సోనియా నివాసం వద్ద సీఎం 'రచ్చ' చేయాలి | TDP leader Babu Rajendra Prasad fire on CM Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

'సోనియా నివాసం వద్ద సీఎం 'రచ్చ' చేయాలి

Published Tue, Nov 19 2013 1:45 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

TDP leader Babu Rajendra Prasad fire on CM Kiran Kumar Reddy

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వై. బాబు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. రచ్చబండలో చేసే రచ్చ యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంటి ముందు చేయాలని ఆయన సీఎం కిరణ్కు సూచించారు.

 

ఢిల్లీలో ధర్నా చేయకుండా ప్రజల సమస్యల కోసం గల్లీలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమాలలో సీఎం కిరణ్ రచ్చ చేయడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. న్యూఢిల్లీలో ధర్నా చేస్తే ఏమైన ప్రయోజనం ఉండవచ్చని అయన అబిప్రాయపడ్డారు.
సీఎం కిరణ్ మాటకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద విలువ ఉందా అని బాబు రాజేంద్రప్రసాద్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. సీఎం మాటకు విలువ లేనప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేస్తే ఉత్తమం అని బాబు రాజేంద్రప్రసాద్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement