నేటి నుంచి ‘రచ్చబండ’ | racchabanda programme on-monday | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘రచ్చబండ’

Published Mon, Nov 11 2013 3:48 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

racchabanda programme on-monday

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్:సుమారు రెండేళ్ల తరువాత రచ్చబండ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ నిర్వహించే ఈ కార్యక్రమం ఈసారి కేవలం మండల కేంద్రాలకే పరిమితం కానుంది. ఒకనాడు సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పడిన రచ్చబండ, నేడు కేవలం కొన్ని రకాల పథకాలను అందజేయడానికే పరిమితమైంది. గతంలో గ్రామాల్లో సైతం రచ్చబండ సభలు నిర్వహించి సమస్యలు తెలుసుకునే వారు.  ఈసారి ఆ పరిస్థితి లేదు. కాగా పలు పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేసేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు.
 
  19,454 పింఛన్లు పంపిణీ
  జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలోని 38 మండలాలు, ఐదు మున్సిపాలిటీలో వివిధ పింఛన్లు 19,454 పంపిణీ చేయనున్నారు. వీటిలో వృద్ధాప్య పింఛన్లు 8,138, వితంతు 9,798, వికలాంగు 1,281, చేనేత కార్మికులు, తొడీ టాపర్స్ 33 పింఛన్లు ఉన్నాయి.
 
 గృహాల మంజూరు ఇలా..
 జిల్లాకు 31,638 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఆమదాలవలస నియోజకవర్గానికి 2,669, ఎచ్చెర్లకు 3,832, శ్రీకాకుళం 1,951, రాజాం 5,475, నరసన్నపేట 2,740, పాలకొండ 3,250, పాతపట్నం 4,256, పలాస 2,635, టెక్కలి 2,192, ఇచ్ఛాపురం నియోజకవర్గానికి 1558 ఇళ్లు చొప్పున మంజూరయ్యాయి.
 
  కొత్త రేషన్‌కార్డులు
 జిల్లాకు కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిలో ఇచ్ఛాపురం నియోజకవర్గానికి 2,213, టెక్కలి 4007, పలాస 2,438, పాతపట్నం 3,035, పాలకొండ 5,745, ఆమదాలవలస 4,351, ఎచ్చెర్ల 5,097, శ్రీకాకుళం 4,375, రాజాం 7,584, నరసన్నపేట నియోజకవర్గానికి 1960 రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. ఇవి కాకుండా కార్డుదారులకు కొత్త సభ్యులుగా 5,689 మందిని చేర్చినట్టు అధికారుల తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement