మ్యాథ్స్ బీ సెమీ ఫైనల్స్‌కు విశేష స్పందన
మ్యాథ్స్ బీ సెమీ ఫైనల్స్‌కు విశేష స్పందన
Published Sun, Dec 4 2016 11:08 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
కర్నూలు(హాస్పిటల్): సాక్షి ఆధ్వర్యంలో సాక్షి ఎరీనా వన్ స్కూల్ ఫెస్ట్ పేరుతో నిర్వహించిన మ్యాథ్స్ బీ సెమీఫైనల్స్‌కు విశేష స్పందన లభించింది. స్థానిక ఎన్‌ఆర్ పేటలోని భాష్యం స్కూల్‌లో పోటీలు నిర్వహించారు. ఇటీవల పోటీలకు సంబంధించి మొదటి రౌండ్ పూర్తయింది. అందులో అర్హత సాధించిన విద్యార్థులకు నాలుగు కేటగిరీలుగా ఆదివారం రెండో రౌండ్ పోటీలు నిర్వహించారు. కేటగిరి 1లో 1, 2వ తరగతులు, కేటగిరి 2లో 3, 4వ తరగతులు, కేటగిరి 3లో 5, 6, 7వ తరగతులు, కేటగిరి 4లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులున్నారు. మొత్తం 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్ష మ్యాథ్స్‌లో బాగా సాధన చేసి, మంచి మార్కులు సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి పరీక్షలు మరిన్ని జరపాలని వారు కోరారు.
ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఆశిస్తున్నా
మ్యాథ్స్‌బీలో మూడవ కేటగిరిలో నేను పాల్గొన్నా. పరీక్ష బాగా రాశా. ఇందులో ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఆశిస్తున్నా. పరీక్షలో అన్ని కోణాల్లో ప్రశ్నలు ఇచ్చారు. దీనివల్ల పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు, ఎలా సిద్ధం కావాలనే అంశాలు బోధపడతాయి.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది
పరీక్ష బాగా రాశాను. లాజికల్, రీజనింగ్‌లో ప్రశ్నలు ఇచ్చారు. ఇలాంటి పరీక్షలు రాయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. భవిష్యత్‌లో ఉన్నత విద్య, ఉద్యోగాలకు ఇలాంటి పరీక్షలు ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరూ ఇలాంటి పరీక్షల్లో పాల్గొనాలి. –వెంకట్ కౌశిల్, 7వ తరగతి
లెక్కల పరీక్ష బాగా రాశాను
పరీక్ష రాయడం ఎంతో ఎంజాయ్‌గా అనిపించింది. చదువుకున్న ప్రశ్నలే వచ్చాయి. అన్నింటికీ సమాధానాలు రాశాను. దీని వల్ల లెక్కలు బాగా నేర్చుకునేందుకు అవకాశం లభించింది. నాకు లెక్కలంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే ఈ పరీక్ష రాశాను. –లిఖిత, ఫస్ట్ క్లాస్
చాలా ఉపయోగం
ఇలాంటి పరీక్షలు పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. దీనివల్ల కొత్త విషయాలు తెలియడంతో పాటు పరీక్షల్లో ప్రశ్నలు ఎలా ఇస్తారో తెలుస్తుంది. భవిష్యత్‌లో మన లక్ష్యసాధనకు ఇది ఎంతో ఉపయోగకరం. రేషియో, డివిజన్, పర్సంటేజేషన్ వంటి ప్రశ్నలు ఇచ్చారు. అన్నీ బాగా రాశాను. –నందిత, 5వ తరగతి
పోటీ పరీక్షలకు ఉపయుక్తం
ఇలాంటి పరీక్షలు తరచూ రాయడం వల్ల ఏ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు, వాటికి సమాధానాలు ఎలా రాయాలో సులభంగా తెలుస్తుంది. దీనికితోడు ప్రాక్టీస్ కూడా ఎక్కువసార్లు చేస్తాం కాబట్టి సులభంగా సమాధానాలు రాసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరీక్షల వల్ల పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగకరం. –జోషిత, 6వ తరగతి
మ్యాథ్స్‌లో డెవలప్ అవుతారు
మ్యాథ్స్‌లో లాజికల్, థింకింగ్ డెవలప్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. పోటీ పరీక్షల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. ఇలాంటి పరీక్షల వల్ల ఈ సబ్జక్టుల్లో పిల్లలకు కమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. వారిలో క్రియేటివ్ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. -రమేష్‌కుమార్, భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్
Advertisement
Advertisement