సోనియా నివాసం వద్ద సీఎం 'రచ్చ' చేయాలి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వై. బాబు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. రచ్చబండలో చేసే రచ్చ యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంటి ముందు చేయాలని ఆయన సీఎం కిరణ్కు సూచించారు.
ఢిల్లీలో ధర్నా చేయకుండా ప్రజల సమస్యల కోసం గల్లీలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమాలలో సీఎం కిరణ్ రచ్చ చేయడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. న్యూఢిల్లీలో ధర్నా చేస్తే ఏమైన ప్రయోజనం ఉండవచ్చని అయన అబిప్రాయపడ్డారు.
సీఎం కిరణ్ మాటకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద విలువ ఉందా అని బాబు రాజేంద్రప్రసాద్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. సీఎం మాటకు విలువ లేనప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేస్తే ఉత్తమం అని బాబు రాజేంద్రప్రసాద్ సూచించారు.