సోనియా మాఫియా డాన్: కొణతాల | konathala Ramakrishna takes on sonia gandhi and kiran kumar reddy | Sakshi
Sakshi News home page

సోనియా మాఫియా డాన్: కొణతాల

Published Thu, Feb 20 2014 9:14 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సోనియా మాఫియా డాన్: కొణతాల - Sakshi

సోనియా మాఫియా డాన్: కొణతాల

తెలుగుజాతిని విచ్ఛిన్నం చేయడానికే యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ కంకణం కట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు కొణతాల రామకృష్ణ ఆరోపించారు. గురువారం ఆయన విశాఖపట్నంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరుపై మండిపడ్డారు.

 

సోనియా మాఫియా డాన్గా అభివర్ణించారు. సీఎం కిరణ్ ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర విభజనకు అన్ని విధాల సహకరించి తెలుగు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసి మరోసారి ప్రజలను మోసగించాలని చూస్తున్నారని కిరణ్పై ఈసందర్భంగా కొణతాల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement