sakshi Arena One
-
Sakshi Media Group: ధనాధన్ టోర్నీకి దండోరా
బ్యాట్ పట్టుకొని బంతిని బౌండరీ దాటించాలని ఉందా? బుల్లెట్ వేగంతో బంతులు వేస్తూ వికెట్లను గిరాటేయాలని ఉందా? మెరుపు వేగంతో కదులుతూ బ్యాటర్లను రనౌట్ చేయాలని ఉందా? క్రికెట్ ఆడేద్దామని... మనలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలని మనసులో బలమైన కోరిక ఉంటే సరిపోదు.. దానికి వేదిక కూడా కావాలిగా! ఇలాంటి ఔత్సాహిక క్రికెటర్లు తమ కలలు నెరవేర్చుకునేందుకు మళ్లీ సమయం వచ్చేసింది. మరో ఆలోచన లేకుండా ముందుగా మీ జట్టును తయారు చేసుకొని ఎంట్రీలు పంపించండి.. ఆ తర్వాత సమరానికి ‘సై’ అనండి...ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఔత్సాహిక క్రికెటర్లకు సువర్ణావకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో 2023 జనవరి మూడో వారంలో సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ నాలుగో సీజన్ మొదలుకానుంది. మూడో సీజన్లో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 627 జట్లు బరిలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్ సీనియర్ విభాగంలో సీకామ్ డిగ్రీ కాలేజీ (తిరుపతి)... జూనియర్ విభాగంలో సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కాలేజీ (ఏలూరు) చాంపియన్స్‌గా నిలిచాయి. తెలంగాణ సీనియర్ విభాగంలో ఎంఎల్ఆర్ఐటీ (దుండిగల్), జూనియర్ విభాగంలో గౌతమ్ జూనియర్ కాలేజీ (ఈసీఐఎల్) జట్లు టైటిల్స్ సాధించాయి. టోర్నీ ఫార్మాట్... ముందుగా జిల్లా, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను 10 ఓవర్లపాటు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన జట్లు ప్రాంతీయ స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్‌లను 20 ఓవర్లపాటు నిర్వహిస్తారు. ప్రాంతీయ స్థాయి టోర్నీ విజేతలు రాష్ట్ర స్థాయిలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో టైటిల్ కోసం తలపడతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపాదికగా ఎంట్రీలు స్వీకరిస్తారు. ఎంట్రీ ఫీజు... ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్లు రూ. 1,500 ఎంట్రీ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్ పద్ధతిలోనూ చెల్లించవచ్చు. వివరాలకు సాక్షి జిల్లా యూనిట్ కార్యాలయంలో సంప్రదించాలి. https://www.arenaone.in/registration వెబ్సైట్లోనూ వివరాలు లభిస్తాయి. ఎంట్రీలను జనవరి 6వ తేదీలోపు పంపించాలి. ఏ ఏ విభాగాల్లో... సాక్షి ప్రీమియర్ లీగ్‌ను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అండర్–19 జూనియర్ స్థాయిలో (1–1– 2003 తర్వాత జన్మించి ఉండాలి)... అండర్–25 సీనియర్ స్థాయిలో (1–1–1997 తర్వాత జన్మించి ఉండాలి) వేర్వేరుగా నిర్వహిస్తారు. జూనియర్ స్థాయిలో ఆడేందుకు జూనియర్ కాలేజీ జట్లకు, సీబీఎస్ఈ స్కూల్ జట్లకు (ప్లస్ 11,12 ), ఐటీఐ, పాలిటెక్నిక్ జట్లకు అర్హత ఉంది. సీనియర్ స్థాయిలో ఆడేందుకు డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీ జట్లకు అవకాశం కల్పిస్తారు. ఎన్ని జట్లకు అవకాశం... ఒక్కో కాలేజీ నుంచి గరిష్టంగా రెండు జట్లను పంపించే వెసులుబాటు ఉంది. రెండు జట్లు కూడా వేర్వేరుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఒక జట్టులో ఆడే ఆటగాడు మరో జట్టుకు ఆడకూడదు. మ్యాచ్‌లు ఆడే సమయంలో ఆటగాళ్లు వయసు ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్) చూపించాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాటర్స్, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్‌గ్లౌవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూస్ ధరించాలి. ఇతర వివరాలకు నిర్వాహకులను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు (తెలంగాణ రీజియన్) 9505514424, 9666013544 (ఆంధ్రప్రదేశ్ రీజియన్) 9912671555, 7075709205, 9666697219 నోట్: అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం. -
70 పాఠశాలలు.. 2 వేల మంది విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబరు 3లోని ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ‘సాక్షి’ ఏరినా వన్ స్కూల్ ఫెస్ట్‌కు విశేష స్పందన లభించింది. 70 పాఠశాలల నుంచి 2వేల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సాక్షి మ్యాథ్స్–బి సెమీఫైనల్స్, స్పెల్–బి క్వార్టర్ ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఆయా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2022–23 సంవత్సరానికిగాను నిర్వహించిన ఈ పోటీలకు డ్యూక్స్ వెఫే స్పాన్సర్ ప్రజెంటర్‌గా వ్యహరించింది. రాజమండ్రి ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. మొత్తం నాలుగు కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొని ప్రతిభ చాటారు. వర్డ్ మీనింగ్ నేర్చుకున్నాను.. ‘సాక్షి’ ఏరీనా వన్ స్కూల్ ఫెస్ట్ స్పెల్–బీలో పాల్గొన్నాను. ఈ పోటీల వల్ల నేను స్పెల్లింగ్ నేర్చుకున్నాను. వర్డ్ మీనింగ్ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. కొత్త పదాలు ఎన్నో తెలిశాయి. ఇలాంటి పోటీలు నిర్వహించడం నాకు చాలా అనందంగా ఉంది. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చాను. – తేజేశ్వర్, 7వ తరగతి, జాన్సన్ గ్రామర్ స్కూల్, వనస్థలిపురం స్పెల్లింగ్ రాసే విధానం తెలిసింది స్పెల్లింగ్ ఎలా కరెక్ట్‌గా ఫాం చేయాలో ఈ పోటీల్లో బాగా నేర్చుకున్నాను. ఇలాంటి పోటీలు మాలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ పోటీల విధానం బాగా నచ్చింది. నేను ఉత్సాహంగా పాల్గొన్నాను. ఎన్నో కొత్త పదాలు, వాటి అర్థాలు తెలుసుకున్నాను. – సాన్వీ, 5వ తరగతి, డాక్టర్ కేకేఆర్ గౌతం స్కూల్, కుషాయిగూడ -
డ్యాన్స్ జోష్
గన్‌ఫౌండ్రీ : విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న ‘సాక్షి’ ఎరీనా యూత్ ఫెస్ట్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. గురువారం కింగ్‌కోఠిలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ ఆండ్ పీజీ కళాశాలలో ‘సాక్షి’ ఎరీనా యూత్‌ఫెస్ట్‌లో భాగంగా డ్యాన్స్, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు తమదైన శైలిలో ఆటపాటలతో సందడి చేశారు. ఈ పోటీలకు జంట నగరాలలోని కళాశాలలకు చెందిన విద్యార్థులతో పాటు పరిసర ప్రాంతాల కళాశాలలకు చెందిన విద్యార్థులు సైతం ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విన్సెంట్ అరోకియాదాస్ మాట్లాడుతూ.. విద్యతో పాటు వివిధ అంశాలలో విద్యార్థులు రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించేందుకు ‘సాక్షి’ యాజమాన్యం వివిధ అంశాలలో పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీల్లో భాగంగా శుక్రవారం పబ్లిక్స్పీకింగ్పోటీలు నిర్వహిస్తారు. డాన్స్ హంగామా.. యూత్‌ఫెస్ట్‌లో భాగంగా నిర్వహించిన డ్యాన్స్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. డ్యాన్స్‌మాస్టర్ నరేష్ ఆనంద్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ పోటీలలో సింగిల్స్ విభాగంలో సెయింట్ జోసెఫ్ కళాశాలలకు చెందిన రియా ప్రథమ స్థానంలో నిలవగా, ఇదే కళాశాలకు చెందిన అఖిలరెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచింది. డబుల్స్ విభాగంలో ఏస్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ప్రత్యూష, దీప్తిల బృందం ప్రథమస్థానంలో నిలవగా సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలకు చెందిన తనిషా బృందం ద్వితియస్థానంలో నిలిచారు. మనయొక్క ఓటు అనే అంశంపై నిర్వహించిన వక్తృత్వ పోటీలు ఆసక్తికరంగా సాగాయి. ఓటు విలువ, ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు మాట్లాడిన తీరు ఆలోచింప చేసింది. ఓయూ పీజీ కళాశాలకు చెందిన యోగిత ప్రథమస్థానంలో నిలవగా సెయింట్ జోసెఫ్ పీజీ కళాశాలకు చెందిన శ్రావణ సంద్య ద్వితీయస్థానంలో నిలిచింది. ఆనందంగా ఉంది ‘సాక్షి’ యూత్‌ఫెస్ట్‌లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు కొత్త స్నేహితులను సైతం పొందగలిగాను. ‘సాక్షి’ యాజమాన్యం ఇలాంటి యూత్ఫెస్ట్లు మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను. –శ్రీకాంత్, సెయింట్ జోసెఫ్ కళాశాల విద్యార్థి చక్కటి వేదిక మాలో దాగి ఉన్న ప్రతిభ, నైపుణ్యాలాను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు మరెన్నో మెలకువలను తెలుసుకునేందుకు ఈ యూత్‌ఫెస్ట్ చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది. ప్రతిఏటా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రతిభకలిగిన విద్యార్థులను ప్రపంచానికి తెలియజేయాలి. – సోను, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల విద్యార్థిని -
ఘనంగా సాక్షి ఎరినావన్ గ్రాండ్ ఫినాలె
-
విజయవాడలో సాక్షి ఎరినా వన్
-
వైఎస్సార్ జిల్లాలో సాక్షి ఎరీనా వన్ స్కూల్ ఫెస్ట్
-
సాక్షి ఆధ్వర్యంలో ఎరీనా వన్ స్కూల్ ఫెస్ట్
-
సాక్షి ఎరీనా స్కూల్ ఫెస్ట్‌కు భారీ రెస్పాన్స్
-
సాక్షి ఎరినావన్ నేత్రుత్వంలో క్రికెట్ పోటీలు
-
ఘనంగా సాక్షి ఎరీనావన్ స్కూల్ ఫెస్ట్
-
కోలాహలంగా సాక్షి ఎరీనా స్కూల్ ఫెస్ట్
-
ఎరీనా వన్ యూత్ ఫెస్ట్ సీజన్-2 పార్ట్-3
-
ఎరీనా వన్ యూత్ ఫెస్ట్ సీజన్-2 పార్ట్-2
-
ఎరీనా వన్ యూత్ ఫెస్ట్ సీజన్-2 పార్ట్-1
-
యూత్ ఫెస్ట్.. సూపర్‌హిట్
అట్టహాసంగా ‘సాక్షి ఎరీనా వన్’ వేడుక సిటీబ్యూరో: ఒకటీ రెండూ కాదు.. సిటీకి చెందిన 225 కాలేజీల విద్యార్థుల మధ్య పోటీ. పలు సాంస్కృతిక అంశాల్లో నువ్వా.. నేనా.. అన్నట్టు తలపడ్డారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ‘సాక్షి’ మీడియా నిర్వహించిన ‘సాక్షి ఎరీనా వన్’ ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహించింది. ఆదివారం ఎల్బీ స్టేడియంలో విన్నర్స్, అచీవర్స్, స్టూడెంట్స్, సెలబ్రీటీస్ మధ్య ఎరీనా ఫినాలే గ్రాండ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. వేలమంది విద్యార్థుల కేరింతల మధ్య సెలబ్రిటీస్ ఆటపాటలతో ప్రాంగణం జోష్‌తో నిండిపోయింది. ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ స్ఫూర్తి దాయక ప్రసంగం.. విద్యావేత్త డాక్టర్ లావు రత్తయ్య అనుభవ పూర్వక సందేశం, ఎంపీ మల్లారెడ్డి ఉల్లాసభరిత ప్రసంగం యువతను ఆకర్షించాయి. చిత్ర దర్శకుడు దశరథ్, సినీనటులు మంచు లక్ష్మి, మనోజ్, నిర్మాత శివకుమార్ మాట్లాడారు. క్రీడాకారిణి సింధు.. విద్యార్థులకు ఇలాంటి మంచి వేదిక ఇచ్చిన సాక్షికి అభినందనలు తెలిపారు. ‘మలుపు’ చిత్ర హీరో ఆది, నిక్కి గల్రానీ, హీరో సునీల్ ఆటపాటలతో అలరించారు. అడవి శేష్, అదాశర్మ తమ కొత్త చిత్రం గీతాలకు సెప్పులేసి ఆకట్టుకున్నారు. ‘సాక్షి’కి కృతజ్ఞతలు చదువుతో పాటు ఇతర అభిరుచుల్లో ముందున్న మాలోని ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ‘సాక్షి’ ఎరీనా వన్ మంచి వేదికైంది. రోబోటిక్స్ విభాగంలో రాణించడం చాలా ఆనందంగా ఉంది. కాలేజీ లెక్చరర్ల సపోర్ట్‌తో వందలాది మంది విద్యార్థులు పోటీపడిన ఈ విభాగంలో ఉత్తమ ప్రతిభను కనబరిచా. ఈ గుర్తింపు సాక్షితో వచ్చిందే. - ఎస్.శివ తేజ, బీటెక్ విద్యార్థి, సీఎంఆర్ కాలేజీ చాలా హ్యాపీగా ఉంది.. విద్యార్థులకు చదువుతో పాటు మంచి అభిరుచులు ఉంటాయి. వీటిని కొంత మంది ఉపాధిగా కూడా ఎంచుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ‘సాక్షి’ ఎరీనా వన్ ఫెస్ట్ నిర్వహించడం ఆనందంగా ఉంది. థియేటర్ విభాగంలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు హ్యపీగా ఉంది. ఇలాంటి పోటీలు ఏ మీడియా చేయలేదు. ఈ గురుతర బాధ్యతను తీసుకున్న సాక్షికి నా సెల్యూట్. - థెర్రిస్సామ్నా, బీఎస్సీ నర్సింగ్, విజయ మేరీ కాలేజీ కళాత్మకతకు ఇదే ‘సాక్షి’ టాలెంట్ ఉన్నా సరైన వేదిక లేని మాలాంటి వారందరికీ ‘ఎరీనా వన్’ మంచి వేదికైంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. పెయింటింగ్ విభాగంలో విజేతగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నా. నాలో ఉన్న కళను ప్రపంచానికి చాటగలిగినందుకు సంతోషంగా ఉంది. - మేఘన, జేఎన్ఏఎఫ్ఏయూ ప్రతిభావంతులకు వేదిక.. నేను పాటలు బాగా పాడతా. డాన్స్ కూడా చేస్తా. ఇన్నాళ్లు నా ప్రతిభను ప్రదర్శించేందుకు సరైన వేదిక దొరకలేదు. ఇప్పుడీ ఈ మహదావకాశం సాక్షి ఎరీనా వన్ ద్వారా రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ వేలాది మంది ప్రేక్షకుల ముందు సోలో డాన్స్ చేయడం లైఫ్‌లో మరచిపోలేను. - శాలినీ, బీటెక్ విద్యార్థిని, ఎంఎల్ఆర్ఐటీ -
మైమరపించిన యంగ్ సింగర్స్
-
ఉరిమే ఉత్సాహం...
‘సాక్షి’ ఎరెనా వన్ ప్రారంభం జోష్ నింపిన యూత్ ఫెస్ట్ క్రీడలు, కళారంగాల్లో దాగిన ప్రతిభను బయటకు తీసేందుకు చేపట్టిన ‘సాక్షి ఎరీనా వన్’ యూత్‌ఫెస్ట్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వచ్చేనెల 21వ తేదీ వరకు కొనసాగే ఈఫెస్ట్‌లో గురువారం పలు విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. మూడు వేర్వేరు వేదికలపై సాగిన ఈ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ర్యాంప్‌వాక్, మోడలింగ్‌లో భాగంగా విద్యార్థినులు, ఔత్సాహిక మోడల్స్ విభిన్న దుస్తులు ధరించి మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ ఫెస్ట్‌కు ‘బజాజ్ పల్సర్ ఇండియా నంబన్ వన్ బైక్’ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. హైదరాబాద్: ‘సాక్షి’ ఎరెనా వన్ యూత్ ఫెస్ట్‌లో యువత ఉరిమే ఉత్సాహంతో పాల్గొంది. చదువుతో కుస్తీ పడే విద్యార్థులు తమకు నైపుణ్యమున్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కూకట్‌పల్లిలోని కెనె డీ స్కూల్ గ్రౌండ్లో త్రోబాల్ పోటీల ను, మైసమ్మగూడలోని ఎంఆర్సీఈటీలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించారు. త్రోబాల్ ఈవెం ట్లో 20 మహిళా జట్లు, 16 పురుషు ల జట్లు పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి ముఖ్యఅతిథిగా విచ్చేసి త్రోబాల్ పోటీలను ప్రారంభించిన అనంతరం ఆయ న మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ఆదరిం చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆటల పోటీల్లో విద్యార్థులను ప్రోత్సహిం చేందు కు సాక్షి మీడియా గ్రూపు గురుతర బాధ్యత తీసుకుందని కొనియాడారు. అనంతరం తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి.జగన్మోహన్గౌడ్ మాట్లాడుతూ.. సాక్షి యూత్‌ఫెస్ట్‌ను సద్వినియో గం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చా రు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు వినోద్‌రెడ్డి, కోశాధికారి వెంకట్, కెనెడీ స్కూల్ యాజమాన్యం సరళ, రమేశ్ పాల్గొన్నారు. త్రోబాల్ విజేత సెయింట్ మార్టిన్స్ త్రోబాల్ ఓపెన్ టోర్నమెంట్లో సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజి (దూలపల్లి) పురుషుల జట్టు విజేతగా నిలిచింది. కూకట్‌పల్లిలోని కెన్నెడీ స్కూల్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన పురుషుల విభాగం ఫైనల్లో సెయింట్ మార్టిన్స్ జట్టు 15-7, 15-4 స్కోరుతో భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజిపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రౌండ్‌రాబిన్ లీగ్ మ్యాచ్‌ల్లో సెయింట్ మార్టిన్స్ 15-2, 15-6 స్కోరుతో ఐఐఎంసీ (లక్డికాపూల్) జట్టుపై, భవాన్స్ వివేకానంద 15-11, 15-9తో ఐఐఎంసీ (లక్డికాపూల్)పై గెలుపాందాయి. సెయింట్ మార్టిన్స్ ముందంజ మైసమ్మగూడలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఆర్సీఈటీ) కళాశాలలో జరిగిన క్రికెట్ టోర్నీ తొలి మ్యాచ్‌లో సెయింట్ మార్టిన్స్ జట్టు... ఎంఆర్సీఈటీపై గెలిచింది. మొదట ఎంఆర్సీఈటీ 4 వికెట్లకు 98 పరుగులు చేసింది. నితిన్ (43), శివ (38) మెరుగ్గా ఆడారు. తర్వాత 99 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ మార్టిన్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసి గెలిచింది. ఆదర్శ్ (41) రాణించాడు. రెండో మ్యాచ్‌లో నిజామ్ కాలేజి... ఎంఆర్ఐటీ జట్టుపై నెగ్గింది. తొలుత నిజామ్ జట్టు 3 వికెట్లకు 53 పరుగులు చేయగా, తర్వాత ఎంఆర్ఐటీ 50 పరుగులకే కుప్పకూలింది. నిజామ్ బౌలర్ క్రిస్ కల్యాణ్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా గ్రూపు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈవెంట్‌ను లాంఛనంగా ఆరంభించారు. ఇందులో హరీష్‌రెడ్డి, ప్రిన్సిపాల్ జాన్‌పాల్, రవీందర్, కళాశాల డెరైక్టర్ సంజీవ రెడ్డి, ఈవో రాజేశ్వర్‌రెడ్డి, హెచ్ఓడీ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. యూత్‌ఫెస్ట్‌లో నేడు డిజైన్ అండ్ ఫ్యాషన్ వేదిక: లకోటియా ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్, ఎంపీఎం మాల్, అబిడ్స్ సర్కిల్ సమయం: ఉదయం 11.30 వివరాలకు: 9885527474 క్రికెట్ టోర్నమెంట్ వేదిక 1: అరోరా సైంటిఫిక్ టెక్నోలాజికల్ అండ్ రిసర్చ్ అకాడమీ (ఆస్ట్రా), చాంద్రాయణగుట్ట, పల్లెచెరువు దగ్గర సమయం: ఉదయం 9, 11 గంటలు, మధ్యాహ్నం ఒంటిగంట, 3 గంటలు (4 మ్యాచ్‌లు) వేదిక 2: మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మైసమ్మగూడ, ధూలపల్లి, కొంపల్లి సమయం: ఉదయం 9, 11 గంటలు, మధ్యాహ్నం ఒంటిగంట, 3 గంటలు (4 మ్యాచ్‌లు) వేదిక 3: నల్లా నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్, కొర్రెముల ఎక్స్ రోడ్, నారపల్లి, ఘట్కేసర్ మండలం సమయం: ఉదయం 9, 11 గంటలు, మధ్యాహ్నం ఒంటిగంట, 3 గంటలు (4 మ్యాచ్‌లు) వివరాలకు: 9505834448 డ్యాన్స్ పోటీలు వేదిక: ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దుండిగల్ సమయం: ఉదయం 9.30 వివరాలకు: 9666470203 బాల్ వేదిక: కెనడీ మాగ్నెట్ స్కూల్, మెట్రో పక్కన, కూకట్పల్లి సమయం: ఉదయం 9.30 వివరాలకు: 9705199924 -
నేడు ‘సాక్షి ఎరీనా వన్’ అంబాసిడర్ల మీట్
సాక్షి, హైదరాబాద్: తొలిసారిగా సాక్షి మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న ‘సాక్షి ఎరీనా వన్’ కార్యక్రమానికి అంబాసిడర్లుగా వ్యవహరించేందుకు వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని సాక్షి జర్నలిజం స్కూల్లో హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. ఏ సమయానికి హాజరుకావాలన్న విషయాన్ని ఆ అభ్యర్థులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్స్ రూపంలో వారికి తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9666284600, 9705199924లో సంప్రదించవచ్చు. -
ఉత్సాహంగా ‘సాక్షి’ యూత్ ఫెస్ట్
ఆడిపాడిన విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: డ్రమ్స్ బీట్స్ దుమ్మురేపుతుంటే... వెస్ట్రన్ ట్యూన్స్ అడుగులు కదిపి ఆడించేశాయి. రసరమ్యమైన సంగీత ఝరిలో కుర్రకారు తమను తాము మైమరిచిపోయారు. ఆకాశమే హద్దుగా... ఆనందమే విందుగా ఆస్వాదించేశారు. యువతలో దాగివున్న కళను వెలికితీయడానికి గండిపేటలోని సీబీఐటీ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన ‘సాక్షి ఎరీనా వన్’ యూత్ ఫెస్ట్ నవోత్సాహంతో అదిరిపోయింది. ‘బజాజ్ పల్సర్ ఇండియా నంబర్‌వన్ బైక్’ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ ఫెస్ట్‌లో వివిధ కళాశాలలకు చెందిన యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చదువుతోపాటు తమకు నచ్చిన కళారంగంలో ప్రతిభ చాటి ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు. తొలిరోజు నిర్వహించిన ‘బాటిల్ ఆఫ్ బ్యాండ్ అండ్ ఇనుస్ట్రుమెంటల్ సోలో’లో ఎవరికెవరూ తీసిపోనంతగా పోటీపడ్డారు. ఆహూతుల నుంచి అభినందనలు అందుకున్నారు. బ్రాస్‌బ్యాండ్ కేటగిరీలో హైదరాబాద్‌లోని గీతం వర్సిటీ, టీకే ఆర్ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి రెండు గ్రూపులు పోటీపడ్డాయి. వీటితోపాటు సోలో కేటగిరీలో మరో ఆరుగురు గిటారు, పియానో ప్లేతో వీనులవిందు చేశారు. కార్యక్రమంలో ‘సాక్షి’ మీడియా గ్రూపు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి మాట్లాడుతూ... తరగతి గదులకు పరిమితమైన కళాశాలల విద్యార్థులను ప్రపంచానికి పరిచయం చేయాలన్న సదుద్దేశంతో ఈ ఫెస్ట్ నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల అభిరుచులకు ఇది చక్కటి వేదికన్నారు. సీబీఐటీ కళాశాల ప్రిన్సిపాల్ చెన్నకేశవరావు మాట్లాడుతూ ‘సాక్షి’ మీడియా నిర్వహిస్తున్న ఈ ఫెస్ట్‌కు తమ కళాశాల వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. పోటీల న్యాయనిర్ణేతలుగా విజయ్ వాడ్రేవు, అరుణ్ రుబె న్ వ్యవహరించారు. మొత్తం ఏడు విభాగాల్లో 30 రకాల పోటీలు ఈ ఫెస్ట్‌లో నిర్వహిస్తారు. వచ్చే నెల 21 వరకు నగరంలోని వివిధ వేదికల్లో ఈ పోటీలు జరుగుతాయి.