
విశాఖపట్నం: ఉన్నత విద్య అభ్యసించాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. కానీ ఇంట్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు ఆలోచనల్లో పడేశాయి. ఇక అది కలగానే మిగిలిపోతుందని అనుకున్నాను. మధ్యతరగతి కుటుంబాలకు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవడం సాధ్యం కాదని ఆశలు వదులుకున్నాను.
కానీ జగనన్న ప్రవేశ పెట్టిన ఈ పథకం వల్ల నా కల నెరవేరింది. ప్రస్తుతం ఈ పథకం వల్ల అందిన సాయంతో న్యూయార్క్ యూనివర్సిటీలో మాస్టర్స్‌లో చేరబోతున్నాను. తీరదనుకున్న నా కలని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. థాంక్యూ సీఎం సార్. – సీహెచ్ లక్ష్మీకిరణ్మయి, మాధవధార