బీ–2018 (కేటగిరీ–1, 2, 3, 4, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో మ్యాథ్స్ విషయంలో అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కేటగిరీ–1: సాక్షి మ్యాథ్‌బీ కేటగిరీ–1 విజేతలు ప్రథమ బహుమతి హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్(కొండాపూర్)లో చదువుతున్న ‘అర్జున్ రాఘవ్’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. ద్వితీయ బహుమతి హైదరాబాద్‌లోని కెన్నడీ హై ద గ్లోబల్æ స్కూల్(బాచుపల్లి)లో చదువుతున్న ‘లిఖిత్ జల్లి’ కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. తృతీయ బహుమతి హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్(కొండాపూర్)లో చదువుతున్న ‘తనయ్ చౌదరీ’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. కేటగిరీ–2: సాక్షి మ్యాథ్‌బీ కేటగిరీ–2 విజేతలతో అక్షర్ స్కూల్ సొల్యూషన్స్ ఎండీ శ్రీనివాస్ ప్రథమ బహుమతి హైదరాబాద్‌లోని కెన్నడీ హై ద గ్లోబల్æ స్కూల్(బాచుపల్లి)లో చదువుతున్న ‘కనూవ్ సింగాల్’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. ద్వితీయ బహుమతి హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్(కొండాపూర్)లో చదువుతున్న ‘ఇషాన్ సక్సేనా’ కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. తృతీయ బహుమతి హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్(కొండాపూర్)లో చదువుతున్న ‘ఎం. శ్రీయాన్రెడ్డి’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. కేటగిరీ–3: సాక్షి మ్యాథ్‌బీ కేటగిరీ–3 విజేతలు ప్రథమ బహుమతి హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్(కొండాపూర్)లో చదువుతున్న ‘అచింత్య గోయల్’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. ద్వితీయ బహుమతి హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్(కొండాపూర్)లో చదువుతున్న ‘అరిట్రో రే’ కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. తృతీయ బహుమతి హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్(కొండాపూర్)లో చదువుతున్న ‘ఆయూశ్ రంజన్’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. కేటగిరీ–4: సాక్షి మ్యాథ్‌బీ కేటగిరీ–4 విజేతలు ప్రథమ బహుమతి హైదరాబాద్‌లోని వికాస్ ద కాన్సెప్ట్ స్కూల్(బాచుపల్లి)లో చదువుతున్న ‘సాయి సుందర సందీప్ గంటి’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. ద్వితీయ బహుమతి హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్(కొండాపూర్)లో చదువుతున్న ‘హీర్ష్ సమ్దాని’ కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. తృతీయ బహుమతి హైదరాబాద్‌లోని వికాస్ ద కాన్సెప్ట్ స్కూల్(బాచుపల్లి)లో చదువుతున్న ‘శ్రీవంత్ విష్ణు వజ్జల’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. -
సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ విజేతలు వీరే
హైదరాబాద్ : ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ–2017 (కేటగిరీ–3, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషపై, మ్యాథ్స్ విషయంలో అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. స్పెల్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లో ది ఆగాఖాన్ అకాడమీలో చదువుతున్న వెగా దర్శి కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిప్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ బ్రాంచ్‌లో చదువుతున్న వి. సాయి అఖిల్ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్‌బీ ద్వితీయ బహుమతి : హైదరాబాద్‌లోని వికాస్ ది కాన్సెప్ట్ స్కూల్, బాచుపల్లిలో చదువుతున్న టి. సౌజన్య లక్ష్మి కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ ద్వితీయ బహుమతి : హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న అరిట్రో రే కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. స్పెల్‌బీ తృతీయ బహుమతి : హైదరాబాద్‌లోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, బంజారాహిల్స్ బ్రాంచ్‌లో చదువుతున్న నిహారిక కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. మ్యాథ్‌బీ తృతీయ బహుమతి : హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం బ్రాంచ్‌లో చదువుతున్న హరి వైష్ణవి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. -
మ్యాథ్స్ బీ సెమీ ఫైనల్స్‌కు విశేష స్పందన
కర్నూలు(హాస్పిటల్): సాక్షి ఆధ్వర్యంలో సాక్షి ఎరీనా వన్ స్కూల్ ఫెస్ట్ పేరుతో నిర్వహించిన మ్యాథ్స్ బీ సెమీఫైనల్స్‌కు విశేష స్పందన లభించింది. స్థానిక ఎన్ఆర్ పేటలోని భాష్యం స్కూల్లో పోటీలు నిర్వహించారు. ఇటీవల పోటీలకు సంబంధించి మొదటి రౌండ్ పూర్తయింది. అందులో అర్హత సాధించిన విద్యార్థులకు నాలుగు కేటగిరీలుగా ఆదివారం రెండో రౌండ్ పోటీలు నిర్వహించారు. కేటగిరి 1లో 1, 2వ తరగతులు, కేటగిరి 2లో 3, 4వ తరగతులు, కేటగిరి 3లో 5, 6, 7వ తరగతులు, కేటగిరి 4లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులున్నారు. మొత్తం 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్ష మ్యాథ్స్‌లో బాగా సాధన చేసి, మంచి మార్కులు సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి పరీక్షలు మరిన్ని జరపాలని వారు కోరారు. ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఆశిస్తున్నా మ్యాథ్స్బీలో మూడవ కేటగిరిలో నేను పాల్గొన్నా. పరీక్ష బాగా రాశా. ఇందులో ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఆశిస్తున్నా. పరీక్షలో అన్ని కోణాల్లో ప్రశ్నలు ఇచ్చారు. దీనివల్ల పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు, ఎలా సిద్ధం కావాలనే అంశాలు బోధపడతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది పరీక్ష బాగా రాశాను. లాజికల్, రీజనింగ్‌లో ప్రశ్నలు ఇచ్చారు. ఇలాంటి పరీక్షలు రాయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. భవిష్యత్‌లో ఉన్నత విద్య, ఉద్యోగాలకు ఇలాంటి పరీక్షలు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరూ ఇలాంటి పరీక్షల్లో పాల్గొనాలి. –వెంకట్ కౌశిల్, 7వ తరగతి లెక్కల పరీక్ష బాగా రాశాను పరీక్ష రాయడం ఎంతో ఎంజాయ్‌గా అనిపించింది. చదువుకున్న ప్రశ్నలే వచ్చాయి. అన్నింటికీ సమాధానాలు రాశాను. దీని వల్ల లెక్కలు బాగా నేర్చుకునేందుకు అవకాశం లభించింది. నాకు లెక్కలంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే ఈ పరీక్ష రాశాను. –లిఖిత, ఫస్ట్ క్లాస్ చాలా ఉపయోగం ఇలాంటి పరీక్షలు పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. దీనివల్ల కొత్త విషయాలు తెలియడంతో పాటు పరీక్షల్లో ప్రశ్నలు ఎలా ఇస్తారో తెలుస్తుంది. భవిష్యత్‌లో మన లక్ష్యసాధనకు ఇది ఎంతో ఉపయోగకరం. రేషియో, డివిజన్, పర్సంటేజేషన్ వంటి ప్రశ్నలు ఇచ్చారు. అన్నీ బాగా రాశాను. –నందిత, 5వ తరగతి పోటీ పరీక్షలకు ఉపయుక్తం ఇలాంటి పరీక్షలు తరచూ రాయడం వల్ల ఏ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు, వాటికి సమాధానాలు ఎలా రాయాలో సులభంగా తెలుస్తుంది. దీనికితోడు ప్రాక్టీస్ కూడా ఎక్కువసార్లు చేస్తాం కాబట్టి సులభంగా సమాధానాలు రాసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరీక్షల వల్ల పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగకరం. –జోషిత, 6వ తరగతి మ్యాథ్స్‌లో డెవలప్ అవుతారు మ్యాథ్స్‌లో లాజికల్, థింకింగ్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. పోటీ పరీక్షల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. ఇలాంటి పరీక్షల వల్ల ఈ సబ్జక్టుల్లో పిల్లలకు కమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. వారిలో క్రియేటివ్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. -రమేష్‌కుమార్, భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్